Thursday, 19 March 2026

Blog

భక్తి

తులా రాశిలో బుధుడు.. ఈ రాశుల వారు జాగ్రత్త!

తులా రాశిలో బుధుడు.. ఈ రాశుల వారు జాగ్రత్త! నష్టాలు, మోసాలకు ఛాన్స్ ఈ నెల(నవంబర్) 24 నుంచి డిసెంబర్ 6 వరకు బుధ గ్రహం తులా రాశిలో సంచారం చేయబోతోంది. వృశ్చిక రాశిలో వక్రించిన బుధుడు తిరోగమనం చెంది తులా రాశిలో ప్రవేశించడం జరుగుతోంది. తుల రాశికి బుదుడికి మిత్ర క్షేత్రమే అయినప్పటికీ, కొన్ని రాశుల వారికి ఇది దుస్థానం కావడం వల్ల వారు ఆదాయ వ్యయాల్లో, పరిచయాల్లో, ఒప్పందాలు కుదర్చుకోవడంలో, కొత్త ప్రయత్నాలు చేపట్టడంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మీన రాశివారు మోసపోవడం, నష్టపోవడం, పొరపాట్లు చేయడం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, తప్పటడుగులు వేయడం వంటివి జరిగే అవకాశం ఉంది.

కడప

ఆది vs భూపేష్ జమ్మలమడుగు లో ఘర్షణ

కడప- జమ్మలమడుగు- ఇరు వర్గాల మధ్య ఘర్షణ… ఆది vs భూపేష్ ముద్దనూరులో మండల కేంద్రంలో స్మాట్ కిచెన్ పనులకోసం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ భూపేష్, ఎమ్మెల్యే ఆది వర్గీయుల మధ్య బాహా,బాహి జెట్.పి బాయ్స్ హై స్కూల్ సమీపంలో స్మార్ట్ కిచెన్ పనులను ముందుగా ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది వర్గీయులు… ఆ పని మేమే చేయాలని ప్రక్కనే పనులను చేపట్టిన భూపేష్ రెడ్డి వర్గీయులు… ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఒకరిపై ఒకరు దాడి,ఇద్దరికి గాయాలు

ఖమ్మం

మధిరలో లంచం స్వీకరిస్తూ ఏసీబీకి పట్టుబడ్డ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కె. చందర్

పున్నమి ప్రతి నిధి మధిర, ఖమ్మం జిల్లా : మధిరలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కె. చందర్ లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ విషయాన్ని ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఒక భవన కార్మికుడు మరణించడంతో, అతని పేరు మీద మంజూరు అయ్యే ₹1,30,000 ఇన్సూరెన్స్ బిల్లు పాస్ చేయడానికి, ఆఫీసర్ చందర్ మృతుని భార్య నుండి ₹15,000 లంచం డిమాండ్ చేశాడు. బాధితురాలు ఏసీబీని సంప్రదించగా, సన్నాహకంగా ఏర్పాటు చేసిన ఉచ్చులో ఖమ్మం రోడ్ పై లంచం తీసుకుంటుండగా చందర్‌ను అధికారులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ యాక్టివిటీలపై మాట్లాడిన రమేష్‌, “అధికారులు తాము చేయవలసిన పనికి లంచం కోరితే వెనుకాడకుండా వెంటనే ఏసీబీకి ఫిర్యాదు చేయాలి. అపోహలతో అధికారులు లంచాలు తీసుకోవడం, ప్రజలు ఇవ్వడం కొనసాగకూడదు,” అని స్పష్టం చేశారు. పౌరుల హక్కులను రక్షించేందుకు ఏసీబీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, ఎవరైనా లంచం డిమాండ్ చేసిన వెంటనే తమను సంప్రదించాలని డీఎస్పీ రమేష్ సూచించారు.

కడప

చైన్ స్నాచింగ్ కలకలం::ప్రొద్దుటూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో చైన్ స్నాచింగ్*

*ప్రొద్దుటూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో చైన్ స్నాచింగ్*… ప్రొద్దుటూరు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో చరిత అనే మహిళ వెళుతూ ఉండగా ఒక వ్యక్తి ఆమె మెడలోని బంగారు చైన్ ను లాక్కెళ్ళే ప్రయత్నం చేయగా అక్కడ ఉండే ప్రజలు అతన్ని పట్టుకొని దేహశుద్ధి చేశారు అనంతరం పోలీసులకు అప్పగించారు

అల్లూరి సీతారామరాజు

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని కార్యకర్తల అభిప్రాయంతోనే నియమిస్తాం: ఏఐసీసీ పరిశీలకుడు డెబాసిస్ పట్నాయక్

అల్లూరి సీతారామరాజు జిల్లా – అరకు, నవంబర్ 24: కాంగ్రెస్ పార్టీని పునర్వ్యవస్థీకరించి బలోపేతం చేయడం లక్ష్యంగా, జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడిని క్షేత్రస్థాయి కార్యకర్తల నిజమైన అభిప్రాయాల ఆధారంగా నియమించనున్నట్లు ఒడిశా రాష్ట్ర ఏఐసీసీ పరిశీలకుడు శ్రీ డెబాసిస్ పట్నాయక్ తెలిపారు. సోమవారం అరకులోయలోని హోటల్ అక్షయ ఇన్ లో నిర్వహించిన “సంఘటన్ సృజన్ అభియాన్” కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశాన్ని ఏఐసీసీ సభ్యుడు శ్రీ వేగు వెంకటేష్ నిర్వహించారు. కార్యక్రమంలో డీసీసీ నేత శతక బుల్లిబాబు, పీసీసీ సభ్యుడు వంతల సుబ్బారావు, అరకు అసెంబ్లీ ఇన్‌చార్జ్ శెట్టి గంగాధర్ స్వామి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మోస్య ప్రేమ్ కుమార్, ఓబిసి ఏ.ఎస్.ఆర్ జిల్లా అధ్యక్షుడు కానూరి ప్రవీణ్, తదితర నాయకులు పాల్గొన్నారు. డెబాసిస్ పట్నాయక్ మాట్లాడుతూ— “అల్లూరి జిల్లాలోని ప్రతి మండలంలో రాబోయే మూడు రోజుల్లో కార్యకర్తలతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహిస్తాం. కార్యకర్తలకు అసలైన మాట చెప్పే అవకాశం ఇవ్వాలన్నదే ఏఐసీసీ లక్ష్యం. అభ్యర్థుల దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి, ఆ తరువాతే కొత్త డీసీసీ అధ్యక్షుడిని నియమిస్తాం” అని తెలిపారు. అదే విధంగా, కాంగ్రెస్ పార్టీని శక్తివంతం చేయడం, కమిటీల పునర్వ్యవస్థీకరణ, ప్రతి కార్యకర్తకు బాధ్యత కల్పించడం వంటి చర్యలు ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి స్పష్టమైన దిశానిర్దేశాలేనని వివరించారు. డీసీసీ పదవికి ఆసక్తి ఉన్న నాయకులు పరిశీలక బృందం అందజేసిన అధికారిక ఫారమ్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బురిడీ డేవిడ్, నోగెలి చంద్రకళ, సమీరెడ్డి బాలకృష్ణ, పాంగి గంగాధర్ సహా పెద్ద సంఖ్యలో స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.

కడప

తనకంటి జ్యువెలర్స్ యజమానులకు ఏ చిన్న అపాయం జరిగిన పోలీసులదే బాధ్యత…

కడప జిల్లా : ప్రొద్దుటూరు కోర్టులో అర్ధరాత్రి వరకు కొనసాగిన వాదనలు ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన తనకంటి జ్యువెలర్స్ యజమాని తనకంటి శ్రీనివాసులు , అతని తమ్ముడు తనకంటి వెంకటస్వామి ని ప్రొద్దుటూరు కోర్టు కు త్రీ టౌన్ సిఐ వేణుగోపాల ఆధ్వర్యంలో హాజరు అయితే తనకంటి వెంకటస్వామి నడవలేని స్థితిలో కోర్టుకు హాజరవ్వడంపై న్యాయమూర్తి ఆరా… పోలీసులు తీవ్రంగా కొట్టారని న్యాయమూర్తి ఎదుట చెప్పిన తనకంటి వెంకటస్వామి… ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు ఎలాంటి గాయాలు లేవని రిపోర్టు ఇవ్వడం తో , తనకంటి వెంకటస్వామిని ప్రైవేటు ఆసుపత్రికి పరీక్షల నిమిత్తం అడ్వకేట్ కమిటీతో పంపిన న్యాయమూర్తి… తిరిగి ప్రొద్దుటూరు కోర్టులో హాజరు పరిచిన పోలీసులు , న్యాయవాదుల కమిటీ… తీర్పు వెల్లడించిన న్యాయమూర్తి తనకంటి జ్యువెలర్స్ యజమాని తనకంటి శ్రీనివాసులు , తనకంటి వెంకట స్వామి లకు 20వేల సొంత పూచికత్తుపై బెయిల్ మంజూరు పోలీసుల వ్యవహార శైలిపై ప్రశ్నించిన న్యాయమూర్తి… తనకంటి జ్యువెలర్స్ యజమాని తనకంటి శ్రీనివాసులు , తనకంటి వెంకటస్వామి లకు ఏ చిన్న అపాయం జరిగిన పోలీసులదే బాధ్యత…

విశాఖపట్నం

ది వరల్డ్ టీచర్ ట్రస్ట్ (జగద్గురుపీఠం) ఛైర్మన్ డా॥ కె. యస్. శాస్త్రి ఇక లేరు

విశాఖపట్నం, నవంబరు 24: ప్రముఖ హోమియో వైద్య నిపుణుడు, జగద్గురుపీఠం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. యస్. శాస్త్రి (89) సోమవారం ఉదయం అక్కయ్యపాలెంలోని తన నివాసంలో కన్నుమూశారు. మంగళవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు కుమారుడు కె. శ్రీనివాస్ తెలిపారు. మాస్టర్ ఈ.కె. నుండి దివ్యస్ఫూర్తిని పొందిన డా. శాస్త్రి, యాభై ఏళ్లకు పైగా నిస్వార్థంగా హోమియో వైద్య సేవలందించారని జగద్గురుపీఠం కార్యనిర్వాహక బృందం భావోద్వేగంతో స్మరించుకుంది. వేలాది మంది రోగులకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని సభ్యులు పేర్కొన్నారు. జగద్గురుపీఠం జాతీయ గౌరవాధ్యక్షునిగా, అలాగే ‘మాస్టర్ హోమియో వైద్యాలయం’ ద్వారా ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలను ఆదర్శనీయంగా నిర్వహించారని సంస్థ కార్యదర్శి బి.ఆర్.కె. రాజు తెలిపారు. మాస్టర్ ఈ.కె పేరిట ‘హోమియో టీచింగ్ సెంటర్’ ను స్థాపించి, వందలాదిమందికి హోమియో వైద్య బోధన అందించిన విషయాన్ని సంస్థ ఉపాధ్యక్షులు ఎన్.వి.యస్. మూర్తి గుర్తుచేశారు. ఆయన రచించిన హోమియో గ్రంథాలు వైద్య రంగానికి విశిష్టమైన దోహదం చేశాయని తెలిపారు. మాస్టర్ సీవీవీ గురుపూజలు, హోమియో జ్ఞాన యజ్ఞ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడంలో డా. శాస్త్రి చేసిన సేవలను సంస్థ గౌరవ్ డైరెక్టర్ అజ్జరపు శ్రీనివాస్ ప్రశంసించారు. ‘హోమియో బ్రదర్ హుడ్’ పత్రికా సంపాదకునిగా, ‘బాలభాను విద్యాలయం’ మరియు ‘హోమియో స్పిరిచ్యువల్ సర్వీస్ మిషన్’ సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించారని డైరెక్టర్ చింతలపాటి పేర్కొన్నారు. మాస్టర్ ఈ.కె. ప్రసంగించిన పతంజలి యోగ సందేశాలను పుస్తక రూపంలో అందించడంలో డా. శాస్త్రి చేసిన కృషి అమూల్యమని ‘కులపతి బుక్ ట్రస్ట్’ ఛైర్మన్ ఎస్.హెచ్.యస్.ఎన్. రాజు కొనియాడారు. 1992–1998 మధ్య ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గౌరవ హోమియో వైద్యునిగా పనిచేసి వేలాది మందికి వైద్యం అందించారని డా. జి.ఏ. రామేశ్వర్ గుర్తుచేశారు. డా. శాస్త్రి పార్ధివదేహానికి ‘మాస్టర్ హోమియో వైద్యాలయం’ సేవకులు, జగద్గురుపీఠం సభ్యులు, అలాగే డా. డి.వి. భాస్కరరావు, డా. బి. వంశీకృష్ణతో పాటు పలువురు ఆధ్యాత్మిక, సామాజిక సంస్థల ప్రతినిధులు ఘనంగా నివాళులు అర్పించారు.

తెలంగాణ

అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమం కు హాజరుకానున్న :మంత్రులు

నకిరేకల్ : నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) స్వయం సహాయక మహిళ సంఘాలకు మూడో విడత వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం కు హాజరుకానున్న మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు. రాష్ట్రంలోనే అత్యధికంగా 26. 34 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు నల్గొండ జిల్లాకు కేటాయింపు, నల్గొండ జిల్లాలో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇదివరకే రెండు విడతల్లో వడ్డీలేని రుణాల పంపిణీ చేయగా, మంగళవారం మరోసారి మూడో విడత పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయనుంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 304 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను, స్వయం సహాయక మహిళా సంఘాలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది . ఈ విషయంపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సోమవారం హైదరాబాదు నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, డిఆర్డిఓ లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ విషయాలను తెలియజేశారు.

అల్లూరి సీతారామరాజు

అనంతగిరి: కాఫీ, చిరుధాన్యాల పంటలతో మంచి ఆదాయం

కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వమని అరకు టీడీపీ ఇంఛార్జ్ దొన్నుదొర అన్నారు. సోమవారం అనంతగిరి మండలం, కొత్తూరు పంచాయితీ గ్రామాల్లో నిర్వహించన రైతన్న.. మీ కోసం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ మేరకు గిరి రైతులకు ఇస్తున్న సబ్సిడీ యంత్ర పరికరాల పధకాల గురించి, అన్నదాత సుఖీభవ-పిఎం కిసాన్ పథకంలో ఇస్తున్న వ్యవసాయ పెట్టుబడిని వివరించారు. గిరి రైతులు పండిస్తున్న కాఫీ, చిరుధాన్య పంటలకు ఉన్న డిమాండ్ తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్

ఆయుష్మాన్ భారత్ కార్డులు పంపిణీ చేయాలి: బీజేపీ నేతలు

సీనియర్ జర్నలిస్ట్ రమణ, నవంబర్ 24: ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కార్డులను ఆబెడ్కర్ కోనసీమ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వారు గత వైసీపీ ప్రభుత్వం లో కొంతమందికి ఇచ్చి మరల క్యాన్సిల్ చేయడం జరిగింది. పేద ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లి వైద్యం చేయించుకోలేక అనేక ఇబ్బందులు పడుతు అప్పుల పాలవుతున్నారు కనుక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరన్నర గడుస్తున్నా ఇంకా పేద ప్రజలకు ఇవ్వాల్సిన ఆయుష్మాన్ భారత్ కార్డులను ఇవ్వలేదు. కాబట్టి సామాన్య ప్రజలందరికీ ఆయుష్మాన్ భారత్ కార్డులను ప్రభుత్వం తరఫున ఇప్పించి పేద ప్రజలను ఆదుకుంటారని జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నట్లు అమలాపురం కలెక్టరేట్ లో సోమవారం బీజేపీ నేతలు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి అమలాపురం పట్టణ అధ్యక్షులు అయ్యల భాస్కరరావు ప్రధాన కార్యదర్శి దాట్ల వెంకట సుబ్బరాజు కిసాన్ మార్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అరిగెల నాని ఎస్సీ మోర్చా నాయకులు దాకే వెంకటరావు మన్నె రామదాసు యువ మోర్చా నాయకులు పావులూరు వెంకట్ అల్లవరం మండల అధ్యక్షులు కట్ట నారాయణమూర్తి ఉపాధ్యక్షులు కట్ట జనార్ధన్ ఇంకా బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.