Thursday, 19 March 2026

Blog

అన్నమయ్య

క్రమశిక్షణకు నిదర్శనం: చిట్వేల్‌లో ఘనంగా ఎన్‌సీసీ దినోత్సవం

-చెత్త బుట్టల వినియోగంపై అవగాహన సెమినార్ – ప్రతిభ కనబరిచిన క్యాడెట్లకు బహుమతుల ప్రదానం చిట్వేల్‌, నవంబర్ 25: పున్నమి ప్రతినిధి 30వ ఆంధ్ర బెటాలియన్ ఎన్‌సీసీ కమాండింగ్ అధికారి కల్నల్ సూర్యనారాయణమూర్తి ఆదేశాల మేరకు చిట్వేల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 78వ ఎన్‌సీసీ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఎన్‌సీసీ ట్రూప్ కమాండర్ పసుపుల రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. -క్రమశిక్షణ, దేశభక్తి అవసరం ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. దుర్గరాజు మాట్లాడుతూ, నేటి విద్యార్థులకు ఎన్‌సీసీ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ శిక్షణ ద్వారా విద్యార్థులలో క్రమశిక్షణ, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు అలవడతాయని, ఇది వారి భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉంటుందని తెలిపారు. -పర్యావరణ స్పృహపై సెమినార్ ఎన్‌సీసీ దినోత్సవ వేడుకలలో భాగంగా సామాజిక బాధ్యతను పెంపొందించే ఉద్దేశంతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్‌సీసీ అధికారి పసుపుల రాజశేఖర్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో “చెత్త బుట్టలను సరైన రీతిలో ఉపయోగించడం ఎలా” అనే అంశంపై ఒక సెమినార్ నిర్వహించి, విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. -బహుమతులు, మొక్కల పెంపకం ఈ సెమినార్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎన్‌సీసీ క్యాడెట్లు సాయి సుజిత్, భరత్, కార్తీక్, ముస్కాన్, రుకయ, వైష్ణవి లకు పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి, దాత జానీ కలిసి బహుమతులు అందజేశారు.తదనంతరం, పర్యావరణ పరిరక్షణకు తమ నిబద్ధతను చాటుతూ, ఎన్‌సీసీ క్యాడెట్లు అందరూ కలిసి పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి, దాత జానీ, ఎన్‌సీసీ విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నంద్యాల

గుంతనాల గ్రామంలో జరిగిన ‘రైతన్నా – మీకోసం’ కార్యక్రమం పాల్గొన్న మంత్రి ఎన్ఎండి ఫరూక్

నంద్యాల, పున్నమి ప్రతినిధి ఆర్ ఎన్ రెడ్డి: నంద్యాల మండలం, గుంతనాల గ్రామంలో వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన “రైతన్నా – మీకోసం” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ గ్రామంలోని రైతుల ఇంటింటికి స్వయంగా తిరిగి, “రైతన్నా – మీకోసం” పాంప్లెట్ పేపర్లను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలు మరియు కార్యక్రమాల గురించి ఆయన రైతులకు వివరంగా అవగాహన కల్పించారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు పలు చారిత్రక నిర్ణయాలు తీసుకుందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సేవలు మరియు పథకాల గురించి రైతులకు పూర్తి స్థాయిలో వివరించారు. ఈ కార్యక్రమం నంద్యాల టిడిపి మండల కన్వీనర్ మునగాల విశ్వనాథ్ రెడ్డి , ఎంపీడీవో, వ్యవసాయ శాఖ అధికారులు మరియు రైతులు , సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

నంద్యాల

గుంతనాల గ్రామంలో జరిగిన ‘రైతన్నా – మీకోసం’ కార్యక్రమం పాల్గొన్న మంత్రి ఎన్ఎండి ఫరూక్

నంద్యాల, పున్నమి ప్రతినిధి ఆర్ ఎన్ రెడ్డి: నంద్యాల మండలం, గుంతనాల గ్రామంలో వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన “రైతన్నా – మీకోసం” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ గ్రామంలోని రైతుల ఇంటింటికి స్వయంగా తిరిగి, “రైతన్నా – మీకోసం” పాంప్లెట్ పేపర్లను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలు మరియు కార్యక్రమాల గురించి ఆయన రైతులకు వివరంగా అవగాహన కల్పించారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు పలు చారిత్రక నిర్ణయాలు తీసుకుందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సేవలు మరియు పథకాల గురించి రైతులకు పూర్తి స్థాయిలో వివరించారు. ఈ కార్యక్రమం నంద్యాల టిడిపి మండల కన్వీనర్ మునగాల విశ్వనాథ్ రెడ్డి , ఎంపీడీవో, వ్యవసాయ శాఖ అధికారులు మరియు రైతులు , సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఎన్ టి ఆర్ జిల్లా

విజయవాడ సిద్ధార్థ మహిళా కళాశాల ఎన్‌ఎస్‌ఎస్— కంకిపాడు, పునాదిపాడులో మెగా హెల్త్ & అవగాహన క్యాంప్

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, విజయవాడ ,ఎన్.ఎస్.ఎస్ విభాగం వారు 1,2 యూనిట్స్ వారు 25 -11 -2025 వ తేదీన కంకిపాడు మరియు పునాదిపాడు గ్రామంలో మణిపాల్ హాస్పిటల్ విజయవాడ వారిచే బిపి, షుగర్ ,ఈసీజీ ,కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. గ్రామ ప్రజలు ఈ క్యాంపులో పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. ఈరోజు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించడం దానితోపాటు తడి చెత్త పొడి చెత్తను వేరు పరచడం వలన సమాజానికి దాని వల్ల కలిగే లాభాలను గురించి వివరించడం,ఎయిడ్స్ పై అవగాహన కల్పించే విధంగా ర్యాలీని , మొక్కలు నాటడం వల్ల కలుషితమైన వాతావరణాన్ని దూరం చేయొచ్చు అనే అంశం మీద కూడా ర్యాలీ నిర్వహించాము. ఈ కార్యక్రమాన్ని ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్. కె.సరళ, శ్రీమతి .టి .నాగరాణి పర్యవేక్షించారు.

ఆదిలాబాదు

ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఇండియన్ సివిల్ సర్వీసెస్ అధికారులు

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దేవపూర్ గ్రామంలో మావల సిఎఫ్ఎల్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎల్డియం ఉత్పల్ కుమార్ ధామ్ హాజరై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బ్యాంక్ అంత కలిగి ఉండాలని, డబ్బు వినియోగం, పొదుపుపై అవగాహన కలిగి ఉండాలని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానం ఉన్న 1930 లేదా పోలీస్ స్టేషన్ కు సంప్రదించాలని తెలిపారు. ఎంఎస్ఎంఈ లోన్స్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ సివిల్ సర్వీసెస్ అధికారులు నేహా గోయల్ (ఐడిఏఎస్), క్రిటి జోషి (ఐఆర్ఎస్), గౌతమ్ పటేల్ (ఐఎస్ఎస్), అనిమేష్ సింగ్ (ఐఏ &ఏఎస్), మహిపాల్ దాన్(ఐపీఓఎస్), ఎంఎస్ఎంఈ డిస్టిక్ మేనేజర్ పృథ్వీరాజ్, సిఎఫ్ఎల్ కౌన్సిలర్స్ కమలాకర్, భూమన్న, సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి వినోద్ మరియు గ్రామస్తులు హాజరయ్యారు.

జోగులాంబ గద్వాల

బ్రేకింగ్ న్యూస్ :ఈరోజు సాయంత్రం 6 గంటలకు సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్

గద్వాల్ నవంబర్ 25( పున్నమి ప్రతినిధి) స్థానిక సంస్థల ఎన్నికల నగర మోగనుంది.. ఈరోజు సాయంత్రం 6 గంటలకు సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్.

తెలంగాణ

ఇందిరమ్మ గృహప్రవేశం కార్యక్రమానికి హాజరైన :ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

నకిరేకల్ :నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం పోరెడ్డి గూడెంలో ఇందిరమ్మ గృహప్రవేశం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కలెక్టర్ ఇలా త్రిపాఠీ, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ తదితరులు హాజరయ్యారు.

కామారెడ్డి

రామారెడ్డిలో బిఆర్ఎస్ ఫైర్ డ్వాక్రా వాళ్లకే చీరలా! ..? – మిగతా మహిళలు లేనట్టేనా..?

కాంగ్రెస్ చీరల పంపిణీపై బిఆర్ఎస్ ఫుల్ ఫైర్ అయింది. డ్వాక్రా మహిళలకే చీరలు ఇచ్చి, మిగతా మహిళలను పక్కనపెట్టడంపై బండారు ఎత్తింది. కామారెడ్డి, 25 నవంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై నాయకులు తీవ్రంగా ధ్వజ మెత్తారు. డ్వాక్రా మహిళలకే చీరలు పంపిణీ చేసి, ఇతర మహిళలను అవమానపరుస్తున్నారని మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, మాజీ ఎంసీఏ డైరెక్టర్ పడగల శ్రీనివాస్ లు మండిప డ్డారు. డ్వాక్రాలో లేని మహిళలు మహిళలు కారా..? అందరి ఓట్లతో గద్దెెక్కి, ఇప్పుడు కొన్ని గ్రూపులకు మాత్రమే చీరలు పంచడం ఎంతటి న్యాయం?” అంటూ ఆయన ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. బతుకమ్మ పండుగకు ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్నా ఒక్కసారి చీరల పంపిణీ చేయలేదని ఆయన దుయ్యబట్టారు.మండలంలో సుమారు 12 వేల మహిళలు ఉన్నా, కేవలం 7,500 చీరలే రావడం ఘోర నిర్లక్ష్యమని ఆయన ఎద్దేవా చేశా రు. ఇంకా దాదాపు 40 శాతం మహిళలకు చీరలు అందాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రతి మహిళకూ చీరలు ఇచ్చే వరకు బిఆర్ఎస్ వీధుల్లోకి వస్తుందని, అవసరమైతే ఆందోళనలు, రాస్తారోకోలు చేయడానికి సిద్ధమని హెచ్చరించారు.కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలను మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ముస్లింలకు రంజాన్ తోఫా, క్రైస్తవులకు క్రిస్మస్ కానుక ఇచ్చేవారని, కానీ ఇప్పుడు ఆ పథకాలను కత్తిరించా రని ఆరోపించా రు.ఎన్నికల సమయంలో కల్లబొల్లి హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్, ఏ ఒకటీ నెరవేర్చలేక ప్రజలను మోసం చేస్తోందని మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి మండిపడ్డారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి, ప్రతి మహిళకు హక్కుగా చీర ఇవ్వాలని, లేకపోతే బిఆర్ఎస్ ప్రజలతో కలిసి మండలంలో ఉద్యమా న్ని జ్వాలలెత్తించేలా చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నర్సారె డ్డి, రైతు బంధు మాజీ జిల్లా డైరెక్టర్ రాజేంద ర్, మాజీ ఏఏంసీ డైరెక్టర్ సిద్దరాములు, బాల్ దేవ్, అంజయ్య, జంగం లింగం, హన్మోళ్ల రాజయ్య, ఇసాయపేట బైరయ్య, బాలమల్లు, దుబ్బాక లక్ష్మణ్, కుశనో.ల్లా రాజు తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ

పద్మశాలీలు రాజకీయ శక్తిగా ఎదగాలి

*పద్మశాలీలు రాజకీయ శక్తిగా ఎదగాలి -చెరుపల్లి రఘుపతి నేత,* బీసీ వర్గానికీ చెందిన పద్మశాలి ముద్దుబిడ్డ శ్రీ పున్న కైలాష్ నేత నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ డిసిసి అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పద్మశాలి సమాజాన్ని గుర్తించి పదవిని ఇచ్చినందుకు బ్రాహ్మణ వెల్లంల గ్రామానికి చెందిన చెరుపల్లి రఘుపతి నేత అనంతరం సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రముఖ్యమంత్రి శ్రీ యేనుమల రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది. పద్మశాలీలు రాజకీయ శక్తిగా ఎదిగి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా రాజకీయంగా అనేక పదవులను సాధించి పద్మశాలి సమాజాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మండల పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు చెరుపల్లి రఘుపతి నేత, పున్న నాగార్జున నేత,జెల్ల రమేష్ నేత, చెరుపల్లి విజయకుమార్ నేత, మిర్యాల గోవర్ధన్ నేత, పున్న చంద్రశేఖర్ నేత పాల్గొన్నారు.

వనపర్తి

దేశంలోని రాష్ట్రంలోని ఉపాధ్యాయుల లో ఉన్న టెట్ ఆందోళన ప్రతిష్టంబనను త్వరలోనే ముగింపు పలుకుతాం పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ గారు స్పష్టం చేశారు

*ఈరోజు గౌరవ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డీకే అరుణ గారి నివాసంలో రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎం ఎన్ విజయకుమార్ కలిసి వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పార్లమెంటులో జరిగే పార్లమెంటు సమావేశాల సందర్భంగా దేశవ్యాప్తంగా లక్షలాది మందిని ఉపాధ్యాయులని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న అంశం అలాగే రాష్ట్రంలో దాదాపుగా 45 నుంచి 50000 మంది ఉపాధ్యాయులను తీవ్ర నిరాశ అభద్రత భావానికి, ప్రతిస్తంభనకి ప్రతిష్టంభనకి గురి చేసినటువంటి టెట్ అనే అంశంపై చర్చించడం జరిగింది, ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యురాలు మన సంఘానికి హామీ ఇస్తూ తప్పకుండా మీరు గత పది రోజుల క్రితమే నాకు సంఘ లెటర్ హెడ్ నుంచి ఈ అంశం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు మెయిల్ పెట్టడం జరిగింది తప్పకుండా పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తి ఆర్టిఏ యాక్ట్ ఎడ్యుకేషన్లో సవరణ చేస్తూ దేశంలోని ఉపాధ్యాయ లోకానికి తీవ్ర గందరగోళాన్ని సృష్టించిన ఈ అంశానికి త్వరలోనే ముగింపు పలుకుతామని ఆ దిశగా భారత ప్రభుత్వం అడుగులు వేస్తున్నారని హామీ ఇవ్వడం జరిగింది వారికి సంఘ పక్షాన ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.