Monday, 4 May 2026

Blog

మహబూబ్ నగర్

కిక్ బాక్సింగ్ పోటీలో విజేతగా నిలిచిన విద్యార్థినిని అభినందిస్తున్న మహబూబ్నగర్ జిల్లా డిఎస్పి గారు

జోనల్ కిక్ బాక్సింగ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థినికి D.S. P. గారు సన్మానం. జోనల్ కిక్ బాక్సింగ్ పోటీల్లో బ్రోన్స్ మెడల్ సాధించిన తన్షిత నీ డి.ఎస్.పి వెంకటేశ్వర్లు గారు, సన్మానించి అభినందించారని, స్పోర్ట్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు, రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 25 నుంచి 28 వరకు ఇండోర్ స్టేడియం మధ్యప్రదేశ్ లో, నిర్వహించిన జోనల్ కిక్ బాక్సింగ్ టోర్నమెంట్లో,- 37 వెయిట్ కేటగిరి పాయింట్ లో,బ్రోన్స్ మెడల్ సాధించడం జరిగింది. ఈ కార్యక్రమంలో , అడ్వైజర్ ఎం ఎన్ విజయకుమార్, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

గుండ్లూరు శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో శివ ముక్కోటి మహోత్సవం

కడప జిల్లా రాజంపేట మండలం గుండ్లూరు గ్రామ సమీపంలోని చేయరు నదీ తీరాన వెలసిన శ్రీ అన్నపూర్ణా సమేత అగస్త్యేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల 03-01-2026, శనివారం నాడు శివ ముక్కోటి (పుష్య శుద్ధ పౌర్ణమి) పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రధాన అర్చకులు శ్రీ చాపాటి శివయ్య స్వామి ఒక ప్రకటనలో తెలిపారు. ​కార్యక్రమ వివరాలు: ​ఉదయం 7:00 గంటలకు: మహాగణపతి పూజ, స్వస్తి వాచనము, మహాన్యాస పారాయణము, ప్రధాన దేవతా కలశస్థాపనలు. అనంతరం మహాగణపతి, రుద్ర, చండీ, ప్రత్యంగిరా హోమములు నిర్వహించబడతాయి. ​మధ్యాహ్నం 12:00 గంటలకు: విశేష ‘మహాపూర్ణాహుతి’ కార్యక్రమం జరుగును. ​ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు బ్రహ్మశ్రీ బండాత్మకూరు శివకుమార్ శర్మ ఆధ్వర్యంలో, 16 మంది రుత్విక్కులచే శాస్త్రోక్తంగా నిర్వహించబడతాయి. భక్తులు ఈ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది. ​ఉభయదారులుగా చేరదలచిన భక్తులు రూ. 1516/- చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు: ​శ్రీ చాపాటి శివయ్య స్వామి: 9491222551 ​బ్రహ్మశ్రీ బండాత్మకూరు శివకుమార్ శర్మ: 9866809476 ​బ్రహ్మశ్రీ బనగానపల్లె సంతోష్ కృష్ణ శర్మ: 9701607510

వనపర్తి

రేపటి నుంచి తెలంగాణలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష

*రేపటి నుండి తెలంగాణలో టెట్ పరీక్షలు షురూ.*. *ఆందోళన చెందకండి..* *రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు* *పున్నమి ప్రతినిధి, వనపర్తి జిల్లా తేదీ::02/01/2026* ➡️కంప్యూటర్ ముందు ఖాళీగా కూర్చోకండి ✅సమాధానం తెలియని ప్రశ్నను ఆలోచిస్తూ కూర్చోకండి.. ముందుకు సాగండి.. ✅ సమాధానాలు తెలిసిన ప్రశ్నలను ముందుగా ఆన్సర్ టిక్ చేయండి.. ✅ ప్రశ్నలకు సమాధానాలు రాని.. వాటికి చివరి 30 నిమిషాలలో ఎదో ఒకటి పెట్టండి.. ✅ మైనస్ మార్కులు లేవు కాబట్టి లాభం జరుగుతుంది. ➡️ ఎగ్జామ్స్ సెంటర్ కు 2 గంటల ముందు చేరుకోండి బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉంటుంది.. ✅ మహిళా ఉపాధ్యాయులకు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు.. కేవలం మెహందీ.. పెట్టుకోకండి.. బయోమెట్రిక్ లో ఇబ్బంది అవుతుంది. ➡️చివరిగా హాల్ టికెట్, ఆధార్ కార్డు వెంట తీసుకా వెళ్ళండి.. మర్చిపోవద్దు.. ➡️సెల్ ఫోన్స్, ఇతర పేపర్లు అనుమతి లేదు.. *ఎలాంటి ఆందోళన లేకుండా ఇన్సర్వీస్ ఉపాధ్యాయులు పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావాలని రాష్ట్ర శాఖ జిల్లా శాఖ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది*

వనపర్తి

రేపటి నుంచి తెలంగాణలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష

*రేపటి నుండి తెలంగాణలో టెట్ పరీక్షలు షురూ.*. *ఆందోళన చెందకండి..* *రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు* *పున్నమి ప్రతినిధి, వనపర్తి జిల్లా తేదీ::02/01/2026* ➡️కంప్యూటర్ ముందు ఖాళీగా కూర్చోకండి ✅సమాధానం తెలియని ప్రశ్నను ఆలోచిస్తూ కూర్చోకండి.. ముందుకు సాగండి.. ✅ సమాధానాలు తెలిసిన ప్రశ్నలను ముందుగా ఆన్సర్ టిక్ చేయండి.. ✅ ప్రశ్నలకు సమాధానాలు రాని.. వాటికి చివరి 30 నిమిషాలలో ఎదో ఒకటి పెట్టండి.. ✅ మైనస్ మార్కులు లేవు కాబట్టి లాభం జరుగుతుంది. ➡️ ఎగ్జామ్స్ సెంటర్ కు 2 గంటల ముందు చేరుకోండి బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉంటుంది.. ✅ మహిళా ఉపాధ్యాయులకు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు.. కేవలం మెహందీ.. పెట్టుకోకండి.. బయోమెట్రిక్ లో ఇబ్బంది అవుతుంది. ➡️చివరిగా హాల్ టికెట్, ఆధార్ కార్డు వెంట తీసుకా వెళ్ళండి.. మర్చిపోవద్దు.. ➡️సెల్ ఫోన్స్, ఇతర పేపర్లు అనుమతి లేదు.. *ఎలాంటి ఆందోళన లేకుండా ఇన్సర్వీస్ ఉపాధ్యాయులు పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావాలని రాష్ట్ర శాఖ జిల్లా శాఖ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది*

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*నెల్లూరు అపోలో హాస్పిటల్ లో అరుదైన వైద్య చికిత్స*

జనవరి (పున్నమి ప్రతినిధి) వైద్యరంగంలో మారుతున్న చికిత్సా విధానాలకు అనుగుణంగా నూతన వైద్య పరికరాలతో అనుభవజ్ఞులైన వైద్యులతో ప్రజలకు వైద్య సేవలు అందిస్తోంది నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్. అనేక అరుదైన శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తూ దేశంలోనే అపోలో హాస్పిటల్స్ మొదటి స్థానంలో నిలుస్తున్నాయి. తాజాగా నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో ఓ వ్యక్తికి అరుదైన వైద్య చికిత్సను చేపట్టి ప్రాణాలను నిలబెట్టింది. కేవలం మెట్రో నగరాలకే పరిమితమైన ఆ వైద్యం మొట్ట మొదటి సారిగా నెల్లూరులోని అపోలో బృందం విజయవంతంగా నిర్వహించింది. ఆ వివరాలను అపోలో హాస్పిటల్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ చిర్రా భక్తవత్సల రెడ్డి, ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ శ్రావణి రెడ్డి బుధవారం హాస్పిటల్ లో విలేకరుల సమావేశం నిర్వహించి తెలియజేశారు. కావలి పట్టణానికి చెందిన 37 సంవత్సరాల వయస్సు కలిగిన నాగరాజు అనే వ్యక్తికి నోట్లి నుండి ఆగకుండా తీవ్రమైన రక్తస్రావం అవుతుండగా వారి కుటుంబసభ్యులు అపోలో హాస్పిటల్ కు తీసువచ్చారని చెప్పారు. నాగరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు ఓ చోట ఉబ్బి ఉండటమే కాకుండా, రంధ్రం కూడా ఏర్పడి ఉన్నట్లు గుర్తించామన్నారు. దాని కారణంగా ఊపిరితిత్తులకు చేరాల్సిన రక్తం బయటకు లీక్ అవుతూ, ఆ రక్తం నోటి గుండా బయటకు వస్తున్నట్లు తెలియజేశారు. ఇలాంటి సమస్యలు చాలా అరుదుగా జరుగుతుంటాని, ఆ సమస్యకు చికిత్స కూడా కేవలం మెట్రో నగరాల్లోనే అందుబాటులో ఉంటుందని చెప్పారు. నెల్లూరు అపోలో హాస్పిటల్ లో క్లిష్టమైన సమస్యలకు కూడా వైద్య సేవలు అందించే పరికరాలతో పాటూ అనుభవజ్ఞులైన వైద్య బృందాలు అందుబాటులో ఉన్నాయని చెబుతూ రోగి నాగరాజుకు బ్రాంకిల్ ఆట్రీ ఎంబోలైజేషన్ అనే పద్ద ద్వారా చికిత్స చేసి ప్రాణాలు నిలబెట్టామన్నారు. ఈ విధానం ద్వారా ఎక్కడైతే రక్తనాళానికి రంధ్రం పడిందో అక్కడ కాయిన్ ను అమర్చి నోట్లో నుండి వస్తున్న రక్త స్రావాన్ని నివారించామన్నారు. చికిత్సా విధానం విజయవంతంగా సాగిందని, ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకున్నారని వైద్యులు డాక్టర్ భక్తవత్సల రెడ్డి, డాక్టర్ శ్రావణి రెడ్డి తెలిపారు. ఈ తరహా చికిత్స జరగడం నెల్లూరులో ఇదే మొదటి సారి అని స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ డాక్టర్ బింధు భార్గవి రెడ్డి పాల్గొని, మాట్లాడారు. అన్నీ రోగాలకు నెల్లూరు అపోలో హాస్పిటల్ లో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.

కామారెడ్డి

పోసానిపేట పీఏసిఎస్‌లో జిల్లా వ్యవసాయ అధికారి, డిసిఓలు తీవ్ర హెచ్చరికలు

కామారెడ్డి, 1 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ క్రెడిట్ సొసైటీ (పీఏసిఎస్)ను జిల్లా వ్యవసాయ అధికారి, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ (డిసిఓ) సందర్శించారు. ఎరు వుల డీలర్లు సేల్ రిజిస్టర్, స్టాక్ బోర్డులు తప్పక సరిగ్గా పెట్టాలని ఘాటైన ఆదేశాలు జారీ చేశారు. రికార్డులు సరిగా లేకపోతే కఠిన చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరించారు.ఈ తనిఖీలు రైతులకు నాణ్యమైన ఎరువుల సులభ సరఫరా, పారదర్శక తను బలోపేతం చేస్తాయని చెప్పారు. పీఏసిఎస్‌ లు ఎరువులు, విత్తనాల పంపిణీలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. డీలర్లు రికార్డులు సరిగా ఉంచక పోతే బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్ వంటి సమస్యలు తలెత్తుతాయని అధికారులు స్పష్టం చేశారు

ఎన్ టి ఆర్ జిల్లా

దేవినేని ఉమామహేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ ప్రభుత్వ విప్‌ తంగిరాల సౌమ్య

ఏపీ ప్రభుత్వ విప్‌, నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య గురువారం గొల్లపూడిలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య తో పాటు నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలు దేవినేని ఉమామహేశ్వర రావు ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ భేటీలో పార్టీ బలోపేతం, నియోజకవర్గ అభివృద్ధి, ప్రజాసమస్యల పరిష్కారం వంటి అంశాలపై స్వల్పంగా చర్చ జరిగింది. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరంపై నాయకులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమాలను చేపట్టాలని, పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి చిత్రపటానికి నివాళులు

దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చిత్రపటానికి ఉదయగిరిలో SMGR వ్యవసాయ కళాశాల ప్రాంగణంలో యాజమాన్యం పూలమాలలు వేసి నివాళులుర్పoచారు కళాశాల ఆసోసియేట్ డీన్ డాక్టర్ జి కృష్ణరెడ్డి పేద పిల్లలు విద్యాభి హృద్దికి మేకపాటి కుటుంబం ఎంతో సహాయం చేశారని కొనియాడారు దాదాపు 100 ఎకరాల పైగా స్థలాన్ని అందించిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. Uploaded Video:

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి నుంచి చెన్నై కి డైరెక్ట్ బస్

ఉదయగిరి నుంచి చెన్నై కి సూపర్ లగ్జరీ సర్వీస్ ను ప్రారంభిస్తున్నట్లు RTC డిఎం రమేష్ కుమార్ తెలిపారు రాత్రి 9:30 గంటలకు బస్ బయలుదేరుతుందన్నారు ఆత్మకూర్, నెల్లూర్ సూళ్లూరుపేట మీదుగా చెన్నై కి ఉదయం 4 గంటలకు చేరుతుందన్నారు తిరిగి చెన్నై నుంచి ఉదయం 10:30 నిమిషాలకు బయలుదేరి సాయంత్రం 3:30 నిమిషాలకు ఉదయగిరి వస్తుందన్నారు కావున ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నూతన సంవత్సరం రోజు కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే

సీతారామపురం మండలంలో గోనువారిపల్లిలో నూతన సంవత్సరం వేడుకలు జరిగాయి ఈ వేడుకలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు ఆయన కేక్ కట్ చేసి ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు ఆయన మాట్లాడుతూ ఉదయగిరి అభివృద్ధికి సంబంధించిన తన వంతు కృషి చేస్తానని తెలిపారు ఈ వేడుకలలో ఎమ్మెల్యే పలువురు నాయకులుకు కేక్ కట్ చేసి తినిపించారు. Uploaded Video:

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.