Monday, 4 May 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో టూరిజం హోటల్ ప్రారంభిసున్నా మాజీ ఎమ్మెల్యే

ఉదయగిరి ఆనకట్ట సమీపంలో ఏపీ టూరిజం హోటల్ అధునకరించారు మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలకు దీటుగా మెట్ట ప్రాంతమైన ఉదయగిరి లో టూరిజం శాఖ హోటలను ఏర్పాటు చేయడం శుభపరిమనన్నారు న్యాయవాదులు రామారావు , షరీఫ్ నిర్వాహకులు తులసి రామ్ , వెంగళ రెడ్డి పాల్గొన్నారు.

తెలంగాణ

వైజ్ఞానిక పరిశీలన తో సమస్యలకు పరిష్కారం సాధ్యమే: కలెక్టర్

నకిరేకల్ :జనవరి ( పున్నమి ప్రతినిధి ) పరిశీలన ద్వారా విషయాన్నీ అవగాహన చేసుకుని సమస్యలను పరిష్కరించేందుకు విద్యార్థులు ప్రయత్నించాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తో కలిసి, డైట్ కళాశాలలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఇన్స్పైర్ అవార్డ్స్ ను ప్రారంభించారు. శాస్ర సాంకేతిక విజ్ఞానం వల్ల గొప్ప ఆవిష్కరణలు సాధ్యమయ్యాయని, విద్యార్థులు చిన్ననాటి నుంచే పరిశీలన అలవాటు చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని 284 ప్రదర్శనలో జాతీయ స్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బుడితి రాజశేఖర్‌కు మరో ఏడాది సర్వీస్ పొడిగింపు

(అమరావతి పున్నమి ప్రతినిధి) రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బుడితి రాజశేఖర్‌కు రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు సర్వీసును పొడిగించింది. వ్యవసాయ శాఖకు ఎక్స్-ఆఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయనను కొనసాగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది జనవరిలో పదవీ విరమణ చేసిన ఆయనకు అప్పట్లోనూ సేవల పొడిగింపు లభించింది. తాజా నిర్ణయంతో ఆయన వ్యవసాయం, పట్టు పరిశ్రమ, సహకారం & మార్కెటింగ్ శాఖల బాధ్యతలు నిర్వర్తించనున్నారు. నెలకు రూ.3.50 లక్షల కన్సాలిడేటెడ్ వేతనం చెల్లించనున్నారు.

తెలంగాణ

మున్సిపల్ ముసాయిదా ఓటర్ జాబితా పున పరిశీలనకు ఆదేశాలు ఇచ్చిన : కలెక్టర్

నకిరేకల్ :జనవరి ( పున్నమి ప్రతినిధి ) మునిసిపాలిటీలో వార్డుల వారీగా ప్రచురించిన ముసయిదా ఓటర్ జాబితాను నూటికి నూరు శాతం పారదర్శకంగా పునః పరిశీలించాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. తప్పులు లేకుండా ఇంటి నెంబర్ల వారీగా వివరాలు పరిశీలించాలని, అభ్యంతరాలను ఈనెల 5 వరకు స్వీకరించాలని సూచించారు. ఓటర్ జాబితా పై హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని తెలిపారు.

కామారెడ్డి

గొల్లపల్లి సర్పంచ్‌కు ఎంపీడీఓ, ఏపీఓల నుంచి గొప్ప గౌరవం

కామారెడ్డి, 02 జనవరి,( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) నాగేశ్వర్ రెడ్డి , సహాయక పరిశోధక అధికారి (ఏపీఓ) తిరు పతిరెడ్డి లను గొల్లపల్లి సర్పంచ్ అతికెల కిషన్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి (హార్దిక స్వాగతం) తెలిపారు. ఈ ఘటన మండల అధికా రులు, గ్రామ నాయకుల మధ్య ఉత్తమ సహకారా న్ని, మర్యాదాబద్ధమైన సంబంధాలను ప్రతి బింబిస్తోంది.ఈ కార్యక్రమం మండలంలో, గ్రామం లో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల అమలులో సర్పంచ్ కిషన్ యాదవ్ అంకిత భావా నికి గుర్తింపుగా నిలిచింది. స్థానిక ప్రజలు సంతోషి స్తూ, మండలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంపీడీఓ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, సర్పంచ్ సేవలు గ్రామ ప్రగతికి ముఖ్యమైనవి. మా సంప్రదింపులు ఇకపై మరింత బలపడతాయి” అని తెలిపారు.

నిర్మల్

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బైంసా ఆధ్వర్యంలో చారిత్రక క్షేత్ర పర్యటన

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భైంసా ఆధ్వర్యంలో చారిత్రక క్షేత్ర పర్యటన మహిషాసుర పాదాలు – మహిషా గుట్ట – గట్టు మైసమ్మ ఆలయాల సందర్శన భైంసా పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థుల్లో చారిత్రక అవగాహన, సాంస్కృతిక విలువలు, ఆధ్యాత్మిక దృక్పథం పెంపొందించాలనే మహత్తర లక్ష్యంతో ఈరోజు ఒక విశిష్టమైన చారిత్రక క్షేత్ర పర్యటనను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మహిషాసుర పాదాలు, మహిషా గుట్ట మరియు ప్రసిద్ధ గట్టు మైసమ్మ ఆలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా మహిషాసుర పాదాలకు సంబంధించిన పురాణ, చారిత్రక నేపథ్యం, సంబంధించిన ప్రాచీన కథనాలు, ఈ పాదాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, మహిషాసురుడు ఎవరి చేత వధించబడ్డాడు వంటి అంశాలను చరిత్ర అధ్యాపకులు డాక్టర్ పి. గంగారెడ్డి గారు విద్యార్థులకు సవివరంగా, ఆసక్తికరంగా వివరించారు. చరిత్రను కేవలం పాఠ్యపుస్తకాల పరిమితిలో కాకుండా ప్రత్యక్షంగా ప్రదేశాలను సందర్శిస్తూ తెలుసుకోవడం వల్ల విద్యార్థుల్లో జ్ఞానపరమైన అవగాహన మరింతగా పెరిగిందని ఆయన తెలిపారు. అనంతరం విద్యార్థులు మహిషా గుట్టపై ఉన్న ప్రసిద్ధ గట్టు మైసమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఈ ఆలయానికి ఉన్న ఆధ్యాత్మిక విశిష్టత, భక్తుల అచంచల విశ్వాసం, ఈ ప్రాంత ప్రజల సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల గురించి అధ్యాపకులు వివరించారు. మహిషాసుర పాదాలను స్థానిక ప్రజలు ఎంతో పవిత్రంగా భావిస్తూ, తరతరాలుగా అత్యంత జాగ్రత్తగా సంరక్షిస్తూ రావడం విశేషమని తెలిపారు. ఇది ప్రజల ధార్మిక నిబద్ధతకు, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడే భావనకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన భక్తులు తమ కోరికలు నెరవేరుతాయని గాఢమైన విశ్వాసంతో ప్రార్థనలు చేస్తారని, అందుకే చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరచుగా ఇక్కడికి వస్తుంటారని అధ్యాపకులు వివరించారు. చారిత్రక ప్రాధాన్యతతో పాటు ఆధ్యాత్మిక విలువలు కలిగిన ఈ ప్రాంతం విద్యార్థులకు ఒక జీవంత అధ్యయన కేంద్రంగా మారిందని వారు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా మహిషాసురుడి పేరుతోనే మహిషా, మాయిస, మైష్య అనే పదాలు ఉద్భవించి, కాలక్రమంలో భైంసా అనే పేరుగా ఈ ప్రాంతం ఏర్పడినట్లు చరిత్ర చెబుతోందని విద్యార్థులకు వివరించారు. ఇది భైంసా పట్టణానికి ఉన్న పురాతన చారిత్రక నేపథ్యాన్ని మరింతగా తెలియజేస్తుందని పేర్కొన్నారు. ఈ క్షేత్ర పర్యటన ద్వారా విద్యార్థుల్లో చరిత్ర, పురాణాలు, స్థానిక సంస్కృతి, ఆధ్యాత్మిక విలువల పట్ల అవగాహన మరింతగా పెరిగిందని అధ్యాపకులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కర్రోళ్ళ బుచ్చయ్య అనుమతితో ఇంచార్ ప్రిన్సిపల్ కె.రఘునాథ్ డా. భీమారావు డాక్టర్ పవన్ కుమార్ పాండే, డాక్టర్ యం. శంకర్, ఎ.రాజు, డాక్టర్ జాదవ్ ఓం ప్రకాష్, డాక్టర్ సంతోష్ కుమార్,డాక్టర్ నహీదా, డాక్టర్ కల్పన, రామ్మోహన్, రాజయ్య, సురేందర్, కిషన్, శ్రావణ్య, అర్షియా సుల్తానా, ఉజ్మా విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

సినిమా

తనికెళ్ల భరణి చేతుల మీదుగా ‘అసుర సంహారం’ మూవీ టీజర్ విడుదల

లెజెండరీ యాక్టర్ తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘అసుర సంహారం’. శ్రీ సాయి ప్రవర్తిక బోయళ్ళ సమర్పణలో, శ్రీ సాయి తేజో సెల్యూలాయిడ్స్ బ్యానర్‌పై సాయి శ్రీమంత్, శబరిష్ బోయెళ్ళ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిషోర్ శ్రీకృష్ణ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్స్, సాంగ్ లాంచింగ్ కార్యక్రమం తనికెళ్ల భరణి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. సుమారు 750కి పైగా చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన తనికెళ్ల భరణి, ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన ‘విలేజ్ క్రైమ్ డ్రామా’గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో తనికెళ్ల భరణితో పాటు మిధున ప్రియ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. “అసుర సంహారం అంటే చెడుపై మంచి సాధించిన విజయం. డైరెక్టర్ కిషోర్ శ్రీకృష్ణ మంచి సబ్జెక్టను తెరకెక్కించారు. సినిమా బాగా వచ్చింది. ఈ సినిమాలో ఒక విలేజ్ లో డిటెక్టివ్ పాత్ర పోషింసించాను. ఈ సినిమా నిర్మించడంలో, షూటింగ్ పార్టులో NRI శబరిష్, మిధున ప్రియ మాకు బాగా సహకరించారు.” అని చెప్పారు. దర్శకుడు కిషోర్ శ్రీకృష్ణ మాట్లాడుతూ.. “తనికెళ్ల భరణి గారు ఇందులో ‘విలేజ్ డిటెక్టివ్‌’గా భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా సినీ చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా మారుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మిథున్ ప్రియా గారి సహాకారం ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మార్చిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని తెలిపారు. నటీ, excutive ప్రొడ్యూసర్ మిథున్ ప్రియా మాట్లాడుతూ… కొన్ని సినిమాల్లో చేసాను. ఇది నాకు పెద్ద సినిమా. నెల్లూరు చుట్టూ షూటింగ్ చేశాం. ఈ సినిమాకు ప్రేక్షకుల సహకారం, ఆశీస్సులు కావాలి. మార్చిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.” అని తెలిపారు.

కామారెడ్డి

కామారెడ్డి కలెక్టర్ గిద్ద గ్రామంలో ఆకస్మిక తనిఖీ లు..

ఇందిరమ్మ ఇళ్ల నుంచి స్కూల్ వరకు పరిశీలన! కామారెడ్డి, 02జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం గిద్దలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, డ్రైనేజీ, స్కూల్ విద్యా స్థాయి.. అన్నీ చూసి సూచనలు.గ్రామీణ ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయా? ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తవుతుందా? స్కూళ్లలో పిల్లలు బాగా చదువుతున్నారా? ఇలాంటి కీలక అంశాలపై జిల్లా కలెక్టర్ ఆశిస్ సాంగ్వాన్ శుక్రవారం రామారెడ్డి మండలం గిద్ద గ్రామంలో ఆకస్మిక సంద ర్శన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నుంచి ప్రభుత్వ పాఠ శాల వరకు అన్నీ పరిశీలించి,స్థానికులు,అధికారు లకు కీలక సూచనలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం: ‘వేగంగా పూర్తి చేయండి.. నాణ్యత మరచవద్దు!’ గిద్ద గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారు ఇల్లు నిర్మిస్తున్న స్థలాన్ని కలెక్టర్ సాంగ్వా న్ ముందుగా పరిశీలించారు. పనుల పురోగతిని దగ్గరగా చూసి, లబ్ధిదారుతో మాట్లాడారు.ఇంటి నిర్మాణాన్ని వేగవంతం చేయండి.ప్రభుత్వం కట్టు బడి ఇస్తున్న నిధులను సద్వినియోగం చేసి, నాణ్య తతో పూర్తి చేయాలి,” అని సూచించారు.లబ్ధిదారు చెప్పిన వివరాల్లో ఇప్పటివరకు ఖర్చు, తీసుకున్న రుణాలు, దశలవారీ నిధి కేటాయింపు, మునుపటి నివాసం, ప్రస్తుత ఉద్యోగం వంటి అంశాలు తెలుసు కున్నారు. గ్రామంలో డ్రైనేజీ కాలువలు,రోడ్ల రెండు వైపులా పెరిగిన పిచ్చి మొక్కల తొలగింపు పనుల ను పరిశీలించారు.పిచ్చి, చెత్త తొలగించి డ్రైనేజీ సరిగ్గా పనిచేయాలి. రోడ్లు శుభ్రంగా ఉండేలా, నీరు నిలవకుండా చూడండి. గ్రామంలో పరిశుభ్రతా కార్యక్రమాలు నిరంతరం జరగాలి,” అని అధికారు లకు ఆదేశాలు జారీ చేశారు.అనంతరం గ్రామంలో ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా లకు చేరుకున్న కలెక్టర్, విద్యార్థులకు నోట్‌బుక్‌లు పంపిణీ చేశారు. తరగతి గదిలో బోర్డుపై గణిత లెక్కలు వ్రాయించి, పిల్లల విద్యా సామర్థ్యాన్ని స్వయంగా పరిశీలించా రు. ఒక విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు. పిల్లలు చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఉపాధ్యా యులు నాణ్యమైన బోధన చేయాలి.ప్రాథమిక నైపుణ్యాలు మెరుగుపడేలా ప్రత్యేక చర్యలు తీసు కోవాలని సూచించారు. పదవ తరగతిలో 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పెట్టు కోవాలని, ప్రత్యేక తరగతు లు నిర్వహించి లోపాలు సరిచేయాలని ఆదేశించా రు.ప్రతి పిల్ల ప్రతిభను వెలికితీయాలి.పరీక్షలకు పూర్తిగా సిద్ధం చేయాలని పేర్కొన్నారు.స్కూల్ ఆవరణంలో పిచ్చి,చెత్త లేకుండా శుభ్రంగా ఉంచా లని సూచించారు. కలెక్ట ర్ సందర్శనల్లో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ్, ఆర్డిఓ వీణ, తహసిల్దార్ ఉమలత, డిపీఓ, డీఎం, డీఈఓ రాజు, ఎంఈఓ తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి

కన్నాపూర్ గ్రామ పంచాయతీలో వర్కర్ కుటుంబానికి ఆర్థిక సహాయం

సర్పంచ్ గొల్ల మహేష్ నాయకత్వంలో 20,500 రూపాయలు అందజేత కామారెడ్డి 2 జనవరి (పున్నమి ప్రతినిధి) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం కన్నాపూర్ గ్రామంలో పంచాయతీ వర్కర్ కరికే నర్సింగ్ తల్లి మరణించిన సందర్భంగా,వారి కుటుంబానికి గ్రామ పంచాయతీ పాలకులు, కాంగ్రెస్ నాయకులు గొప్ప మానవతా దృక్పథం చూపారు.ఈ సహాయం తెలం గాణ గ్రామీణ ప్రజల మధ్య మంచి సందేశాన్ని ఇచ్చింది. పంచాయతీ సర్పంచ్ గొల్ల మహేశ్, పంచాయతీ కార్యదర్శి లావణ్య, ఉపసర్పంచ్ యాత్వంత్ రావు, వార్డు సభ్యులు శగా నవీన్, హరీష్, ప్రశాంత్, లావణ్య, రవళి, విజయ్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు బిక్షపతిలు కలిసి కుటుంబానికి రూ.20,500 సహాయం అందజేశారు.ఈ కార్యక్ర మం గ్రామంలో ఐక్యతను పెంచి,పాలకుల మానవ త్వాన్ని ప్రదర్శించారు.కుటుంబ సంక్షేమ ప్రాధాన్య త పంచాయతీ పాలకులు కరికే నర్సింగ్ కుటుంబా నికి తమ వంతు సహాయం చేసి, ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉప్శమనం కల్పించారు.ఈసహాయం ద్వా రా గ్రామంలో సంక్షేమ భావన పెరిగిందని చెప్పారు. తెలంగాణలో ఇలాంటి చిన్న చర్యలు పెద్ద మార్పు ను తీసుకువస్తాయని నిరూపితమైంది.కన్నాపూర్ గ్రామ ప్రజలు ఈ సహాయాన్ని చూసి పాలకులపై నమ్మకం పెంచుకున్నారు. సర్పంచ్ గొల్ల మహేష్ నాయకత్వం వర్థిల్లాలి అని నినాదాలు చేశారు. ఇలాంటి కార్యక్రమాలు రామారెడ్డి మండలంలో మరిన్ని ఆశలను నింపుతున్నాయని ఆశభావం వ్వక్తం చేశారు.

మహబూబ్ నగర్

కిక్ బాక్సింగ్ పోటీలో విజేతగా నిలిచిన విద్యార్థినిని అభినందిస్తున్న మహబూబ్నగర్ జిల్లా డిఎస్పి గారు

జోనల్ కిక్ బాక్సింగ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థినికి D.S. P. గారు సన్మానం. జోనల్ కిక్ బాక్సింగ్ పోటీల్లో బ్రోన్స్ మెడల్ సాధించిన తన్షిత నీ డి.ఎస్.పి వెంకటేశ్వర్లు గారు, సన్మానించి అభినందించారని, స్పోర్ట్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు, రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 25 నుంచి 28 వరకు ఇండోర్ స్టేడియం మధ్యప్రదేశ్ లో, నిర్వహించిన జోనల్ కిక్ బాక్సింగ్ టోర్నమెంట్లో,- 37 వెయిట్ కేటగిరి పాయింట్ లో,బ్రోన్స్ మెడల్ సాధించడం జరిగింది. ఈ కార్యక్రమంలో , అడ్వైజర్ ఎం ఎన్ విజయకుమార్, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.