విశాఖపట్నం
*కూటమి ప్రభుత్వం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ బీసీలకు వెన్నుపోటు పొడిచారూ* డాక్టర్ తుళ్ళి చంద్రశేఖర్ యాదవ్ వైఎస్ఆర్సిపి రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి *విశాఖపట్నంపున్నమి ప్రతినిధి* చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ కూటమి ప్రభుత్వం బీసీలను అడ్డంగా మోసం చేసి బీసీలను ఓటు బ్యాంక్ గా చూస్తున్నారు, బీసీలకు ఎలక్షన్ కి ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా బీసీలను మోసం చేస్తున్నారని వైఎస్ఆర్సిపి రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ తుళ్ళి చంద్రశేఖర్ యాదవ్ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ జనాభా లో బీసీలు 50 శాతం కంటే ఎక్కువ కాబట్టి బీసీలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లయినా బీసీలు అనేక రంగాల్లో ఇంకా వెనుకబడి ఉన్నారు ఈ వెనుకపాటు కు కారణం ఏమిటంటే బీసీలను ఓటు బ్యాంకు గా చూస్తున్నారు. బీసీల అభివృద్ధికి ప్రత్యేక విధానాలు రూపొందించకపోవడం ఒక కారణం. ముఖ్యంగా రాజకీయ పార్టీలు బీసీలు కు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం. కానీ y s జగన్ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో బీసీలు కు ఇచ్చిన హామీలను 100% నెరవేర్చారు. కానీ కూటం ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నారు. అలాగే బీసీలకు తగిన గౌరవం ప్రాధాన్యత కూటమి ప్రభుత్వం ఇవ్వకపోవడం కూడా ఒక కారణం. గత ప్రభుత్వంలో శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలను ఓటు బ్యాంకు గా కాకుండా బ్యాక్ బోన్ క్లాసులుగా ఆత్మగౌరవంతో తల పైకెత్తుకునే లాగా చేశారు. గత ప్రభుత్వం2014 నుండి 2019 చంద్రబాబు ప్రభుత్వం అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం గతంలో ఉన్న అవినీతికి వివక్షకు పరాకాష్ట అయిన జన్మభూమి కమిటీల్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019 నుండి 2024 వరకు బీసీలు పై ప్రత్యేక శ్రద్ధతో వాలంటీర్ వ్యవస్థను తెచ్చి బీసీ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేయడం ద్వారా అవినీతికి అవకాశం లేకుండా చేశారు మన జగనన్న. జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో బీసీ కుటుంబాలకు జగనన్న 1. 98 లక్షల కోట్ల లబ్ధి చేకూర్చారు. ఈ కూటమి ప్రభుత్వం ఇంత వరకు పదో వంతు కూడా చేయలేదు.లోకేష్ పాదయాత్రలో చంద్రబాబు మీటింగ్లలో పవన్ కళ్యాణ్ మీటింగ్లలో వాళ్లు చెప్పింది ఏంటి అంటే మా ప్రభుత్వం వస్తే జగన్మోహన్ రెడ్డి బీసీలకు చేసిందానికంటే ఎక్కువగా చేస్తావని హామీలు ఇచ్చి ఈరోజు ఆ హామీలను నెరవేర్చలేదు. బీసీ రక్షణ చట్టం తెస్తాను అని చెప్పి ఇప్పటికి బీసీ రక్షణ చట్టం మాటే లేదు. బీసీలను ఆర్థికంగా ఆదుకుంటాం అని అన్నారు కానీ వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తున్నారు. బీసీ విద్యార్థిలకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని మోసం చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా 50 శాతం పైన బీసీలు ఉన్నారు. మొన్న తుఫాన్ కి ఎక్కువగా నష్టపోయిన బీసీ రైతులను ఆదుకుంటానని చెప్పి ఇప్పటివరకు వాళ్లని ఆదుకున్న దాఖలాలు లేవు. బీసీ ఎస్సీ ఎస్టి మైనారిటీలు రుణాల కోసం ఎదురుచూస్తున్న ఆ రైతుల గోడు పట్టదా. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల రైతు బీమా కూటమీ ప్రభుత్వం కట్టక నష్టపోయిన రైతులకు నష్టపరహారం చెల్లించ కా ఎంతోమంది బీసీ ఎస్సీ ఎస్టీ రైతులు దాదాపు 300 మంది బలవన్ మరణానికి పాలయ్యారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ రైతులకు అన్నదాత పథకం కింద వేట 20000 ఇస్తానని చెప్పి రెండేళ్లకు గాను 40 వేలు ఇవ్వాల్సింది పోయి 10000 రూపాయలు ఇచ్చి 30000 ఎగ్గొట్టారు . బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు రైతులకు గిట్టుబాటు ధర లేక పంటలను రోడ్డు మీద పడేశారు. బీసీ హాస్టల్ లో పరిస్థితి చూస్తే మరీ అద్వానంగా దయనీయమైన పరిస్థితులు లో బీసీ విద్యార్థులు విద్యార్థినిలు బతుకుతున్నారు. అదే జగన్ గారి ప్రభుత్వంలో నాడు నేడు పథకం కింద స్కూళ్ళు హాస్టల్కు పెద్దపీట వేసి నాణ్యమైన విద్యను హాస్టల్ సౌకర్యాలను కల్పించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పాలన చూసినట్టయితే బీసీ హాస్టల్ లో పురుగుల అన్నం కి విద్యార్థులు అస్వస్థకు గురై హాస్పిటల్ పాలైన సంఘటనలు ఎన్నో చూసాం. ఇదా కూటమి ప్రభుత్వం బీసీ విద్యార్థులకు చూసుకునే పద్ధతి. అదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పిల్లలు తినే ఆహారాన్ని గోరుముద్దు కింద స్వయంగా సీఎం జగనన్నే ఎంపిక చేస్తున్న రాష్ట్రం మంది. చదువులే జీవితాలకు వెలుగులని నమ్మాడు కాబట్టే సొంత మేనమామ లాగా బీసీ బిడ్డల కోసం ఎంతో ఖర్చుకైనా వెనకాడ లేదు. అమ్మ ఒడి లబ్ధిదారులు లో 20 లక్షల మంది బీసీ తల్లులు తమ సోదరుడు ఏటా ఇస్తున్న 15 వేల తో ధీమాగా బిడ్డల్ని చదివించారు. ఈ కూటమి ప్రభుత్వం అమ్మ ఒడి పథకాన్ని పేరు మార్చి తల్లికి వందనం అని చెప్పి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇస్తామని చెప్పి ఇప్పుడు తల్లికి వందనం పథకానికి తూట్లు పొడిచి బీసీ తల్లుల్ని మోసం చేస్తున్నారు. హాస్యాస్పదం ఏంటంటే అమ్మ ఒడి పేరు మార్చి తల్లికి వందనం అని పెట్టి అది నారా లోకేష్ పథకం లా ప్రచారం చేసుకున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దాన్ని హాస్యాస్పదంగా తీసుకొని నవ్వుకున్నారు. ఈ మధ్యకాలంలో విడుదలైన గణాంకాలు చూస్తే ఒకప్పుడు జగనన్న హయాంలో స్కూళ్లు నో వేకెన్సీ అని గవర్నమెంట్ బడులు గేటుకు పెట్టారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో డ్రాప్ అవుట్స్ ఎక్కువయ్యారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవన తో బీసీ బిడ్డలు కోరిన విధంగా చదువుకున్నారు. పోటీ పరీక్షలకు జగనన్న విద్యున్నతి, విదేశీ చదువులు కు జగనన్న విదేశీ విద్య నిధి అమలు చేశారు. ఇదొక విద్యా విప్లవం బీసీలు బతుకుల్లో విప్లవాత్మక మార్పు కు ఈ పథకాలే నాంది. … జగనన్న తన అక్క చెల్లెమ్మల కోసం వైయస్సార్ చేయూత వైయస్సార్ సున్నా వడ్డీ పథకాలు ఇచ్చి చేయూత ద్వారా 16 లక్షలు మంది కి సున్నా వడ్డీ రుణాలతో, 57 లక్షల మంది బీసీ మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యారు. వైయస్సార్ కళ్యాణమస్తు ద్వారా పదో తరగతి చదివిన ఆడపిల్లల పెళ్ళికి 50,000 సాయం, కులాంతర వివాహం చేసుకుంటే 75000 సాయం అందించారు. ఈ కూటమి ప్రభుత్వం అక్కాచెల్లెమ్మలకు బీసీ ఆడబిడ్డలకు ఇస్తానన్న హామీ ఇప్పటి వరకు నెరవేర్చలేదు ఆఖరికి బిసి ఆడ బిడ్డలను వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుకు కూటమి ప్రభుత్వంకు దక్కుతుంది. కోవిడ్ మహమ్మారి వల్ల జీవనోపాధి దెబ్బతిన్న రజకులు, నాయి బ్రాహ్మణులు, టైర్లలకు ఏట 10000 రూపాయలు చొప్పున జగనన్న చేదోడుగాచేతికి ఇచ్చారు. 70000 మంది చేనేత కార్మికులకు ఏటా24 వేల రూపాయలు నేతన్న నేస్తంగా అందించారు. మత్స్యకార భరోసా, కల్లుగీత కార్మికులకు బీమా, గొర్రెల పెంపకదారులకు ప్రత్యేక రుణాలు అందిస్తూ కులవృత్తులని ఆత్మగౌరవంతో కొనసాగించేలా అమలు చేశారు. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాలలో 50% బీసీలకు ఇవ్వడం ఇది ఒక కొత్త అధ్యాయం. ఒక్కసారిగా ఇన్ని లక్షల మంది బిసి యువతి యువకుల్ని గౌరవనీయ స్థానంలో కూర్చోబెట్టడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి సాధ్యమైన ఘనత అది ఒక జగనన్నకే సాధ్యం. … బీసీలు చేతికి పాలనా పగ్గాలు అందించింది కూడా శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలను ఓటర్లుగా కాకుండా పాలకులుగా బలహీన వర్గాల వారు ఉండాలని జగనన్న ఆకాంక్ష. అందుకే చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా గత రాజకీయ సాంప్రదాయాలకు భిన్నంగా ఎక్కువ మంది బీసీల చేతికి అధికారాన్ని ఇచ్చారు. నామినేటెడ్ పదవుల్లో గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లో బీసీలకు బీసీ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో బీసీలకు చిప్ప చేతికి ఇస్తున్నారు. అధికారంలోకి రాకముందు బీసీల సమస్యలు అధ్యయనానికి ఓ కమిటీ వేసి వారి సూచనలని మేనిఫెస్టోలో చేర్చి అధికారంలోకి వచ్చాక బీసీ సమస్యల పరిష్కారానికి శాశ్వత కమిషన్ మరియు 56 బీసీ కార్పొరేషన్లు జగనన్న ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వంలో బీసీలకు ఏం చేశారు. … జగనన్న ప్రభుత్వంలో 15 మంది మంత్రులు 6 గురు లోక్ సభ ఎంపీలు నాలుగురు రాజ్యసభ ఎంపీలు 22 మంది ఎమ్మెల్సీలు బీసీలే అదనంగా సుమారు 90000 మంది బీసీలకు వివిధ ప్రభుత్వ పదవులు ఇచ్చారు. రాష్ట్రంలో మాత్రమే కాదు యావత్ దేశంలో బీసీల అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ చేసింది ఎవరూ లేరు. వైయస్సార్సీపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల అభివృద్ధిని ప్రధాన ఎజెండాగా ముందుకు తీసుకెళ్లారు. కేంద్రం కులగణన విడుదల చేయాలని ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంతో పోరాడారు 38 బిసి ఉపకులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని కేంద్రంపై వైఎస్ఆర్సిపి ఒత్తిడి తెచ్చింది రాష్ట్రం లో విద్య ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా ప్రాతిపదిగిన రిజర్వేషన్లను అమలు చేయాలని చట్టసభల్లో వైఎస్ఆర్సిపి ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పోరాడారు. కేంద్ర స్థాయిలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, బీసీల సంక్షేమానికి లక్ష కోట్లతో ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు మేరకు వైఎస్ఆర్సిపి ఎంపీలు పోరాడారు . ఈ కూటమి ప్రభుత్వం కి ఇవన్నీ ఏం మాత్రం పట్టింపు లేదు ఎంతసేపటికి కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని దోచుకోవడం పంచుకోవడం ఏ తప్ప బీసీల సమస్యలపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన ఏ దాఖలాలు లేవు. ఆంధ్ర రాష్ట్రంలో బీసీలంతా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు బీసీలంతా కూటమి ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో లేరు. కూటమి ప్రభుత్వం