Tuesday, 17 March 2026

Blog

E-పేపర్

బంగారు రుణాలపై తక్కువ వడ్డీ రేటు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ వాసు

రైల్వేకోడూరు మండలం స్థానిక ఆర్ఎస్ రోడ్ బ్రాంచ్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ వాసు, మాట్లాడుతూ మా ఖాతాదారులకు డిపాజిట్లపై అధిక వడ్డీ రేటు కల్పిస్తున్నాము అంతేకాకుండా ఇంటిపై రుణాలు వాహన రుణాలు బంగారం పై రుణాలు వ్యాపారాలపై లోన్ సౌకర్యం కల్పించబడును. కావున ఖాతాదారులు ఈ సౌకర్యాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాము.

E-పేపర్

బంగారు రుణాలపై ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు తక్కువ వడ్డీ రేట్లు మేనేజర్ వాసు

రైల్వేకోడూరు మండలం స్థానిక ఆర్ఎస్ రోడ్ బ్రాంచ్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ వాసు, మాట్లాడుతూ మా ఖాతాదారులకు డిపాజిట్లపై అధిక వడ్డీ రేటు కల్పిస్తున్నాము అంతేకాకుండా ఇంటిపై రుణాలు వాహన రుణాలు బంగారం పై రుణాలు వ్యాపారాలపై లోన్ సౌకర్యం కల్పించబడును. కావున ఖాతాదారులు ఈ సౌకర్యాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాము.

అన్నమయ్య

అన్నమయ్య జిల్లాలో విలీనం చేస్తే ఆందోళన ఉదృతం చేస్తాం

-సిద్దవటం తహసీల్దారుకు వినతిపత్రం అందచేసిన జేఏసీ నాయకులు సిద్దవటం,డిసెంబర్ 01 పున్నమి ప్రతినిధి సిద్దవటం మండలాన్ని అన్నమయ్య జిల్లాలో విలీనం చేస్తే ఆందోళన ఉదృతం చేస్తామని సిద్ధవటం జేఏసీ నాయకులు అన్నారు.సిద్ధవటాన్ని రాయచోటిలో కలపడం పట్ల సిద్దవటం జె.ఏ.సి సభ్యులు సోమవారం మండల వ్యాప్తంగా వందలాది మంది ప్రజల సంతాకాలు సేకరించి సిద్దవటం తహసీల్దారు ఆకుల తిరుమల బాబుకు వినతిపత్రం అందచేశారు.ఈ సందర్భంగా జేఏసీ సభ్యులు మాట్లాడుతూ సిద్దవటం మండలాన్ని యధావిధిగా కడపలోకే వుంచాలని లేదా అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించి సిద్దవటం మండలాన్ని రాజంపేటలోకి కలపాలని తహసీల్దారు గారికి వినతిపత్రం అందచేశామని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తహసీల్దారు కార్యాలయం ఎదుట రాయచోటి వద్దు కడప ముద్దు- రాయచోటి వద్దు రాజంపేట ముద్దు అనే నినాధాలతో హోరెత్తించారు. మండలంలోని అన్ని పార్టీల నాయకులు ఉద్యమించాలని చాలా మంది నోరు విప్పి ముందుకు రావడం లేదని ఇలాగైతే వచ్చే స్దానిక ఎలక్షన్లలో ప్రజలు తగిన బుద్ది చెపుతారని అన్నారు. ఇప్పటికైనా నాయకులు ఉద్యమాన్ని ముందుండి నడిపించి పై స్దాయి నాయకులకు ప్రభుత్వ పెద్దలకు విన్నవించి సామాన్య ప్రజల పక్షాన నిలవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యాప్తంగా ఉన్న రైతులు, చేనేత కార్మికులు, విద్యావంతులు, మేధావులు, వ్యాపార వేత్తలు, స్వచ్చంద సంస్థ సభ్యులు, పాఠశాలల యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు. జేఏసీ కార్యాచరణలో భాగంగా తదుపరి కడప జిల్లా కలెక్టరు గారిని కలసి వినతిపత్రం అందించ నున్నట్లు సభ్యులు తెలిపారు.

అన్నమయ్య

కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం

-టిడిపి మహిళా నాయకురాలు కోటపాటి సుబ్బమ్మ సిద్దవటం డిసెంబర్ 1 పున్నమి ప్రతినిధి కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని టిడిపి మహిళా నాయకురాలు కోటపాటి సుబ్బమ్మ అన్నారు. రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమట్టి జగన్మోహన్ రాజు ఆదేశాల మేరకు సిద్ధవటం మండలంలోని మల్లేశ్వరం సోమవారం ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ల కార్యక్రమంలో మల్లేశ్వరపురం గ్రామం ఎస్సీ కాలనీలో సచివాలయం సిబ్బందితో కలిసి కోటపాటి సుబ్బమ్మ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఒకటో తారీకు అనగానే ఒక పండగ వాతావరణం కనబడుతుందన్నారు.ఉదయం 7 గంటల నుండి సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి వృద్ధులకు,వికలాంగులకు, ఒంటరి మహిళలకు వివిధ రకాల పెన్షన్లను సచివాలయం సిబ్బంది పనితీరు అద్భుతంగా ఉందన్నారు.వైకాపా నాయకులు మాత్రం విషం చిమ్ముతూ పెన్షన్లను తొలగిస్తున్నారని పెన్షన్ దారులలో ఆందోళన కలిగిస్తున్నారన్నారు. వైకాపా ప్రభుత్వంలో అనేక అక్రమ పెన్షన్లను నమోదు చేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి ఒక్క అర్హులకి పెన్షన్ ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్నారని ఆమె తెలియజేశారు.

అన్నమయ్య

పింఛ‌న్ల‌ను పెంచిన ఘ‌న‌త సీఎం చంద్ర‌బాబుదే

-రాజంపేట నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షుడు కాడే చెంచయ్య నాయుడు డిసెంబ‌రు,01 పున్నమి ప్రతినిధి పింఛ‌న్ల‌ను రూ.4వేల‌కు పెంచిన ఘ‌న‌త ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబునాయుడిదేన‌ని రాజంపేట నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు కాడే చెంచయ్య నాయుడు స్ప‌ష్టం చేశారు. మండలంలోని భాకరాపేట గ్రామ సమీపంలో ఉన్న ఏపీఎస్పీ 11వ పోలీసు బెటాలియన్ వద్ద ఎన్టిఆర్ భ‌రోసా పింఛ‌న్ల పంపిణీని ఆయ‌న సోమ‌వారం ప్రారంభించారు.లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పింఛ‌న్ మొత్తాన్ని అంద‌జేశారు.ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద‌ల స‌మ‌స్య‌ల‌ను అర్ధం చేసుకున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు సామాజిక పింఛ‌న్ల‌ను రూ.వెయ్యి నుంచి రూ.2వేల‌కు,ఆ త‌రువాత రూ.3వేల నుంచి ఒకేసారి రూ.4వేల‌కు పెంచి వారిని ఆదుకున్నార‌ని చెప్పారు.గ‌త ప్ర‌భుత్వ హాయాంలో పింఛ‌న్‌ను రూ.2వేలు నుంచి రూ.3వేల‌కు పెంచ‌డానికి ఐదేళ్లు ప‌ట్టింద‌ని అన్నారు.పేద‌ల సంక్షేమం కోసం ఎల్ల‌ప్పుడూ క‌ట్టుబ‌డి ఉండేది టిడిపి ప్ర‌భుత్వ‌మేన‌ని పేర్కొన్నారు.రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, అభివృద్ది, సంక్షేమం రెండు క‌ళ్లుగా పాల‌న సాగుతోంద‌ని చెప్పారు. త‌ప్పుదోవ ప‌ట్టించిన వ్య‌వ‌స్థ‌ను ముఖ్య‌మంత్రి త‌న అపార అనుభ‌వంతో గాడిన పెడుతున్నార‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కాడే కదిరేగారి శ్రీనివాసులు నాయుడు,సిద్ధవటం టిడిపి అధ్యక్షుడు రాజశేఖర్ యాదవ్, జిల్లా యాదవ సంఘం సెక్రటరీ కృష్ణ, పార్ల శ్రీనివాసులు, పంచాయతీ సెక్రటరీ సుధీర్ పాల్గొన్నారు.

విశాఖపట్నం

తెల్లవారకముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు… అవ్వ–తాతల మొహాల్లో వెలిగిన సంతోష దీపాలు

సోమవారం తెల్లవారకముందే విశాఖపట్నం నగరంలోని 49వ వార్డు సేవా కార్యక్రమాలతో సందడిగా మారింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు అందజేయడానికి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చింతు కన్నం నాయుడు, జాయింట్ సెక్రటరీ కీలు కోటేశ్వరరావు పర్యవేక్షణలో సచివాలయం సిబ్బంది ఉదయం మొదటి వెన్నెలలోనే ప్రతి ఇంటిని సందర్శించారు. అరుణోదయం పూర్తిగా విరియకముందే తలుపు తట్టిన సచివాలయం సిబ్బందిని చూసి పలువురు వృద్ధులు ఆనందభాష్పాలతో స్పందించారు. అవ్వ–తాతల మొహాల్లో మెరిసిన ఆ తగ్గని చిరునవ్వు కార్యక్రమానికి మరింత అందాన్ని తీసుకొచ్చింది. ప్రతి లబ్ధిదారుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ మొత్తం అందేలా పార్టీ నాయకులు, స్థానిక బాధ్యులు, సిబ్బంది సమన్వయంతో పని చేసిన తీరు స్థానిక ప్రజల ప్రశంసలను అందుకుంది. ఇంటికి ఇంటిగా తిరుగుతూ లబ్ధిదారుల వివరాలు ధృవీకరించి, పెన్షన్లు తక్షణమే అందేలా జాగ్రత్తపడ్డారు. పెన్షన్లు సమయానికి అందించడం ప్రభుత్వ పథక ప్రయోజనాలను ప్రజల భవన ద్వారాలకే తీసుకువెళ్లినట్లేనని స్థానికులు అభిప్రాయపడ్డారు. 49వ వార్డు అంతటా తెల్లవారకముందే సాగిన ఈ సేవా పర్యటన వృద్ధుల హృదయాల్లో వేడి కిరణాల్లా సంతోషాన్ని నింపింది.

కడప

ఇంస్టాంట్ పేడ రంగు తాగి మహిళ ఆత్మహత్య

కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం దేవాంగ పేట జ్యోతి నగర్ కు చెందిన ఓ మహిళ సౌభాగ్య ఇంస్టాంట్ పేడ రంగు నీళ్లలో కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకుంది ఈ సంఘటన కు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. చాలా ప్రమాదకరమైన ఈ సౌభాగ్య ఇంస్టాంట్ పేడ రంగు లో ఎన్నో విషపూరిత రసాయనాలు ఉన్నాయి వెంటనే ఈ ఇన్స్టంట్ పేడ రంగు బ్యాన్ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలి

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మామిడికుదురు మండలంలో బహుజన పార్టీ సమావేశం – పార్టీ బలోపేతానికి పిలుపు

డా” బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ మామిడికుదురు మండలంలో బహుజన పార్టీ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బహుజన్ సమాజ్ పార్టీ గన్నవరం నియోజకవర్గ అధ్యక్షులు తాడి రాంబాబు, ఇంచార్జ్ కుసుమ శంకర్, జనరల్ సెక్రటరీ ఎం. చందు హాజరయ్యారు. మండలంలో పార్టీ బలోపేతం కోసం విలువైన సూచనలు అందించారు. జనకళ్యాణ్ దివస్ సందర్భంగా పార్టీని ఇంటింటికి తీసుకెళ్లి, పార్టీ ఫండ్ సేకరణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని మండల కమిటీకి ఆదేశాలు ఇచ్చారు. ఈ సమావేశంలో తాడి రమేష్, గెడ్డం రమేష్, అశోక్, వెంకటేష్, పి. ప్రసాద్, వీరేంద్ర, రాంప్రసాద్, రాజు, బంగారు రాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలోతెలుగు విభాగం ఆధ్వర్యంలో భగవద్గీత జయంతి ఉత్సవములు…

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల లో 1.12. 2025 వ తేదీన తెలుగు విభాగం వారు శ్రీమద్ భగవద్గీత సందర్భంగా గీతా సందేశము అనే అంశంపై కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివిఎస్ కుమార్ గారు అధ్యక్షత వహించగా, మధురకవి, మధురస్వరయోగి బిరుదాంకితులు ,శ్రీ వలివేటి వెంకట శివరామకృష్ణమూర్తి గారు ముఖ్యఅతిథిగా విచ్చేసినారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివిఎస్ కుమార్ గారు భగవద్గీత మానవాళికి ఆదర్శప్రాయమని, భగవద్గీతను అందరూ అధ్యయనం చేయాలని చెబుతూ భగవద్గీత యొక్క ప్రాధాన్యతను వివరించారు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీ వలివేటి వెంకట శివరామ కృష్ణమూర్తి గారు మాట్లాడుతూ గీత సందేశాన్ని అందిస్తూ గీత సు గీత కర్తవ్య శ్రీమద్భగవద్గీత గొప్పతనాన్ని తెలియజేస్తూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన శ్రీమద్రామాయణ, భారత, భగవద్గీతల ద్వారా ఏ సమస్యలున్నా వాటిని అధ్యయనం చేసి అవగతం చేసుకొని ఆచరించినట్లయితే సమస్యల ప్రభావం ఎక్కువగా ఉందని తెలియజేస్తూ మన ఉన్నతికి ఈ గ్రంథాలు ఎంతగానో దోహదం చేస్తాయని అమూల్య సందేశాన్ని వినిపించారు. తదనంతరం విద్యార్థులు గీత పఠ నాన్ని ఎంతో చక్కగా ఆలపించారు. భగవద్గీత శ్లోకాల పోటీలలో గెలుపొందిన వారికి ముఖ్య అతిధులు చేతులు మీదుగా బహుమతి ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్. కె.సరళ, డాక్టర్ .ఐ. మంజుల మరియు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఆంధ్రప్రదేశ్

మంగంపేట మిల్లుల సమస్యలను పరిష్కరించిన ముక్కా రూపానంద రెడ్డి

ఓబులవారిపల్లి మండలం మంగంపేట మైన్స్ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా ముగ్గురాళ్ల మిల్లుల కు అవసరమైన రాయి సరఫరా ఏపీఎండిసి యాజమాన్యం మరియు మిల్లుల యాజమాన్యం మధ్య ఉన్న కొన్ని సమస్యల కారణంగా నిలిచిపోవడంతో 120కి పైగా మిల్లులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ సమస్యల వల్ల స్థానిక పరిశ్రమలు, కార్మికులు, రోజువారీ ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడింది, ఈ పరిస్థితిని మంగంపేట ప్రాంత మిల్లు యజమానులు రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి దృష్టికి తేవడం జరిగింది. ఈ నేపథ్యంలో ముక్కా రూపానంద రెడ్డి స్పందించి విజయవాడలోని ఏపీఎండిసి హెడ్ ఆఫీస్ నందు ఎండీ తో ప్రత్యక్షంగా మాట్లాదంతో, మంగంపేట మైన్స్‌లో సరఫరా నిలిచిపోవడానికి కారణాలను తెలుసుకుని, సమస్యల పై ఆయన సానుకూలంగా స్పందించారు. అందువలన ఫలితంగా, మంగంపేట మైన్స్ నుంచి మిల్స్‌కు రాయి సరఫరా పునరుద్ధరించేందుకు ఏపీఎండిసి అంగీకరించింది. దీంతో గత కొన్ని రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 120 మిల్లుల సమస్యకు పరిష్కారం లభించింది. పరిశ్రమల కార్యకలాపాలు తిరిగి పునరుద్ధరించుకునే అవకాశమొచ్చింది. అందువలన తిరిగి మిల్లులకు ముగ్గురాయి సరఫరా యధావిధిగా పునరుద్ధరించడం జరిగింది. స్థానిక పారిశ్రామికవేత్తలు,ఈ సమస్యను పరిష్కరించినందుకు ముక్కా రూపానంద రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. ప్రాంత అభివృద్ధి, పరిశ్రమల ప్రోత్సాహం కోసం ఆయన చూపుతున్న కృషి ప్రశంసనీయమని హర్షం వ్యక్తం చేశారు , అనంతరం ఏపిఎండిసి హెడ్ ఆఫీసీ నందు జరిగిన చర్చలలో స్థానిక పల్లవ రైజింగ్ మిల్లుల యజమానులు పాల్కొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.