Friday, 6 March 2026

Blog

ఆంధ్రప్రదేశ్

వరిగొండ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానంలో ఘనంగా వనభోజన మహోత్సవం

వరిగొండ గ్రామంలోని శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానంలో జంగమ సేవా సంఘం ఆధ్వర్యంలో 12వ వార్షిక వనభోజన మహోత్సవం భక్తుల సమక్షంలో ఘనంగా జరిగింది. గోపూజ, అభిషేకం, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, మెడికల్ క్యాంప్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దాతలకు సన్మానాలు, వివాహ పరిచయ వేదిక, పిల్లలకు బహుమతులు అందించారు. ఆలయ చైర్మన్ కోడూరు శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ఎలాంటి చిన్న తప్పిదాలకు తవ్వివకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ఎలాంటి చిన్న తప్పిదాలకు తవ్వివకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పున్నమి న్యూస్ ప్రతినిధి 24 ఫిబ్రవరి 2026 జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్: రంగారెడ్డి జిల్లా ఈ నెల 25వ తేదీ బుధవారం నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ఎలాంటి చిన్న తప్పిదాలకు తవ్వివకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు.మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశం మందిరం నుండి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత ఆర్డీఓలు, ఎంపిడిఓలు, ఆర్.సి.లు, పోలీస్ శాఖ అధికారులు, విద్యుత్ అధికారులు, విద్యాశాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో ఇంటర్ పరీక్షలపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ బుధవారం నుండి మార్చ్ 18వ తేదీ వరకు ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలకు చేపట్టవలసిన పనులను సమన్వయంతో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు నిర్వహణకు సరైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, డివిజన్ స్థాయిలో సంబంధిత అధికారులతో వాట్సప్ గ్రూప్ చేయాలన్నారు. ఆర్డీఓ కార్యాలయాలలో ఎగ్జామ్ సెల్ ను ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష విధులు నిర్వహించే ప్రతి అధికారి బాధ్యతగా పని చేయాలన్నారు. పరీక్ష కేంద్రాలలో ఎటువంటి తప్పిదాలు జరగకుండా నిర్వహించాలన్నారు. జిల్లాలో 200 పరీక్షా కేంద్రాల ద్వారా 84,301 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 70,171 మంది రెండవ సంవత్సరం విద్యార్థులు, జిల్లాలో మొత్తం 1,54,472 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, 31 ప్రశ్న పత్రాల స్టోరేజ్ పాయింట్లు ఉంటాయని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని, మాస్ కాపీయింగ్ కు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. పోలీస్ శాఖ వారు పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు నిర్వహించాలని, పరీక్షా పరీక్షా సమయంలో జీరాక్స్ సెంటర్లు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు హాజరయ్యేలా ఆర్టీసీ అధికారులు బస్సులను నడపాలని, పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులతో మెడికల్ పాయింట్ ఏర్పాటు చేసి సిబ్బంది కేంద్రాల వద్ద అందుబాటులో ఉండేలా వైద్య అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. విద్యుత్ శాఖ అధికారులు పరీక్షా కేంద్రాలలో ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోస్టల్ శాఖ వారు జవాబు పత్రాలను సరిగా రిసీవ్ చేసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాలలో అవసరమైన మంచినీరు, ఫాన్స్, టాయిలెట్స్ ఏర్పాట్లు సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎవ్వరూ కూడా మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లకూడదని, విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికాలు, ముఖ్యంగా మొబైల్ ఫోన్లు తీసుకెళ్లకుండా పరిశీలించాలని సూచించారు.ఈ సమావేశంలో ఆర్డీఓలు జగదీశ్వర్ రెడ్డి, అనంత్ రెడ్డి, సరిత, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంక్యా నాయక్, విద్యాశాఖ అధికారి సుసిందర్ రావు, వైద్య ఆరోగ్య శాఖ అధికారి లలితా దేవి, పోలీస్ అధికారులు, పోస్టల్ శాఖ అధికారులు, ఆర్టీసీ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

రెండు నెలల పసికందును చంపిన రెడ్డిలను కఠినంగా శిక్షించాలని గిస బిక్షపతి డిమాండ్ చేశారు.

ముస్తాబాద్ ఫిబ్రవరి 24 పున్నమి ప్రతినిధి. ముస్తాబాద్ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహం దగ్గర.రాజన్న సిరిసిల్ల జిల్లా భవన కార్మిక సంఘం అధ్యక్షులు గీస బిక్షపతి గారు. దర్శనం కోసం వెళ్లిన దళిత బిడ్డలపై ఇష్టం వచ్చినట్టుగా కొట్టి కాళ్ళతో తన్ని రెండు నెలల పసికందును చంపిన రెడ్డిలను కఠినంగా శిక్షించి నష్టపోయిన కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గుడి నిర్మాణం చేసింది ఆ నిర్మాణానికి కష్టపడింది ఎస్సీ బీసీలే మరి వారు కనీసం దేవుని దర్శనం చేసుకునే కనీస హక్కు లేదంటూ ఈ దుశ్చర్యకు పాల్పడ్డ వారిని వెంటనే శిక్షించాలని. ఇలాంటివి మునుముందు పునరావడం కాకుండా ఎస్సీ బీసీలు ఐక్యతగా ఉండి పోరాడాలని కోరారు.

రాజన్న సిరిసిల్ల

కుమ్మెర ఘటన నిందితులకు కఠిన శిక్ష విధించాలని ముస్తాబాద్‌లో నిరసన

కుల వివక్ష దాడిలో పసికందు మరణానికి కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలి. మొన్న నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామం దేవుని జాతరలో కులవివక్షతో మహిళపై దాడి చేసి పసికందు మరణానికి సంభందించిన ఘటన నిందితులను తక్షణమే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహం దగ్గర మండల రజక సంఘం మరియు బీసీ, ఎస్సీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరియు ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ లో ఆ దుర్మార్గులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి కుల అహంకారంతో బీసీ, దళిత కుటుంబానికి చెందిన వారిపై అమానుషంగా దాడి చేసి రెండు నెలల పసికందు మరణానికి కారణమైన వాళ్లపై హత్యకేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు నమోదు చేయించాలని, రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ ఎస్టీలపై ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే కుమ్మెర నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబమైన గణేష్, చంద్రకళలకు ప్రభుత్వపరంగా 50 లక్షలు రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించాలని కోరుతూ… ఈ కేసు ఘటనలో సంబంధం ఉన్న అందరనీ ఎలాంటి రాజకీయ ఒత్తిడిలకు తలగకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఆ బీసీ రజక కుటుంబానికి న్యాయం జరిగే వరకు బడుగు బలహీన వర్గాలు ఒక్కటిగా పోరాటం చేస్తామని ఇలాంటి ఘటనలను అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు కూడా కండించాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో రజక మండల సంఘం నాయకులు, బీసీ సంఘాల నాయకులు, ఎస్సీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

ఖమ్మం వెలుగుమట్లలో భూదాన్ భూముల వివాదం: పేదల గుడిసెల కూల్చివేతపై కన్నీటి కథనం

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి) ఖమ్మం నగర శివారులోని వెలుగుమట్ల ప్రాంతంలో ఉన్న 60 ఎకరాల భూదాన్ భూములు మరోసారి వివాదాల కేంద్రంగా మారాయి. గత పదేళ్లుగా అక్కడే చిన్న చిన్న గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న వందలాది కుటుంబాలు ఒక్కసారిగా నిరాశ్రయులయ్యాయి. తెల్లవారుజామునే భారీ సంఖ్యలో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, ఖమ్మం కార్పొరేషన్ అధికారులు చేరుకుని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. జేసీబీలు గర్జించగా, మహిళలు, వృద్ధులు, చిన్నారుల రోదనలు ఆకాశాన్ని తాకాయి. కన్నీటి వర్షం మధ్య కూల్చివేత సుమారు 600కి పైగా కుటుంబాలు పదేళ్లుగా అక్కడే నివసిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. చాలా మంది కూలీ పనులు చేసుకుంటూ, చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. “మాకు ఎక్కడికీ వెళ్లే చోటు లేదు… మా పిల్లల చదువు ఏమవుతుంది?” అంటూ మహిళలు విలపించారు. కొందరు వృద్ధులు గుడిసెల ముందే కూర్చుని నిరసన తెలిపారు. అయితే అధికారులు ఖాళీ చేసే వరకు అక్కడే మోహరించి, ఒక్కొక్క గుడిసెను కూల్చివేశారు. రాజకీయ ఆరోపణలు, ప్రజల వాపోయింపు ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన నేతల పేర్లు ప్రస్తావిస్తూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు అయిన భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులను గెలిపించి పంపితే, ఇప్పుడు తమనే రోడ్డు మీదకు నెట్టేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. “పేదల దగ్గర నుంచి దోచుకుని ధనవంతులకు ఇస్తున్నారు” అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అధికారుల వాదన ప్రకారం భూములు ప్రభుత్వ అధీనంలో ఉన్నవని, అక్రమ నిర్మాణాలు తొలగించడమే తమ విధి అని చెబుతున్నట్లు సమాచారం. కోర్టు కేసు – ఆదేశాలపై సందేహాలు ఈ భూములపై వివాదం కోర్టులో పెండింగ్‌లో ఉందని, కోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకోకుండా కూల్చివేతలు చేపట్టడం చట్టవిరుద్ధమని బాధితుల తరఫు న్యాయవాదులు అంటున్నారు. “కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి ఉండాల్సింది. ఇలా హఠాత్తుగా చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం” అని వారు పేర్కొన్నారు. మానవ కోణం – రోడ్డున పడిన జీవితాలు ఇళ్లు కోల్పోయిన కుటుంబాలు ప్రస్తుతం రోడ్డుపై తాత్కాలికంగా గుడారాలు వేసుకుని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్నారుల చదువులు, మహిళల భద్రత, వృద్ధుల ఆరోగ్యం వంటి అనేక ప్రశ్నలు ముందుకు వచ్చాయి. సామాజిక సంస్థలు, ప్రజా ప్రతినిధులు తక్షణమే స్పందించి పునరావాసం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ముందున్న మార్గం? వెలుగుమట్ల ఘటన ఖమ్మం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పేదల పునరావాసంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? కోర్టు తీర్పు ఏ మలుపు తీసుకువస్తుంది? ప్రజలకు ప్రత్యామ్నాయ నివాసాలు కల్పిస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లో తెలియనుంది. ఇప్పటికైతే వెలుగుమట్లలో కూల్చివేతల దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి. పేదల కళ్లలో కన్నీరు ఆగాలంటే తక్షణ చర్యలు అవసరం అనే అభిప్రాయం విస్తృతంగా వ్యక్తమవుతోంది.

E-పేపర్

వీధి కుక్కల దాడిలో.. ఆవుదూడ మృతి..? యాచారం మండలం నజ్దిక్ సింగారంలో వీధి కుక్కల బారిన పడి ఆవుదూడ మృతి

పున్నమి న్యూస్ 24 ఫిబ్రవరి 2026 వీధి కుక్కల దాడిలో.. ఆవుదూడ మృతి..? యాచారం మండలం నజ్దిక్ సింగారంలో వీధి కుక్కల బారిన పడి ఆవుదూడ మృతి చెందిందని రైతు కడారి జంగయ్య తెలిపాడు. తన వ్యవసాయ పొలంలో రోజులాగే ఆవులు, దూడలను కట్టేసి వెళ్ళానన్నాడు. రాత్రి వీధి కుక్కల దాడిలో ఆవు దూడ మృతి చెందిందని కన్నీటి పర్యంతమయ్యాడు. ఇలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదన్నారు. గ్రామంలో వీధి కుక్కల బెడద ఎక్కువైందని, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరాడు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు లోని జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి తీగల చంద్ర శేఖర్ ను మర్యాద పూర్వకoగా కలిసిన మర్రిపాడు చిన్న జనసేన

నెల్లూరు లోని జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి తీగల చంద్ర శేఖర్ ను మర్యాద పూర్వకoగా కలిసిన మర్రిపాడు చిన్న జనసేన మర్రిపాడు చిన్న జనసేన మాట్లాడుతూ అధినేత పవన్ కళ్యాణ్ మాటే శిరోధార్యమని పార్టీ ప్రతిష్టతను పెంచేందుకు ఎన్ని ఆవుమానాలు ఎన్నో ఇబ్బందులు ఎదురైనా ఓర్పు సహానంతో మర్రిపాడు మండలం లో పార్టీ అభ్యునతికి నిరంతరం కృషి చేస్తున్నామని అయన మాట్లాడారు.

పల్నాడు

ఫిబ్రవరి 28నే పింఛన్లు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీ మేరకు ప్రతీ నెలా ఒకటో తేదీనే రూ 4 వేలు పెన్షన్ పంపిణీ చేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ కొనసాగిస్తోంది. ప్రతీ నెలా సీఎం చంద్రబాబు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కొత్త పెన్షన్ల మంజూరు పైనా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాగా.. ఈ నెల పెన్షన్ల పంపిణీ వేళ ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ఈ మేరకు సచివాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం మార్చి 1న పెన్షన్ పంపిణీ పైన కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సరం ప్రారంభం వేళ పెన్షన్ లబ్దిదారులకు ఒక రోజు ముందుగానే నగదు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మార్చి 1, 2026 బదులుగా ఫిబ్రవరి 28నే పింఛన్లు అందనున్నాయి. అన్ని గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బందికి డిసెంబర్ 27 నాటికి నగదు అందజేయాలని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ముందుగానే సమాచారం ఇచ్చింది. ఫిబ్రవరి 28 నే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవేళ, ఏవైనా మిగిలిపోతే, ఆయా పింఛన్లను మార్చి 2న పంపిణీ చేయాలని సూచించింది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. మార్చి1న ఆదివారం కావటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 28న విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో జరిగే పెన్షన్ల పంపిణీలో పాల్గొంటారు. తిరుమల లడ్డూ కేసులో సుప్రీం కీలక తీర్పు, ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్..!! ఈ నెల 28నే పెన్షన్ల పంపిణీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలి నెల నుంచే వృద్ధులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, డప్పు కళాకారుల సామాజిక భద్రతా పెన్షన్ల కింద నెలకు రూ.4000 అందిస్తున్నారు. వికలాంగులు, కుష్టు వ్యాధిగ్రస్తులకు రూ.6000, పూర్తి వికలాంగులకు రూ.10,000, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి నెలకు రూ.10000 ఆర్థిక సాయం అందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 63.12 లక్షల పింఛన్‌దారులకు ప్రతీ నెలా ఒకటో తేదీనే రూ.2743.99 కోట్లు సచివాలయ సిబ్బంది లబ్దిదారుల ఇంటివద్దనే పంపిణీ చేస్తున్నారు. ఒకటో తేదీ సెలవు వస్తే ముందు రోజునే పంపిణీ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. కాగా, ప్రభుత్వం తాజా ఆదేశాల మేరకు ఈ నెల 28వ తేదీ పెన్షన్లు పంపిణీ చేసేందుకు రంగం సిద్దం అయిది. ఆ రోజున ఎవరికైనా అందక పోతే మార్చి 2న లబ్దిదారులకు అందించనున్నారు.

E-పేపర్

లక్ష్మీనరసింహ స్వామి ఆలయ భూములను కబ్జా చేసిన పట్టించుకోరా ??????

పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్ 9640204826 24 ఫిబ్రవరి 2026 రంగారెడ్డి జిల్లా యాచారం మండలం ధర్మన్నగూడ గ్రామంలో శ్రీ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి పేరు మీద ఉన్న మూడు ఎకరాల ఎండోమెంట్ భూమిని దొంగ చాటున భారతీయ జనతా పార్టీ మాజీ ఎంపీటీసీ గౌర మల్లేష్ సతీమణి గౌర వసంత పైన తూలేఖర్డ్ రెవిన్యూ గల సర్వే నెంబర్ 98 /2 లో మూడు ఎకరాల భూమిని పట్టా చేసుకున్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిరక్షణ కమిటీ ధర్మన్నగూడ గ్రామ కమిటీ సభ్యులు అందరూ కలిసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ధర్మన్నగూడ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ భూముల పరిరక్షణ కమిటీ గ్రామ అధ్యక్ష కార్యదర్శులు బండ మల్లేష్ మండల సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 98/2 లో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం పేరు మీద భూమి ఉందని తెలిపారు ఈ భూమిని గత 20 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటివరకు మాజీ ఎంపీటీసీ గౌర మల్లేష్ సాగు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామ ప్రజలంతా కలసి ఐక్యంగా పోరాడి ఆలయ భూమిని దక్కించుకోవాలని తెలిపారు మాజీ ఎంపీటీసీ గౌర మల్లేష్ ధర్మన్నగూడ గ్రామ ప్రజలందరికీ మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఈ భూమిని సర్వే చేసి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పేరు పేరు మీదికి తక్షణమే మార్చాలి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ పరిరక్షణ కమిటీ సభ్యులు శశిధర్ రెడ్డి మండల నరసింహ. మండల గోపాలకృష్ణ మండల జంగయ్య కొంపోజు సురేష్ చారి. బుడిగలి మల్లేష్ బుర్రి వెంకటేష్ మండల నరేందర్ ఇతరులు పాల్గొన్నారు

E-పేపర్

లక్ష్మీనరసింహ స్వామి ఆలయ భూములను కబ్జా చేసిన పట్టించుకోరా ??????

పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్ 9640204826 24 ఫిబ్రవరి 2026 రంగారెడ్డి జిల్లా యాచారం మండలం ధర్మన్నగూడ గ్రామంలో శ్రీ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి పేరు మీద ఉన్న మూడు ఎకరాల ఎండోమెంట్ భూమిని దొంగ చాటున భారతీయ జనతా పార్టీ మాజీ ఎంపీటీసీ గౌర మల్లేష్ సతీమణి గౌర వసంత పైన తూలేఖర్డ్ రెవిన్యూ గల సర్వే నెంబర్ 98 /2 లో మూడు ఎకరాల భూమిని పట్టా చేసుకున్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిరక్షణ కమిటీ ధర్మన్నగూడ గ్రామ కమిటీ సభ్యులు అందరూ కలిసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ధర్మన్నగూడ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ భూముల పరిరక్షణ కమిటీ గ్రామ అధ్యక్ష కార్యదర్శులు బండ మల్లేష్ మండల సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 98/2 లో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం పేరు మీద భూమి ఉందని తెలిపారు ఈ భూమిని గత 20 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటివరకు మాజీ ఎంపీటీసీ గౌర మల్లేష్ సాగు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామ ప్రజలంతా కలసి ఐక్యంగా పోరాడి ఆలయ భూమిని దక్కించుకోవాలని తెలిపారు మాజీ ఎంపీటీసీ గౌర మల్లేష్ ధర్మన్నగూడ గ్రామ ప్రజలందరికీ మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఈ భూమిని సర్వే చేసి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పేరు పేరు మీదికి తక్షణమే మార్చాలి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ పరిరక్షణ కమిటీ సభ్యులు శశిధర్ రెడ్డి మండల నరసింహ. మండల గోపాలకృష్ణ మండల జంగయ్య కొంపోజు సురేష్ చారి. బుడిగలి మల్లేష్ బుర్రి వెంకటేష్ మండల నరేందర్ ఇతరులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.