Tuesday, 17 March 2026

Blog

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామ నియోజకవర్గం – ఐతవరం గ్రామంలో నూతన DDO కార్యాలయానికి శుభారంభం

నందిగామ నియోజకవర్గంలోని ఐతవరం గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన DDO (డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్) కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య కలెక్టర్ లక్ష్మీశ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ: “దేశ ప్రగతికి పల్లెలే పట్టుకొమ్మలు” అనే మహాత్మా గాంధీజీ మాటలను ఆదర్శంగా తీసుకుని, గ్రామీణ పరిపాలనను మరింత బలోపేతం చేయడం, ప్రజలకు వేగవంతమైన సేవలను అందించడం లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి & పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఈ నూతన కార్యాలయాలను ఏర్పాటు చేశారని తెలిపారు. ఇందుకు వారికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే గత ప్రభుత్వంలో అమల్లో ఉన్న క్లస్టర్ విధానాన్ని రద్దు చేయడం ద్వారా గ్రామ పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి కల్పించబడిందని, దీతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే కాకుండా పరిపాలన వేగవంతం అవుతుందని వివరించారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి లక్ష్యంగా ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

తెలంగాణ

మూడో విడత నామినేషన్ల స్వీకరణను పారదర్శకంగా నిర్వహించాలన్న : కలెక్టర్

నకిరేకల్ : డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా మూడో విడత నామినేషన్ల స్వీకరణను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గురువారం ఆమె నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు.

నారాయణపేట

నేడు కున్సి గ్రామంలో నామినేషన్ దాఖలు

క్రిష్ణ మండలం కున్సి గ్రామంలో నేడు వివిధ పార్టీ ల తరుపున సర్పంచుల అభ్యర్థులు గా నామినేషన్ వేయడం జరిగింది. అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నల్లే శ్రీనివాసులు, మరియు బిఆర్ఎస్ పార్టీ తరపున ఎం.సురేష్ ,మ్యకలి మహదేవ్ ,మ్యకలి రామచందర్, మరియు బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గా పిట్టల్ చంద్రశేఖర్ నామినేషన్ సమర్పించడం జరిగింది.

ఎన్ టి ఆర్ జిల్లా

పవన్ వ్యాఖ్యలను వక్రీకరణ… ఖండనలో జనసేన తెలంగాణ – ఆంధ్ర బంధం దెబ్బతీయద్దని రమాదేవి హెచ్చరిక

రాజోలు సభలో జనసేన అధినేత పవణ్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను కొంతమంది తెలంగాణ నాయకులు తప్పుగా అర్థం చేసుకొని, రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించడం తీవ్రంగా ఖండిస్తున్నట్టు నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త దుర్గా మల్లేశ్వర స్వామి వారి ట్రస్ట్ బోర్డ్ మెంబర్ తంబళ్ళపల్లి రమాదేవి స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ మాటల ఉద్దేశాన్ని దుర్వినియోగం చేయడం సరైంది కాదని ఆమె అన్నారు. వరదలతో నష్టపోయిన రైతులను ఓదార్చే క్రమంలో, వారి బాధను తగ్గించేందుకు మాత్రమే పవన్ కళ్యాణ్ ‘దిష్టి’ అనే పదాన్ని ఉపయోగించారని, దాన్ని తెలంగాణ ప్రజలపై విమర్శగా చూపడం పూర్తిగా తప్పుడు అన్వయమని రమాదేవి పేర్కొన్నారు.“ఏ ప్రాంతాన్ని గాని, ఏ రాష్ట్రాన్ని గాని పవన్ కళ్యాణ్ విమర్శించలేదు. ఆయన వ్యాఖ్యలను మొత్తం తెలంగాణ ప్రజలపై విస్తరించడంబాధాకరం. ఆంధ్ర–తెలంగాణ రాష్ట్రాల మధ్యున్న అన్నదమ్ముల బంధాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం దెబ్బతీయకూడదు” అని తేల్చిచెప్పారు. రాజకీయ వేదికపై చెప్పిన మాటలను వ్యక్తిగతంగా తీసుకోవడం సమంజసం కాదని ఆమె అన్నారు. “రెండు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగాలి, అభివృద్ధి పథంలో సహకారం అవసరం” అని రమాదేవి పేర్కొన్నారు.

అన్నమయ్య

కుమ్మర వీధిలో నిలిచిన వర్షపు నీరు: ప్రజలకు నరకం!

-చిట్వేల్ టౌన్‌లో రోడ్డుపై చెరువును తలపిస్తున్న నీరు – పాదచారులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు చిట్వేల్, డిసెంబర్ 4: పున్నమి ప్రతినిధి ఇటీవల కురుస్తున్న వర్షాలకు చిట్వేల్ మండలంలోని టౌన్ పరిధిలోని కుమ్మర వీధి పరిస్థితి దయనీయంగా మారింది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, రోడ్డు అస్తవ్యస్తంగా ఉండటం వల్ల వర్షపు నీరు వీధి మొత్తం నిండిపోయి, రోడ్డును చిన్నపాటి చెరువులా మార్చేసింది. -రాకపోకలకు తీవ్ర అంతరాయం నీరు నిలిచిపోవడం వల్ల పాదచారులు, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు రోడ్డుపై నడవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ వీధిలో వాహనాలు కూడా సరిగా కదల్లేని పరిస్థితి ఏర్పడింది. ఈ నీటి కారణంగా వ్యాధులు ప్రబలే ప్రమాదం కూడా ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. -ప్రతిష్టాత్మక ‘జనవాణి’లోనూ మొర ఈ వీధి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య అంత చిన్నది కాదని, గతంలో ప్రతిష్టాత్మకంగా జరిగిన జనవాణి కార్యక్రమంలో కూడా స్థానిక ఎమ్మెల్యే ఈ సమస్యను వివరంగా వివరించడం జరిగిందని స్థానిక పెద్దలు గుర్తు చేశారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారు. -గ్రామ పెద్దలు/అధికారులకు విజ్ఞప్తి “ప్రజల భద్రతను, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి. కుమ్మర వీధిలో కొత్త రోడ్డు పనులుచేపట్టడానికి గ్రామ పెద్దలు మరియు సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి,” అని స్థానిక ప్రజలు, వీధి సంక్షేమ కమిటీ సభ్యులు తీవ్రంగా విజ్ఞప్తి చేశారు.గ్రామ అభివృద్ధి కోసం ఈ సమస్యను అందరూ సీరియస్‌గా తీసుకుని, సహకరించాలని స్థానికులు కోరారు.

కడప

మున్సిపాలిటీ లో నిర్లక్ష్యం.. …

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పేరుకుపోయిన మురికి సుభ్రం చేయకుండ వదిలేసిన పని వాళ్ళు పట్టించుకొని అధికారులు. ఇలాగే వదిలేస్తే రోగాన పడవల్సిందే ఈ సంఘటన ప్రొద్దుటూరులో పాలిటెక్నిక్ కాలేజీ దెగ్గర ఉన్న శివ శంకర్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద చోటు చేసుకుంటుంది

అన్నమయ్య

వరద రోడ్డును పరిశీలించిన ఏ ఎస్ పి మనోజ్ హెగ్డే

-చిట్వేల్ – రాపూరు మార్గంలో రాకపోకలకు అంతరాయం – అనుంపల్లి వద్ద రాజుకుంట అలుగు ఉధృతిపై సిబ్బందికి కీలక సూచనలు చిట్వేల్, డిసెంబర్ 4 పున్నమి ప్రతినిధి ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చిట్వేల్ మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలను రాజంపేట అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) శ్రీ మనోజ్ రామనాథ్ హెగ్డే గురువారం సందర్శించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయన పలు సూచనలు చేశారు. -అనుంపల్లి వద్ద పరిశీలన ఏఎస్పీ హెగ్డే గారు ముఖ్యంగా చిట్వేల్ – రాపూరు రోడ్డు లోని అనుంపల్లి గ్రామం వద్ద ఉన్న పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ ప్రాంతంలో రాజుకుంట చెరువు అలుగు ఉద్ధృతంగా పారుతూ రోడ్డుపైకి చేరడం వల్ల వాహన రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. -సిబ్బందికి, ప్రజలకు సూచనలు పరిశీలన అనంతరం, ఏఎస్పీ మాట్లాడుతూ, రోడ్డుపై నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఎవరూ సాహసించి రోడ్డు దాటవద్దని కోరారు. అలాగే, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు మానుకోవాలని సూచించారు.పోలీస్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, నీటి ప్రవాహం తగ్గే వరకు ఈ మార్గంలో రాకపోకలను పూర్తిగా నిలిపివేసి, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రజలకు సహాయం అందించడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

భారీ వర్షాలకు నీట మునిగిన విద్యుత్ సబ్ స్టేషన్

04/12/2025 మనుబోలు మండలంలోని బద్వేలు వెంకన్నపాలెం లో రాత్రి కురిసిన భారీ వర్షాలకు 33/11kv సబ్ స్టేషన్ నీటిలో మునిగిపోయింది ఇక్కడ పని చేస్తున్నటువంటి షిఫ్ట్ ఆపరేటర్స్ అక్కడ ఉన్నటువంటి షిఫ్ట్ రూమ్ లో కూడా ఉండలేనటువంటి పరిస్థితి ప్రతి సంవత్సరం భారీ వర్షాలు వచ్చినప్పుడల్లా ఇక్కడ పని చేస్తున్నటువంటి షిఫ్ట్ ఆపరేటర్స్ నీళ్లలోనే ఆపరేటింగ్ చేయవలసినటువంటి పరిస్థితి ఈ పరిస్థితిని చూస్తున్నటువంటి గ్రామ ప్రజలు ఈ సబ్ స్టేషన్ కుచుట్టుప్రక్కల ప్రహరీ ను ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని అభిప్రాయపడుతున్నారు.

E-పేపర్

పెద్ద శంకర్ల పూడి గ్రామంలో ప్రజాదర్బార్ కార్యక్రమం.

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి గ్రామంలో స్థానిక శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ రాజా ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఉన్న సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యే సత్య ప్రభ కు అందజేశారు. ఈ సందర్భంగా వరుపుల సత్య ప్రభ రాజా మాట్లాడుతూ ఈ సమస్యల పరిష్కారం దిశగా పని చేస్తానని సత్య ప్రభ రాజా అన్నారు. కొన్ని సమస్యలపై అధికారులతో మాట్లాడి తక్షణమే పరిష్కారం చేయాలని ఆమె ఆదేశించారు. తమ సమస్యలపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజాకు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ కూటమి నాయకులు పాల్గొన్నారు.

కాకినాడ

ఎదిరింటి వాళ్ళు వేధింపులు తాళలేక ఆత్మహత్య ప్రయత్నం చేసిన మహిళ

పున్నమి న్యూస్, పెద్దాపురం, 04,డిసెంబర్., పెద్దాపురం సూరంపాలెం రోడ్, జగన్ కాలనీ లో ట్యూషన్ చెప్పుకుంటూ జీవనం సాగిస్తున్న మహిళను ఇంటి ఎదురుగా వున్న వ్యక్తి వేధింపులు తట్టుకోలేక ఉదయం 9.00 గంటలకు ఫెనైల్ తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. సమయానికి ట్యూషన్ విద్యార్థి రావడంతో విషయం తెలుసుకుని గవర్నమెంట్ హాస్పిటల్ లో అడ్మిట్ చేయటం జరిగింది. మహిళ పరిస్థితి నార్మల్ గా ఉన్నట్టు ఆమె భర్త సమాచారం ఇచ్చారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.