Friday, 6 March 2026

Blog

ఆంధ్రప్రదేశ్

లింగంపల్లి యువకుడు డా. వెంకటేశ్వర్లుకు డాక్టరేట్ ఘనత

లింగంపల్లి గ్రామానికి చెందిన డా. గార్ల వెంకటేశ్వర్లు న్యూఢిల్లీలోని డి.పి.ఎస్.ఆర్.యులో ఫార్మసీ పరిశోధనలో డాక్టరేట్ పొందారు. శేషాచలం కొండల ఔషధ మొక్కల యాంటీకాన్సర్ లక్షణాలపై ఆయన పరిశోధన చేశారు. విజ్ఞాన్ భవన్‌లో జరిగిన 8వ స్నాతకోత్సవంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల మీదుగా పట్టా అందుకున్నారు. కార్యక్రమంలో వైస్ చాన్సలర్ డా. రవిచంద్రన్, రిజిస్ట్రార్ డా. రామచంద్ర ఖత్రి సహా ప్రముఖులు పాల్గొన్నారు.

తిరుపతి

రెండవ రోజు కొనసాగుతున్న అంగన్వాడీల రిలే దీక్షలు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 24: మండల కేంద్రంలోని స్థానిక ఐ.సి.డి.ఎస్ కార్యాలయం ఎదుట సోమవారం ప్రజా సంఘాలైన సి.ఐ.టి.యు, ఐ.ఎఫ్.టి.యు ఆధ్వర్యంలో రెండవ రోజు కొనసాగుతున్న అంగన్వాడీల రిలే దీక్షలు ఈ సందర్భంగా సి.ఐ.టి.యు నాయకులు పెనగడం గురవయ్య మాట్లాడుతూ….అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల 32 వేల కోట్ల లో ఒక్క రూపాయి కూడా అంగన్వాడీల వేతనాలకు ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించక పోవడం ఎంతో బాధాకరమని సిఐటియు జిల్లా కార్యదర్శి పెనగడం గురవయ్య పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 20 నెలలు కాలం గడిచినప్పటికీ అంగన్వాడి కార్యకర్తల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఎంతో దురదృష్టకరమని ప్రభుత్వం చెల్లిస్తున్న వేతనం వారి కుటుంబ పోషణకు ఏ మాత్రం సరిపోవడం లేదని రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరలను దృష్టిలో ఉంచుకొని అంగన్వాడి కార్యకర్తల వేతనాలను పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఎక్కడా కూడా రక్తహీనత ఉండకూడదని, పౌష్టిక ఆహారం అంగన్వాడీ కార్యకర్తల ద్వారా ప్రతి ఒక్కరికి అందజేస్తున్నామని కానీ పౌష్టికాహారం అందజేసే అంగన్వాడి కార్యకర్తల కుటుంబాల్లో మాత్రం చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణ ఎంతో బాధాకరంగా వెల్లదీస్తున్నారని అంగన్వాడీల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేంతవరకు సిఐటియు వారికి అండగా ఉండి పోరాటాలు చేస్తూనే ఉంటుందని అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కింద ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్తకు 26 వేల రూపాయల జీతం ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్ గా మార్చాలని ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేశారు. ఈనెల 25, 26, 27వ తేదీలలో జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట రిలే దీక్షలు చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో సి.ఐ.టి.యు నాయకులు గంధం మణి, రాజా, రేవతి, పుష్ప, సక్కుబాయి, ఐ. ఎఫ్.టి.యు నాయకులు జాకీర్, కల్పన తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

ఏపీ అసెంబ్లీ క్రీడల్లో ఉత్సాహంతో పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 24: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఏపీ అసెంబ్లీ క్రీడా మహోత్సవాలు ఉత్సాహవంతంగా కొనసాగుతున్నానేపద్యంలో క్రీడా పోటీల్లో చురుకైన ఉత్సాహంతో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొనడం ప్రత్యేకంగా నిలిచింది. ప్రజా సేవలో నిత్యం తలమునకలలై ఉండే ఆయన క్రీడల పట్ల తన ఆసక్తిని మరోసారి నిరూపించారు. మైదానంలో ఆయన చూపించిన చలాకీతనం, క్రీడాస్ఫూర్తి తోటి శాసనసభసభ్యుల ప్రశంసలు అందుకుంది. రాజకీయ భిన్నాభిప్రాయాలు సహజమైనవే అయినా క్రీడలు అందరినీ ఒకే వేదికపై కలుపుతాయని క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్నీ అందిస్తాయని ప్రజాప్రతినిధులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని శాసనసభ క్రీడా మహోత్సవాలు సభ్యుల మధ్య స్నేహభావాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. ఏది ఏమైన ఈ వేడుకల్లో సుధీర్ రెడ్డి పాల్గొనడం మరింత ఉత్సాహాన్ని నింపిందనే చెప్పుకోవాలి తమ నాయకుడు ఈ క్రీడల్లో అత్యంత ప్రతిభ కనపరిచి విజియాన్ని కైవసం చేసుకోవాలని నియోజిక వర్గంలోని నాయకులు, కార్యకర్తలు, సుధీర్ రెడ్డి అభిమానులు ఆశిస్తునారు.

తిరుపతి

కార్యకర్తల గౌరవానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 24: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పార్టీ కార్యకర్తల సమస్యలపై దృష్టి సారించారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ క్రీడా మహోత్సవాల్లో పాల్గొంటూనే తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడుతున్న కార్యకర్తలకు తగిన గుర్తింపు, నామినేటెడ్ పదవులు కల్పించాలని కోరుతూ “రాష్ట్ర అధ్యక్షులు పళ్ళ శ్రీనివాస్ యాదవ్” ని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ వినతిపై పళ్ళ శ్రీనివాస్ యాదవ్ సానుకూలంగా స్పందిస్తూ, పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే కార్యకర్తలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.

తిరుపతి

విజయవంతమైన జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 24: శ్రీకాళహస్తి పట్టణంలోని CM ఫంక్షన్ హాల్ నందు జనసేన ఉద్యమి సన్నాహక కార్యక్రమం గూర్చి సమావేశం జనసేన ముఖ్య నాయకులు, జనసైనికులు, వీరమహిళల మధ్య అట్ట హాసంగా జరిగింది. ఈ సమావేశానికి అతిథులుగా ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొని జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వము గురించి పలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాలహస్తీశ్వర దేవస్థాన పాలకమండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్, జనసేన పార్టీ నాయకులకు, వీర మహిళలకు, జనసైనికులకు పాల్గొన్నారు.

తిరుపతి

లబ్ధిదారుల వద్దకేళ్లి సి.యం. రిలీఫ్ ఫండ్ అందజేసిన బొజ్జల రిషిత రెడ్డి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 24: శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషిత రెడ్డీ, అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మన తొట్టంబేడు మండలం లోని బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని నేడు నేరుగా వారి ఇళ్ల వద్దకే వెళ్లి అందజేశారు. తొట్టంబేడు మండలంలో 19 మంది లబ్ధిదారులకు సంబంధించి మొత్తం రూ. 12,29,918 విలువైన చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.

తిరుపతి

వికసిత్ భారత్ – జీ రామ్ జీ పథకంతో ఇసుక తాగేలిలో రోడ్డు సౌకర్యం

ఏర్పేడు, పున్నమి న్యూస్, ఫిబ్రవరి 24: ఏర్పేడు మండలం ఇసుక తాగేలి గ్రామంలో వికసిత్ భారత్ – జీ రామ్ జీ పథకం కింద సుమారు 46 లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణంకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. మంగళవారం నాడు ఈ పనులను కాంట్రాక్టర్ నూతలపాటి సూర్యనారాయణ నేతృతంలో పనులను ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ జెడ్పిటిసి సభ్యులు పేరం ధనంజయలు నాయుడు, ఏపీ సీడ్స్ మాజీ డైరెక్టర్ కందటి శివశంకర్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా హాజరై భూమి పూజ చేసి రోడ్డు పనులను ప్రారంభించారు. పూతలపట్టు – నాయుడుపేట పాత రహదారి నుంచి ఇసుక తాగేలీ వరకు ఒక కిలోమీటర్ తారు రోడ్డు, 120 మీటర్ల సిసి రోడ్డు నిర్మాణాన్ని పనులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి టిడిపి నాయకులు హంస ,ముని రామయ్యలు, సర్పంచ్ కందాటి గరవమ్మ, ప్రభాకర్ రెడ్డి, మధు, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. అనేక సంవత్సరాలుగా గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేక ప్రజలు అవస్థలు పడేవారు . ప్రస్తుతం టిడిపి హయాంలో ఇసుక తాగేలికి తారు రోడ్డు సౌకర్యం ఏర్పడడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తిరుపతి

శ్రీవాణి నిధులతో స్వర్ణముఖి నదీశ్వరుని ఆలయ పునః నిర్మాణం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 24: శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సహరకారంతో శ్రీకాళహస్తి చుక్కల నిడిగల్లు గ్రామంలో చుక్కల నిడిగల్లు ఎస్టి కాలనీ శివాలయం కు 20 లక్షలు శ్రీవాణి ట్రస్టు నిధులతో మంజూరయ్యాయని ఈనెల 26వ తేదీన శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. చుక్కల నిడిగల్లు ఎస్టి కాలనీలో బోడి దేవాలయం చుక్కలు నిడిగల్లు చెరువు వద్ద వెలిసిన స్వర్ణముఖి నదీశ్వరుడు లింగం 500 సంవత్సరాల పైబడి ఉన్న ఆలయంలో 30 సంవత్సరాల ముందు నిధులు కోసం దొంగలు స్వామివారిని పక్కకు జరపడంతో అప్పటినుంచి శివుడికి నీడ లేకపోవడంతో ఈ విషయాన్ని కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోని కలిసి శివాలయం పరిస్థితి విన్నవించడంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ, మంత్రి దేవాదాయ శాఖ కమిషనర్ వారందరి సహకారంతో ఈ ఆలయ పునఃనిర్మాణం ప్రారంభిస్తున్నామని తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఏసి రామకృష్ణ సమక్షంలో చుక్కల నిడిగల్లు భక్తులు, ప్రజలు, శ్రీకాళహస్తి దేవస్థాన వేద పందితులు శివప్రసాద్ శర్మ బాలాలయం ఏర్పాట్లు చేసి అక్కడి నుంచి శివలింగాన్ని తొలగించి గుడి నిర్మాణం పూర్తయిన తర్వాత మళ్లీ శివయ్య అక్కడే ప్రతిష్టిస్తామనీ వారు తెలిపారు.

తిరుపతి

శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి 15వ వార్షికోత్సవంలో ముక్కా వరలక్ష్మి పాల్గొన్నారు

రైల్వే కోడూరు మండలం ఉర్లగట్టుపోడు పంచాయితీ పరిధిలోని బాలిరెడ్డిపల్లె గ్రామంలో వెలసిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం 15వ వార్షికోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్, కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి శ్రీమతి ముక్కా వరలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఆమె ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శాలువ కప్పి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ముక్కా వరలక్ష్మి మాట్లాడుతూ, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం తమ కుటుంబం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, టీడీపీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఖమ్మం

వెలుగుమట్లలో పేదల గుడిసెల కూల్చివేత అమానుషం – కాంగ్రెస్, బీఆర్‌ఎస్, కమ్యూనిస్టులు కుమ్మక్కై మోసం: బీజేపీ ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్

ఖమ్మం ఫిబ్రవరి (పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి) ఖమ్మం కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న వెలుగుమట్ల పరిధిలోని 62 ఎకరాల భూదాన్ భూముల్లో పదేళ్లుగా నివసిస్తున్న సుమారు వెయ్యి పేద కుటుంబాల గుడిసెలను కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ పేర్కొన్నారు. పేదల ఇళ్లను జేసీబీలతో నేలమట్టం చేయడం అమానుష చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాలు ఇప్పిస్తామని చెప్పి గతంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ నాయకులు అమాయక ప్రజల వద్ద లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసం చేశారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక పేదలకు న్యాయం చేయాల్సిందిపోయి, వేలాది మంది పోలీసులతో దాడి చేసి గుడిసెలను కూల్చివేయడం ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచే చర్య అని విమర్శించారు. కనీసం కుటుంబాలకు తమ సామాన్లు సర్దుకునే సమయం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. బీజేపీ ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ మాట్లాడుతూ, పదేళ్లుగా అక్కడే నివసిస్తూ ప్రభుత్వాన్ని పట్టాల కోసం వేడుకుంటున్న పేదలపై ఈ విధంగా ప్రతాపం చూపించడం కాంగ్రెస్ ప్రభుత్వ అసలు స్వరూపాన్ని బయటపెట్టిందన్నారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకు ముగ్గురు మంత్రుల ఆదేశాలతోనే ఈ చర్యలు జరిగాయని ఆరోపించారు. ఈ భూములపై ఎప్పటినుంచో కన్నేసిన కొందరు రాజకీయ నాయకులు పథకం ప్రకారం పావులు కదిపారని, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ లు కూడా ఈ వ్యవహారంలో పాత్ర పోషించారని బీజేపీ నేతలు విమర్శించారు. తెల్లవారుజామునే భారీ పోలీస్ బలగాలను మోహరించి పేదల ఇళ్లను ఖాళీ చేయించడం నిరంకుశ పాలనకు నిదర్శనమని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలకు ఇళ్లు ఇవ్వడంలో విఫలమయ్యారని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేరు చెప్పుకుంటూ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. పేదలను రోడ్డున పడేసే విధానాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై భారతీయ జనతా పార్టీ ప్రజల తరఫున అండగా నిలుస్తుందని, న్యాయపరంగా మరియు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ హెచ్చరించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.