Monday, 4 May 2026

Blog

E-పేపర్

కాంగ్రెస్ పార్టీ కీ రాజీనామా చేసిన జెలమోని మాధవి రవీందర్

కాంగ్రెస్ పార్టీ కీ రాజీనామా చేసిన జెలమోని మాధవి రవీందర్ పున్నమి ప్రతినిధి 03 ఫిబ్రవరి 2026 *రంగారెడ్డి జిల్లా: ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి చివరి నిమిషం వరకు బీఫామ్ ఇస్తామని మోసం చేశారని మాల్ రెడ్డి వైఖరి నిరసిస్తూ ఇబ్రహీంపట్నం మున్సిపల్ 6 వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జెలమోని మాధవి రవీందర్ కాంగ్రెస్ పార్టీ కీ రాజీనామా,* గత నెల జనవరి 19న టీటీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెలమోని రవీందర్, టిడిపికి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు,* 6వార్డులో ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ హామీ తోనే మున్సిపల్ లో నామినేషన్ వేసామని, చివరి నిమిషంలో మోసం చేశారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం* కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరిగిందని, స్వతంత్ర అభ్యర్థి వర్ధిగా పోటీ చేసి గెలుస్తామని దిమా వ్యక్తం చేశారు.*

E-పేపర్

తెలంగాణ రాజ్యాధికార పార్టీ గ్రామాలలో విస్తరణ

*తెలంగాణ రాజ్యాధికార పార్టీ గ్రామాలలో విస్తరణ* పున్నమి న్యూస్ 03 ఫిబ్రవరి 2026 తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న (ఎం.ఎల్.సి.) ఆదేశాల మేరకు, రాష్ట్రంలో పార్టీని రాష్ట్రస్థాయి నుండి గ్రామాలలోకి వేగవంతంగా విస్తరించే దిశగా రాష్ట్ర యువజన అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్ సూచనలతో, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పాకాల నరసింహ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడిగా కుకునూరు అరవింద్ చారి , ప్రధాన కార్యదర్శిగా రాచ కొండ హరీష్ , ఉపాధ్యక్షుడిగా నాంపల్లి సురేష్ , ఉపాధ్యక్షుడుగా రాచకొండ నవీన్, సోషల్ మీడియా ఇన్‌చార్జిగా మునుగు సంజీవ్ కుమార్ ను నియమించడం జరిగింది. అలాగే అబ్దుల్లాపూర్‌మెట్ మండల ప్రధాన కార్యదర్శిగా సత్యం చారి నియమించారు. ఈ సందర్భంగా నియమితులైన వారందరికీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ తమ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టి ఆర్ పి రాష్ట్ర యువజన అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పాకాల నరసింహ, కుక్కునూరు అరవింద్, రాచకొండ హరీష్, నాంపల్లి సురేష్, రాచకొండ నవీన్ తదితరులు పాల్గొన్నారు

హైదరాబాద్

ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లకు త్వరలో పరిష్కారం

*ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లకు త్వరలో పరిష్కారం* *పున్నమి ప్రతినిధి హైదరాబాద్ తేది 3/02/2026* *ఈ రోజు సచివాలయంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని కలిసిన TG Teachers JAC బృందం.. ఉపాధ్యాయుల సమస్యల పైన ప్రాతినిధ్యం చేసిన జాక్.. సాయకూలంగ స్పందించిన మంత్రివర్యులు, అన్ని విషయాలను చర్చించడానికి త్వరలోనే ముఖ్యమంత్రి గారితో సమావేశం అవుదామని.. తెలిపిన మంత్రి గారు..* ఈ కార్యక్రమంలో జాక్ గౌరవ్ అధ్యక్షులు శ్రీ గాల్ రెడ్డి హర్ష వర్ధన్ గారు.. జేఏసీ చైర్మన్ చంద్ర శేఖర్ రావు గారు, సెక్రటరీ జనరల్ నర్సింహులు గారు, కోశాధికారి అబ్దుల్లా గారు.. జేఏసీ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో దుత్తలూరు మండలం సీఐటీయూ ప్రధాన కార్యదర్శి నేలటూరి సింహాద్రి ఈ నెల 12 వ తేదీన దేశ వ్యాప్తంగా సమ్మె జరుగుతుందని ఆయన తెలిపారు

దుత్తలూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో దుత్తలూరు మండలం సీఐటీయూ ప్రధాన కార్యదర్శి నేలటూరి సింహాద్రి ఆశ డే సందర్బంగా మాట్లాడుతు ఈ నెల 12 తేదీన దేశ వ్యాప్తంగా సమ్మె జరుగుతుంది ఈ సమ్మె లో ఆశ వర్కర్స్ పాల్గోని జయప్రదం చేయాలనీ ఆయన పిలుపునిచ్చారు అనంతరం 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలనీ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ని కార్మికులుగా మార్చి వారికీ కనీసం వేతనం 26,000 పెంచాలని esi, pf ఇవ్వాలని గవర్నమెంట్ ఉద్యోగులు మాదిరిగా మార్చి సెలవులు ఇవ్వాలని ఈ డిమాండ్లను నెరవేర్చాలని, లేనిచో ఈ దేశ వ్యాప్త సమ్మె ఉద్రిక్తంగా కోనసాగిస్తామని వారు తెలిపారు

హెల్త్ టిప్స్

🥥 కొబ్బరికాయ – ఆరోగ్యానికి, జీవనశైలికి ప్రకృతి ఇచ్చిన అమూల్య వరం🙏

కొబ్బరికాయను భారతదేశంలో “కల్పవృక్ష ఫలం” అని కూడా అంటారు. ఎందుకంటే కొబ్బరి చెట్టులోని ప్రతి భాగం మన జీవితానికి ఉపయోగపడుతుంది. కొబ్బరి ఆకుల నుంచి మొదలుకుని, కొబ్బరి కాయ, కొబ్బరి నీరు, కొబ్బరి నూనె వరకు అన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మన సంప్రదాయాల్లో పూజలలో, శుభకార్యాలలో కొబ్బరికాయకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది శుభానికి, పవిత్రతకు ప్రతీకగా భావిస్తారు. కొబ్బరి నీరు సహజ ఎలక్ట్రోలైట్‌లతో నిండి ఉండి, శరీరంలో నీటి శాతం తగ్గకుండా కాపాడుతుంది. వేసవికాలంలో అధిక వేడి వల్ల కలిగే అలసట, తలతిరగడం, నీరసం వంటి సమస్యలను వెంటనే తగ్గిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ను బయటకు పంపి, కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ కొబ్బరి నీటిని సురక్షితంగా తీసుకోవచ్చు. కొబ్బరి గుజ్జు జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ పేగుల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. కొబ్బరిలో ఉన్న మంచి కొవ్వులు (Healthy Fats) శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఇవి గుండెకు హానికరం కాకుండా, సరైన మోతాదులో తీసుకుంటే హృదయ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కొబ్బరి నూనె ఆయుర్వేదంలో ఔషధంగా విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇది జుట్టు వేర్లను బలపరచి, జుట్టు రాలడం, చుండ్రు, జుట్టు పొడిబారడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా కొబ్బరి నూనెతో తల మసాజ్ చేయడం వల్ల మెదడుకు చల్లదనం కలిగి, నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. చర్మంపై ఉపయోగిస్తే చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. చిన్న పిల్లలకు మసాజ్ చేయడానికి కూడా కొబ్బరి నూనె చాలా సురక్షితం. ఇంకా కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటంతో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, శరీరంలో అధిక వేడి వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు కూడా పరిమిత మోతాదులో కొబ్బరిని తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెంచదు. ఈ ఆధునిక జీవనశైలిలో రసాయనాలతో నిండిన ఆహారం ఎక్కువగా తీసుకుంటున్న మనకు, సహజంగా లభించే కొబ్బరి ఒక సంపూర్ణ ఆరోగ్య ఆహారంగా చెప్పవచ్చు. రోజువారీ ఆహారంలో కొబ్బరిని, కొబ్బరి నీటిని, కొబ్బరి నూనెను సరైన విధంగా చేర్చుకుంటే అనేక ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. అందుకే కొబ్బరికాయను కేవలం ఒక ఆహార పదార్థంగా కాకుండా, ఆరోగ్యాన్ని కాపాడే ప్రకృతి ప్రసాదించిన అమృతంగా భావించాలి.

కామారెడ్డి

రామారెడ్డి మండలంలో అక్రమ ఇసుక మాఫియాపై పోలీసుల ఉక్కు పాదం

రామారెడ్డి మండలం రెడ్డిపేట శివారులో ట్రాక్టర్‌తో ఇసుక దోపిడీ.. కన్నాపూర్‌లో శివారులో పట్టుకుని కేసు! కామారెడ్డి,2 ఫిబ్రవరి, ( పున్నమి ప్రతినిధి ) :. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపెట్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అనుమతులు లేకుం డా దూసుకెళ్లిన ట్రాక్టర్ రామారెడ్డి ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. ఘటనకు సంబంధించిన వివరాలు రామారెడ్డి మండలం రెడ్డిపేట శివారులో కొయ్యల లింబాద్రి అనే వ్యక్తి తన ట్రాక్టర్‌తో ఎలాంటి అను మతులు లేకుండా పెద్దఎత్తుగా ఇసుకను అక్ర మంగా తరలిస్తూ.. కన్నాపూర్ శివారులో పక్కా సమాచారం మేరకు పోలీసులు, ఎస్ఐ రాజశేఖర్ నేతృత్వంలోని రెవెన్యూ అధికారులతో కలిసి వెంటనే ట్రాక్టర్‌ను సీజ్ చేసి, కఠిన కేసు నమోదు చేశామన్నారు. ఇది కేవలం ఒక్క ట్రాక్టర్ కాదు – ఇసుక మాఫియా దూకుడుకు సవాలైన చర్య!ఎస్ఐ రాజశేఖర్ స్పష్టమైన హెచ్చరిక.. ఎవరినీ వదలమని చెప్పారు. అనుమతులు లేకుండా చట్టవిరుద్ధ పనులు చేస్తే.. ఎవరినీ చూడకుండా కేసులు నమోదు చేస్తామంటూ ఎస్ఐ రాజశేఖర్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. మండలంలో ఇసుక దోపిడీకి గురి కాకుండా పకడ్బందీ చర్యలు తీవ్రత రం చేపడుతున్నామని అన్నారు. స్థానికుల సర్దు కునేలా, చట్టాన్ని దెబ్బతీయడానికి ఎవరూ ముందుకు రారని స్పష్టం చేశారు.మండలంలో ఇసుక మాఫియా దూకుడు వెంటనే ఆపివేయాల న్నారు. రామారెడ్డి మండలంలో ఇలాంటి అక్రమ ఇసుక రవాణా ఘటనలు ఎక్కువైపోతున్నాయి. పర్యావరణానికి, చట్టానికి గట్టి దెబ్బ తీస్తున్న ఈ మాఫియా కార్యకలాపాలకు పోలీసులు గట్టిగా బుద్ది చెపుతామన్నారు. స్థానిక ప్రజలు అపోహలు వదిలి, సమాచారం అందించాలని పిలుపు నిచ్చా రు. ఎక్కడైనా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు.

కడప

ప్రొద్దుటూరులో దారుణం చోటుచేసుకుంది

కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం వైఎంఆర్ కాలనీ గురుసాయి అపార్ట్మెంట్లో దారుణం చోటుచేసుకుంది. అపార్ట్మెంట్లో 5వ అంతస్తు నుండి ఆడుకుంటున్న 8వ తరగతి చరిత కిందపడి మృతి . “ఎరువుల దుకాణంలో పనిచేస్తున్న తన తండ్రి పొట్టి పార్టీ రామచంద్రారెడ్డి ” . కేశవరెడ్డి హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న చరిత.

E-పేపర్

నేర్రపల్లి లో శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయ ప్రధమ వార్షికోత్సవ

నేర్రపల్లి లో శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయ ప్రధమ వార్షికోత్సవ పున్నమి న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : 02 ఫిబ్రవరి 2026 నేర్రపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయ ప్రధమ వార్షికోత్సవ ఆహ్వానం మేరకు ప్రత్యేక పూజలో పాల్గొన్న పాలకవర్గo అనంతరం ఆలయ కమిటీ సభ్యులు హాజరైనా పాలకవర్గానికి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ హేమలత శ్రీహరి, ఉప సర్పంచ్ వెలగ వేణుగోపాల్ రెడ్డి వార్డు మెంబెర్స్ మేకల పద్మ-జంగయ్య యాదవ్,గుడ్డేటి అరుణ్ కుమార్ యాదవ్ తో పాటు ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు…

E-పేపర్

అంబరాన్ని అంటిన జాతర సంబరాలు

*అంబరాన్ని అంటిన జాతర సంబరాలు ** రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : పున్నమి న్యూస్ ప్రతినిధి 02 ఫిబ్రవరి 2026 అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి ఆరుట్ల జాతర* *ఘనంగా శ్రీ శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి రధోత్సవం* – అట పాటలలో గ్రామ పెద్దలు -యువతి యువకులు – ⁠- ⁠ప్రత్యేక కార్యక్రమలతో ఆకట్టుకుంటున్న *కళాకారులు* – ⁠సకలసౌజర్యలు కల్పించిన *గ్రామ పంచాయతీ* – ⁠చిన్న నాటి మిత్రులను కలుసుకున్న క్లాసుమేట్ లు * ఆరుట్ల గ్రామం లో ఎన్నో ప్రతిష్టగా జరిగే శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణం రుక్మిణి సత్యభమా కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభావంగా జరిగింది , ఆరుట్ల. గ్రామస్తులతో పాటు చుట్టూ వున్నా పలు గ్రామాల ప్రజలు జాతరకు వచ్చి రాదోత్సవం నుచూసి ఆనందించారు , ప్రతి సంవత్సరం జరిగే జాతర ను ఈ. సంవత్సరం. నూతన. పాలక మండలి ప్రత్యేక శ్రద్ద తో వినూత్న కార్యక్రమాలు నిర్వహించండం విశేషం , హైద్రాబాద్ లో నివసిస్తున్న ఆరుట్ల గ్రామస్తులు వచ్చారు * ⁠ఈ కార్యక్రమం లో ఆరుట్ల గ్రామ సర్పంచ్. మానుపటి శోభ కుమార్, ఉపసర్పంచ్ నూకం రాజు ముదిరాజ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాతిరి ఎల్లేష్ BRS పార్టీ మండలం అధ్యక్షులు చీరాల రమేష్, PACS మాజీ చైర్మన్లు మొద్దు సికిందర్ రెడ్డి, వేదిరే హనుమంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు కొంగరి విష్ణు వర్ధన్ రెడ్డి, అనంగాళ్ల యాదయ్య, సుంకరి పండారిగౌడ్, మాజీ ఉపసర్పంచ్ పండాల జంగయ్య గౌడ్, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ యండి జానీపాషా ,గ్రామ పెద్దలు మాడ్గుల కృష్ణ గౌడ్, కొంగరి జనార్దన్ రెడ్డి, చిందం జంగయ్య, మెండు సత్తి రెడ్డి, నర్సిరెడ్డీ,రఘుపతి, శ్రీనివాస్ గౌడ్, రావుల రాఘవ, బడ్డు విజయ్, కంబాలపల్లి భాస్కర్, దంటు మధుసుదన్ రెడ్డి, వార్డు సభ్యులు పున్నం రాము, కొండిగారి శ్రవణ్, పంది శేఖర్, అనగాళ్ల జగన్, మంకు మమతావినోద్, మంద మాధవి మౌహన్ రెడ్డి, రావుల జంగయ్య, భాను, మాడ్గుల బాలమణి, మొర్రి పద్మా ఐలయ్య, మొహమ్మద్ ఇమ్రాన్, లాలగారి మణెమ్మ, సాతిరి సత్యం, తదితరులు వున్నారు

తెలంగాణ

మాజీ ఎమ్మెల్యే ఎస్ సీ వి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వానం

శ్రీ కాళహస్తి, పిబ్రవరి 02, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తీశ్వర మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు ఎస్ సీ వి నాయుడు కు దేవస్థానం అధికారులు ప్రోటోకాల్ ఏ ఈ ఓ మోహన్, ఆలయ సూపర్డెంట్ నాగభూషణం యాదవ్ తదితర అధికారులు ఆయన నివాసంలో కలిసి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వాన పత్రికలు అందజేశారు. అనంతరం వేద పండితులు ఎస్ సి వి నాయుడు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలని, భక్తులకు సదుపాయాలు కల్పించడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఎస్ సి వి నాయుడు సూచించారు. తమవంతు నిర్మాణాత్మక సహకారం అందిస్తామని మాజీ ఎమ్మెల్యే ఎస్ సి వి తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.