Saturday, 2 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

ఆత్మ నిర్భయ భారత్ ను బలోపేతం చేసే బడ్జెట్..

భారత్ లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నిర్మాణమయ్యే బడ్జెట్ గా కేంద్ర బడ్జెట్ ఉందని బిజెపి నేత మిడతల రమేష్ పేర్కొన్నరు. *ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధిని కాంక్షించే బడ్జెట్ ను కేంద్రం రూపొందించింది*. సముద్ర తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో జల రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది.. బకింగ్ హోమ్ కెనాల్ ద్వారా తక్కువ రవాణా ఖర్చుతో వేగవంతంగా వాణిజ్య సరుకుల రవాణా అందుబాటులోకి వస్తుంది.. ఆంధ్రసముద్ర తీర ప్రాంతంలో కొబ్బరి.. గంధం చెట్లు ఏర్పాటు చేయనున్నారు.. ఆంధ్రప్రదేశ్లో *అరుదైన ఖనిజాలు వెలికితీత కు ఈ బడ్జెట్ లో నిధులు* కేటాయించబడ్డాయి.. ప్రపంచ స్థాయి రాష్ట్ర రాజధానిగా అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయింపు ఉంది. అత్యంత విలువైన గంధం చెట్ల వనాలు ఏర్పాటు ద్వారా అంతరించిపోతున్న ప్రకృతి సంపద వృద్ధి లోకి రానుంది.. పాకిస్తాన్ చైనా బంగ్లాదేశ్లలో ఉన్న పరిస్థితులకు తగిన విధంగా రక్షణ రంగ బలోపేతానికి… *రక్షణ రంగ రహస్య ప్రాజెక్టులకు అధిక నిధులు* కేటాయించబడ్డాయి.. ఆత్మానిర్బర భారత్ దిశగా బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయని రమేష్ బడ్జెట్ పై వ్యాఖ్యానించారు…

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు గ్రంథాలయ చైర్మన్‌గా శాంతకుమారి* గారి ప్రమాణ స్వీకారం

* – విద్యా రంగానికి గర్వకారణం : * *కిషోర్ గునుకుల గారు* > జిల్లా ప్రధాన కార్యదర్శి > జనసేన పార్టీ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జిల్లా గ్రంథాలయ చైర్మన్‌గా మాజీ ఉదయగిరి ఎమ్మెల్యే గౌరవనీయులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి ధర్మపత్ని శ్రీమతి శాంతకుమారి గారు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడం నెల్లూరు జిల్లా విద్యా–సాంస్కృతిక రంగానికి గర్వకారణమని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రంథాలయాలు కేవలం పుస్తకాలు ఉన్న భవనాలు మాత్రమే కాకుండా జ్ఞానానికి ఆలయాలు, విద్యార్థులకు దిశానిర్దేశం చేసే దీపాలు, సమాజాన్ని విజ్ఞానవంతంగా తీర్చిదిద్దే కేంద్రాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. అలాంటి కీలక బాధ్యతను శాంతకుమారి గారు స్వీకరించడం ద్వారా జిల్లాలోని విద్యార్థులు, యువత, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఎన్నో అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ తరపున, పార్టీ అధ్యక్షులు, *డిప్యూటీ సీఎం గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి* ఆలోచనలకు అనుగుణంగా విద్య, విజ్ఞానం, విలువల ఆధారిత సమాజ నిర్మాణానికి ఎల్లప్పుడూ సంపూర్ణ మద్దతు ఇస్తామని స్పష్టంగా తెలిపారు. శాంతకుమారి గారు తన పదవీకాలంలో గ్రంథాలయాలను ఆధునీకరించి, డిజిటల్ సదుపాయాలను విస్తరించి, పేద విద్యార్థులకు జ్ఞాన ద్వారాలు మరింత విస్తృతంగా తెరవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బీజేవైఎం రాష్ట్ర సహా కోశాధికారిగా మురగ.నరేష్**

** నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని మూలాపేటకు చెందిన మురగ నరేష్ కు భారతీయ జనతా పార్టీ యువమోర్చాలో రాష్ట్ర సహాయ కోశాధికారిగా పదవి ఇవ్వడం జరిగింది. చిన్నతనం నుండి ఆర్ఎస్ఎస్ లో స్వయం సేవక్ గా శిక్షణ పొంది పలు బాధ్యతలు నిర్వహించి అనంతరం విద్యార్థి దశలో ఏబీవీపీ కార్యకర్తగా చేరి గతంలో ఏబీవీపీ వి.ఆర్. కళాశాల అధ్యక్షులుగాను, నెల్లూరు నగర సహాయ కార్యదర్శి గాను, నగర సెంట్రల్ జోన్ ఇన్చార్జిగాను, నగర కార్యదర్శి గాను, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగాను, ఎస్.ఎఫ్.డి నెల్లూరు జిల్లా కన్వీనర్ గాను, అనంతరం బిజెపిలో చేరి భారతీయ జనతా యువమోర్చాలో నెల్లూరు నగర ప్రధాన కార్యదర్శి గాను, మూలాపేట మండల బిజెపి అధ్యక్షులు గాను, బీజేవైఎం నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గాను, బాధ్యతలు నిర్వహించి ప్రస్తుతం బీజేవైఎం రాష్ట్ర సహాయ కోశాధికారిగా నియమించడం జరిగింది. ఆయనకు పై బాధ్యతను ఇచ్చిన రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షులు కే. సునీల్ రెడ్డి మరియు రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పివిఎన్. మాధవ్ రాష్ట్ర బిజెపి ఆర్గనైజింగ్ సెక్రటరీ నూకల. మధుకర్ నెల్లూరు జిల్లా బిజెపి అధ్యక్షులు ఎస్. వంశీధర్ రెడ్డి మరియు ఇతర జిల్లా రాష్ట్ర నాయకులకు ఆయన అభినందనలు తెలిపారు. అలాగే తనపై ఎంతో నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి రాష్ట్రం నలుమూలల పర్యటించి అన్నివర్గాల విద్యార్థి, యువతను సమీకరించి పార్టీలోకి ఆహ్వానించి పార్టీని బలోపేతం చేస్తానన్నారు. అలాగే రాష్ట్ర, కేంద్ర పార్టీలు ఇచ్చే అన్ని కార్యక్రమాలను అన్ని వర్గాల ప్రజలలోకి విశేషంగా తీసుకువెళతానని, రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని, విద్యార్థి, యువతలో దేశభక్తి, జాతీయ భావాలు, నైతిక విలువలతో కూడిన సమాజంలో అన్ని వర్గాలలో అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించే దిశగా పనిచేస్తానన్నారు.

E-పేపర్

మరో ఉద్యమంలా నిరసన!* BRS

పున్నమి న్యూస్ ప్రతినిధి 01 ఫిబ్రవరి 2026 తెలంగాణ ఇంచార్జ్: 9640204826 మరో ఉద్యమంలా నిరసన!* తెలంగాణ రాష్ట్ర సాధనకు నాయకత్వం వహించి, తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్రాభివృద్ధికి ఎనలేని సేవలందించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత *కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్)* SIT నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో బైక్ ర్యాలి నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాకు వెళ్లి రోడ్డుపై బైఠాయించి, రాస్తారోకో చేసి, ముఖ్యమంత్రి “రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన” జిల్లా పార్టీ అధ్యక్షులు *మంచిరెడ్డి కిషన్ రెడ్డి* , రాష్ట్ర నాయకు *మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి(బంటి)* , ఇబ్రహీంపట్నం నియోజకవర్గ *బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు*. *అనంతరం ప్రశాంత్ రెడ్డి(బంటన్న) ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు.*

E-పేపర్

మున్సిపల్ ఎన్నికల వేళ బిఎస్పీలో చేరికలు.

*మున్సిపల్ ఎన్నికల వేళ బిఎస్పీలో చేరికలు…* పున్నమి న్యూస్ ప్రతినిధి: 01 ఫిబ్రవరి 2026 తెలంగాణ ఇంచార్జ్ : బహుజన్ సమాజ్ పార్టీ (BSP) తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా ,రాజేంద్ర నగర్ నియోజకవర్గ పరిధిలో , గత పాలకుల పాలన లానే అదే తరహాలో , 24 నెలలు దాటినా ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనీ సక్రమంగా నెరవేర్చకపోవడంతో ప్రజల్లో కాంగ్రెస్,బి.ఆర్.ఎస్,&బిజెపి పార్టీల పై , తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది., అంతేకాకుండా ఆ పార్టీ నేతలను జనం ప్రశ్నిస్తుండడంతో వారికి సమాధానం చెప్పలేక పోవడంతో, మున్సిపల్ ఎన్నికల వేళ రాజేంద్ర నగర్ నియోజకవర్గ నుండి సుమారుగా 50 మంది నాయకులు నేడు బహుజన్ సమాజ్ పార్టీ లో చేరారు . వీరిని రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించి ,అభినందనలు తెలిపారు. ఈ చేరిక కొరకై చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షులు తప్ప కృష్ణ గారు కీలక పాత్ర పోషించారు. జై భీమ్…! జై భారత్

హెల్త్ టిప్స్

☘️రోజూ మొలకెత్తిన పెసలు తింటే కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు 🌱

రోజూ మొలకెత్తిన పెసలు (Green Gram Sprouts / మొలకెత్తిన మినపప్పు) తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు సహజంగా అందుతాయి. ఇవి జీర్ణానికి సులభంగా ఉండి, శరీరాన్ని లోపలినుంచి బలపరుస్తాయి. ముఖ్యంగా బలహీనత, అలసట, జీర్ణ సమస్యలు, రక్తహీనత వంటి సమస్యలలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మొలకెత్తిన పెసల్లో ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్, విటమిన్ C, B-కాంప్లెక్స్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో, రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది మంచి ఆహారం. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరచి, మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ సమస్యలను తగ్గిస్తాయి. అలాగే రక్తహీనత (అనీమియా) ఉన్నవారిలో హిమోగ్లోబిన్ పెంచడంలో తోడ్పడతాయి. మహిళలకు, ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో శక్తిని ఇచ్చే ఆహారంగా ఉపయోగపడతాయి. మొలకెత్తిన పెసలు తినడం వల్ల బరువు నియంత్రణ, చర్మం కాంతివంతంగా మారడం, జుట్టు రాలడం తగ్గడం వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పిల్లలు, పెద్దలు, వృద్ధులు—అందరికీ ఇది ఒక సంపూర్ణ ఆరోగ్యాహారం. 👉 ఎలా తినాలి? ఉదయం ఖాళీ కడుపుతో లేదా బ్రేక్‌ఫాస్ట్‌లో కొద్దిగా నిమ్మరసం వేసి, ఉల్లిపాయ/క్యారెట్‌తో సలాడ్‌లా తినవచ్చు. తేలికగా ఉడికించి కూడా తీసుకోవచ్చు. 🌿 రోజూ చిన్న పరిమాణంలో తీసుకుంటే దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

రాజన్న సిరిసిల్ల

కొండాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం

ముస్తాబాద్ /పున్నమి ప్రతినిధి /ఫిబ్రవరి బి.ఆర్.ఎస్ అధినేత కేసీఆర్ గారికి సిట్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో కొండాపూర్ సర్పంచ్ , ఉప సర్పంచ్ మరియు గ్రామ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మని దగ్నం చేయడం జరిగింది ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షుడు నిమ్మదేవి రెడ్డి గారు మరియు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మంద బాల్ రెడ్డి గారు మాట్లాడుతూ కేవలం రాజకీయంగా కేసీఆర్ గారి పై బురద చల్లడానికి మరియు తమ వైఫల్యాలు అన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల దృష్టిని మళ్లించడానికి మాత్రమే ఈ విచారణ విచారణలన్ని ఈరోజు ముందుకు తీసుకొస్తున్నారు అమలు గాని హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలతో ప్రజలను మభ్యపెట్టి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు ఆ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి చేతకాక ప్రజల దృష్టినీ వాటి నుండి మళ్ళించడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు రాష్ట్రంలో యూరియా కోసం రైతులు పాడుతున్న తన్నులాట మీకు కనబడడం లేదా ముఖ్యమంత్రి గారు రైతు భరోసా లేదు రైతు బందు లేదు కల్యాణ లక్ష్మి లేదు తులం బంగారం లేదు మీ 6 గ్యారంటీల్లో మీరు అమలు చేసింది ఏందో ఒక్కసారి చెప్పండి అబద్ధపు విచారణలు ఎన్ని నిందలు పెట్టిన భయపడేటోళ్ళం మేము కాదు మా నాయకుడి వెనుక యావత్ తెలంగాణ ప్రజలందరూ ఉన్నారు కచ్చితంగా ఇచ్చిన హామీలను నెరవేర్చదాక ఊరుకునే పరిస్థితి లేవు అబద్ధపు ఆరోపణలు చేస్తే కచ్చితంగా మా బిఆర్ఎస్ శ్రేణుల కూడా ఎప్పటికప్పుడు సింహంలా గర్జిస్తూనే ఉంటాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఇటి కార్యక్రమంలో కొండాపూరు బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల

సిట్ నోటీసును వ్యతిరేకిస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

సిట్ నోటీసును వ్యతిరేకిస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం ముస్తాబాద్ /పున్నమి ప్రతినిధి /ఫిబ్రవరి మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారి పై కక్ష సాధింపు చర్యతోనే సిట్ నోటీసులు ఇచ్చిందని ఆరోపిస్తూ ముస్తాబాద్ మండలం లోని గూడూరు గ్రామం లో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని అందులో భాగంగానే హరీష్ రావు, కేటీఆర్‌కు, కేసీఆర్‌కు ఫోన్ టాపింగ్ కేసులో సీట్ నోటీసులు పంపిస్తుందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. ప్రజలను దృష్టి మళ్లించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతుందని మండిపడ్డారు *ఈ కార్యక్రమం లో BRS పార్టీ సీనియర్ నాయకులు చీటి వెంకటనర్సింగరావు గూడూరు గ్రామ ఉపసర్పంచ్ తాటాకర్ల ప్రభాకర్. 8వ వార్డ్ మెంబర్ పుల్లూరి సంతోష్. కేటీఆర్ సేన ముస్తాబాద్ మండల అధ్యక్షులు వంగూరి దిలీప్ . కేటీఆర్ సేన గ్రామ అధ్యక్షులు చెక్కపెల్లి వెంకటేష్. యూత్ ప్రధాన కార్యదర్శి కోడూరి మనీష్. కేటీఆర్ సేన ఉపాధ్యక్షులు చెరుకు మహేష్. BRS పార్టీ సీనియర్ నాయకులు యూవకులు పాల్గొన్నారు

E-పేపర్

తూర్పుగోదావరి సీతానగరం మండలం తొర్రేడు గ్రామంలో పులి సంచారం

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం పున్నమి ప్రతినిధి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి సీతానగరం మండలం తొర్రేడు గ్రామంలో పులి సంచారం కలకలం లేగుతుంది హైస్కూల్ రోడ్ లోని పాత గెస్ట్ హౌస్ లో రెండు దూడలను చంపిన పులి. అక్కడినుంచి మొక్కజొన్న చేల మీదుగా జమ్మలపుంతవైపు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు దీంతో గ్రామస్తులను అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా రాత్రివేళలో చిన్న పిల్లలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు అటవీ శాఖ అధికారులు నిఘ పెంచారు END

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నందిపాడు అటవీ ప్రాంతంలో పెద్దపులి కలకలం

దుత్తలూరు 01-2-2026 నందిపాడు, ఫారెస్ట్ బీట్ దుద్దెరుకుంటా పరిసరాల్లోని అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన వార్త స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. చీపురు పుల్లల సేకరణ కోసం అడవిలోకి వెళ్లిన గ్రామానికి చెందిన లక్ష్మయ్య అనే వ్యక్తికి పులి కనిపించింది అని ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ​ఘటన వివరాలు: ​గ్రామానికి చెందిన లక్ష్మయ్య ఎప్పటిలాగే అడవిలోకి చీపురు పుల్లలు కోయడానికి వెళ్లారు,ఈ సమయం లొ పెద్దపులి కనిపించినట్లు, గ్రామస్థులకు మరియు అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. ​సమాచారం అందిన వెంటనే అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారులు మరియు సిబ్బంది కలిసి అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. ​పులి పాదముద్రల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.అధికారులకు ఎటువంటి ఆనవాళ్లు దొరకకపోవడం తొ, ​పరిసర గ్రామ ప్రజలు అడవిలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ​ముఖ్యంగా పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.