Thursday, 30 April 2026

Blog

E-పేపర్

*ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల పోటీలో 24 వార్డుల్లో 83 మంది కౌన్సిలర్ అభ్యర్థులు బరిలో

ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల పోటీలో 24 వార్డుల్లో 83 మంది కౌన్సిలర్ అభ్యర్థులు బరిలో* *42 మంది అభ్యర్థులు నామినేషన్స్ ఉపసంహారణ(విత్ డ్రా)* … కాంగ్రెస్ 24, బిఆర్ఎస్ 23, బీజేపీ 20, జనసేన 3, BSP 2, CPM 1, స్వతంత్రులు 10 మంది. పున్నమి న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ 03 ఫిబ్రవరి 2026 *1 వార్డు…5* కాంగ్రెస్ – చింతం రాధమ్మ, BRS పార్టీ – తాళ్ల చంద్రకళ, బీజేపీ – ముత్యాల శ్యామల, స్వతంత్ర అభ్యర్థులు – జమాల్ పూర్ స్వాతి, దేవరశెట్టి అండాలు *2 వార్డు…..4* కాంగ్రెస్ – భాను బాబు నీళ్ల, BRS పార్టీ – SD.ఇదాయాత్ అలీ, బీజేపీ – పుట్ట జగదీష్ , స్వతంత్ర అభ్యర్థులు – మహమ్మద్ అదామ్ అలీ *3 వ వార్డు…..4* కాంగ్రెస్ – బర్తకి జగన్నాధం, BRS పార్టీ – తాళ్ల వెంకటేష్, బీజేపీ – కందుల విజయ్ కుమార్, స్వతంత్ర అభ్యర్థులు – దాసరి మురళీ కృష్ణ, *4వ వార్డు….4* కాంగ్రెస్ – యాచారం శ్రీకాంత్, BRS పార్టీ – కొండ్రు ప్రవీణ్ కుమార్, బీజేపీ – నౌసు దాసు, BSP పార్టీ – చెరుకూరి కరుణాకర్ *5వ వార్డు…..3* కాంగ్రెస్ – పెద్దిగారి మణికీర్తి, BRS పార్టీ – జెర్కొని మమత రాజు, బీజేపీ – చెరుకూరి మనిషా, *6వ వార్డు….5* కాంగ్రెస్ -మహమ్మద్ అమీన బేగం , BRS పార్టీ – శెట్టి సుభాషిణి, బీజేపీ – మైలరం జయమ్మ, స్వతంత్ర అభ్యర్థులు – జెలమోని మాదవి, అఫ్రిన్ సుల్తాన *7 వ వార్డు….3* కాంగ్రెస్ – టేకుల కమలాకర్ రెడ్డి, BRS పార్టీ – టేకుల సుదర్శన్ రెడ్డి, బీజేపీ – ఆకుల సంతోష్ కుమార్, *8వ వార్డు….3* కాంగ్రెస్ – వర్ట్య రాందాస్, BRS పార్టీ – రామావత్ నర్సింహా, బీజేపీ – రామావత్ బాలకృష్ణ, *9వ వార్డు…..3* కాంగ్రెస్ – దారు రాఘవేందర్ రావు, BRS పార్టీ – అరవింద్ కర్నె , బీజేపీ -జక్క రవీందర్ రెడ్డి, *10వ వార్డు….2* కాంగ్రెస్ – దొంతరామోని భార్గవి బీజేపీ – భాగ్యలక్ష్మి కాకి *11వ వార్డు….3* కాంగ్రెస్ -ఆముదాల కళావతి , BRS పార్టీ – కొండ్రు శ్రీలత, బీజేపీ – కొండ్రు మనీల *12 వ వార్డు…..4* కాంగ్రెస్ – ఏర్పుల చంద్రయ్య, BRS పార్టీ – కొండిగారి త్రిలోక్ కుమార్, CPM పార్టీ- బోడ సామెల్ స్వతంత్ర అభ్యర్థులు – మాచర్ల అమరేందర్ *13వ వార్డు…3* కాంగ్రెస్ – ఇందూరి శ్రీనివాస్, BRS పార్టీ – ఆకుల సురేష్, బీజేపీ – ఆడెపు రాఘవేందర్ స్వామి *14వ వార్డు….4* కాంగ్రెస్ – ఎదుళ్ల విజయలక్ష్మి, BRS పార్టీ – మొద్దు శ్రావణి, బీజేపీ – ప్యాపలి ప్రశాంతి , స్వతంత్ర అభ్యర్థులు – మొద్దు సుష్మ రెడ్డి *15 వ వార్డు….3* కాంగ్రెస్ – తాళ్ల శ్రీశైలం గౌడ్, BRS పార్టీ – క్యామ శంకర్, బీజేపీ – గొట్టం శ్రీశైలం. *16వ వార్డు…. 2* కాంగ్రెస్ – ఈర్లపల్లి సునీత, BRS పార్టీ – అలువాల జ్యోతి. *17వ వార్డు… 5* కాంగ్రెస్ – ముత్యాల జ్యోతి, BRS పార్టీ – మడుపు లక్షమ్మ, బీజేపీ – ముత్యాల శ్రీలత, జనసేన పార్టీ…. బస్వాపురం సుమలత స్వతంత్ర అభ్యర్థులు – జక్క ప్రమీల *18వ వార్డు…..4* కాంగ్రెస్ – బర్ల మంగ, BRS పార్టీ – పండుగ సులోచన, జనసేన పార్టీ -మడుపు శ్రీదేవి బీజేపీ -సిద్ధం భాను ప్రియ , *19వ వార్డు….4* కాంగ్రెస్ – మహమ్మద్ ఫెరోజ్, BRS పార్టీ – ఆకుల యాదగిరి, బీజేపీ – ఆకుల సాయిరాం, BSP పార్టీ- కొండ్రు రఘుపతి *20వ వార్డు… 3* కాంగ్రెస్ – పంది భాను ప్రియ BRS పార్టీ – జయ మంద స్వతంత్ర అభ్యర్థి – మాచర్ల ఇంద్రజ *21వ వార్డు….4* కాంగ్రెస్ – ఈగల రాములు BRS పార్టీ – చిలుకల బుగ్గ రాములు బీజేపీ – కొప్పు సతీష్ జనసేన పార్టీ- కప్పటి సంతోష్ కుమార్ *22వ వార్డు….3* కాంగ్రెస్ – కప్పరి స్రవంతి BRS పార్టీ – వింజమూరి శిరీష బీజేపీ – నౌసు భాగ్యలక్ష్మి *23వ వార్డు… 3* కాంగ్రెస్ – చెనమోని చంద్రకళ BRS పార్టీ – నీలం శ్వేత బీజేపీ – గన్నోజు అంబికా *24వ వార్డు…..2* కాంగ్రెస్ – పబ్బే శ్రీనివాస్ BRS పార్టీ – గూడూరు గిరీష్ *ఇబ్రహీంపట్నం గడ్డ పై పోటిల్లో ఉన్న 83 మంది కౌన్సిలర్ అభ్యర్థులు ఈ నెల 11వ తారీఖున ఎన్నికల్లో తమ భవితవ్యం తెలుసుకోనున్నారు*

తిరుపతి

హిందూ స్మశాన వాటికలో సమస్యలు పరిష్కరించాలని ఆర్.డి.ఓ.కి వినతి

శ్రీకాళహస్తి, పిబ్రవరి 03, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని హిందూ స్మశాన వాటికలో వెట్టి కార్మికులతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు సమస్యలు పరిష్కరించాలని పట్టణవాసులు శ్రీకాళహస్తి రేవిన్యుదివిజినల్ అధికారికి వినతి పత్రం అందజేశారు. పట్టణ ప్రజలు ఎదోర్కొంటున్న ప్రధాన సమస్యలగుర్చి బాదితులు మాట్లాడుతూ…మృతిచెందిన వ్యక్తి దేహా ఖననానికి, దహనమునకు (గ్యాస్ బర్నింగ్, కట్టెలతో కాల్చడానికి తగిన ధరలను నిర్ణయించి సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలనీ, కర్మక్రియల మండపం వద్ద మౌలిక వసతులు సదుపాయాలు కల్పించాలని RDO కి వినతి పత్రం ఇవ్వడము జరిగినదని వారు తెలిపారు. ఈ కార్యక్రమం లో తెలుగు దేశం పార్టీ యూనిట్ ఇంచార్జి మునిరాజా యాదవ్, ధర్మరాజుల గుడి జీర్ణోద్ధరణ కమిటీ చైర్మన్ MS రెడ్డి, తెలుగు దేశం పార్టీ నాయకుడు కుమార్, స్మశాన వాటిక సమస్యల పోరాట కమిటి సభ్యులు సంజాకుల మురళీ కృష్ణ, రాజు,జయప్రకాశ్, మేస్త్రీ ఆనంద్, శివకుమార్, భార్గవ్ పాల్గొన్నారు.

E-పేపర్

ఇబ్రహీంపట్నం (ACP )KPV రాజు (C I )మద్ది మహేందర్ రెడ్డిని మర్యాదపూర్వకం కలిసిన సన్మానించిన నేర్రపల్లి సర్పంచ్ శ్రీ హరి ఉప సర్పంచ్ వెలగ వేణు గోపాల్ రెడ్డి

మర్యాదపూర్వకం కలిసిన సన్మానించిన సర్పంచ్ శ్రీ హరి ఉప సర్పంచ్ వెలగ వేణు గోపాల్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : 03 ఫిబ్రవరి 2026 ఇబ్రహీంపట్నం ACP KPV రాజు CI మద్ది మహేందర్ రెడ్డిని మర్యాదపూర్వకం కలిసిన సన్మానించిన నేర్రపల్లి సర్పంచ్ శ్రీ హరి ఉప సర్పంచ్ వెలగ వేణు గోపాల్ రెడ్డి గ్రామ సెక్రటరీ రాజ్ కుమార్ పాల్గొన్నారు

E-పేపర్

బ్లడ్ బ్యాంక్ కాలనీలో విద్యుత్ సమస్యకు చెక్ – నూతన ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

బ్లడ్ బ్యాంక్ కాలనీలో విద్యుత్ సమస్యకు చెక్ – నూతన ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పున్నమి న్యూస్ ప్రతినిధి హయత్ నగర్ డివిజన్ 03 ఫిబ్రవరి 2026 హయత్ నగర్ డివిజన్లోని బ్లడ్ బ్యాంక్ కాలనీలో గత కొంతకాలంగా లో వోల్టేజ్ సమస్య తీవ్రంగా ఉండటంతో గృహాలలోని ఎలక్ట్రానిక్ పరికరాలు దెబ్బతినడం, ఫ్యాన్లు, మోటార్లు సరిగా పనిచేయక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను స్థానికులు కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే స్పందించారు. విద్యుత్ శాఖ అధికారులతో కలిసి కాలనీలో పర్యటించి పరిస్థితిని పరిశీలించిన కార్పొరేటర్ గారు శాశ్వత పరిష్కారంగా నూతన ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయించారు. దీంతో కాలనీలో విద్యుత్ సరఫరా మెరుగుపడి వోల్టేజ్ సమస్య పూర్తిగా తగ్గింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారం తమ బాధ్యత అని, ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక సదుపాయాలు అందించే దిశగా కృషి కొనసాగుతుందని తెలిపారు. కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ కార్పొరేటర్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం లో AE ఖాదర్ అలీ, లైన్ మ్యాన్ అశోక్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి భాస్కర్, బీజేవైఎం అధ్యక్షులు అఖిలేష్ మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు… *కార్పొరేటర్ గారి కార్యాలయం.* హయత్ నగర్ డివిజన్

E-పేపర్

కాంగ్రెస్ పార్టీ కీ రాజీనామా చేసిన జెలమోని మాధవి రవీందర్

కాంగ్రెస్ పార్టీ కీ రాజీనామా చేసిన జెలమోని మాధవి రవీందర్ పున్నమి ప్రతినిధి 03 ఫిబ్రవరి 2026 *రంగారెడ్డి జిల్లా: ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి చివరి నిమిషం వరకు బీఫామ్ ఇస్తామని మోసం చేశారని మాల్ రెడ్డి వైఖరి నిరసిస్తూ ఇబ్రహీంపట్నం మున్సిపల్ 6 వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జెలమోని మాధవి రవీందర్ కాంగ్రెస్ పార్టీ కీ రాజీనామా,* గత నెల జనవరి 19న టీటీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెలమోని రవీందర్, టిడిపికి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు,* 6వార్డులో ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ హామీ తోనే మున్సిపల్ లో నామినేషన్ వేసామని, చివరి నిమిషంలో మోసం చేశారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం* కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరిగిందని, స్వతంత్ర అభ్యర్థి వర్ధిగా పోటీ చేసి గెలుస్తామని దిమా వ్యక్తం చేశారు.*

E-పేపర్

తెలంగాణ రాజ్యాధికార పార్టీ గ్రామాలలో విస్తరణ

*తెలంగాణ రాజ్యాధికార పార్టీ గ్రామాలలో విస్తరణ* పున్నమి న్యూస్ 03 ఫిబ్రవరి 2026 తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న (ఎం.ఎల్.సి.) ఆదేశాల మేరకు, రాష్ట్రంలో పార్టీని రాష్ట్రస్థాయి నుండి గ్రామాలలోకి వేగవంతంగా విస్తరించే దిశగా రాష్ట్ర యువజన అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్ సూచనలతో, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పాకాల నరసింహ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడిగా కుకునూరు అరవింద్ చారి , ప్రధాన కార్యదర్శిగా రాచ కొండ హరీష్ , ఉపాధ్యక్షుడిగా నాంపల్లి సురేష్ , ఉపాధ్యక్షుడుగా రాచకొండ నవీన్, సోషల్ మీడియా ఇన్‌చార్జిగా మునుగు సంజీవ్ కుమార్ ను నియమించడం జరిగింది. అలాగే అబ్దుల్లాపూర్‌మెట్ మండల ప్రధాన కార్యదర్శిగా సత్యం చారి నియమించారు. ఈ సందర్భంగా నియమితులైన వారందరికీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ తమ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టి ఆర్ పి రాష్ట్ర యువజన అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పాకాల నరసింహ, కుక్కునూరు అరవింద్, రాచకొండ హరీష్, నాంపల్లి సురేష్, రాచకొండ నవీన్ తదితరులు పాల్గొన్నారు

హైదరాబాద్

ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లకు త్వరలో పరిష్కారం

*ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లకు త్వరలో పరిష్కారం* *పున్నమి ప్రతినిధి హైదరాబాద్ తేది 3/02/2026* *ఈ రోజు సచివాలయంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని కలిసిన TG Teachers JAC బృందం.. ఉపాధ్యాయుల సమస్యల పైన ప్రాతినిధ్యం చేసిన జాక్.. సాయకూలంగ స్పందించిన మంత్రివర్యులు, అన్ని విషయాలను చర్చించడానికి త్వరలోనే ముఖ్యమంత్రి గారితో సమావేశం అవుదామని.. తెలిపిన మంత్రి గారు..* ఈ కార్యక్రమంలో జాక్ గౌరవ్ అధ్యక్షులు శ్రీ గాల్ రెడ్డి హర్ష వర్ధన్ గారు.. జేఏసీ చైర్మన్ చంద్ర శేఖర్ రావు గారు, సెక్రటరీ జనరల్ నర్సింహులు గారు, కోశాధికారి అబ్దుల్లా గారు.. జేఏసీ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో దుత్తలూరు మండలం సీఐటీయూ ప్రధాన కార్యదర్శి నేలటూరి సింహాద్రి ఈ నెల 12 వ తేదీన దేశ వ్యాప్తంగా సమ్మె జరుగుతుందని ఆయన తెలిపారు

దుత్తలూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో దుత్తలూరు మండలం సీఐటీయూ ప్రధాన కార్యదర్శి నేలటూరి సింహాద్రి ఆశ డే సందర్బంగా మాట్లాడుతు ఈ నెల 12 తేదీన దేశ వ్యాప్తంగా సమ్మె జరుగుతుంది ఈ సమ్మె లో ఆశ వర్కర్స్ పాల్గోని జయప్రదం చేయాలనీ ఆయన పిలుపునిచ్చారు అనంతరం 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలనీ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ని కార్మికులుగా మార్చి వారికీ కనీసం వేతనం 26,000 పెంచాలని esi, pf ఇవ్వాలని గవర్నమెంట్ ఉద్యోగులు మాదిరిగా మార్చి సెలవులు ఇవ్వాలని ఈ డిమాండ్లను నెరవేర్చాలని, లేనిచో ఈ దేశ వ్యాప్త సమ్మె ఉద్రిక్తంగా కోనసాగిస్తామని వారు తెలిపారు

హెల్త్ టిప్స్

🥥 కొబ్బరికాయ – ఆరోగ్యానికి, జీవనశైలికి ప్రకృతి ఇచ్చిన అమూల్య వరం🙏

కొబ్బరికాయను భారతదేశంలో “కల్పవృక్ష ఫలం” అని కూడా అంటారు. ఎందుకంటే కొబ్బరి చెట్టులోని ప్రతి భాగం మన జీవితానికి ఉపయోగపడుతుంది. కొబ్బరి ఆకుల నుంచి మొదలుకుని, కొబ్బరి కాయ, కొబ్బరి నీరు, కొబ్బరి నూనె వరకు అన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మన సంప్రదాయాల్లో పూజలలో, శుభకార్యాలలో కొబ్బరికాయకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది శుభానికి, పవిత్రతకు ప్రతీకగా భావిస్తారు. కొబ్బరి నీరు సహజ ఎలక్ట్రోలైట్‌లతో నిండి ఉండి, శరీరంలో నీటి శాతం తగ్గకుండా కాపాడుతుంది. వేసవికాలంలో అధిక వేడి వల్ల కలిగే అలసట, తలతిరగడం, నీరసం వంటి సమస్యలను వెంటనే తగ్గిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ను బయటకు పంపి, కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ కొబ్బరి నీటిని సురక్షితంగా తీసుకోవచ్చు. కొబ్బరి గుజ్జు జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ పేగుల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. కొబ్బరిలో ఉన్న మంచి కొవ్వులు (Healthy Fats) శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఇవి గుండెకు హానికరం కాకుండా, సరైన మోతాదులో తీసుకుంటే హృదయ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కొబ్బరి నూనె ఆయుర్వేదంలో ఔషధంగా విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇది జుట్టు వేర్లను బలపరచి, జుట్టు రాలడం, చుండ్రు, జుట్టు పొడిబారడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా కొబ్బరి నూనెతో తల మసాజ్ చేయడం వల్ల మెదడుకు చల్లదనం కలిగి, నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. చర్మంపై ఉపయోగిస్తే చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. చిన్న పిల్లలకు మసాజ్ చేయడానికి కూడా కొబ్బరి నూనె చాలా సురక్షితం. ఇంకా కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటంతో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, శరీరంలో అధిక వేడి వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు కూడా పరిమిత మోతాదులో కొబ్బరిని తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెంచదు. ఈ ఆధునిక జీవనశైలిలో రసాయనాలతో నిండిన ఆహారం ఎక్కువగా తీసుకుంటున్న మనకు, సహజంగా లభించే కొబ్బరి ఒక సంపూర్ణ ఆరోగ్య ఆహారంగా చెప్పవచ్చు. రోజువారీ ఆహారంలో కొబ్బరిని, కొబ్బరి నీటిని, కొబ్బరి నూనెను సరైన విధంగా చేర్చుకుంటే అనేక ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. అందుకే కొబ్బరికాయను కేవలం ఒక ఆహార పదార్థంగా కాకుండా, ఆరోగ్యాన్ని కాపాడే ప్రకృతి ప్రసాదించిన అమృతంగా భావించాలి.

కామారెడ్డి

రామారెడ్డి మండలంలో అక్రమ ఇసుక మాఫియాపై పోలీసుల ఉక్కు పాదం

రామారెడ్డి మండలం రెడ్డిపేట శివారులో ట్రాక్టర్‌తో ఇసుక దోపిడీ.. కన్నాపూర్‌లో శివారులో పట్టుకుని కేసు! కామారెడ్డి,2 ఫిబ్రవరి, ( పున్నమి ప్రతినిధి ) :. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపెట్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అనుమతులు లేకుం డా దూసుకెళ్లిన ట్రాక్టర్ రామారెడ్డి ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. ఘటనకు సంబంధించిన వివరాలు రామారెడ్డి మండలం రెడ్డిపేట శివారులో కొయ్యల లింబాద్రి అనే వ్యక్తి తన ట్రాక్టర్‌తో ఎలాంటి అను మతులు లేకుండా పెద్దఎత్తుగా ఇసుకను అక్ర మంగా తరలిస్తూ.. కన్నాపూర్ శివారులో పక్కా సమాచారం మేరకు పోలీసులు, ఎస్ఐ రాజశేఖర్ నేతృత్వంలోని రెవెన్యూ అధికారులతో కలిసి వెంటనే ట్రాక్టర్‌ను సీజ్ చేసి, కఠిన కేసు నమోదు చేశామన్నారు. ఇది కేవలం ఒక్క ట్రాక్టర్ కాదు – ఇసుక మాఫియా దూకుడుకు సవాలైన చర్య!ఎస్ఐ రాజశేఖర్ స్పష్టమైన హెచ్చరిక.. ఎవరినీ వదలమని చెప్పారు. అనుమతులు లేకుండా చట్టవిరుద్ధ పనులు చేస్తే.. ఎవరినీ చూడకుండా కేసులు నమోదు చేస్తామంటూ ఎస్ఐ రాజశేఖర్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. మండలంలో ఇసుక దోపిడీకి గురి కాకుండా పకడ్బందీ చర్యలు తీవ్రత రం చేపడుతున్నామని అన్నారు. స్థానికుల సర్దు కునేలా, చట్టాన్ని దెబ్బతీయడానికి ఎవరూ ముందుకు రారని స్పష్టం చేశారు.మండలంలో ఇసుక మాఫియా దూకుడు వెంటనే ఆపివేయాల న్నారు. రామారెడ్డి మండలంలో ఇలాంటి అక్రమ ఇసుక రవాణా ఘటనలు ఎక్కువైపోతున్నాయి. పర్యావరణానికి, చట్టానికి గట్టి దెబ్బ తీస్తున్న ఈ మాఫియా కార్యకలాపాలకు పోలీసులు గట్టిగా బుద్ది చెపుతామన్నారు. స్థానిక ప్రజలు అపోహలు వదిలి, సమాచారం అందించాలని పిలుపు నిచ్చా రు. ఎక్కడైనా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.