Thursday, 30 April 2026

Blog

ఆంధ్రప్రదేశ్

నకిలీ నోట్ల ముఠా పట్టివేత

కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం సంగముడి గ్రామంలోని హెప్సీ వైన్ షాప్‌లో ఇద్దరు వ్యక్తులు రెండు నకిలీ 500 రూపాయల నోట్లు ఇవ్వడం తో తో అనుమానం వచ్చిన క్యాషియర్ ఫిర్యాదు చేయడం తో కృత్తివెన్ను పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో మచిలీపట్నం ఎస్‌డీపీఓ సీహెచ్. రాజా పర్యవేక్షణలో పెడన సీఐ నాగేంద్ర ప్రసాద్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాలతో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరు విశాఖ పెందుర్తి మండలం కోకవానిపాలెంలో అద్దె ఇంట్లో నకిలీ నోట్లు ముద్రించి మార్కెట్‌లో చలామణి చేస్తునట్లు పోలీసులు తెలిపారు. రూ.6.02 లక్షల నకిలీ నోట్లు, రూ.6 వేల ఒరిజినల్ నగదు, 3 సెల్‌ఫోన్లు, ప్రింటర్లు, ల్యామినేషన్ మెషిన్ తదితర పరికరాలను సీజ్ చేసి నిందితులను బంటుమిల్లి కోర్టుకు రిమాండ్‌కు తరలించారు. నకిలీ నోట్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. Uploaded Video:

ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించడమే లక్ష్యం: వెల్ వాకర్స్ వింగ్

పున్నమి ప్రతినిధి – నెల్లూరు పొదలకూరు రోడ్డులోని వెల్ వాకర్స్ వింగ్ ఆధ్వర్యంలో కరెంట్ ఆఫీస్ సెంటర్‌లో ఉన్న శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో జాతీయ నాయకులు డా. బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా గాంధీ ఫోటోలను బహూకరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బొగ్గవరపు శ్రీమన్నారాయణ మాట్లాడుతూ విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకుని పెద్దలు సూచించిన మంచి విలువలను అనుసరిస్తే భవిష్యత్తు उज్వలంగా ఉంటుందన్నారు. ఈ ఏడాది విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హెడ్మాస్టర్ డా. గంగిశెట్టి శివకుమార్, రచయిత డా. టేకుమళ్ళ వెంకటప్పయ్య, కోశాధికారి పెంచల నరసింహారావు, కళ్యాణి, రాధా పాల్గొన్నారు

కామారెడ్డి

కామారెడ్డి పట్టణ మున్సిపల్ ఎన్నికలు…

– 44వ వార్డు సభ్యురాలుగా పార్శీ సరిత కామారెడ్డి, 04 ఫిబ్రవరి,( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి పట్టణంలో 44వ వార్డు సరిత పోటీ లోకామారెడ్డి జిల్లా పట్టణ కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల హోరు ఊపందుకుంది. కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ 44వ వార్డు సభ్యురాలి స్థానానికి పార్టీ సరిత నామినేషన్ దాఖలు చేసి బరిలోకి దిగారు. ఎన్నిక ల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ,పార్శీ సరిత, అందరూ 44వ వార్డు అభివృద్ధిని కోరుకుంటున్నా మని చెప్పారు. ఈ లక్ష్యంతోనే నేను పోటీ చేస్తు న్నాను అని అన్నారు.వార్డు సర్వంగా అభివృద్ధి కోసం మా నామినేషన్ దాఖలైంది. ప్రజలు మాకు భారీ ఓట్ల మద్దతు ఇచ్చి, ఈ వార్డును అభివృద్ధి మాదిరిగా మార్చే అవకాశం కల్పిస్తారని నమ్ముతు న్నాను అని అన్నారు. ఈ వార్డులో మున్సిపల్ సౌకర్యాలు మెరుగుపరచడం, ప్రజల సమస్యలు పరిష్కరించడం తమ ప్రధాన లక్ష్యమని సరిత స్పష్టం చేశారు.స్థానిక ప్రజలు సరిత అభ్యర్థిత్వాన్ని స్వాగతిస్తూ, ఎన్నికల్లో వారికి మద్దతు ప్రకటించా రు. కామారెడ్డి పట్టణ మున్సిపల్ ఎన్నికలు ప్రజల అభివృద్ధి సంకల్పానికి మైలురాయిగా మారతాయ ని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఖమ్మం

ఖమ్మం మీదుగా హై స్పీడ్ ‘బుల్లెట్ రైల్’ తెలంగాణ అభివృద్ధికి మరో మైలురాయి

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి) తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో మరో కీలక అధ్యాయానికి నాంది పలుకుతోంది. దేశంలోనే అత్యాధునిక సాంకేతికతతో రూపొందుతున్న హై స్పీడ్ ‘బుల్లెట్ రైల్’ ప్రాజెక్టు ఖమ్మం మీదుగా వెళ్లే అవకాశాలు బలపడుతున్నాయి. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే ఖమ్మం జిల్లా రవాణా, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బుల్లెట్ రైల్ ప్రాజెక్టులో భాగంగా గంటకు 300 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించే అత్యాధునిక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. దీని వల్ల ఖమ్మం నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ప్రస్తుతం గంటల తరబడి పడుతున్న ప్రయాణం, భవిష్యత్తులో నిమిషాల్లోనే పూర్తయ్యే పరిస్థితి ఏర్పడనుంది. ఈ ప్రాజెక్టుతో ఖమ్మం జిల్లా వ్యూహాత్మక కేంద్రంగా మారనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బుల్లెట్ రైల్ స్టేషన్ ఏర్పాటుతో భూముల విలువలు పెరగడం, కొత్త పరిశ్రమలు, ఐటీ పార్కులు, లాజిస్టిక్ హబ్‌లు ఏర్పడే అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. యువతకు ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా, జిల్లాలో ఆర్థిక చైతన్యం మరింత వేగం పుంజుకోనుంది. ఇప్పటికే ప్రాథమిక సర్వేలు, సాధ్యాసాధ్యాలపై అధ్యయనాలు జరుగుతున్నట్లు సమాచారం. కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ మహత్తర ప్రాజెక్టును త్వరితగతిన అమలు చేయాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం ప్రజలు కూడా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై భారీ ఆశలు పెట్టుకున్నారు. బుల్లెట్ రైల్ రూపంలో ఖమ్మం జిల్లా దేశ అభివృద్ధి పటంలో మరోసారి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునే దిశగా అడుగులు పడుతున్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయం

ఖమ్మం

ఏదులాపురం మున్సిపల్ ఎన్నికలు : జనసేన అభ్యర్థులకు బి ఫామ్ ల పంపిణీ చేసిన మిర్యాల రామకృ ష్ణ

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి) ఏదులాపురం : ఖమ్మం జిల్లా జనసేన పార్టీ మున్సిపల్ కోఆర్డినేటర్ మిరియాల రామకృష్ణ ఆధ్వర్యంలో ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అభ్యర్థులకు బి ఫామ్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు అభ్యర్థి కొమ్ము లక్ష్మి, 7వ వార్డు అభ్యర్థి జార్పుల నీలిమ, 27వ వార్డు అభ్యర్థి బాణోత్ రఘు, 28వ వార్డు అభ్యర్థి దండి సుధాకర్, 29వ వార్డు అభ్యర్థి హనుమంతు మౌనికలకు అధికారికంగా బి ఫార్ములు అందజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఖమ్మం నియోజకవర్గ నాయకులు బండారు రామకృష్ణ, యసంనేని అజయ్, తుడం ఉత్తమ్ రాజు, బనోత్ దేవేందర్, షేక్ హసీనా, రమణ కుమార్, అఖిల్, గంగాధర్, విజయ్, రాకేష్ చారి తదితరులు పాల్గొన్నారు. రామ కృష్ణ మాట్లాడుతూ ఏదులాపురం మున్సిపాలిటీలో ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా జనసేన పార్టీ అభ్యర్థులు కృషి చేస్తారని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి ప్రజల మద్దతు తప్పకుండా లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఖమ్మం

సత్తుపల్లి మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థులకు బి-ఫార్ముల పంపిణీ

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి దినపత్రిక జిల్లా ఇంచార్జి) సత్తుపల్లి: సత్తుపల్లి మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ (BJP) వార్డు అభ్యర్థులకు ఎన్నికల ఇంచార్జి సైది రెడ్డి బి-ఫార్ములను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పడిగిల మధు, దొంగల సత్యనారాయణ, నంబూరి రామలింగేశ్వరావ్, పాలకొల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్తుపల్లి పట్టణంలోని పలు వార్డులకు బీజేపీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారు. పార్టీ అభ్యర్థులు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారని నాయకులు తెలిపారు. సత్తుపల్లి మున్సిపాలిటీ – బీజేపీ వార్డు అభ్యర్థులు: 1️⃣ 1వ వార్డు (UR) – చీకటి వసంతరావు 2️⃣ 2వ వార్డు (URW) – మెరుగు శిరీష 3️⃣ 4వ వార్డు (BC జనరల్) – మంద శివ 4️⃣ 5వ వార్డు (BC జనరల్) – జోని బోయిన్ కార్తీక్ 5️⃣ 6వ వార్డు (జనరల్-W) – పులిచర్ల స్వాతి 6️⃣ 7వ వార్డు (URW) – ఆచంట తులసి కృష్ణ 7️⃣ 8వ వార్డు (జనరల్) – మెరుగు లక్ష్మి 8️⃣ 9వ వార్డు (ST జనరల్) – విజయ్ బానోత్ 9️⃣ 10వ వార్డు (SC జనరల్) – జై మమతా 🔟 11వ వార్డు (జనరల్) – మంద సందీప్ 1️⃣1️⃣ 12వ వార్డు (SC-W) – ఆశా భాను 1️⃣2️⃣ 13వ వార్డు (BC-W) – హారిక విశ్వనాధుల 1️⃣3️⃣ 14వ వార్డు (జనరల్) – ఆచంట నాగస్వామి 1️⃣4️⃣ 15వ వార్డు (BC జనరల్) – నాగ మౌనిక 1️⃣5️⃣ 16వ వార్డు (SC జనరల్) – జొన్నలు గడ్డ నరేష్ 1️⃣6️⃣ 17వ వార్డు (URW) – తెనాలి మంజుల 1️⃣7️⃣ 18వ వార్డు (జనరల్-W) – వనమా మాధవి 1️⃣8️⃣ 19వ వార్డు (జనరల్) – ఆచంట నాగమణి 1️⃣9️⃣ 20వ వార్డు (BC జనరల్) – సాయి చంద్ర వర్ధన్ 2️⃣0️⃣ 21వ వార్డు (జనరల్) – మిశ్రా 2️⃣1️⃣ 22వ వార్డు (BC-W) – పామర్తి దేవి ప్రసన్న (B.Tech) 2️⃣2️⃣ 23వ వార్డు (BC-W) – జోని బోయిన అరుణ

తిరుపతి

ముక్కంటిని దర్శించిన సినీ హీరో నందమూరి కళ్యాణ్ రామ్

శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దర్శనార్థం సినీ నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ మంగళవారం నాడు ఆలయానికి విచ్చేశారు. ఆయనకు తెలుగుదేశం పార్టీ మీడియా అధికార ప్రతినిధి నాగమల్లి దుర్గాప్రసాద్, బాలాజీ రెడ్డీ లు సాదర స్వగతం పలికి శ్రీ స్వామి, అమ్మవార్ల ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయించారు. దర్శనానంతరం ఆలయ వేద పండితులచే ఆశీర్వదించి వాయులింగేశ్వరుని తీర్థప్రసాదాలు, శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి జ్ఞాపికను ఆలయ నిర్వాహకులు కళ్యాణ్ రామ్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు నందమూరి అభిమానులు భారీగా పాల్గొన్నారు.

తిరుపతి

సచివాలయ సర్వేల నుండి పూర్తిగా మినహాయింపుకావాలీ..జే.ఎల్.యం.లు

శ్రీకాళహస్తి, పిబ్రవరి 03, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పరిదిలో విధ్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ లైన్ మ్యాన్-2 విధ్యుత్ సిబ్బంది సచివాలయ సర్వేల నుంచి పూర్తిగా మినహాయింపుకావాలంటూ మంగళవారం నాడు శ్రీ కాళహస్తి సబ్ డివిజన్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు JLM గ్రేడ్-2 లు 24 గంటలు అందుబాటులో ఉంటూ ఆదివారం కూడా సెలవు అనేది లేకుండా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ని అందించడానికి ప్రమాదకర పరిస్థితులులో కూడా తాము పని చేస్తున్నామని సచివాలయ సర్వేల నుంచి పూర్తిగా మినహాయింపు కోరుతూ CSని కోరగా, CS వెంటనే అన్ని జిల్లాల కలెక్టర్ లకి ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇప్పుడు మళ్లీ సచివాలయ సర్వే లు చేయాలని విద్యుత్ అధికారులు తమపై ఒత్తిడి తెస్తున్నారని అలాంటి రెండు రకాల పనుల మధ్య ఒత్తిడితో ప్రమాదకర పరిస్థితులులో పనులు చేయటం తమ వల్ల కాదని సచివాలయ సర్వే లు చేయాల్సిన రోజుల్లో పూర్తిగా డిపార్ట్మెంట్ విధుల నుంచి మినహాయింపు ఇస్తేనే తాము విధులు నిర్వర్తిస్తామని లేకపోతే సర్వే లు చేసే పరిస్థితి లేదని వారు పేర్కొన్నరు.

తిరుపతి

మెంబర్షిప్ టు లీడర్షిప్ మార్గంలో అందరూ కృషి చేయాలి జనసైన్యం

తొట్టంబేడు, పిబ్రవరి 03, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తొట్టంబేడు మండలంలోనీ జనసేన పార్టీ నాయకులందరూ కలిసి పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసి, గ్రామ గ్రామాల్లో జనసేన పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లే విధంగా, ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా ప్రతి ఒక్క నాయకుడు కృషి చేయాలని జనసేన పార్టీ అభివృద్ధి కోసం దృఢమైన సంకల్పంతో బాధ్యతగా పనిచేయడమే మా లక్ష్యమని నిర్ణయించుకొవవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, తేజ, గంధం శీను, నాదెండ్ల రాజేష్, మహేష్, లక్ష్మణ్, హరి, మనీ, ప్రదీప్ కుమార్, నవీన్,కల్లపూడి వెంకటేష్, శాంతి కుమార్, రమేష్ బాబు, సాయి, భాను, ముని చంద్ర, జానీ, నాగరాజు, చెంచయ్య, మరియు పేట చిరంజీవి, డాక్టర్ నక్క ప్రసాద్, పసల సురేష్, పసల ఎలిసా, చందు, గోపి వీర మహిళ దుర్గ పాల్గొన్నారు.

E-పేపర్

*ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల పోటీలో 24 వార్డుల్లో 83 మంది కౌన్సిలర్ అభ్యర్థులు బరిలో

ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల పోటీలో 24 వార్డుల్లో 83 మంది కౌన్సిలర్ అభ్యర్థులు బరిలో* *42 మంది అభ్యర్థులు నామినేషన్స్ ఉపసంహారణ(విత్ డ్రా)* … కాంగ్రెస్ 24, బిఆర్ఎస్ 23, బీజేపీ 20, జనసేన 3, BSP 2, CPM 1, స్వతంత్రులు 10 మంది. పున్నమి న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ 03 ఫిబ్రవరి 2026 *1 వార్డు…5* కాంగ్రెస్ – చింతం రాధమ్మ, BRS పార్టీ – తాళ్ల చంద్రకళ, బీజేపీ – ముత్యాల శ్యామల, స్వతంత్ర అభ్యర్థులు – జమాల్ పూర్ స్వాతి, దేవరశెట్టి అండాలు *2 వార్డు…..4* కాంగ్రెస్ – భాను బాబు నీళ్ల, BRS పార్టీ – SD.ఇదాయాత్ అలీ, బీజేపీ – పుట్ట జగదీష్ , స్వతంత్ర అభ్యర్థులు – మహమ్మద్ అదామ్ అలీ *3 వ వార్డు…..4* కాంగ్రెస్ – బర్తకి జగన్నాధం, BRS పార్టీ – తాళ్ల వెంకటేష్, బీజేపీ – కందుల విజయ్ కుమార్, స్వతంత్ర అభ్యర్థులు – దాసరి మురళీ కృష్ణ, *4వ వార్డు….4* కాంగ్రెస్ – యాచారం శ్రీకాంత్, BRS పార్టీ – కొండ్రు ప్రవీణ్ కుమార్, బీజేపీ – నౌసు దాసు, BSP పార్టీ – చెరుకూరి కరుణాకర్ *5వ వార్డు…..3* కాంగ్రెస్ – పెద్దిగారి మణికీర్తి, BRS పార్టీ – జెర్కొని మమత రాజు, బీజేపీ – చెరుకూరి మనిషా, *6వ వార్డు….5* కాంగ్రెస్ -మహమ్మద్ అమీన బేగం , BRS పార్టీ – శెట్టి సుభాషిణి, బీజేపీ – మైలరం జయమ్మ, స్వతంత్ర అభ్యర్థులు – జెలమోని మాదవి, అఫ్రిన్ సుల్తాన *7 వ వార్డు….3* కాంగ్రెస్ – టేకుల కమలాకర్ రెడ్డి, BRS పార్టీ – టేకుల సుదర్శన్ రెడ్డి, బీజేపీ – ఆకుల సంతోష్ కుమార్, *8వ వార్డు….3* కాంగ్రెస్ – వర్ట్య రాందాస్, BRS పార్టీ – రామావత్ నర్సింహా, బీజేపీ – రామావత్ బాలకృష్ణ, *9వ వార్డు…..3* కాంగ్రెస్ – దారు రాఘవేందర్ రావు, BRS పార్టీ – అరవింద్ కర్నె , బీజేపీ -జక్క రవీందర్ రెడ్డి, *10వ వార్డు….2* కాంగ్రెస్ – దొంతరామోని భార్గవి బీజేపీ – భాగ్యలక్ష్మి కాకి *11వ వార్డు….3* కాంగ్రెస్ -ఆముదాల కళావతి , BRS పార్టీ – కొండ్రు శ్రీలత, బీజేపీ – కొండ్రు మనీల *12 వ వార్డు…..4* కాంగ్రెస్ – ఏర్పుల చంద్రయ్య, BRS పార్టీ – కొండిగారి త్రిలోక్ కుమార్, CPM పార్టీ- బోడ సామెల్ స్వతంత్ర అభ్యర్థులు – మాచర్ల అమరేందర్ *13వ వార్డు…3* కాంగ్రెస్ – ఇందూరి శ్రీనివాస్, BRS పార్టీ – ఆకుల సురేష్, బీజేపీ – ఆడెపు రాఘవేందర్ స్వామి *14వ వార్డు….4* కాంగ్రెస్ – ఎదుళ్ల విజయలక్ష్మి, BRS పార్టీ – మొద్దు శ్రావణి, బీజేపీ – ప్యాపలి ప్రశాంతి , స్వతంత్ర అభ్యర్థులు – మొద్దు సుష్మ రెడ్డి *15 వ వార్డు….3* కాంగ్రెస్ – తాళ్ల శ్రీశైలం గౌడ్, BRS పార్టీ – క్యామ శంకర్, బీజేపీ – గొట్టం శ్రీశైలం. *16వ వార్డు…. 2* కాంగ్రెస్ – ఈర్లపల్లి సునీత, BRS పార్టీ – అలువాల జ్యోతి. *17వ వార్డు… 5* కాంగ్రెస్ – ముత్యాల జ్యోతి, BRS పార్టీ – మడుపు లక్షమ్మ, బీజేపీ – ముత్యాల శ్రీలత, జనసేన పార్టీ…. బస్వాపురం సుమలత స్వతంత్ర అభ్యర్థులు – జక్క ప్రమీల *18వ వార్డు…..4* కాంగ్రెస్ – బర్ల మంగ, BRS పార్టీ – పండుగ సులోచన, జనసేన పార్టీ -మడుపు శ్రీదేవి బీజేపీ -సిద్ధం భాను ప్రియ , *19వ వార్డు….4* కాంగ్రెస్ – మహమ్మద్ ఫెరోజ్, BRS పార్టీ – ఆకుల యాదగిరి, బీజేపీ – ఆకుల సాయిరాం, BSP పార్టీ- కొండ్రు రఘుపతి *20వ వార్డు… 3* కాంగ్రెస్ – పంది భాను ప్రియ BRS పార్టీ – జయ మంద స్వతంత్ర అభ్యర్థి – మాచర్ల ఇంద్రజ *21వ వార్డు….4* కాంగ్రెస్ – ఈగల రాములు BRS పార్టీ – చిలుకల బుగ్గ రాములు బీజేపీ – కొప్పు సతీష్ జనసేన పార్టీ- కప్పటి సంతోష్ కుమార్ *22వ వార్డు….3* కాంగ్రెస్ – కప్పరి స్రవంతి BRS పార్టీ – వింజమూరి శిరీష బీజేపీ – నౌసు భాగ్యలక్ష్మి *23వ వార్డు… 3* కాంగ్రెస్ – చెనమోని చంద్రకళ BRS పార్టీ – నీలం శ్వేత బీజేపీ – గన్నోజు అంబికా *24వ వార్డు…..2* కాంగ్రెస్ – పబ్బే శ్రీనివాస్ BRS పార్టీ – గూడూరు గిరీష్ *ఇబ్రహీంపట్నం గడ్డ పై పోటిల్లో ఉన్న 83 మంది కౌన్సిలర్ అభ్యర్థులు ఈ నెల 11వ తారీఖున ఎన్నికల్లో తమ భవితవ్యం తెలుసుకోనున్నారు*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.