Thursday, 30 April 2026

Blog

తిరుపతి

ముక్కంటి నిత్యాన్నదాన పథకానికి రూ.. లక్ష విరాళం

శ్రీకాళహస్తి టెంపుల్ న్యూస్, పిబ్రవరి 04, పున్నమి న్యూస్: శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థాన నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్ వాస్తవ్యులు జ్యోతిర్మయి, మనోజ్ బిజెపి తిరుపతి జిల్లా మాజీ అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప సమక్షంలోఆలయ ఈవో బాపిరెడ్డికి లక్ష రూపాయల విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ పిఆర్ఓ రవి శ్రీ స్వామి, అమ్మవార్ల దర్శనం చేయించి వేద పండితుల ఆశీర్వచనాలు అందించారు. అనంతరం వీరు ఆలయ అన్నప్రసాద వితరణకు లక్ష రూపాయలు విరాళం డొనేషన్ కౌంటర్లో అందజేసి, ఆలయ ఈవో బాపిరెడ్డి చేతులు మీదుగా లక్ష రూపాయల రసీదును వీరికి అందించారు. ఈ కార్యక్రమంలో చంద్రప్ప కుమారుడు తరుణ్, ఆలయ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతి

జనసేనానికి శ్రీకాళహస్తీశ్వరస్వామి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం

శ్రీకాళహస్తి, పిబ్రవరి 04, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తిలో శివరాత్రి సందర్భంగా ఈ నెల 10వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ కొట్టే సాయిప్రసాద్ ఆహ్వానించారు. బుధవారం నాడు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ కి ఆహ్వాన పత్రికతో పాటు స్వామి వారి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ అర్చకులు పవన్ కళ్యాణ్ కి వేదాశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు పగడాల మురళీ, ఆలయ అధికారులు పాల్గోన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి పున్నమి ప్రతినిధి. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా గ్రామీణ ప్రజలకు క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తున్నామని మనుబోలు ప్రభుత్వ వైద్యాధికారిణి డాక్టర్ మోహసిన్ సుల్తానా తెలిపారు. బుధవారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో ఆమె మాట్లాడుతూ ప్రతి ఏటా ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహిస్తామని అన్నారు. 18 ఏళ్ల పైబడినవారు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలన్నారు. పొగాకు, గుట్కా వాడకం వల్ల నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని, క్యాన్సర్‌కు చికిత్స ఉందని, ముందస్తు పరీక్షలతో నివారించవచ్చని వివరించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వైయస్ షర్మిల అక్కంపేట పర్యటనను విజయవంతం చేయాలి

ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి పున్నమి ప్రతినిధి ఈనెల 12న మనుబోలు మండలం అక్కంపేట గ్రామానికి వైయస్ షర్మిల రెడ్డి విచ్చేస్తున్న నేపథ్యంలో పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు సర్వేపల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ బల్ల హరి పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా రచ్చబండ కార్యక్రమంలో షర్మిల కూలీలతో మాట్లాడతారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

E-పేపర్

నువ్వు ముఖ్యమంత్రివా? లేక వీధి రౌడీవా? – రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్.

*నువ్వు ముఖ్యమంత్రివా? లేక వీధి రౌడీవా? – రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్.* *గెలిచే దమ్ములేక మా అభ్యర్థులను ఎత్తుకెళ్తున్నారు* *వడ్డీతో సహా చెల్లిస్తాం గుర్తుపెట్టుకోండి.* జనం న్యూస్ 2026 ఫిబ్రవరి 5 మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్ తెలంగాణ కోసం పదవులులేదని కాదు..ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ నాయకుడు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీకి గెలిచే దమ్ములేక, ఓడిపోతామనే భయంతో బీఆర్ఎస్ అభ్యర్థులను బెదిరించి, ప్రలోభపెట్టి పార్టీలు మారుస్తున్నారని మాజీ మంత్రి, హరీష్ రావు మండిపడ్డారు. మెదక్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాషపై, పాలనపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.హరీష్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి.. నువ్వు ముఖ్యమంత్రివా? లేక వీధి రౌడీవా? అని అడుగుతున్నా. అవ్వతాతలు రూ. 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావ్ అని అడిగితే లాగుల తొండలు వదులుతా అంటావా.బాండ్ పేపర్లు రాసిచ్చి, అమ్మతోడు అని చెప్పి మోసం చేశావు కదా.. ఆడబిడ్డలు మహాలక్ష్మి రూ. 2500 అడిగితే ‘పేగులు తీసి మెడలో వేసుకుంటా’ అంటావా? ఇదేనా నీ సంస్కారం? నీ రౌడీయిజం సాగదు ఖబర్దార్.తెలంగాణ కోసం డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మంత్రి పదవులను గడ్డిపోచల్లా విసిరేసిన మహనీయుడు కేసీఆర్. అని అన్నారు. కె సిఆర్ చెబితే మేము కూడా పదవులకు రాజీనామా చేసి ఆంధ్రా పాలకుల ముఖం మీద కొట్టినం. మరి నువ్వు? రాజీనామా చేయమంటే జిరాక్స్ పేపర్ పంపిన దొంగవు. తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ గురిపెట్టిన ద్రోహివని అన్నారు. కేసీఆర్ ప్రాణ త్యాగానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చారు కాబట్టే నువ్వు ఈరోజు సీఎం కుర్చీలో ఉన్నావు. లేకపోతే ఆంధ్రాలో మోచేతి నీళ్లు తాగుతూ, బ్యాగులు మోసుకుంటూ బతికేవాడివి. కాంగ్రెస్ పార్టీకి గెలిచే సత్తా ఉంటే మా అభ్యర్థులను ఎందుకు ఎత్తుకెళ్తున్నారు? జనం మీకు ఓటు వేయరని అర్థమై.. పోలీసులతో బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి కండువాలు కప్పుతున్నారు. ఎవరెవరు అమ్ముడుపోతున్నారో, ఎవరు ఎందుకు ఎత్తుకుపోతున్నారో అందరినీ గుర్తుపెట్టుకుంటాం. సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తాం. ఇప్పటివరకు రైతు బంధు ఇవ్వలేదు. ఫిబ్రవరి 11వ తేదీలోగా రైతు బంధు పడకపోతే.. రైతులు నీ చెడ్డీల తొండలు తొడిగి ఏడిపిస్తారు. నిన్ను చీరిచింతకు చెండాడుతారని,రుణమాఫీ పేరుతో దేవుళ్లనే మోసం చేసిన ఘనుడివి నువ్వు. నీ అబద్ధాలను రైతులు నమ్మే స్థితిలో లేరని మెదక్ జిల్లా కల నెరవేర్చింది కేసీఆర్. ఇక్కడికి కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు, రైలు, నాలుగు లైన్ల రోడ్డు తెచ్చింది కేసీఆర్ అని ఘనపూర్ ఆయకట్టుకు నీళ్లు ఇచ్చింది మేము. సిద్దిపేటతో సమానంగా మెదక్‌ను అభివృద్ధి చేశామని కాంగ్రెస్ వచ్చాక ఇక్కడ ఒక్క రూపాయి పని జరగలేదన్నారు. మెదక్‌లో ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని ఏ కార్యకర్తకు ఏ ఇబ్బంది వచ్చినా మీకు మీ హరీష్ అన్న ఉన్నాడు.. నేను చూసుకుంటా. కాంగ్రెస్ గుండా రాజకీయాన్ని, మోసాలను ఎండగట్టండని తెలిపారు. బీజేపీకి 8 మంది ఎంపీలను ఇస్తే బడ్జెట్‌లో గుండు సున్నా ఇచ్చారు. కాబట్టి కారు గుర్తుకే ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి. మెదక్ అభివృద్ధిని కొనసాగిద్దాం. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డి, రాష్ట్ర, జిల్లా నాయకులు తిరుపతి రెడ్డి, మాజీ చైర్మన్లు మాజీ కౌన్సిలర్లు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న అభ్యర్థులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

E-పేపర్

మాల్ రెడ్డి అభిషేక్ రెడ్డి కలసిన ఇబ్రహీంపట్నం మండల్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ యాదవ్

*మాల్ రెడ్డి అభిషేక్ రెడ్డి కలసిన ఇబ్రహీంపట్నం మండల్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ యాదవ్* పున్నమి న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : 04 ఫిబ్రవరి 2026 నేర్రపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం, నూతన పాలక వర్గానికి శుభాభినందనలు తెలిపి గ్రామ అభివృద్ధికి అందరు అహర్నిశలు పని చెయాలి అన్నారు అలాగే గ్రామ అభివృద్ధి కి ఎమ్మెల్యే సహకారం తప్పకుండ ఉంటుంది అన్నారు..,ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోడండ్ల హేమలత శ్రీ హరి, ఉప సర్పంచ్ వేణు గోపాల్ రెడ్డి వార్డు మెంబెర్స్ మేకల పద్మ-జంగయ్య యాదవ్,అరుణ్ కుమార్ యాదవ్, అఖిల, నర్సింహా యాదవ్,రేణుక-శ్రీనివాస్, బాలయ్య, శ్రీధర్..తో పాటు తదితరులు పాల్గొన్నారు…

E-పేపర్

ఇబ్రహీంపట్నం మండలంలో కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్…!

ఇబ్రహీంపట్నం మండలంలో కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్…! పున్నమి న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : 04 ఫిబ్రవరి 2026 ఇబ్రహీంపట్నం మండల పరిధి పెత్తుల్ల గ్రామ శివారులో ప్రైవేట్ కంపెనీలోని వ్యర్ధాలను బహిరంగ ప్రదేశాల్లో చెత్తకుప్పలుగా ఏర్పాటు చేసి నిత్యం కాల్చుతూ ఉన్నారు. రాష్ట్రంలో బహిరంగంగా చెత్త కాల్చడం నిషేధం.గత సంవత్సరంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పోస్టర్ కూడా విడుదల చేశారు. బహిరంగంగా చెత్త పడవేసిన జరిమానా విధించాలని చట్టం ఉన్నప్పటికీ ఇంకా అక్కడక్కడ గ్రామాల్లో మండలాల్లో చెత్త కాల్చుతూనే ఉన్నారు. గ్రామంలోని ప్రధాన రోడ్డు అయినా గ్రామ కార్యదర్శి పట్టనట్టు ఉన్నారని గ్రామస్తులు వాపోతున్నారు. చిత్త ప్లాస్టిక్ కాల్చడం వల్ల గాలిలోని నాణ్యత లోపిస్తుందని పలు పరిశోధన సంస్థలు వెల్లడించిన విషయం తెలిసిందే. చెత్త కాల్చడం వల్ల శ్వాస కోశ సంబంధిత సమస్యలు ఎదురవుతాయని, క్యాన్సర్ కు కారణం కూడా అవుతుందని బహిరంగంగా చెత్త కాల్చడం ప్రభుత్వం నిషేధించింది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని సంబంధిత వ్యక్తులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జాన వెంకన్న మృతి పట్ల సంతాపం

(నెల్లూరు: పున్నమి ప్రతినిధి) ప్రముఖ వామపక్ష నాయకుడు, సామాజిక సేవకుడు, ఎస్‌ఎఫ్‌ఐ వ్యవస్థాపకుల్లో ఒకరైన కామ్రేడ్ జాన వెంకన్న (జానా వెంకయ్య) ఇక లేరు. 04.02.2026 ఉదయం 5.30 గంటలకు ఆయన పరమపదించారు. ఎస్‌ఎఫ్‌ఐ ద్వారా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన, అనంతరం సీపీఎం నెల్లూరు రూరల్‌లో కీలక పాత్ర పోషించారు. ఎఫ్‌సీఐలో ఉద్యోగం చేస్తూ ఎక్కడ పనిచేసినా పార్టీ శాఖలు, హోల్‌టైమర్లను తీర్చిదిద్దారు. పేదల సేవ, పిల్లల విద్యే లక్ష్యంగా జీవించిన ఆయన అనేక మందికి ఆదర్శం. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు గోమతి నగర్ నివాసం నుంచి ఏసీఎస్‌ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు దేహదానం కోసం అంతిమ యాత్ర సాగనుంది. వారి మృతికి పున్నమి ప్రతినిధులు, NIFA–CPM మిత్రులు సంతాపం తెలిపారు. డా. జానా చైతన్య కిషోర్ మరియు కుటుంబ సభ్యులు జోహార్లు అర్పించారు.

ఆంధ్రప్రదేశ్

నకిలీ నోట్ల ముఠా పట్టివేత

కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం సంగముడి గ్రామంలోని హెప్సీ వైన్ షాప్‌లో ఇద్దరు వ్యక్తులు రెండు నకిలీ 500 రూపాయల నోట్లు ఇవ్వడం తో తో అనుమానం వచ్చిన క్యాషియర్ ఫిర్యాదు చేయడం తో కృత్తివెన్ను పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో మచిలీపట్నం ఎస్‌డీపీఓ సీహెచ్. రాజా పర్యవేక్షణలో పెడన సీఐ నాగేంద్ర ప్రసాద్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాలతో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరు విశాఖ పెందుర్తి మండలం కోకవానిపాలెంలో అద్దె ఇంట్లో నకిలీ నోట్లు ముద్రించి మార్కెట్‌లో చలామణి చేస్తునట్లు పోలీసులు తెలిపారు. రూ.6.02 లక్షల నకిలీ నోట్లు, రూ.6 వేల ఒరిజినల్ నగదు, 3 సెల్‌ఫోన్లు, ప్రింటర్లు, ల్యామినేషన్ మెషిన్ తదితర పరికరాలను సీజ్ చేసి నిందితులను బంటుమిల్లి కోర్టుకు రిమాండ్‌కు తరలించారు. నకిలీ నోట్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. Uploaded Video:

ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించడమే లక్ష్యం: వెల్ వాకర్స్ వింగ్

పున్నమి ప్రతినిధి – నెల్లూరు పొదలకూరు రోడ్డులోని వెల్ వాకర్స్ వింగ్ ఆధ్వర్యంలో కరెంట్ ఆఫీస్ సెంటర్‌లో ఉన్న శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో జాతీయ నాయకులు డా. బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా గాంధీ ఫోటోలను బహూకరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బొగ్గవరపు శ్రీమన్నారాయణ మాట్లాడుతూ విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకుని పెద్దలు సూచించిన మంచి విలువలను అనుసరిస్తే భవిష్యత్తు उज్వలంగా ఉంటుందన్నారు. ఈ ఏడాది విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హెడ్మాస్టర్ డా. గంగిశెట్టి శివకుమార్, రచయిత డా. టేకుమళ్ళ వెంకటప్పయ్య, కోశాధికారి పెంచల నరసింహారావు, కళ్యాణి, రాధా పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.