Thursday, 30 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పోలీస్ స్పోర్ట్స్ మీట్లో నాలుగు పతకాలు సాధించిన లక్ష్మీకి ఎస్సై శివ రాకేష్ అభినందనలు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి) .నెల్లూరులో జిల్లా ఎస్పీ గౌరవనీయులు డాక్టర్ అజిత వేజెండ్ల గారి ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీస్ స్పోర్ట్స్ మీట్లో నాలుగు మెడల్స్ సాధించి మనుబోలు పోలీస్ స్టేషన్‌కు జిల్లా స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన లక్ష్మీని ఎస్సై శ్రీ శివ రాకేష్ గారు అభినందించారు. ఈ సందర్భంగా ఆమె కృషి, పట్టుదల ఇతర పోలీస్ సిబ్బందికి ఆదర్శమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గ్రూప్–2లో సత్తా చాటిన విద్యానికేతన్ విద్యార్థి మనోజ్ కుమార్‌కు ఘన సన్మానం

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి). గ్రూప్–2 పరీక్షల్లో విజయం సాధించిన శ్రీ విద్యానికేతన్ కోచింగ్ సెంటర్ పూర్వ విద్యార్థి తొండమనాటి మనోజ్ కుమార్‌ను సోమవారం మనుబోలులో ఘనంగా సన్మానించారు. నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి, విజయవాడ సెక్రటేరియట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా ఎంపిక కావడం గర్వకారణమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ జగదీష్ బాబు, పూర్వ విద్యార్థులు కావేటి భార్గవ్, ఆన్‌లైన్ యోగా ట్రైనర్ కొలను భరత్ కుమార్ రెడ్డి, వీడియో జర్నలిస్ట్ కుడమల శ్రీనివాస్ గౌడ్, వంశీ, నవదీప్, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

తూర్పుగోదావరి రోడ్డు కం రైల్వే బ్రిడ్జి పై ఘోరప్రమాదం

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి రోడ్డు కం రైల్వే బ్రిడ్జి పై ఘోరప్రమాదం జరిగింది. రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు యువకులు ఘటనాస్థలంలో మృతి చెందారు ఇరువైపులా రెండు రెండు కిలోమీటర్లు 4 కిలోమీటర్లు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది END

రాజన్న సిరిసిల్ల

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ మండల నాయకులు

ముస్తాబాద్ /పున్నమి/ ప్రతినిధి ఫిబ్రవరి ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్ రెడ్డి గారు మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ నాయకులు ఇప్పటికైనా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా చేపడుతున్న విచారణలను అనవసర ఆరోపణలతో అడ్డుకోవాలని ప్రయత్నించడం సరికాదని హితవు పలికారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు, అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న తరుణంలో ప్రజా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేయడం తగదని అన్నారు. ఫోన్ టాపింగ్, వ్యాపారులపై ఒత్తిళ్లు వంటి ఆరోపణలు అప్పట్లో తీవ్రంగా వినిపించాయని గుర్తుచేశారు. ఇలాంటి గత చర్యలను మరిచి ప్రస్తుత ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేయడం సమంజసం కాదని తెలిపారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ చేరుతున్నాయని చెప్పారు. ప్రజా ప్రభుత్వానికి ఆటంకాలు కలిగించే ప్రయత్నాలు మానుకొని, నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, జిల్లా నాయకులు, వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు, మండల నాయకులు, యూత్ కాంగ్రెస్, NSUI నాయకులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మడమానూరులో శేషమ్మ గారి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి). సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మడమానూరు గ్రామంలో సీనియర్ నాయకులు చమిడిబోయిన సుబ్బయ్య గారి తల్లి చమిడిబోయిన శేషమ్మ గారి మృతిపై పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వర్ధినేని మస్తాన్ నాయుడు, నూనె లక్ష్మయ్య (నీటి సంఘం అధ్యక్షులు), ఉడతా విజయకుమార్ (పీఏసీఎస్ డైరెక్టర్), చెమిర్తి సుదీర్ (వైస్ ప్రెసిడెంట్)తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు తురక తిరుపయ్య, షేక్ మాసంసాహెబ్, గుమ్మా సురేష్, ఇరగరాజు శ్రీను, అన్నింగి శరత్, పాముజుల నాగరాజు, తారకేశ్వర్ రెడ్డి, ఉడతా మధు, తురక వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

శ్రీ వేణుగోపాల స్వామి వారి రథోత్సవం (ఊరేగింపు) లో పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఇబ్రహీంపట్నం దండెం రాంరెడ్డి

శ్రీ వేణుగోపాల స్వామి వారి రథోత్సవం (ఊరేగింపు) లో పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు , ఇబ్రహీంపట్నం దండెం రాంరెడ్డి . ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, మంచాల మండలం, ఆరుట్ల గ్రామంలో శ్రీశ్రీశ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలు పున్నమి న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : 02 ఫిబ్రవరి 2026 ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, మంచాల మండలం, ఆరుట్ల గ్రామంలో శ్రీశ్రీశ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ మరియు గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు ఈరోజు శ్రీ వేణుగోపాల స్వామి వారి రథోత్సవం (ఊరేగింపు) లో పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు , ఇబ్రహీంపట్నం దండెం రాంరెడ్డి ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి చీరాల రమేష్, ఉపసర్పంచ్ నూకం రాజు, వార్డు మెంబర్ సాథిరి సత్యం, వార్డు మెంబర్ శ్రవణ్, కొల్లోజు చంద్రశేఖర్ చారి, బీఆర్ఎస్ నాయకుడు దాసరిమొని ప్రవీణ్ ముదిరాజ్, కోరె ఐలయ్య, జానీ, ఆర్ల యాదయ్య, రాఘవ కురుమ, ఆర్ల కృష్ణ, రావుల ఐలయ్య మరియు కందుకూరి మల్లారెడ్డి , మొగుళ్ళ రాంరెడ్డి, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

కామారెడ్డి

లంకె బిందెలు” భయంతో లక్షల దోపిడీ..

కామారెడ్డిలో మాయాజాల దొంగల గారడి పోలీసు పంజాలో! కామారెడ్డి, ఫిబ్రవరి 2, ( పున్నమి ప్రతినిధి ) : ప్రాణాలు పోతాయి.. లంకె బిందెలు తీసేయకపో తే కుటుంబం మొత్తం మరణిస్తుంది!”ఈ భయ భ్రమలతో అమాయకులను మోసం చేసి లక్షలు దోచుకున్న మాయాగాడిని కామారెడ్డి పోలీసులకు పట్టుబట్టారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఐపిఎస్‌ల పర్యవేక్షణలో, అంతర్జిల్లా మోసగాడు కడమంచి నర్సింలు @ నర్సారెడ్డి చేతిలో రూ.7 లక్షల నగదు, విలాసవంతమైన కార్లు స్వాధీనం, ఇది కేవలం ఒక కేసు కాదు.. మూఢనమ్మకాల ఆయుధంతో పలు కుటుంబాలను బెదిరించిన ‘దొంగ బాబా’ గుట్టు రట్టు అయింది. ఇది ఓన్నాజిపేట్‌లో మొదటి ఎపిసోడ్…. దుమ్మల్ల బీరవ్వ కుటుంబానికి బెదిరింపులు జన వరి 26న, నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం ఓన్నాజిపేట్ గ్రామంలో జరిగిన ఈ ‘బిగ్ మ్యాటర్ ట్విస్ట్.. దుమ్మల్ల బీరవ్వల ఇంటికి వచ్చిన ఈ మాయాగాడు, “వాస్తు దోషాలు, క్షుద్ర పూజలు, అతీంద్రియ శక్తులు” అని నటిస్తూ లంకె బిందెలు ఇంట్లో ఉన్నాయంటు భయం చూపించాడు. “ఇవి తీసేయకపోతే కుటుంబంలో మరణం ఖాయం!” అంటూ భయపెట్టి, పూజల పేరుతో మొత్తం రూ. 8,20,000 తీసుకుని ఫోన్లు కట్ చేసి పరార్ అయ్యాడు. బీరవ్వల ఫిర్యాదితో కామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు. సాంకేతిక టూల్స్‌ తో విచారణలో, సిరిసిల్ల జిల్లా వేములవాడ మండ లం చిర్లవంచకు చెందిన నర్సారెడ్డి ముఖ్య నింది తుడిగా తేలాడు. చిన్న మల్లారెడ్డి ఫ్లాష్‌బ్యాక్.. భిక్షాటన నుంచి దోపిడీకి షిఫ్ట్! గతేడాది అక్టోబర్‌లో చిన్న మల్లారెడ్డి గ్రామంలో ఈ ‘సీరియల్ మోసగాడు’ స్పాట్ హీరో అయ్యాడు. భిక్షాటన పేరుతో వచ్చి, లాస్య కుటుంబంలో ఆరో గ్య సమస్యలు ఉన్నాయని ముందుగానే తెలిసి, సోదరుడు సురేష్‌కు కిడ్నీ, తల్లికి అనారోగ్యాలు వస్తాయని ‘అంచనా’ వేశాడు. నమ్మకం సంపాదిం చాడు. “లంకె బిందెలు కారణమే.. పూజలు చేయకపోతే ఎవరో చనిపోతారు!” అని భయపెట్టి రూ.14 లక్షల పూజా ఖర్చు చెప్పి, రూ.2,93,000 డబ్బులు బ్లాక్ మెయిల్ చేశాడు. మరో ఇద్దరు సహచరులతో కలిసి సదాశివనగర్, జనగామ జిల్లా కోడకండ్ల పోలీస్ పరిధిలోనూ ఇలాంటి నేరాలు చేసినట్లు ఆరోపణలు, నిందితుడి బ్యాక్‌గ్రౌండ్.. భిక్షాటన నుంచి మాయా బాబా! 30 ఏళ్ల కడమంచి నర్సింలు (నర్సారెడ్డి), తండ్రి దుర్గయ్య, బుడగ జంగం (ఎస్సీ) కులం. వృత్తి భిక్షాటన అని చెప్పుకుని, బంగారం, నగదు, ఆన్‌ లైన్ ట్రాన్సాక్షన్లతో దోపిడీ చేస్తున్నాడు. పోలీసుల స్వాధీనం: రూ.7 లక్షల క్యాష్, మారుతి స్విఫ్ట్ డిజైర్ (TS02FL0625), హ్యుండాయ్ క్రెటా (TG23 9853), ఒక మొబైల్. మిగిలిన ఇద్దరు పరారీలో.. త్వరలో పట్టుకుంటామని ఎస్పీ హామీ.. “మూఢనమ్మకాలు ఆయుధం కాకూడదు!” అమాయకత్వాన్ని ప్రయోజనం చేసుకుని మూఢన మ్మకాలతో దోపిడీ చేస్తున్నారని ఎస్పీ రాజేష్ చంద్ర ఘాటుగా హెచ్చరించారు. “ఇలాంటి మోసాలు గుర్తిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా డయల్ 100కు సంప్రదించండి. జిల్లాలో ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్య లు తీసుకుంటామని అన్నారు.కామారెడ్డి పోలీసు లు మొత్తం జిల్లాను కవర్ చేసి, ఇలాంటి మాయా గాల్లను ట్రాక్ చేస్తు న్నారు. అమాయకులు భయప డకండి.. పోలీసు లే మీ బలం!

తూర్పు గోదావరి

ఆర్య వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కోనా శ్రీనివాస్ బాధ్యతల స్వీకారం

అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కోనా శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం వేలాదిమంది ఆర్య వైశ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రపంచ ఆర్యవైశ్య ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా కోనా శ్రీనివాసరావు ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన పలువురు ఆర్య వైశ్యులను రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించి, అర్హులైన ఆర్య వైశ్యులకు 30 కుట్టు మిషన్లు, మహిళలకు 100 గ్రైండర్లు, పేదరికంలో ఉన్న ఆర్య వైశ్య విద్యార్థులకు 20 ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అలాగే అన్నదేవరపేట, చిడిపి, పెద్దేవం గ్రామాలకు చెందిన ఆర్య వైశ్యులలో పేదవారిని గుర్తించి, ఐవిఎఫ్ సెక్రటరీ మారం కృష్ణ ప్రసాద్ (కె.పి) సూచన మేరకు రెండు గ్రైండర్లు, ఒక కుట్టు మిషన్‌ను కె.పి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్య వైశ్య ప్రముఖులు, ఆర్య వైశ్య కుటుంబ సభ్యులు, సంఘ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

తూర్పు గోదావరి

వేగేశ్వరపురంలో 90 శాతం సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తి – కైగాల శ్రీనివాస్

తాళ్లపూడి, తూర్పుగోదావరి (పున్నమి ప్రతినిధి): ఫిబ్రవరి 02: కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం గ్రామంలో సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులు 90 శాతం పూర్తయ్యాయని టిడిపి మండల మాజీ అధ్యక్షులు కైగాల శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా తాళ్లపూడి యువ ప్రెస్ టీమ్‌తో మాట్లాడుతూ, స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు ఎనర్జీఎస్ పథకం ద్వారా గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేశారని అన్నారు. గతంలో రూ.31 లక్షల వ్యయంతో సిమెంట్ రోడ్లు నిర్మించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎస్సీ ప్రాంతంలో రెండు రోడ్లు, ఓసీ ప్రాంతంలో నాలుగు రోడ్లను రూ.26 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నామని, ఈ పనులు వారం రోజుల్లో పూర్తవుతాయని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని ఆయన అన్నారు. ఇప్పటివరకు గ్రామంలో 90 శాతం రోడ్ల నిర్మాణం పూర్తయిందని, మిగిలిన 10 శాతం రోడ్లకు రూ.20 లక్షల నిధులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని తెలిపారు. అలాగే గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను కూడా త్వరలో నిర్మించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ కొమ్ములపల్లి వెంకటమూర్తి, వేగేశ్వరపురం తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు అంబటి కృష్ణ, బీజేపీ తాళ్లపూడి మండల అధ్యక్షులు యిండుగుల రామకృష్ణ, వేగేశ్వరపురం జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు దేవన సత్తిబాబు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ వెంకట్, వీఆర్వో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రామంలో చేపట్టిన సిమెంట్ రోడ్ల నిర్మాణాల వివరాలను తెలిపారు. కండేల్లి పద్మ ఇంటి నుండి తామరపల్లి శ్రీను ఇంటి వరకు రూ.7.50 లక్షలతో, కావూరి నాగేశ్వరరావు ఇంటి నుండి అంకోలు శ్రీను ఇంటి వరకు రూ.2.50 లక్షలతో, కావూరి సునీత ఇంటి నుండి వేములూరి విక్టర్ వారి ఖాళీ స్థలం వరకు రూ.2.50 లక్షలతో, పళ్ళ సూర్యకుమారి ఇంటి నుండి పాదం శెట్టి రామారావు ఇంటి వరకు రూ.6.50 లక్షలతో, పోలిశెట్టి నాగేశ్వరరావు ఇంటి నుండి ఏపీఎస్ఐడిసి కాలువ వరకు రూ.4 లక్షలతో, వీరస్వామి గద్దె నుండి తైలం ప్రసాద్ స్థలం వరకు రూ.3 లక్షలతో సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయని ఈ సందర్భంగా తెలిపారు.

కడప

ప్రొద్దుటూరు 1 వన్ టౌన్ CI గా కొండారెడ్డి

పొద్దుటూరు 1 టౌన్ సిఐ గా కొండారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ మధ్యకాలంలో ఇక్కడ పనిచేస్తున్న CI శ్రీరామును 40 రోజుల్లో అధికారులు బదిలీ చేసి అన్నమయ్య జిల్లా విధులు నిర్వహిస్తున్న కొండారెడ్డిని నియమించారు. CI శ్రీరామ్ వెళ్లిన ఐదు రోజుల తర్వాత కొండారెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.