Thursday, 30 April 2026

Blog

కడప

ప్రొద్దుటూరు 1 వన్ టౌన్ CI గా కొండారెడ్డి

పొద్దుటూరు 1 టౌన్ సిఐ గా కొండారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ మధ్యకాలంలో ఇక్కడ పనిచేస్తున్న CI శ్రీరామును 40 రోజుల్లో అధికారులు బదిలీ చేసి అన్నమయ్య జిల్లా విధులు నిర్వహిస్తున్న కొండారెడ్డిని నియమించారు. CI శ్రీరామ్ వెళ్లిన ఐదు రోజుల తర్వాత కొండారెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

అనకాపల్లి

ప్లాస్టిక్‌కు చెక్… నిత్యావసరాలకు ప్రోత్సాహం: ఏటికొప్పాకలో ప్రారంభమైన స్వచ్ఛ రథం..!

అనకాపల్లి జిల్లా ఫిబ్రవరి 2 పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్ : ఎలమంచిలి మండలంలోని అన్ని గ్రామాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలనే లక్ష్యంతో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ రథం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, వాటికి బదులుగా నిత్యవసర సరుకులను అందించడం జరుగుతుంది. మండలంలోని ప్రతి గ్రామాన్ని ఈ స్వచ్ఛ రథం సందర్శించి ప్రజల్లో అవగాహన కల్పించనుంది. ఈ కార్యక్రమానికి ఏటికొప్పాక గ్రామంలో ఘనంగా శ్రీకారం చుట్టారు. గ్రామ సర్పంచ్ భజంత్రీల లక్ష్మి గారి కుమారుడు శ్రీను, కూటమి నాయకులు, పంచాయతీ సెక్రెటరీ గిరిప్రసాద్, సచివాలయం సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం గ్రామాలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడంలో కీలకంగా మారనుంది.

కడప

తప్పిపోయిన బాలుడిని పేరెంట్స్ కి అప్పగించిన పోలీసులు.

ప్రొద్దుటూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద తప్పిపోయిన బాలుడిని స్థానిక 2 టౌన్ పోలీసులు చేరదీసి తమ సంరక్షణలో ఉంచుకున్నారు. ఈ వివరాలు సోషల్ మీడియాలో రావడంతో పేరెంట్సా సాయంత్రం 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి వచ్చారు. CI వంశీనాథ్, SI రాఘవేంద్ర రెడ్డి వారి నుంచి గుర్తింపు వివరాలు తీసుకొని బాలుడిని అప్పగించారు.

కడప

తప్పిపోయిన బాలుడిని పేరెంట్స్ కి అప్పగించిన పోలీసులు.

ప్రొద్దుటూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద తప్పిపోయిన బాలుడిని స్థానిక 2 టౌన్ పోలీసులు చేరదీసి తమ సంరక్షణలో ఉంచుకున్నారు. ఈ వివరాలు సోషల్ మీడియాలో రావడంతో పేరెంట్సా సాయంత్రం 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి వచ్చారు. CI వంశీనాథ్, SI రాఘవేంద్ర రెడ్డి వారి నుంచి గుర్తింపు వివరాలు తీసుకొని బాలుడిని అప్పగించారు.

జోగులాంబ గద్వాల

రాష్ట్ర స్థాయి సౌత్ జోన్ సీనియర్ మహిళల షూటింగ్ బాల్ పోటీలో సత్తాచాటిన పాలమూరు అమ్మాయి..

జోగులాంబ గద్వాల్ ఫిబ్రవరి 2(పున్నమి ప్రతినిధి) జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ మండలం చిన్నతండ్రపాడు గ్రామం మారుమూల గ్రామానికి చెందిన కూలి పని చేసే అతి పేద కుటుంబం సుధాకర్ ఎలిజిబెత్ మూడవ కూతురు సువర్ణ గత జనవరి 17, 18 తేదీలలో వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో జరిగిన రాష్ట్రస్థాయి సౌత్ జోన్ సీనియర్ మహిళల షూటింగ్ బాల్ పోటీలలో ఉమ్మడి మహబూబ్నగర్ మహిళా జట్టులో పాల్గొని, క్రీడా నైపుణ్యతను, క్రీడా ప్రతిభను చాటి వెండి పతకం సాధించి, జాతీయస్థాయి సీనియర్ మహిళల షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు రాష్ట్ర షూటింగ్ బాల్ ఉపాధ్యక్షుడు కోచ్ బి. గోపాలం ద్వారా సమాచారం అందినట్లు తండ్రి సుధాకర్ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, విలేకరుల సమావేశంలో తెలిపారు. జాతీయస్థాయి సీనియర్ మహిళల షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికైన సువర్ణ ఫిబ్రవరి 6 నుండి 9 వరకు ఆంధ్రప్రదేశ్, తిరుపతిలో జరుగు జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొంటుందని కోచ్ బి.గోపాలం తెలిపారు. అలాగే 2025 సెప్టెంబర్ 22 నుండి 24 వరకు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు లో జరిగిన జూనియర్ షూటింగ్ బాల్ పోటీలలో పాల్గొని కాంస్య పథకం, మెరిట్ సర్టిఫికెట్ పొందినది . అలాగే 2025 డిసెంబర్ 14న తాండూర్ పట్టణంలో జరిగిన అస్మిత ఖే లో ఇండియా షూటింగ్ బాల్ మహిళల పోటీలలో పాల్గొని జాతీయస్థాయి క్రీడలకు ఎంపికైనది .వచ్చే ఏప్రిల్ నెలలో ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లో జరుగు జాతీయ స్థాయి క్రీడలలో పాల్గొంటుంది. 2025 డిసెంబర్ 29 నుండి 31 వరకు వరంగల్ జిల్లా అన్నారం లో జరిగిన సీనియర్ మహిళా షూటింగ్ బాల్ పోటీలలో పాల్గొని, మహబూబ్నగర్ జట్టు గెలుపునకు కృషిచేసి వెండి పతకము, ప్రశంసా పత్రం సాధించినది అని కోచ్ బి. గోపాలం తెలిపారు. సువర్ణ ప్రస్తుతము మహబూబ్నగర్ సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాలలో BA 2వ సంవత్సరం చదువుతున్నది. , రాష్ట్ర షూటింగ్ బాల్ ఉపాధ్యక్షుడు కోచ్ బి.గోపాలం ప్రోత్సాహము, సహకారంతో రాష్ట్ర ,జాతీయస్థాయి క్రీడలలో రాణిస్తూ తాండ్ర పాడు గ్రామ కీర్తి ప్రతిష్టలను పెంచుచున్నది. సువర్ణ మాట్లాడుతూ మా తల్లిదండ్రుల కష్టాన్ని శ్రమను గుర్తించి నేను బాగా చదివి ,క్రీడల్లో రాణించి కోచ్ గోపాల్ సార్ సహకారంతో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించాలని నా ప్రధమ కర్తవమనిఆమె తెలిపినది. జాతీయస్థాయి షూటింగ్ బాల్ క్రీడలకు ఎంపికైన సువర్ణను రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.గోపాలం, కళాశాల ప్రిన్సిపల్ జయప్రద, ఫిజికల్ డైరెక్టర్ రజిని ,గ్రామ సర్పంచ్ ,వార్డు సభ్యులు, పెద్దలు, ప్రజలు అభినందించారు..

ఖమ్మం

బీఆర్‌ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజును పరామర్శించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి) బీఆర్‌ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజును మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరామర్శించారు. ఆదివారం కేసీఆర్‌ను సిట్ విచారణకు పిలిచిన సందర్భంలో జరిగిన నిరసన కార్యక్రమంలో అరెస్ట్ అయి జిల్లా జైలులో ఉన్న పగడాల నాగరాజును ఆయన కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా నాగరాజుకు పూర్తి మద్దతు ఉంటుందని, త్వరలోనే బెయిల్ తీసుకొని విడుదల చేయిస్తామని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ మురళి, కూరాకుల నాగభూషణం తదితర బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

కడప

బిర్లా ఓపస్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫీసును ప్రారంభించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరా రెడ్డి గారు

ప్రొద్దుటూరు ఎర్రగుంట్ల బైపాస్ నందు సాయి రాజరాజేశ్వరి సినీ హబ్ కాంప్లెక్స్ నందు బసిరెడ్డి రాజేశ్వరి రెడ్డి వారి బిర్లా ఓపెస్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫీస్ ని ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాల రెడ్డి గారు, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవ రెడ్డి గారు తెదేపా రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండా రెడ్డి గారు. *ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య గారు రాష్ట్ర షేక్ వెల్ఫేర్ అండ.

కడప

మైదుకూరు ప్రాంతానికి చేరుకున్న నిర్మాత బండ్ల గణేష్ సంకల్ప యాత్ర..

కడప జిల్లా..@ బండ్ల గణేష్ సంకల్ప యాత్ర మైదుకూరు ప్రాంతానికి చేరుకున్న నిర్మాత బండ్ల గణేష్ సంకల్ప యాత్ర.. యాత్రకు సంఘీభావం తెలిపి తేనిటీవిందు ఏర్పాటు చేసిన మైదుకూరు టిడిపి నాయకులు బండి రెడ్డయ్య, శాలువ పూల మాలతో ఘనంగా సత్కారం.. దేవుడి ముక్కు తీర్చుకోవడం కోసం పాదయాత్ర మొదలు పెట్టాను.. నేటికి 350 కిలోమీటర్ల పాదయాత్ర ముగిసింది.. దారి పొడవునా నాపై మమకారంతో అభిమానంతో ఆదరిస్తున్నారు వారికి కృతజ్ఞతలు.. వచ్చే ఆది లేదా సోమవారం నాటికి తిరుమల చేరుకుని ఏడుకొండల వాడి ముక్కు తీర్చుకుంటాను.. తెలుగు ప్రాంత ప్రజలపై ఏడుకొండల వాడి ఆశీస్సులు ఉండాలని అందరూ బాగుండాలని కోరుకుంటాను.

ఆంధ్రప్రదేశ్

ఫిబ్రవరి 2026 – అరుదైన క్యాలెండర్ విశేషం

రాబోయే ఫిబ్రవరి 2026 నెల ఒక అరుదైన క్యాలెండర్ విశేషంగా నిలవనుంది. ఈ నెలలో ఆదివారం నుంచి శనివారం వరకు అన్ని రోజులు నాలుగేసి సార్లు మాత్రమే వస్తాయి. అంటే 4 ఆదివారాలు, 4 సోమవారాలు, 4 మంగళవారాలు, 4 బుధవారాలు, 4 గురువారాలు, 4 శుక్రవారాలు, 4 శనివారాలు ఉండడం విశేషం. ఇటువంటి సమన్వయం ప్రతి 823 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే సంభవిస్తుందని క్యాలెండర్ నిపుణులు చెబుతున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బడ్జెట్ 2026లో AIకి భారీ ప్రాధాన్యం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి) బడ్జెట్ 2026లో కృత్రిమ మేధ (AI) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విశేష ప్రాధాన్యం ఇచ్చింది. ఇండియాAI మిషన్‌కు ₹5,000 కోట్ల నిధులు కేటాయించి, 10,000కు పైగా GPUs, డీప్‌టెక్ స్టార్టప్‌లకు మద్దతు ప్రకటించింది. ఐఐటీల్లో AI క్రియేటర్ ల్యాబ్స్ ఏర్పాటు, PM రీసెర్చ్ ఫెలోషిప్ విస్తరణతో పరిశోధనకు ఊపునిచ్చింది. ఉద్యోగాలపై AI ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి హైపవర్డ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.