Tuesday, 28 April 2026

Blog

కడప

28 న పెన్షన్ పంపిణీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతినెలా అందిస్తున్న పెన్షన్ను ఒకరోజు ముందుగానే అందించారు మార్చి నెల గాను అందించవలసిన వికలాంగులు వితంతువులు మరియు వయోవృద్ధుల పెన్షన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు ముందు గానే అందించడం తో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు

రాజన్న సిరిసిల్ల

బీసీలకు ₹60 వేల కోట్లు కేటాయించాలి: శీలం స్వామి డిమాండ్

ముస్తాబాద్ము ఫిబ్రవరి పున్నమి ప్రతినిధి బడ్జెట్‌లో బీసీలకు ₹60 వేల కోట్లు కేటాయించి, బీసీ సబ్ ప్లాన్‌ను తక్షణమే అమలు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీలం స్వామి డిమాండ్ చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో కామారెడ్డిలో నిర్వహించిన బీసీ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి, ప్రతి ఏడాది ₹20 వేల కోట్లు కేటాయించి ఐదు సంవత్సరాల్లో ₹1 లక్ష కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం ₹9 వేల కోట్లు కేటాయించి అందులో కేవలం ₹5 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, తరువాతి ఏడాది ₹11 వేల కోట్లు కేటాయించినప్పటికీ పూర్తి స్థాయిలో వినియోగించలేదని విమర్శించారు. బీసీలకు ఇచ్చిన హామీల మేరకు బాకీ ఉన్న నిధులతో కలిపి ఈసారి బడ్జెట్‌లో ₹60 వేల కోట్లు కేటాయించాలని, కేటాయింపులు అంకెలకే పరిమితం కాకుండా బీసీ జనాభా అభివృద్ధి, సంక్షేమానికి పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలని కోరారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటే బీసీ స్టడీ సర్కిళ్లు, కొత్త గురుకులాలు, ప్రత్యేక పాఠశాలలు, కులవృత్తుల కార్పొరేషన్లు, ప్రోత్సాహక పథకాలు అమలు చేయాలని, పల్లెలు–పట్టణాల్లో బీసీ ఐక్యత భవనాలు నిర్మించాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీసీ మేధావులు, యువత, కార్మికులు, రైతులు పోరాటానికి సిద్ధమవుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు జాల బిక్షపతి, పుల్లూరి రవి, బద్ద వెంకటి, మోతే నర్సింలు, బద్ద నాంపెల్లి, నీరటి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడుజాటోత్ హుస్సేన్ నాయక్ ఖమ్మం రాక

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతూ హుస్సేన్ నాయక్ ఆదివారం ఖమ్మం జిల్లాకు రానున్నారు. ఈ విషయాన్ని ఖమ్మం రూరల్ బీజేపీ మండల అధ్యక్షులు జాటోతూ మధు నాయక్ ఒక ప్రకటనలో వెల్లడించారు. వెలుగుమట్ల భూదాన్ బాధితులను పరామర్శించేందుకు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతూ హుస్సేన్ నాయక్ ఖమ్మం పర్యటనకు వస్తున్నట్లు తెలిపారు. ఇల్లు కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితుల పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకుని, వారి సమస్యలను పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పర్యటనలో బాధితులతో సమావేశమై వారి నుంచి వివరాలు సేకరించి, తగిన నివేదికను ఉన్నత స్థాయికి సమర్పించే అవకాశం ఉందని మధు తెలిపారు.

అన్నమయ్య

అవ్వాతాతల ముంగిటకే ‘ఎన్టీఆర్ పింఛన్ భరోసా’!

తిరుపతి జిల్లా చిట్వేల్ మండలం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఎన్టీఆర్ పింఛన్ భరోసా’ పథకం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందని చిట్వేల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాకర్ల నాగార్జున నాయుడు పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని మార్గోపల్లి, మైలపల్లి గ్రామ పంచాయతీల్లో ఆయన సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లను అందజేశారు.ఈ సందర్భంగా నాగార్జున నాయుడు మాట్లాడుతూ.. వృద్ధులు, వితంతువుల కష్టాలను గుర్తించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, వారు ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవంగా జీవించాలనే ఉద్దేశంతో పింఛన్ మొత్తాన్ని రూ. 4,000 కు పెంచారని కొనియాడారు. “ఒకటో తేదీనే, అది కూడా లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి అధికారులు పింఛన్ సొమ్మును అందజేయడం శుభపరిణామం. గత ప్రభుత్వంలో పింఛన్ కోసం గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది, కానీ ఇప్పుడు ఆ ఇబ్బందులు తొలిగాయి” అని ఆయన స్పష్టం చేశారు.తమ గుమ్మం వద్దకే వచ్చి రూ. 4 వేల పింఛన్ అందజేయడం పట్ల వృద్ధులు, వితంతువులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బాలు రామాంజనేయులు, క్లస్టర్ ఇంచార్జ్ వెంకటేష్ రాజు, కో-క్లస్టర్ ఇంచార్జ్ కట్టా గిరిబాబు పాల్గొన్నారు.మార్గోపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు సుదీర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దేరంగుల భాను ప్రకాష్, చిట్వేల్ గ్రామ కమిటీ అధ్యక్షుడు పగడాల వెంకటేష్, స్కూల్ కమిటీ చైర్మన్ శంకర్ రాజు మరియు సచివాలయ సిబ్బంది విజయలక్ష్మి, కిరణ్, శివకుమార్, సువర్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు భరోసా కల్పించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఒక రోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కార్యక్రమం

ఆత్మకూరు శాసనసభ్యులు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మహత్యులు గౌ. శ్రీ ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాల మేరకు ఒక రోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కార్యక్రమం లో పడమటి నాయుడుపల్లి బీసీ కాలనీ గ్రామం లో పాల్గొన్న మర్రిపాడు మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ పడచల శ్రీనివాసులు యాదవ్, ప్రజలు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఆత్మకూరు తెలుగు యువత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అలాగే రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి సూచనలతో ఈరోజు నెల్లూరు పాలెం 23 వ వార్డు)లో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మకూరు తెలుగు యువత మాజీ అధ్యక్షులు, నెల్లూరు పాలెం తెలుగుదేశం పార్టీ నాయకుడు చెరుకురు తిరుపతి నాయుడు మరియు సచివాలయం సిబ్బంది అడ్మిన్ మాధవి, వీఆర్వో ప్రతాప్.

అనకాపల్లి

సైన్స్ ప్రాజెక్టులతో ఆకట్టుకున్న విద్యార్థులు – రేవు పోలవరం హై స్కూల్ లో జాతీయ సైన్స్ దినోత్సవం..!

అనకాపల్లి జిల్లా, ఫిబ్రవరి 28 (పున్నమి న్యూస్ ప్రతినిధి – ఆనంద్): ఎస్. రాయవరం మండలం రేవు పోలవరం జడ్.పీ.హెచ్.ఎస్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం హెచ్‌.ఎమ్‌. అరుణ గారి ఆధ్వర్యంలో జరిగింది. సైన్స్ టీచర్లు కుర్మారావు, ప్రవీణ్ కుమార్ మరియు ఇతర ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులు వివిధ సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించారు. విద్యార్థులు తమ సృజనాత్మకతను, శాస్త్రీయ ఆలోచనలను ప్రతిబింబించే ప్రాజెక్టులను రూపొందించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా హెచ్‌.ఎమ్‌. అరుణ గారు మాట్లాడుతూ C. V. Raman గారి “రామన్ ఎఫెక్ట్” గురించి వివరించి, విద్యార్థులు శాస్త్రీయ వైఖరి మరియు శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండాలని సూచించారు. శాస్త్ర విజ్ఞానం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

అమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి: నాయకుల డిమాండ్

ముస్తాబాద్, ఫిబ్రవరి 28 . పున్నమి ప్రతినిధి ముస్తాబాద్ మండల కేంద్రంలో అమాలి (హమాలి) కార్మికుల సమస్యల పరిష్కారార్థం సమావేశం నిర్వహించారు. అమాలి కార్మికులకు ప్రత్యేకంగా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటైతే కార్మికులకు సంక్షేమ పథకాలు సులభంగా అందుబాటులోకి వస్తాయని, వారి సమస్యలు సమర్థవంతంగా పరిష్కారమవుతాయని తెలిపారు. చెమటోడ్చి కష్టపడి జీవనం సాగించే అమాలి కార్మికులకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. అమాలి కార్మికులకు 50 సంవత్సరాలు నిండిన వెంటనే నెలకు ₹5,000 పెన్షన్ ఇవ్వాలని, ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు ₹10 లక్షల పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఇల్లు లేని నిరుపేద కార్మికులకు గృహాలు నిర్మించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అమాలి కార్మికుల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పథకాలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎగమాటి ఎల్లారెడ్డి, సీఐటీయూ నాయకులు ఎలిగంటి రాజశేఖర్, తెలంగాణ బిల్డింగ్ & అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు గీస బిక్షపతి, ముస్తాబాద్ మండల అమాలి కార్మికుల అధ్యక్షుడు నరేష్, రమేష్, చినుగురు దేవయ్య, యాదగిరి, నరసింహులు, సంజీవ్, ఎడ్ల రమేష్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

ముందస్తుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు – పెన్షన్ దారుల ముఖాల్లో చిరునవ్వులు..!

అనకాపల్లి జిల్లా, ఫిబ్రవరి 28 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్): మార్చి 1వ తేది ఆదివారం కావడంతో, పెన్షన్ దారులు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యగా ఫిబ్రవరి 28వ తేదీనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. ఏటికొప్పాక ప్రాంతంలో కూటమి నాయకులు మరియు సచివాలయ సిబ్బంది సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. పెన్షన్ దారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముందస్తు పంపిణీతో వృద్ధులు, దివ్యాంగులు సహా లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. “సమయానికి పెన్షన్ అందడం మా కుటుంబానికి ఎంతో ఉపశమనంగా ఉంటుంది” అని పలువురు లబ్ధిదారులు పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల స్థానిక ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు. సామాజిక భద్రత పథకాల అమలులో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ చర్య మరోసారి స్పష్టం చేసింది.

ఖమ్మం

వెలుగు మట్ల భూదాన్ హిస్టరీ

ఆచార్య వినోబా భవే ఆశయాలకి ఆశయాలకి ఆకార్షితులు అయినా భూ స్వామి రాయల కోటేశ్వరరావు ఖమ్మం జిల్లా వెలుగు మట్ల లో 62 ఎకరాలు భూమి ని భూ దాన్ బోర్డు కి అప్పగించారు. కాల క్రమం. లో భూమి విలువ పెరగడం తొ అక్రమార్కులు తప్పుడు పత్రలతో ఆ భూములని అమ్మారు. సొంత ఇంటి కల తొ సామాన్యులు కొని ఇల్లు కట్టుకున్నారు. ప్రభుత్వం కోర్టు కి వెళ్లగా అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు అని స్టే విధించింది. దీంతో అధికారులు నిర్మాణాలని తొలగిస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.