Tuesday, 28 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బద్దెవోలు క్రాస్‌లో అగ్ని ప్రమాదం – బాధిత కుటుంబానికి టిడిపి నేత సానే వెంకటరమణయ్య సాయం

ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి). మనుబోలు మండలం బద్దెవోలు క్రాస్ రోడ్‌లోని సంగమేశ్వర గిరిజన కాలనీలో శనివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. యాకసిరి రత్నం ఇంటిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. కట్టుబట్టలు, నిత్యావసర సరుకులు, రూ.10 వేల నగదు కాలిపోయి సుమారు రూ.30 వేల నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. సమాచారం తెలుసుకున్న టిడిపి నేత సానే వెంకటరమణయ్య బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేసి ఆదుకున్నారు. కార్యక్రమంలో శివుడు, రాజా గౌడ్, జితేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

పీఎం శ్రీ జెడ్‌పీ హైస్కూల్‌లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 39వ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు బి. దుర్గారాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.కార్యక్రమం ప్రారంభంలో భారత ప్రముఖ శాస్త్రవేత్త సివి రామన్పూ లమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, సి.వి. రామన్ 1928లో కనుగొన్న ‘రామన్ ఎఫెక్ట్’ స్మారకార్థం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు. ఈ ఆవిష్కరణకు గాను ఆయనకు 1930లో నోబెల్ బహుమతి లభించిందని పేర్కొన్నారు. శాస్త్రీయ దృక్పథం ప్రతి విద్యార్థి ఆలోచనా విధానంలో భాగం కావాలని సూచించారు.సీనియర్ ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు చిన్న వయస్సు నుంచే విజ్ఞాన దృక్పథంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్రస్థాయి సైన్స్ పోటీలకు ఎంపికైన జీవశాస్త్ర ఉపాధ్యాయులు ఏ. శివన్నారాయణ గౌడ్ మాట్లాడుతూ, “విజ్ఞానంలో మహిళలు వికసిత భారత్‌కు దారితీసే శక్తి” అనే థీమ్ ద్వారా మహిళా శాస్త్రవేత్తల పాత్రను ప్రోత్సహించడం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని “ఉమెన్ ఇన్ సైన్స్” అంశంపై వ్యాసరచన, వక్తృత్వం, సైన్స్ రంగోలి పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.రాష్ట్ర స్థాయి సైన్స్ సమగ్ర మహోత్సవానికి ఎంపికైన ఉపాధ్యాయులు శివన్నారాయణ గౌడ్‌ను సన్మానించారు. సైన్స్ పోటీలలో విజేతలైన విద్యార్థులకు పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. సమగ్ర మహోత్సవంలో పాల్గొన్న 80 మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, మెమెంటోలు అందించారు.ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

తిరుపతి

విద్యుత్ బారిన పడి రైతు మృతి… కుటుంబంలో తీవ్ర విషాదం

మండల పరిధిలోని పత్తిగుంట వారి పల్లెకు చెందిన రాఘవ నరసరాజు (59) శనివారం మధ్యాహ్నం విషాదకర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయారు. తన వ్యవసాయ పొలంలోని నిమ్మ తోటకు నీరు పట్టేందుకు మోటార్ ఆన్ చేయడానికి వెళ్లిన ఆయన, లైన్ నుంచి మోటార్‌కు వెళ్లే విద్యుత్ తీగ కిందపడిన విషయాన్ని గమనించకపోవడంతో విద్యుత్ షాక్‌కు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న నరసరాజు ఆకస్మిక మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి రైతు కుటుంబాన్ని తక్షణమే ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

తిరుపతి

జాతీయ సైన్స్ దినోత్సవం వేడుకల్లో శ్రీ సాయి వికాస్ పాఠశాల విద్యార్థుల ప్రతిభా ప్రదర్శన

జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిట్వేలిలోని శ్రీ సాయి వికాస్ పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ప్రదర్శన విద్యార్థుల ప్రతిభకు వేదికగా నిలిచింది. చిన్నారులు తమ సృజనాత్మక ఆలోచనలను వినూత్న ప్రయోగాల రూపంలో ఆవిష్కరించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని విద్యాసంస్థల అధ్యక్షులు తిరుమల రెడ్డమ్మ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం సర్ సి.వి. రామన్ చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నిత్యజీవితంలోని ప్రతి అంశం సైన్స్‌తో ముడిపడి ఉందని, చిన్న వయసులోనే శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవడం అవసరమని సూచించారు. ప్రాథమిక విభాగం బాధ్యులు మాధవి మాట్లాడుతూ చిన్నారులు ఎంతో ఉత్సాహంతో ప్రదర్శనలు సిద్ధం చేయడం అభినందనీయమన్నారు. నాలుగో తరగతి విద్యార్థినులు పప్పుధాన్యాలతో మానవ దేహంలోని అవయవాలను రూపకల్పన చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వర్షపు నీటి సంరక్షణ, వినియోగంపై రూపొందించిన నమూనాలు కూడా సందర్శకులను ఆలోచింపజేశాయి. కార్యక్రమంలో నువ్వల శ్రీనివాసులు, యం. రమణ, వరలక్ష్మి, ప్రియాంక, ధనలక్ష్మి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రతిభకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. Uploaded Video:

అన్నమయ్య

చిట్టి చేతుల.. ‘విజ్ఞాన’ అద్భుతాలు!

జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం చిట్వేలిలోని శ్రీ సాయి వికాస్ పాఠశాల లో విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ నమూనాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారులు తమ చిట్టి చేతులతో రూపొందించిన ప్రయోగాలు చూపర్లను మంత్రముగ్ధులను చేశాయి. తొలుత విద్యాసంస్థల అధ్యక్షురాలు తిరుమల రెడ్డమ్మ జ్యోతి ప్రజ్వలన చేసి, నోబెల్ విజేత సర్ సి.వి.రామన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ నమూనాలు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని చాటిచెప్పాయి. ముఖ్యంగా నాల్గవ తరగతి విద్యార్థినులు **పప్పుధాన్యాలను ఉపయోగించి మానవ దేహంలోని అవయవాలను** తీర్చిదిద్దిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. వర్షపు నీటి నిల్వ పర్యావరణ పరిరక్షణ, నిత్యజీవితంలో సైన్స్ ప్రాముఖ్యతను వివరించే పలు ప్రయోగాలు సందర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ప్రధానోపాధ్యాయులు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. నిత్యజీవితంలో ప్రతి అంశం సైన్స్‌తో ముడిపడి ఉంటుందని, ఇలాంటి ప్రదర్శనల వల్ల విద్యార్థుల్లో పరిశోధనాత్మక ఆలోచనలు పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రైమరీ విభాగం బాధ్యులు మాధవి మాట్లాడుతూ.. చిన్న పిల్లలు సైతం ఎంతో ఉత్సాహంగా ఈ ప్రదర్శనలో పాల్గొనడం సంతోషకరమన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నువ్వల శ్రీనివాసులు, ఎం. రమణ, వరలక్ష్మి, ప్రియాంక, ధనలక్ష్మి, లక్ష్మి మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అన్నమయ్య

నిమ్మతోటలో విషాదం.. విద్యుత్ షాక్‌తో రైతు మృతి

నిరంతరం కష్టపడి సాగు చేసే రైతును విద్యుత్ రూపంలో మృత్యువు కబళించింది. చిట్వేలి మండల పరిధిలోని పత్తిగుంటవారిపల్లెకు చెందిన రైతు రాఘవ నరసరాజు (59) శనివారం విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామస్థుల కథనం మేరకు.. రాఘవ చంగల్‌రాజు కుమారుడైన నరసరాజు శనివారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో తన పొలంలోని నిమ్మతోటకు నీరు కట్టేందుకు వెళ్లారు. విద్యుత్ మోటార్ ఆన్ చేసే క్రమంలో, లైన్ పైనుంచి మోటార్‌లోకి వెళ్లే వైరు తెగి కింద పడి ఉండటాన్ని ఆయన గమనించలేదు. ప్రమాదవశాత్తు ఆ వైరు తగలడంతో విద్యుత్ షాక్ తగిలి ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. పొలం వద్దకు వెళ్లిన తోటి రైతులు గమనించేసరికే ఆయన ప్రాణాలు కోల్పోయారు.మృతుడు నరసరాజుకు భార్య, ఇద్దరు కుమార్తెలు మరియు ఒక కుమారుడు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. మృతదేహం వద్ద కుటుంబ సభ్యుల రోదనలు హృదయ విదారకంగా మారాయి. ప్రమాదవశాత్తు జరిగిన ఈ సంఘటనపై గ్రామస్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సాగు పనుల్లో ఉండగా ప్రాణాలు కోల్పోయిన నరసరాజు కుటుంబాన్ని ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలని, తక్షణమే ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని పత్తిగుంటవారిపల్లె గ్రామస్థులు మరియు రైతు సంఘం నాయకులు కోరుతున్నారు.

కడప

28 న పెన్షన్ పంపిణీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతినెలా అందిస్తున్న పెన్షన్ను ఒకరోజు ముందుగానే అందించారు మార్చి నెల గాను అందించవలసిన వికలాంగులు వితంతువులు మరియు వయోవృద్ధుల పెన్షన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు ముందు గానే అందించడం తో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు

రాజన్న సిరిసిల్ల

బీసీలకు ₹60 వేల కోట్లు కేటాయించాలి: శీలం స్వామి డిమాండ్

ముస్తాబాద్ము ఫిబ్రవరి పున్నమి ప్రతినిధి బడ్జెట్‌లో బీసీలకు ₹60 వేల కోట్లు కేటాయించి, బీసీ సబ్ ప్లాన్‌ను తక్షణమే అమలు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీలం స్వామి డిమాండ్ చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో కామారెడ్డిలో నిర్వహించిన బీసీ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి, ప్రతి ఏడాది ₹20 వేల కోట్లు కేటాయించి ఐదు సంవత్సరాల్లో ₹1 లక్ష కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం ₹9 వేల కోట్లు కేటాయించి అందులో కేవలం ₹5 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, తరువాతి ఏడాది ₹11 వేల కోట్లు కేటాయించినప్పటికీ పూర్తి స్థాయిలో వినియోగించలేదని విమర్శించారు. బీసీలకు ఇచ్చిన హామీల మేరకు బాకీ ఉన్న నిధులతో కలిపి ఈసారి బడ్జెట్‌లో ₹60 వేల కోట్లు కేటాయించాలని, కేటాయింపులు అంకెలకే పరిమితం కాకుండా బీసీ జనాభా అభివృద్ధి, సంక్షేమానికి పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలని కోరారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటే బీసీ స్టడీ సర్కిళ్లు, కొత్త గురుకులాలు, ప్రత్యేక పాఠశాలలు, కులవృత్తుల కార్పొరేషన్లు, ప్రోత్సాహక పథకాలు అమలు చేయాలని, పల్లెలు–పట్టణాల్లో బీసీ ఐక్యత భవనాలు నిర్మించాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీసీ మేధావులు, యువత, కార్మికులు, రైతులు పోరాటానికి సిద్ధమవుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు జాల బిక్షపతి, పుల్లూరి రవి, బద్ద వెంకటి, మోతే నర్సింలు, బద్ద నాంపెల్లి, నీరటి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడుజాటోత్ హుస్సేన్ నాయక్ ఖమ్మం రాక

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతూ హుస్సేన్ నాయక్ ఆదివారం ఖమ్మం జిల్లాకు రానున్నారు. ఈ విషయాన్ని ఖమ్మం రూరల్ బీజేపీ మండల అధ్యక్షులు జాటోతూ మధు నాయక్ ఒక ప్రకటనలో వెల్లడించారు. వెలుగుమట్ల భూదాన్ బాధితులను పరామర్శించేందుకు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతూ హుస్సేన్ నాయక్ ఖమ్మం పర్యటనకు వస్తున్నట్లు తెలిపారు. ఇల్లు కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితుల పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకుని, వారి సమస్యలను పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పర్యటనలో బాధితులతో సమావేశమై వారి నుంచి వివరాలు సేకరించి, తగిన నివేదికను ఉన్నత స్థాయికి సమర్పించే అవకాశం ఉందని మధు తెలిపారు.

అన్నమయ్య

అవ్వాతాతల ముంగిటకే ‘ఎన్టీఆర్ పింఛన్ భరోసా’!

తిరుపతి జిల్లా చిట్వేల్ మండలం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఎన్టీఆర్ పింఛన్ భరోసా’ పథకం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందని చిట్వేల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాకర్ల నాగార్జున నాయుడు పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని మార్గోపల్లి, మైలపల్లి గ్రామ పంచాయతీల్లో ఆయన సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లను అందజేశారు.ఈ సందర్భంగా నాగార్జున నాయుడు మాట్లాడుతూ.. వృద్ధులు, వితంతువుల కష్టాలను గుర్తించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, వారు ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవంగా జీవించాలనే ఉద్దేశంతో పింఛన్ మొత్తాన్ని రూ. 4,000 కు పెంచారని కొనియాడారు. “ఒకటో తేదీనే, అది కూడా లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి అధికారులు పింఛన్ సొమ్మును అందజేయడం శుభపరిణామం. గత ప్రభుత్వంలో పింఛన్ కోసం గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది, కానీ ఇప్పుడు ఆ ఇబ్బందులు తొలిగాయి” అని ఆయన స్పష్టం చేశారు.తమ గుమ్మం వద్దకే వచ్చి రూ. 4 వేల పింఛన్ అందజేయడం పట్ల వృద్ధులు, వితంతువులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బాలు రామాంజనేయులు, క్లస్టర్ ఇంచార్జ్ వెంకటేష్ రాజు, కో-క్లస్టర్ ఇంచార్జ్ కట్టా గిరిబాబు పాల్గొన్నారు.మార్గోపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు సుదీర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దేరంగుల భాను ప్రకాష్, చిట్వేల్ గ్రామ కమిటీ అధ్యక్షుడు పగడాల వెంకటేష్, స్కూల్ కమిటీ చైర్మన్ శంకర్ రాజు మరియు సచివాలయ సిబ్బంది విజయలక్ష్మి, కిరణ్, శివకుమార్, సువర్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు భరోసా కల్పించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.