Tuesday, 28 April 2026

Blog

గూడూరు

ఎస్.కె.ఆర్ డిగ్రీ కళాశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవం

గూడూరు @ 28 ఫిబ్రవరి స్థానిక ఎస్ కే ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. సింహాద్రి, కార్యక్రమ నిర్వాహకులు శ్రీధర్ శర్మ, ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎక్సైజ్ ఎస్సై పి. మహేష్, అధ్యాపకులు డాక్టర్ కే. శివప్రసాద్ తదితరులు మాట్లాడుతూ భారతదేశపు ఘనమైన శాస్త్రీయ వారసత్వాన్ని ప్రపంచంలో సగర్వంగా నిలిపిన మహనీయుడు స్వర్గీయ డాక్టర్ సి.వి. రామన్ అని, ఫిబ్రవరి 28న ‘రామన్ ఎఫెక్ట్’ ఆవిష్కరించిన సందర్భాన్ని పురస్కరించుకుని జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని రామన్ జీవిత విశేషాలను కొనియాడారు. 1888 నవంబరు 7న తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించిన రామన్ చిన్నతనం నుంచే విజ్ఞాన శాస్త్రంపై మక్కువ పెంచుకున్నారని, ప్రభుత్వ ఉద్యోగంలో చేరినప్పటికీ, అన్వేషణే శ్వాసగా పరిశోధనల పట్ల తపన తో కలకత్తాలోని ‘ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్’ లో రాత్రింబవళ్లు శ్రమించి అద్భుత ప్రయోగాలు చేశారని, సముద్రపు నీరు నీలిరంగులో ఎందుకు కనిపిస్తుందనే జిజ్ఞాసతో ప్రారంభమైన ఆయన అన్వేషణ ‘రామన్ ఎఫెక్ట్’ ఆవిష్కరణకు దారితీసిందని, కాంతి కిరణాలు పారదర్శకమైన ఘన, ద్రవ, వాయు మాధ్యమాల గుండా ప్రసరించినప్పుడు వాటి స్వభావంలో వచ్చే మార్పును ఆయన నిరూపించారని, ఈ ఆవిష్కరణ రసాయన శాస్త్రం, స్పెక్ట్రోస్కోపీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని, 1930లో భౌతికశాస్త్రంలో నోబెల్ అందుకున్న తొలి ఆసియావాసిగా రామన్ రికార్డ్ సృష్టించాడని, దేశ అత్యున్నత పురస్కా రమైన భారతరత్నతో పాటు లెనిన్ శాంతి బహుమతినీ పొందారని, బెంగళూరులో ‘రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ స్థాపించి శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి కృషి చేశారని, విజ్ఞాన శాస్త్రం నిత్యజీవితంలో భాగమని, రామన్ వంటి మహనీయుల స్ఫూర్తితో నేటి విద్యార్థులు నూతన ఆవిష్కరణల వైపు ప్రయత్నం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులుతో పాటు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ గూడూరు వారి ఆధ్వర్యంలో ‘మత్తుపదార్థాలు – అవగాహన’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై పి. మహేష్ నేటి యువత మత్తు పదార్థాల బారిన పడకుండా వాటికి దూరంగా ఉండాలని జీవిత విలువలు గురించి విద్యార్థినీ విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.

సూర్యాపేట

సూర్యాపేటలో స్కానింగ్ సెంటర్ సీజ్

సూర్యాపేట: సూర్యాపేటలో ఆపిల్ డయాగ్నోస్టిక్ అండ్ స్కాన్ సెంటర్ లో నిబందనలకు విరుద్ధంగా ప్రాక్టీస్ చేస్తున్న ఒక డాక్టర్ పై హైకోర్టు ఆదేశాల మేరకు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ విచారణ జరిపారు. ఆ నివేదిక ఆధారంగా, జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు శనివారం స్కాన్ సెంటర్ ను సీజ్ చేశారు. జిల్లాలో అక్రమ స్కాన్ కేంద్రాల పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

తిరుపతి

ఐటీ శాఖ మంత్రికి విశాఖలో వీడ్కోలు పలికిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 28: శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అనకాపల్లి జిల్లాలో బ్లూ జెట్ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించుకుని, విశాఖపట్నం నుండి విజయవాడకు తిరుగు ప్రయాణమవుతున్న యువనేత, విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కి విశాఖ విమానాశ్రయంలో వీడ్కోలు పలకడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ…. ప్రజా సేవలో నిరంతరం బిజీగా ఉండే మంత్రి లోకేష్ తో గడిపిన ఈ కొద్దిపాటి సమయం ఎంతో ఉత్సాహాన్ని నింపిందని ముఖ్యంగా గత మూడు రోజులుగా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో జరిగిన క్రికెట్ మ్యాచ్‌ల గురించి ఇద్దరం ఎంతో సరదాగా చర్చించుకోవడం జరిగిందని మైదానంలో బ్యాట్ పట్టినప్పటి విశేషాలు, అక్కడ చోటుచేసుకున్న సరదా సన్నివేశాల గురించి మాట్లాడుకుంటుంటే సమయమే తెలియలేదన్నారు. రాజకీయాల్లో ఎంతటి ఒత్తిడి ఉన్నా, అప్పుడప్పుడు ఇలాంటి ఆత్మీయ పలకరింపులు, సరదా ముచ్చట్లు కొత్త ఉత్తేజాన్ని ఇస్తాయని అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో లోకేష్ చూపిస్తున్న అంకితభావం తనకు ఎప్పుడూ ఒక గొప్ప స్ఫూర్తిగావుంటుందని ప్రజల కోసం నిరంతరం పరితపించే మా మధ్య సాగిన ఈ భేటీ ఎంతో సందడిగా, ఆత్మీయంగా ముగిసిందని ఎమ్మెల్యే ఎంతో ఆనందంతో పేర్కొన్నారు.

తిరుపతి

మర్రిమందలో పెన్షన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే సతీమణి రిషితా రెడ్డి

ఏర్పేడు పున్నమి న్యూస్, ఫిబ్రవరి 28: ఏర్పేడు మండలం మర్రిమంద పంచాయతీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. మండల పార్టీ అధ్యక్షుడు పేరం నాగరాజు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి ముఖ్య అతిథిగా విచెసారు. ఆమెకు పార్టీ శ్రేణులు, గ్రామస్తులు బ్యాండ్ సెట్ వాయిద్యాలు, టపాకాయలతో ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులతో ఆహ్వానించారు. ఈ సందర్భంగా రిషితా రెడ్డి మాట్లాడుతూ…. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆదివారం సెలవు కారణంగా లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా ఒకరోజు ముందుగానే శనివారం నాడు పెన్షన్ల పంపిణీ చేపట్టామన్నారు. కూటమి ప్రభుత్వంలో రేషన్ పంపిణీలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని, నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు లబ్ధిదారులు తమకు అనుకూల సమయంలో రేషన్ పొందే వెసులుబాటు కల్పించామని ప్రభుత్వం బియ్యం, జొన్నలు, చక్కెర అందిస్తున్నట్లు ఆమె వివరించారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.4.5 కోట్ల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయగా, ఏర్పేడు మండలంలోనే దాదాపు కోటి రూపాయల సాయం అందిందని గుర్తు చేశారు. అనంతరం మల్లాడి డ్రగ్స్ కంపెనీ సహకారంతో మర్రిమంద ఎస్సీ కాలనీకి చెందిన వెంకటేష్‌కు మూడు చక్రాల ఎలక్ట్రిక్ సైకిల్‌ను అందజేశాసి జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ప్రదర్శనను తిలకించి అభినందించారు. మండల అధ్యక్షుడు పేరం నాగరాజు నాయుడు మాట్లాడుతూ…..ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కార్యకర్తలంతా నిరంతరం ప్రజాసేవలో ఉన్నారని మండలంలో జాతీయ రహదారుల నుంచి పంచాయతీ రోడ్ల వరకు అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ప్రతి గ్రామంలో ఆర్‌వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

తిరుపతి

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 28: శ్రీకాళహస్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయలో పనిచేయుచున్న లోకనాథం మాతృమూర్తి ఇటీవల ఆకస్మికంగా మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి శనివారం నాడు లోకనాథం నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి లోకనాథం మాతృమూర్తి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూర్ తారక శ్రీనివాసులు, తిరుపతి శ్రీకాళహస్తి పార్లమెంట్ పరిశీలకులు ఓడూరు గిరిధర్ రెడ్డి, ఎస్సీ సెల్ నియోజకవర్గ ప్రెసిడెంట్ పసల కృష్ణయ్య,డాక్టర్ వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ శంకర్, నియోజకవర్గ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ పఠాన్ ఫరీద్, బుల్లెట్ జై శ్యామ్ రాయల్, కంఠా ఉదయ్ కుమార్, శ్రీవారి సురేష్, జూమ్లేష,మెహబూబ్ భాష, ఆరిఫ్, జిలాని, అస్లాం,సర్పంచ్ ముద్దుమూడి రవి, గుణ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

8వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొజ్జల

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 28: శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పట్టణంలోని 8వ వార్డులో ముందస్తు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పేదలకు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేయడం జరిగిందని పేదలకు, వృద్దులకు, వికలాంగులకు, ఆర్తులకు ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందంజలో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వన్నీకుల క్షత్రియ డైరెక్టర్ మిన్నల రవి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సలహా మండలి సభ్యులు ఎం సుబ్బయ్య, రాష్ట్ర బీసీ విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ ఉమేష్ రావు, పట్టణ అధ్యక్షులు విజయకుమార్, బిఎల్ఎ కె సుజాత, కో యూనిట్ ఇంచార్జ్ సి సుజాత, పార్టీ నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజలు పాల్గొని జయప్రదం చేయడం జరిగినది.

తిరుపతి

సైన్స్ మానవాభివృద్ధికి మూలం-తలపా దామోదరం రెడ్డి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 28: శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల్ వద్ద వున్నా శ్రీ చైతన్య పాఠశాల ప్రాంగణంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రూపా దేవి, ఆధ్వర్యంలో సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ విజ్ఞాన ప్రదర్శనలో శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. సైన్స్ అనేది మానవుల అభివృద్ధికి మూలంమని విద్యార్థులు సైన్స్ పట్ల మక్కువ పెంచుకొని, భవిష్యత్ అవసరాలు దృష్ట్యా ప్రతి ఒక్క విద్యార్థి ప్రయోగాలు చేపట్టి భవిష్యత్తుకు అందజేయాలన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతో….విద్యార్థులు కేవలం విద్యలోనే కాక మానవతా విలువల పట్ల, వారి ఆరోగ్యం పట్ల చైతన్య పరుస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బీజాలు వేస్తూ కృషి చేస్తున్నారని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, శ్రీకాళహస్తి పట్టణ యువజన అధ్యక్షులు ఆంటోనీ, ముని కృష్ణయ్య, నాగరాజు, మహేష్, చరణ్, జోసెఫ్, అల్లావుద్దీన్ మరియు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

మంత్రి నాదెండ్లతో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థాన చైర్మన్

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 28: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం పాలక మండలి అద్యక్షులు కొట్టేసాయి ప్రసాద్ తిరుపతి పార్లమెంట్ పర్యటన నిమిత్తం తిరుపతికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాలు ఆహారం, వినియోగదారుల వ్యవహారాల మంత్రి, జనసేన పార్టీ PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు పగడాల మురళి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి

ఐసర్ విజ్ఞాన ప్రదర్శనలో పాల్గొన్న శ్రీకాళహస్తి ది స్కూల్ విద్యార్థులు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 28: శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన ది స్కూల్ విద్యార్థులు సైన్స్ దినోత్సవం సందర్భంగా శనివారం నాడు భారతీయ విజ్ఞాన శిక్షణ, పరిశోధన సంస్థ,(IISER) తిరుపతి చే ఏర్పాటు చేసిన విజ్ఞాన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో దేశంలోని వివిధ యూనివర్సిటీ, కళాశాల విద్యార్థుల ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. విజ్ఞాన శాస్త్రానికి అనుబంధమైన రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, బయాలజీ, గణిత పాఠ్యాంశానికి సంబంధించిన అనేక ప్రత్యేకమైన ప్రదర్శనలు ఉపయుక్తంగా ఉన్నాయని భవిష్యత్తు ఉన్నత విద్యకు తమకు మార్గదర్శనంగా ఉన్నాయన్నారు. ఐసర్ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థను సందర్శించడం తమకు ఎంతో ఆనందంగా విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పి.విశాల, విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

తిరుపతి

దర్జీ సోదరులు ఐక్యతతో ముందుకు సాగాలి – ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 28: శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 28: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముత్యాలమ్మ గుడి వీధి కోర్టు సమీపంలో ఉన్న టైలర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం వద్ద టైలర్స్ డే సందర్భంగా నిర్వహించిన వేడుకలలో హాజరైనారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, టైలర్స్ కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని అనంతరం టైలర్ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ….గతంలో తన తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో టైలర్లు పెద్ద వారుగా గుర్తించి, ప్రతి టైలర్ సోదరుడికి సొంతిల్లు కల్పించాలని సంకల్పించి గోపాలకృష్ణారెడ్డి బృందావన టైలర్ కాలనీలో ఇళ్ల స్థలాలు మంజూరు చేసిన విషయాన్ని స్మరించుకున్నారు. టైలర్ సోదర సోదరీమణులు నైపుణ్యాభివృద్ధి సాధించి, ఐక్యతతో ముందుకు సాగాలని సూచించారు. టైలర్స్ సంక్షేమానికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం ట్రైలర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారిని పూలమాలవేసి దృశ్యాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులు తోట్టాంబేడు బాలయ్య, ఉపాధ్యక్షులు చెంజి సుబ్రహ్మణ్యం (మణి), మౌలా, రమేష్, కార్యదర్శి చెంగయ్య, ఖజాంచీ చరణ్ టైలర్, గౌరవ కమిటీ సభ్యులు పోలూరు శ్రీనివాసులు రెడ్డి, జీవి అమర్నాథ్ తదితరులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిధులు లీగల్ అడ్వైజర్ కండ్రిగ ఉమా, పట్టణ టీడీపీ అధ్యక్షులు విజయ్ కుమార్, మునిరాజు నాయుడు, చెంచయ్య నాయుడు, అంజూరు చక్రధర్ (జనసేన నాయకులు) తదితరులు పాల్గొన్నారు. టైలర్ సోదర సోదరీమణులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.