Tuesday, 28 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నందిపాడు లో జనసేన ఉద్యమి కార్యక్రమం పాల్గొన్న ఉదయగిరి ఇంచార్జి కొట్టె వెంకటేశ్వర్లు

​దుత్తలూరు 1-3-2026 స్థానిక నందిపాడు గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ‘ఉద్యమి’ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ కొట్టె వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో జనసేన కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. : కొట్టె వెంకటేశ్వర్లు గ్రామస్తులతో నేరుగా మాట్లాడి, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీ ఆశయాలను, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ ‘ఉద్యమి’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు,నియోజకవర్గ అభివృద్ధి కోసం యువత రాజకీయాల్లోకి రావాలని, మార్పు కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ​”ప్రజల పక్షాన నిలబడి పోరాడటమే జనసేన లక్ష్యం. ఉదయగిరి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పార్టీని బలోపేతం చేస్తాం.” – కొట్టె వెంకటేశ్వర్లు ​కార్యక్రమంలో పాల్గొన్న వారు: ​ఈ కార్యక్రమంలో దుత్తలూరు మండల కన్వీనర్స్థా దుంపలగడ్డ రవి గారూ, మరియు జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఖమ్మం

భూదాన్ బాధితులకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నారప రాజు రామ చంద్రరావు పరామరర్శ

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) భూదాన్ నిర్వాసితులను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్ర రావు. ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవన్‌లో ఆశ్రయం పొందుతున్న వెలుగుమట్ల భూదాన్ నిర్వాసితులను నారపరాజు రామచంద్ర రావు పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితుల పరిస్థితిని స్వయంగా తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. ఇల్లు కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఓర్పుతో విన్న ఆయన, వారి సమస్యల పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేసిన ఆయన, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమం లో బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, జిల్లా ఇంచార్జి బద్దం మహిపాల్ రెడ్డి, కిసాన్రా మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండ పల్లి శ్రీధర్ష్ రెడ్డి, రాష్ట్ర మహిళ నాయకురాలు ఉప్పల శారద కోశాధికారి దేవకీ వాసు దేవారావ్, నున్న రవికుమార్, అల్లిక అంజయ్య. గుత్త వెంకటేశ్వర్లు, శ్రీమతి పమ్మి అనిత, ఇవి రమేష్ల్, వల్లల రమేష్, తదితరులు పాల్గొన్నారు Uploaded Video:

ఖమ్మం

పెనుబల్లి మండలం నాయకులగూడెంలో ఘనంగా శ్రీ పెద్దమ్మ తల్లి జాతర

ఖమ్మం ఫిబ్రవరి పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బయ్యాన్నగూడెం గ్రామ శివారు నాయకులగూడెంలో శ్రీ పెద్దమ్మ తల్లి జాతర భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. ఈ జాతర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆశ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత డాక్టర్ మట్టా దయానంద్, మండల అధ్యక్షులు పంది వెంకటేశ్వర్లు, చీకటి రామారావు నాయకులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దొంతు సత్యవతి, ఉప సర్పంచ్ కావిటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. జాతరలో భాగంగా పెద్దమ్మ తల్లి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాదం స్వీకరించారు. కార్యక్రమం భక్తి పరవశంతో, ఆధ్యాత్మిక వాతావరణంలో విజయవంతంగా జరిగినది

అనకాపల్లి

ముందస్తు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ విజయవంతం

అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక ప్రాంతంలో ఆదివారం సెలవు నేపథ్యంలో ఫిబ్రవరి 28న ముందస్తుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది సమన్వయంతో కార్యక్రమం సజావుగా సాగింది. సమయానికి పెన్షన్ అందడంతో వృద్ధులు, దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేశారు.

అనకాపల్లి

రేవు పోలవరం హై స్కూల్‌లో జాతీయ సైన్స్ దినోత్సవం

అనకాపల్లి జిల్లా రేవు పోలవరం జడ్‌పీహెచ్‌ఎస్‌లో జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా జరిగింది. హెచ్‌ఎం అరుణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు వినూత్న సైన్స్ ప్రాజెక్టులతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా C. V. రామన్ గారి రామన్ ఎఫెక్ట్‌ను వివరించి, శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవాలని సూచించారు.

ఖమ్మం

వెలుగుమట్ల భూదాన్ కూల్చివేత బాధితులపై ముమ్మర సామాజిక–ఆర్థిక సర్వే అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు – కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో ఫిబ్రవరి 24న చేపట్టిన ఆక్రమణల తొలగింపు కార్యక్రమంలో ఇండ్లు కోల్పోయిన బాధితులపై సామాజిక, ఆర్థిక సర్వే ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 21 మంది తహశీల్దార్లకు సర్వేను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు నిర్వహించిన సర్వేలో: ఖమ్మం అర్బన్ మండలానికి చెందిన వారు – 182 మంది ఖమ్మం జిల్లాలోని ఇతర మండలాలకు చెందిన వారు – 340 మంది ➡️ మొత్తం ఖమ్మం జిల్లాకు చెందిన వారు – 522 మంది ఇతర వివరాలు ఇలా ఉన్నాయి: రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు చెందిన వారు – 107 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు – 3 మంది సర్వే ప్రక్రియ కొనసాగుతోందని, పూర్తి అయిన అనంతరం అర్హులైన పేదలకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నివాస స్థల పట్టాలు మరియు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడానికి చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు. సర్వే సక్రమంగా పూర్తయ్యేందుకు సంబంధిత వ్యక్తులు తమ తమ గ్రామాల్లో అందుబాటులో ఉండి అధికారులకు సహకరించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

రంగారెడ్డి

* విద్యార్థుల్లో శ్రవణ భాషణ సామర్ధ్యాలను మెరుగుపరుస్తుంది.. — ఏఎక్సెల్ ఫర్ ఎఫ్ ఎల్ ఎన్ ఏఐ బేసెడ్ లెర్నింగ్ క్లాస్ను ప్రారంభి..ఎం ఈ ఓ-బాసు నాయక్ *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) ఫిబ్రవరి 27 : మహేశ్వరం నియోజకవర్గం, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బడంగ్‌పేట్ మరియు బాలాపూర్ డివిజన్‌లలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలలో 2024–2025 విద్యాసంవత్సరానికి గాను పదవ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రధమ స్థానం సాధించిన విద్యార్థులకు జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ సహకారంతో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం బిజెపి అధ్యక్షులు రాళ్ల గూడెం రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం బిజెపి కార్యాలయంలో నిర్వహించినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ అందెల శ్రీరాములు హాజరై ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్కులు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు ప్రోత్సాహం అందించడం అత్యంత అవసరమని విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారికి ఆర్థికంగా అండగా నిలుస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి సేవలు అభినందనీయమైనవి అని….ఈ విధమైన కార్యక్రమాలు విద్యార్థుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతాయి అని పేర్కొన్నారు. అలాగే, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదివి సమాజానికి సేవ చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో కూడా ప్రతిభావంతులైన విద్యార్థులకు అన్ని విధాలుగా సహకారం అందించేందుకు కృషి కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రావుల మల్లేష్ బిజెపి సీనియర్ నాయకులు నవారు శ్రీనివాస్ రెడ్డి, రేసు నరసింహారెడ్డి, కొంతం సంపత్ రెడ్డి, బిజెపి ఉపాధ్యక్షులు సైదులు, కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, బిజెపి నాయకులు మల్లేష్, ఆంజనేయులు యాదవ్, బీజేవైఎం నాయకులు సతీష్ నందా, శివ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

* కేంద్ర మంత్రి బండి సంజయ్ మర్యాదపూర్వకంగా కలసిన కోలన్ శంకర్ రెడ్డి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) ఫిబ్రవరి 28 : తెలంగాణ మొదటి మేయర్ ను గెలిపించి అలాగే కరీంనగర్ పార్ల మెంట్ లో భారీ సంఖ్యలో కౌన్సిలర్స్ ను గెలిపించి తెలంగాణ ప్రజలలో బిజెపి పై విశ్వాసం నింపిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ని బిజెపి రంగారెడ్డి జిల్లా రాష్ట్ర నేత కోలన్ శంకర్ రెడ్డి శాలువా కప్పి పూల బోకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ రాబోవు కాలములో తెలంగాణ లోని గ్రేటర్ హైదరాబాద్ , అలాగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థులను గెలిచే ధ్యేయంగా ప్రతి కార్యకర్త, నాయకులు సైనికులుగా సమన్వయం తో కృషి చేయాలని పిలుపునిచ్చారుఈ కార్యక్రమములో బిజెపి నాయకులు మాదన్న, నర్సింగ రావ్, జయసూర్య, జగన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ‎

ఖమ్మం

నేడు ఖమ్మం రానున్న ముప్పు వరపు వెంకయ్య నాయుడు

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) భారత మాజీ ప్రధాని భారత రత్న అటల్ బిహారి వాజ్ పాయ్ యొక్క శత జయంతి ఉత్సవ కార్యక్రమంలో లో పాల్గొనేందుకు భారత మాజీ ఉప రాష్ట్ర పతి ముప్ప వరపు వెంకయ్య నాయుడు ఖమ్మం రానున్నారు. స్థానిక వైరా రోడ్డు లోని ఎస్ ఆర్ గార్డెన్స్ లో జరుగు కార్యక్రమంలో వెంకయ్య నాయుడు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.

ఖమ్మం

వెలుగుమట్ల కూల్చివేతలపై ఈటెల రాజేందర్ ఆగ్రహం – పేదలపై అన్యాయం చేశారంటూ ప్రభుత్వంపై మండిపాటు

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్లను కోల్పోయిన బాధితులను పరామర్శించిన మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ఐదు రోజులుగా వెలుగుమట్ల ప్రజల కన్నీళ్లతో ప్రభుత్వం చలగాటం ఆడిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచే ఇదే విధానాన్ని కొనసాగిస్తోందని విమర్శించారు. జిల్లాలో కీలక పదవులు కాంగ్రెస్ చేతుల్లోనే ఉన్నప్పటికీ, ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఆశలు మూడు సంవత్సరాలకే చెదిరిపోయాయని అన్నారు. హైదరాబాద్‌లో హైడ్రా, మూసీ పేరుతో ఒకచోట కూల్చివేతలు చేస్తూ, వెలుగుమట్లలో భూదాన్ భూములు, అక్రమ గుడిసెలు అంటూ పేదల నివాసాలను నేలమట్టం చేశారని మండిపడ్డారు. భూదాన్ అంటే దానం చేసిన భూమి అని గుర్తు చేసిన ఆయన, సామాజిక సంస్కర్త వినోబా భావే వేల ఎకరాలు దానం చేసిన నేపథ్యంలో వెలుగుమట్లలోని 147, 148, 149 సర్వే నెంబర్లలో 62 ఎకరాలు భూదాన్ భూమి ఉన్నాయని తెలిపారు. గతంలో ఈ భూములపై ఎవరూ ఆసక్తి చూపకపోయినా, ఇప్పుడు భూముల విలువ పెరగడంతో ప్రభుత్వం దృష్టి పడిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం భూములు పంచడం కాదు, లాక్కోవడమే చేస్తోందని విమర్శించారు. 2019లో కోర్టు ఆదేశాల మేరకు బాధితులకు విద్యుత్, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని చెప్పినా, అప్పటి ప్రభుత్వం అమలు చేయలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం కనీస సౌకర్యాలు ఇవ్వకపోగా, ఉన్న నివాసాలనే కూల్చివేసిందని అన్నారు. పేదలపై 4000 మంది పోలీసులను మోహరించడం అవసరమా అని ప్రశ్నించిన ఆయన, 62 ఎకరాల్లో 30 ఎకరాల భూమి ఎక్కడికి వెళ్లిందో కలెక్టర్ లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూదాన్, ఇనామ్ భూముల వివరాలను బయటపెట్టాలని, పెద్దల వద్ద ఉన్న అక్రమ భూములను తిరిగి స్వాధీనం చేసుకునే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. బాధితులకు అదే స్థలంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించాలని, తక్షణ సాయంగా ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే జరిగిన తప్పుకు ముఖ్యమంత్రి నిర్బంధంగా క్షమాపణ చెప్పాలని కోరారు. పేదల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వారిపైనే అన్యాయం చేస్తోందని విమర్శించిన ఈటెల రాజేందర్, వెంటనే ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.