Thursday, 12 March 2026

Blog

ఎన్ టి ఆర్ జిల్లా

గుంతల రహదారిగా మారిన నందిగామ–రామన్నపేట మార్గం… ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

ఎన్‌టిఆర్ జిల్లా నందిగామ నుండి రామన్నపేటకు వెళ్లే ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారింది. HP పెట్రోల్ బంక్ వద్ద గ్యాస్ కంపెనీ నుంచి రామన్నపేట ఫ్లైఓవర్ వరకు… అలాగే GDMM కాలేజ్, ఉమా కాలనీ, కండ్రికఆంజనేయస్వామి గుడి మార్గంలో తారురోడ్డు కుంగిపోయి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. రోజూ ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. గుంతల్లోకి వాహనాలు జారిపడి బైకులు స్కిడ్ అవ్వడం, ప్రమాదాలు జరగడం,పలువురు గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందడం వంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వర్షాలు పడితే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ప్రజలు భయపడుతున్నారు. నీటితో నిండిన గుంతలు డ్రైవర్లకు కనిపించకపోవడంతో ప్రమాదాలు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కావున నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్ మండల కృష్ణకుమారి, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్యలను వెంటనే స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. రోజూ వందలాది వాహనాలు వెళ్తున్న ఈ రహదారి ఎందుకు నిర్లక్ష్యానికి గురైందని వారు ప్రశ్నిస్తున్నారు.ప్రజల ఆరోగ్యం, రక్షణ దృష్ట్యా ఈ రోడ్డును త్వరితగతినపునరుద్ధరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

రాజన్న సిరిసిల్ల

అంగరంగ వైభవంగా ముదిరాజ్ ఆత్మీయ సన్మానం

ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలలో ముస్తాబాద్ మండల కేంద్రంలో వివిధ గ్రామాలలో విజయం సాధించిన ముదిరాజ్ సర్పంచులు ఉప సర్పంచ్లను వార్డ్ నెంబర్లను ముస్తాబాద్ మండల ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు పిట్ల విట్టల్ గారి అధ్యక్షతన ఘనంగా సన్మానిస్తూ అధ్యక్షులు పిట్ల విట్టల్ మాట్లాడుతూ ముదిరాజ్ బిడ్డలు విజయం సాధించడం చాలా గర్వకారణం అని మండల అభివృద్ధితోపాటు సమాజ ఐక్యత కోసం ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని ఆకాంక్షించారు ప్రజా సమస్యల పరిష్కారం గ్రామాల అభివృద్ధి యువత సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో మండల వివిధ గ్రామాలలోని అధ్యక్షులు కమిటీ సభ్యులు ప్రధాన కార్యదర్శి జింక పవన్ ఉపాధ్యక్షులు కంచం నరసింహులు గీస బిక్షపతి వివిధ గ్రామాల కుల బాంధవులు పాల్గొని సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

రాజన్న సిరిసిల్ల

వార్డు మెంబర్గా గెలుపొందిన రంజాన్ నరేష్ ను సన్మానించిన ముదిరాజ్ సంక్షేమ సంఘం

ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలలో ముస్తాబాద్ మండల 4వ వార్డ్ స్థానంలో విజయం సాధించిన రంజాన్ నరేష్ ని ముదిరాజ్ సగం సభ్యులు ఘనంగా సన్మానించారు సందర్భంగా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పిట్ల విట్టల్ మాట్లాడుతూ రంజాన్ నరేష్ గెలుపొందడం చాలా సంతోషకరమైన విషయమని ప్రజా సేవలో ముందుండి పనులు చేస్తూ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పిట్ల విట్టల్ మరియు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గజ్జల రాజు హిట్ల రాజగోపాల్ మాజీ ప్రెసిడెంట్. పుల్లూరు రవి తదితరులు పాల్గొని సంతోషం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారుచేశారు

కామారెడ్డి

రామారెడ్డిలో సర్పంచ్ లకు ఘన సన్మానం

కామారెడ్డి,05 జనవరి,( పున్నమి ప్రతినిధి ) : రామారెడ్డి గ్రామాభివృద్ధిలో ముందుండే సర్పంచ్–ఉప సర్పంచ్ లకు గౌరవానికి నేడు రామారెడ్డి వేదికగా మారింది.గ్రామ పూసల సంఘం ఆధ్వర్యం లో గ్రామ సర్పంచ్ , ఉప సర్పంచ్ లను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పూసల సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి, శుభ్రత, మౌలిక వసతుల మెరుగుదల, ప్రజల సమస్యల పరిష్కారంలో సర్పంచ్, ఉప సర్పంచ్ చురుకైన పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. ప్రజలతో మమేకమై, ఎప్పుడూ అందుబాటులో ఉండటం వలన వారికి ఈగౌరవం లభించును అని అన్నారు. ఈ కార్యక్రమంలో పూసల సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని నేతలకు శాలువాలు, పూలమా లలు వేసి సత్కరించారు. గ్రామాభివృద్ధికి తమ వంతు కృషి మరింతగా కొనసాగిస్తామని ఈ సంద ర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్ హామీ ఇచ్చారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రెవెన్యూ గ్రామ సభలో పాసుపుస్తకాల పంపిణీ

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి)మనుబోలు మండలం కట్టువపల్లి గ్రామంలో సోమవారం తాసిల్దార్ రమాదేవి ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు గ్రామ సభను నిర్వహించి అర్హులైన రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీఆర్వో నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామానికి 362 పాసుపుస్తకాలు రాగా, వాటిలో 55 పాసుపుస్తకాల్లో తప్పులు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం 308 పాసుపుస్తకాలు మాత్రమే పంపిణీ చేశామని, మిగిలిన వాటిలో తప్పులు సరిచేసి త్వరలో అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు పోతా రెడ్డి నందగోపాల్ రెడ్డి, ఎంట్రపల్లి మహేంద్ర, పిడూరు మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా చావా ప్రణీత్ ఎంపిక

ఖమ్మం జనవరి (పున్నమి ప్రతి నిధి) అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి చావా ప్రణీత్ ఎంపికయ్యారు. జనవరి 3, 4, 5 తేదీల్లో శంషాబాద్‌లో జరిగిన ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర మహాసభల్లో ఆయనను రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు చావా ప్రణీత్‌కు అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్

మండల పార్టీ బలోపేతమే లక్ష్యం – టిడిపి శిక్షణా తరగతుల్లో కె.కె.చౌదరి స్పష్టం

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో 07వ బ్యాచ్‌కు చెందిన నూతనంగా నియమితులైన మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు శిక్షణా తరగతులు ఘనంగా నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో భాగంగా “మండల పార్టీ అధ్యక్షుల విధులు – విధానాలు” అనే అంశంపై మాజీ మండల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె.కె.చౌదరి సమగ్రంగా అవగాహన కల్పించారు. పార్టీ బలోపేతం, కేడర్ సమన్వయం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లడంలో మండల స్థాయి నాయకుల పాత్ర అత్యంత కీలకమని ఆయన అన్నారు. పార్టీ సిద్ధాంతాలు, విధానాలకు కట్టుబడి పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. ఈ శిక్షణా తరగతులు నాయకుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, భవిష్యత్తు కార్యాచరణకు దిశానిర్దేశం చేస్తున్నాయని పార్టీ నేతలు తెలిపారు.

రంగారెడ్డి

* * జిహెచ్ఎంసి , జడ్పిటిసి , ఎంపీటీసీ లకు సిద్ధం కావాలి: కే ఎల్ ఆర్* –నూతన సర్పంచులు ప్రజలకు సేవకులుగా ఉండాలి -బరిలో ఉండే నాయకులు పేర్లు ఇవ్వాలని సూచన

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) జనవరి 05 : జిహెచ్ఎంసి , జడ్పిటిసి , ఎంపీటీసీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తెలిపారు జిహెచ్ఎంసి లో కలిసిన డివిజన్లు, మహేశ్వరం, కందుకూరు మండలాల్లో జడ్పిటిసి , ఎంపీటీసీ లకు బరిలో నిలిచే నాయకులు తమ పేర్లను తుక్కుగూడ కార్యాలయంలో ఇవ్వాలని కోరారు.సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన నాయకులు తమ గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలని కె ఎల్ ఆర్ సూచించారు. వచ్చే ఎన్నికల్లో నిలబడే అభ్యర్థుల విజయంలో సర్పంచులదే కీలక పాత్ర ఉంటుందన్నారు. కొత్త ఏడాది సందర్భంగా కలిసిన నాయకులతో ప్రత్యేకంగా చర్చించారు. రిజర్వేషన్ల ప్రకారం బీసీ, ఎస్సీ , ఎస్టీ, జనరల్ అభ్యర్థులు పేర్లు ఇవ్వాలని లక్ష్మారెడ్డి సూచించారు. ఎన్నికల్లో పని చేసే యువకులు, పార్టీ నేతలను ఇన్ఛార్జులుగా పంపిస్తామని అన్ని ఎన్నికల్లో విజయం సాధించే నాయకులను ఎంపిక చేయాలని మండల, డివిజన్ లీడర్లకు కె ఎల్ ఆర్ సూచించారు.ఈ కార్యక్రమంలో నూతన సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, మహిళ నాయకురాళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

*సంక్రాంతి పండుగ ముందే అపశృతి – బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) జనవరి 05 : మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట జీహెచ్‌ఎంసీ పరిధి ప్రశాంత్ నగర్ ఫేజ్–1లో సంక్రాంతి పండుగ సందర్భంగా చోటు చేసుకున్న అపశృతి స్థానికులను కలచివేసింది. రాజులూరి గ్రామానికి చెందిన గణేష్ (వయస్సు 15 సంవత్సరాలు) అనే బాలుడు తన మేనత్త ఇంటికి వచ్చిన సందర్భంగా గాలిపటం ఎగరేస్తుండగా, అది హై టెన్షన్ విద్యుత్ వైర్లకు చిక్కుకుంది. గాలిపటాన్ని తీసేందుకు ప్రయత్నించిన సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై, శరీరంపై తీవ్ర గాయాలు కాగా మంటలు అంటుకున్నాయి.తక్షణమే బాధితుడిని ప్రథమ చికిత్స నిమిత్తం ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాధితుడి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడి, బాధితుడికి నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. గణేష్ త్వరగా కోలుకొని సాధారణ జీవన స్రవంతిలోకి రావాలని ఆకాంక్షిస్తూ, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ విజయ్ దిండు భూపేష్ గౌడ్ ఆర్కల కామేష్ రెడ్డి మా దారి రమేష్ బొక్క రాజేందర్ రెడ్డి అవినాష్ తో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్

రాష్ట్ర కన్వీనర్ గా డేరంగుల శేఖర్

రాష్ట్ర కన్వీనర్ గా డేరంగుల శేఖర్ చారకొండ:- జనవరి 05, కాంగ్రెస్ పార్టీ (న్యాయ,మానవ హక్కుల,సమాచార హక్కు)లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా చంద్రయాన్ పల్లి గ్రామానికి చెందిన న్యాయవాది డేరంగుల శేఖర్ ను నియమిస్తూ పిసిసి లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఈ సందర్భంగా డేరంగుల శేఖర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఉస్మానియా యూనివర్సిటీ ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడిగా చురుకైన పాత్ర చేపట్టి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయవాద వృత్తిలో పట్టా పొంది కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చిత్తశుద్ధితో పనిచేసిన సేవలను గుర్తించి తనను కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా నియమించారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తన నియమాకానికి సహకరించిన స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి,ఎంపి మల్లురవి,కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. *అభినందించిన వంశీచంద్ రెడ్డి* కాంగ్రెస్ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా నియమితులైన డేరంగుల శేఖర్ సోమవారం సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన సందర్భంగా శేఖర్ ను శాలువా కప్పి అభినందించారు. ఈ కార్యక్రమంలో వెల్దండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోతీలాల్ నాయక్,కిసాన్ సెల్ తాలూకా అధ్యక్షులు పర్వత్ రెడ్డి,యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పుస్తకాల రాహుల్, తక్కళ్ళపల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.