నేతివారిపల్లెలో కలకలం రేపిన ఆత్మహత్య
చిట్వేలు మండలం నేతివారిపల్లె గ్రామంలో వివాహిత చిందం దివ్య (28) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా రాజపల్లె గ్రామానికి చెందిన దివ్య, హైదరాబాదులో ఒక ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్‌గా పనిచేస్తుండేది. ఐదేళ్ల క్రితం చిట్వేలు మండలం నేతివారిపల్లెకు చెందిన పసల సాయి పవన్‌ను ప్రేమ వివాహం చేసుకొని మూడేళ్ల కుమారుడిని పొందింది. భర్త పవన్ మద్యపానం, ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటుపడి సుమారు నాలుగు లక్షల రూపాయల అప్పులు చేసినట్లు సమాచారం. మద్యం మానుతానని పలుమార్లు హామీ ఇచ్చినా మార్పు లేకపోవడంతో మనస్తాపం చెందిన దివ్య ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో చిట్వేల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.










