Wednesday, 11 March 2026

Blog

రాజన్న సిరిసిల్ల

మాఘ మాస జాతర గ్రామాల ఐక్యత ఆధ్యాత్మిక శాంతికి ప్రతీక

ముస్తాబాద్/పున్నమి ప్రతినిధి/జనవరి 18 ముస్తాబాద్ మండలంలో మొర్రాయిపల్లె గ్రామంలో మాఘమాస పండగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రసిద్ధి గాంచిన బుగ్గ రాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులు భగవంతుని దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, గ్రామ సర్పంచ్ మెంగని శ్రీనివాస్, ఉప సర్పంచ్ల ఫోరం మండల ఉపాధ్యక్షుడు పల్లె ఆనంద్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు సందుపట్ల చిన్న అంజిరెడ్డి, చందుపట్ల రాజిరెడ్డి, పప్పుల బద్రయ్యా, గుండం యాదవ రెడ్డి, మెంగని రాజు, రాజు మెంగని, సందుపట్ల ఎల్లారెడ్డి, పల్లె దేవయ్య, మొర్రాయిపల్లె గ్రామ మాజీ రైతు బంధు అధ్యక్షుడు బోయిని శ్రీనివాస్ తదితరులు పాల్గొని సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుత, గ్రామీణ సంస్కృతి పరిరక్షణలో ఇలాంటి పండుగల పాత్ర ఎంతో కీలకమని, మాఘమాస పండగ గ్రామ ప్రజల్లో ఐక్యతను మరింత బలపరుస్తుందని తెలిపారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై పండగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.

E-పేపర్

నందిపాడు లొ ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు

​దుత్తలూరు Date:18-1-2026 నందిపాడు సెంటర్ లొ ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి: నివాళులర్పించిన నాయకులు ​ తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక, మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి కార్యక్రమం నందిపాడులో అత్యంత ఘనంగా నిర్వహించబడింది. దుత్తలూరు టీడీపీ మండల కన్వీనర్ ఉండేల గురవారెడ్డి ఆధ్వర్యంలో, ఉదయగిరి శాసన సభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి ఆదేశాల మేరకు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మహానేత నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే శ్రీ కంభం విజయ రామిరెడ్డి గారు దంపతులు పాల్గొని ఎన్టీఆర్ చిత్ర పటానికి నివాళులర్పించారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు, అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం లొ మాజీ ఎంపీపీ రవీందర్ బాబు గారూ, సొసైటీ అధ్యక్షులు మధు గారూ, గ్రామ టీడీపీ అధ్యక్షులు మరియు నాయకులు పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సీనియర్ జర్నలిస్ట్ రఘు రామిరెడ్డి పరిస్థితి విషమo

బద్వేల్ మున్సిపాలిటీలోని మడకల వారిపల్లి గ్రామoనకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ రఘు రామిరెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమo పలు వార్త పత్రికల్లో పనిచేసిన రఘు రామిరెడ్డి గత నెల అనగా 14-12-2025 న అగ్రహారం హైవే ఫై బైపాస్ రోడ్డు లో కార్ వెళుతున్న సమయంలో గెదేలను కార్ ఢీ కొనడంతో ఆయనకు తలకు తీవ్ర మైన గాయామైoది మెరుగైన వైద్యం కోసం బెంగళూరు కీ తరలించారు ఇప్పటికి నెల రోజులు పైగా బెంగళూరులో చికిత్స ఆనంతరం ఆరోగ్యం క్షిణిoచడంతో చేతులెత్తెసిన బెంగుళూరు వైద్యులు, ఆసుపత్రి నుంచి తీసుకెళ్లామని డాక్టర్ బంధువులకు సూచన.

రాజన్న సిరిసిల్ల

ఆంటీ డ్రగ్స్ క్రికెట్ టోర్నమెంట్

ANTI-DRUG CRICKET LEAGUE ముస్తాబాద్/పున్నమి ప్రతినిధి/ జనవరి 17 ఈరోజు ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ని సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహించారు నామాపూర్ లోకల్ క్రికెట్ టోర్నమెంట్ 2026 లో ఈరోజు ఫైనల్ మ్యాచ్ లో సర్పంచ్ టీం విజయం సాధించగా రన్నర్ అప్పుగా అంబేద్కర్ యూత్ నిలిచింది. బ్యాట్స్ స్పాన్సర్స్ 1. జూకంటి వెంకన్న 2. రాజు నాయక్ (నామాపూర్ సెక్రటరీ) ట్రోఫీస్ & మెడల్స్ స్పాన్సర్ శరణ్య ఫోటోగ్రఫీ📸 – నామాపూర్ (ప్రో:తాడేపు రవి యాదవ్) అంటి డ్రగ్స్ క్రికెట్ టోర్నమెంట్ కి సహకరించిన ప్రతి ఒక్కరికి నామాపూర్ యూత్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ అనిల్ మాట్లాడుతూ యువత ముత్తు పదార్థాలకు దూరంగా ఉండి గంజాయి వంటి మత ప్రార్థనకు అలవాటు కాకుండ సమయం వృధా చేసుకోకుండా వివిధ పోటీ పరీక్షల్లో పాల్గొంటూ సమయాన్ని వినియోగించుకోవాలి అన్నారు అలాగే యువతకి ఏ అవసరం వచ్చినా అందుబాటులో నేను ఉంటాను అని ఇలాంటి ఆటల పోటీలు యువతలో ఐకమత్యాన్ని పోటీ తత్వాన్ని పెంచుతాయని ఇవి దేశం నిర్మాణంలో చాలా ముఖ్యమని అలాగే వ్యక్తి యొక్క మానసిక అభివృద్ధికి ఇలాంటి పోటీలు చాలా అవసరమని యువతకు పిలుపునిచ్చారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సర్వేపల్లిలో రోడ్డు, తాగునీటి అభివృద్ధి పనులకు వేగం—ఎమ్మెల్యే సోమిరెడ్డి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి). మూడు కోట్ల 58 లక్షల వ్యయంతో పొదలకూరు–మనుబోలు రోడ్డు మంజూరైనట్లు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మనుబోలు మండలం కొండుపాలెం, వీరంపల్లి గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు ప్రారంభించి మాతమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 11.85 కోట్లతో 428 తాగునీటి పనులు చేపట్టినట్లు, జేజేఎం కింద పలు గ్రామాల్లో పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు.

రాజన్న సిరిసిల్ల

గ్రామీణ యువతలోని క్రీడా ప్రతిభ కు వెలుగు చూపే వేదికె సీఎం కప్ 2006

గ్రామీణ ప్రాంత యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “సీఎం కప్–2026” క్రీడా పోటీలకు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో ఘనంగా ప్రారంభం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా యువజన క్రీడా అధికారి అజ్మీర రామదాసు గారు, మండల ఎంపీడీవో లచ్చాలు గారు, మండల విద్యాధికారి రాజిరెడ్డి గారు, స్థానిక ఎస్సై గణేష్ గారు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ళ బాల్ రెడ్డి గారు కలిసి క్రీడా టార్చ్‌ను వెలిగించి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. యువత క్రీడల్లో ముందుకు రావాలని, శారీరక దృఢత్వంతో పాటు క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి క్రీడాకారులు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అక్కంపేట జగనన్న లేఔట్‌లో అవినీతి—పట్టాల పంపిణీకి ఎమ్మెల్యే ఆదేశం

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి) .నెల్లూరు జిల్లా మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో సర్వే నం.103లోని 3.75 ఎకరాల భూమి జగనన్న లేఔట్‌గా కేటాయించినప్పటికీ, గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి కారణంగా పేదలకు ఇళ్ల పట్టాలు అందలేదని గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే సంబంధిత అధికారులను పిలిచి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకొని పేదలకు వెంటనే పట్టాలు పంపిణీ చేయాలని ఆదేశించారు. అధికారులు త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఖమ్మం

రైతు సంక్షేమం, సమాజ ఆరోగ్యానికి “సుఫలయాత్ర”.. పాల్గొనాలని బీజేపీ నేత గల్లా సత్యనారాయణ విజ్ఞప్తి

ఖమ్మం జనవరి (పున్నమి ప్రతినిధి) రైతు సంక్షేమం, సమాజ ఆరోగ్యం లక్ష్యంగా ఈ నెల 20-01-2026 (సోమవారం) ఉదయం 9:30 గంటలకు “సుఫలయాత్ర” పాదయాత్ర నిర్వహించనున్నట్లు బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్యనారాయణ తెలిపారు. నేలకొండపల్లి నుండి భక్త రామదాసు ధ్యాన మందిరం వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో #శ్రీశ్రీశ్రీ #త్రిదండి #చిన్నశ్రీమన్నారాయణ #రామానుజజీయర్ #స్వామి వారి పాదయాత్రగా భక్త బృందం, రైతు సోదరులతో కలిసి ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సుఫలయాత్ర ద్వారా రైతుల సంక్షేమం, సమాజానికి ఆరోగ్య పరిరక్షణపై అవగాహన పెంపొందించడమే ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. భక్తులు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ పాదయాత్రను జయప్రదం చేయాలని గల్లా సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.

తూర్పు గోదావరి

ఇదెక్కడి న్యాయం. వాపోయిన వెంకటరెడ్డి

బిక్కవోలు పున్నమి ప్రతినిధి . జనవరి 15. బలభద్రపురం పంచాయతీ కార్యదర్శులపై బిక్కవోలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విశ్రాంత ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుని ఫిర్యాదు పై చర్య తీసుకొమ్మని ఎస్సైని ఆదేశించిన జిల్లా కలెక్టర్. మరణించిన భార్య మరణ ధ్రువీకరణ పత్రాన్ని భర్తకి ఇవ్వకుండా ఆమెకి వారసులు కాని ఇద్దరికి ఇచ్చిన బలభద్రపురం కార్యదర్శులు నిర్వాకం ఇది. వివరాల్లోకి వెళితే, తన భార్య కోనాల పార్వతి గత సంవత్సరం నవంబర్ 25న మరణించిన విషయాన్ని ఆమె భర్త, విశ్రాంత ఉపాధ్యాయుడు కోనాల వెంకటరెడ్డి గ్రామపంచాయతీకి తెలియపరిచారు. అయితే ఆమె మరణ ధ్రువీకరణ పత్రాన్ని వెంకటరెడ్డికి ఇవ్వకుండా, చట్టపరంగా కానీ న్యాయపరంగా కానీ వారసులు కాని ఆమె సోదరుడు వెలగల అచ్యుత రామారెడ్డికి అప్పటి కార్యదర్శి పి అచ్చియ్య చౌదరి ఇవ్వడం విశేషం. చౌదరి స్థానంలో తదుపరి కార్యదర్శిగా వచ్చిన గొంగల అశోక్ కుమార్ కూడా భర్త అయిన వెంకటరెడ్డికి ఇవ్వకుండా మరణించిన పార్వతికి మొదటి భర్త కర్రి వెంకటరెడ్డి (లేటు) యొక్క మొదటి భార్య కుమారుడు, తాపేశ్వరం గ్రామపంచాయతీ కార్యదర్శి అయిన కర్రి వెంకట చక్రధరరెడ్డికి ఇవ్వడం చేసారని విశ్రాంత ఉపాధ్యాయుడు ఒక ప్రకటనలో ఆరోపించారు. భర్తగా తాను తన భార్య మరణ ధ్రువీకరణ పత్రంను ఆర్.టి.ఐ తో సహా నాలుగు సార్లు దరఖాస్తు చేసినా కార్యదర్శి అశోక్ వాటిని బేఖాతరు చేశారని తెలిపారు. తన భార్య ఆస్తులను అక్రమంగా కాజేయాలనే దురుద్దేశ్యంతో ఉన్న చక్రధరరెడ్డి, అచ్యుత రామారెడ్డిలతో పంచాయితీ కార్యదర్శులు ఇద్దరూ కుమ్మక్కయ్యారని వెంకటరెడ్డి ఆరోపించారు. తన ఆర్టిఐ దరఖాస్తుకు బిక్కవోలు మండల అభివృద్ధి అధికారి స్పందిస్తూ తక్షణం పార్వతి మరణ ధ్రువీకరణ పత్రమును భర్త అయిన తనకు ఇమ్మని డిసెంబర్ 29న ఆదేశించినా, కార్యదర్శి అశోక్ సదరు ఆదేశాన్ని సైతం బేఖాతరు చేశారన్నారు. చివరకు స్పందనలో కలెక్టర్ కి తాను నివేదించగా కలెక్టర్ ఆదేశంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ నెల 9వ తేదీన తన భార్య మరణ ధ్రువీకరణ పత్రమును ఇచ్చారని ఆయన తెలిపారు. మండల అభివృద్ధి అధికారి ఆదేశాన్ని కూడా ఖాతరు చేయకపోవడానికి కారణం, వారసులు కాని వారికి తామిచ్చిన మరణ ధ్రువీకరణ పత్రంతో వారిలో ఎవరో ఒకరు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పొందే విధంగా వారికి తగినంత సమయం ఇచ్చే దురుదేశ్యంతోనే కార్యదర్శులు కాలయాపన చేస్తూ వచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారసులు కాని వారితో నేరపూరిత కుట్రలో భాగస్వాములు అయి కర్తవ్య నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్య వైఖరితో తప్పుడు సమాచారంతో రెవెన్యూ శాఖను మోసగించి, వారు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పొందేందుకు వారితో కుమ్మక్కైన పూర్వ, ప్రస్తుత కార్యదర్శులతో పాటు సదరు నలుగురు కుట్రదారులపై బిక్కవోలు పోలీస్ స్టేషన్ లో కోనాల వెంకటరెడ్డి క్రిమినల్ కంప్లైంట్ చేశారు. ఆయన ఫిర్యాదు పై తగు విచారణ చేసి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ బిక్కవోలు సబ్ ఇన్స్పెక్టర్ కి ఆదేశాలు జారీ చేశారు.ఈ ప్రకటన తో పాటు ఉన్నతధికారులు జారీ చేసిన ఆదేశాల వివరాలు కూడా వెంకటరెడ్డి మీడియా కు అందించారు.

ఖమ్మం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్‌ రిజర్వేషన్లు ఖరారు – కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వారీగా వివరాలు

ఖమ్మం జనవరి ( పున్నమి ప్రతినిధి) ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాబోయే మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబంధించిన డివిజన్‌/వార్డు రిజర్వేషన్లను ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అన్‌రిజర్వుడ్‌ (UR) కేటగిరీలకు కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి. ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్ (60 డివిజన్లు): ఎస్టీ : 1 ఎస్సీ : 7 బీసీ : 20 అన్‌రిజర్వుడ్‌ (UR) : 32 కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్: ఎస్టీ : 11 ఎస్సీ : 12 బీసీ : 7 అన్‌రిజర్వుడ్‌ (UR) : 30 ఏదులాపురం (32 వార్డులు): ఎస్టీ : 3 ఎస్సీ : 7 బీసీ : 6 అన్‌రిజర్వుడ్‌ (UR) : 16 కల్లూరు: ఎస్టీ : 3 ఎస్సీ : 5 బీసీ : 2 అన్‌రిజర్వుడ్‌ (UR) : 10 మధిర: ఎస్టీ : 1 ఎస్సీ : 6 బీసీ : 4 అన్‌రిజర్వుడ్‌ (UR) : 11 సత్తుపల్లి: ఎస్టీ : 1 ఎస్సీ : 3 బీసీ : 7 అన్‌రిజర్వుడ్‌ (UR) : 12 వైరా: ఎస్టీ : 1 ఎస్సీ : 5 బీసీ : 4 అన్‌రిజర్వుడ్‌ (UR) : 10 అశ్వరావుపేట: ఎస్టీ : 3 ఎస్సీ : 4 బీసీ : 4 అన్‌రిజర్వుడ్‌ (UR) : 11 ఇల్లెందు: ఎస్టీ : 2 ఎస్సీ : 4 బీసీ : 6 అన్‌రిజర్వుడ్‌ (UR) : 12 ఈ రిజర్వేషన్లతో రాజకీయ పార్టీల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చలు ఊపందుకున్నాయి. రాబోయే ఎన్నికలపై స్థానికంగా ఆసక్తి నెలకొంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.