రాజమండ్రి సినిమా హాల్లో సినిమా వాళ్ళ సందడి
✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి జిల్లా పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. రాజమండ్రి గీతా అప్సి నిమా హాల్లో సినిమా వాళ్ళ సందడి END.
✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి జిల్లా పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. రాజమండ్రి గీతా అప్సి నిమా హాల్లో సినిమా వాళ్ళ సందడి END.
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి). మనుబోలు మండలంలో ఆదివారం ఎన్టీ రామారావు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్వేపల్లి ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, మండలాధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య మాట్లాడుతూ ఎన్టీఆర్ సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. పేదవాడి ఆకలిని గుర్తించి రెండు రూపాయల బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఆయనకేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొని ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు.
యోగిగా మారిన తర్వాత తన పద్యాలలో కేవలం నీతిని మాత్రమే కాక, సమాజంలోని మూఢనమ్మకాలు, కుల వివక్ష, మత మౌఢ్యంపై తీవ్రమైన విమర్శలు చేసిన ప్రజాకవి వేమన తన జీవితాంతం ప్రజల కోసమే జీవించారు. జనవరి 19వ తేదీన ఆయన 374వ జయంతి సందర్భంగా ‘నీతి నిలయ సమాజాన యోగివేమన – కవిత’ వేమన ఏమనె… ప్రకృతి సూత్రం పాటించమనె వైజ్ఞానికంగా అంతరాత్మను తెలుసుకోమనె భావోద్వేగాలు అదుపులో ఉంచుకోమనె సృష్టిని సమన్యాయ దృష్టితో చూడమనె జన్మనిచ్చిన వారిని సూర్యచంద్రులుగ భావించమనె తమ తప్పులు సరిదిద్దుకుని సన్మార్గం సాగించమనె. ప్రజా హృదయాన నిత్యం ఉదయించే అనుకరణ సూచన మానవత్వ మతంతో వ్యక్తిత్వాన్ని నవీకరించిన ఆలోచన పని పాటలు ప్రతిరోజు ప్రతిఫలించే అభివృద్ధి నివేదన నడవడి క్రమశిక్షణ ఒరవడి ఆచరణ మంచి మాటకి ఆయుష్షు విశ్లేషణ… విశ్వదాభిరామ వినురవేమ యోగివేమన సామాజిక ప్రేమ. జననం జీవనం దైవానుగ్రహ పరంపర పయనం పుష్పించిన తలంపు సుమాల విజ్ఞాన వనం గమనం సుగుణం అనుసంధాన భావకవనం నిత్య స్వానుభవాల సంతులన ప్రయోజనం. మానవ బుద్ధి సమృద్ధి సమ్మిళిత మార్గదర్శకం అల్పుడు సజ్జనుడు ప్రభావ పరివర్తన కాలసూచికం గుణముల గణనలో ఉపమానాంశాల మమేకం ప్రతి మాట సంక్షేమ హెచ్చరికల పద్య వాచకం. మానవజాతి మనుగడ గతికి శ్రేయోదాయకం ఉపమానాలతో ఉపయుక్తమైన వేమన శతకం. జీవితప్రమాణానికి వికాస ప్రయాణానికి నిలయం సాంఘిక క్షేత్రంలో సృజనాత్మక వ్యవసాయం ఇది ఫలదీకృత సరళీకృత జనజీవన ఆశయం మాటల మాలికలల్లిన మనోవిజ్ఞాన ఆశ్రయం సమాజ శ్రేయస్సుకు సందేశాత్మక ఆశీస్సుల అభయం సులక్షణ సంస్కరణల భావ ప్రకంపన ఆగమనాలయం నీతి నిలయ సమాజాన ఆలోచన ఆచరణ సద్వయం.. యోగివేమన పద్య సారాంశం
అగనంపూడి, జనవరి 18 (పున్నమి ప్రతినిధి) జివిఎంసి 79 వ వార్డు పరిధి లో స్థానిక కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ అధ్యక్షతన అగనంపూడి, మరియు శివాజీ నగర్ పైలాన్ దగ్గర కీర్తిశేషులు నట సార్వభౌమ నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి గాజువాక పార్టీ కార్యాలయం లో రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొని పలువురు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కరణం సత్యారావు, మాడిస వెంకట్రావు, వార్డు అధ్యక్షులు కరణం జగదీష్, కర్రి. దసేంద్ర, పివిఎన్ మూర్తి, మామిడి అప్పారావు, తైడా లక్షణరావు, జగదీష్, కొరాయి నాగార్జున, గంతకూర అప్పారావు, రేవతి, పల్లెల నాగేశ్వరరావు, గల్ల రాజు, సిహెచ్ రామనాయుడు గల్లా నర్సింగరావు, పప్పల సూర్య, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ (పున్నమి ప్రతి నిధి ) భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ షురూ అయింది. గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న అధ్యక్ష పదవికి సంబంధించి ఎన్నికల షెడ్యూల్ను పార్టీ రిటర్నింగ్ అధికారి కె.లక్ష్మణ్ విడుదల చేశారు. ఈ ప్రక్రియ అంతా ఢిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో జరగనుంది. ఎన్నికల షెడ్యూల్ వివరాలు: పార్టీ ప్రకటించిన వివరాల ప్రకారం ఎన్నికల సరళి ఇలా ఉండబోతోంది: జనవరి 19: మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ. పరిశీలన: నామినేషన్ల దాఖలు అనంతరం వెంటనే వాటిని పరిశీలిస్తారు. ఉపసంహరణ: అదే రోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. జనవరి 20: అవసరమైతే పోలింగ్ నిర్వహించి, అదే రోజు కొత్త అధ్యక్షుడి పేరును అధికారికంగా ప్రకటిస్తారు. రేసులో నితిన్ నబీన్.. ఏకగ్రీవమేనా? ప్రస్తుతం భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న నితిన్ నబీన్ (45) పేరు అధ్యక్ష పదవికి ప్రముఖంగా వినిపిస్తోంది. యువ నాయకత్వానికి పెద్దపీట వేయాలన్న అధిష్ఠానం ఆలోచనలో భాగంగా ఆయన్నే అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎవరీ నితిన్ నబీన్? బిహార్కు చెందిన నితిన్ నబీన్ సిన్హాకు బలమైన ఆరెస్సెస్ (RSS) నేపథ్యం ఉంది. గతేడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బాంకీపుర్ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాయస్థ సామాజికవర్గానికి చెందిన ఈయన, గతేడాది డిసెంబర్లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులై అందరినీ ఆశ్చర్యపరిచారు. బిహార్ నుంచి జాతీయ స్థాయిలో పార్టీ సారథ్య పగ్గాలు చేపట్టబోతున్న తొలి నేతగా ఆయన రికార్డు సృష్టించనున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియతో జేపీ నడ్డా వారసుడు ఎవరనే ఉత్కంఠకు తెరపడనుంది.
అనకాపల్లి జిల్లా, జనవరి 18 పున్నమి న్యూస్ ప్రతినిధి (ఆనంద్): తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని ఎలమంచిలి రూరల్ మండలం కొత్తలి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ సర్పంచ్ ఇత్తంశెట్టి రాజా వెంకట రమణారావు, ఎలమంచిలి మాజీ ఎంపీపీ, ప్రస్తుత పిఎసిఎస్ చైర్మన్ కొలుకులూరి విజయరామరాజు పాల్గొని ఎన్టీఆర్ ప్రజాస్వామ్యానికి చేసిన సేవలను స్మరించారు. మండల పార్టీ అధ్యక్షులు నాయుడు, మాజీ సర్పంచ్ కాండ్రకోట చిరంజీవి, మండల క్లస్టర్ ఇంచార్జ్ వూడి రామకృష్ణ, ఎక్స్ వైస్ ఎంపీపీ గొన్నబత్తులు శేషు, ఎక్స్ సర్పంచ్ గంజి శ్రీను, ఎడ్ల చిన్న బాబు తదితర నాయకులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన సీనియర్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజల హాజరుతో కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించడమే లక్ష్యమని నేతలు తెలిపారు.
ముస్తాబాద్ /పున్నమి ప్రతినిధి /జనవరి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మాఘ అమావాస్య పండగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ స్వయంభు వెంకటేశ్వర స్వామి బోరు వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ముస్తాబాద్ ఎస్‌ఐ గణేష్, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు భోంపెల్లి సురేందర్ రావు, పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఏద్దండి నర్సింహా రెడ్డి, మొర్రాయిపల్లె ఉప సర్పంచ్ పల్లె ఆనంద్ పాల్గొన్నారు. అలాగే ఆలయ కమిటీ సభ్యులు జల బిక్షపతి, కంచం నరసింహులు, దేవరెడ్డి రంజిత్ తదితరులు హాజరై గ్రామ శాంతి, ప్రజల శ్రేయస్సు కోసం స్వామివారి ఆశీస్సులు కోరారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి ( పున్నమి ప్రతినిధి). మనుబోలుస్థానిక అంబేద్కర్ నగర్‌లో వెలసి ఉన్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత దేవస్థానం నందు ఆదివారం చెన్నకేశవ భజన బృందం అన్నసంతర్పణ కార్యక్రమానికి కావలసిన వంట సామాగ్రిని ఆలయ కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా సుమారు రూ.7,000 విలువైన బియ్యం, కూరగాయలు, నూనె, పప్పులు తదితర సామగ్రిని విరాళంగా ఇచ్చారు. భజన బృంద సభ్యుల సేవా భావాన్ని ఆలయ నిర్వాహకులు అభినందించారు. ఈ కార్యక్రమం భక్తుల్లో ఆధ్యాత్మికతతో పాటు సేవాభావాన్ని పెంపొందించిందని తెలిపారు.
ఖమ్మం జనవరి (పున్నమి ప్రతినిధి) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఖమ్మం ఎన్ టి ఆర్ సర్కిల్ నందు గల ఎన్ టి ఆర్ విగ్రహం కి పూల మాలలూ వేసి ఘన నివాళులు అర్పించిన బీజేపీ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ, ఈ కార్యక్రమం లో ఖమ్మం రెండవ పట్టణ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్, వల్లల రమేష్, డీకొండ శ్యాం తదితరులు పాల్గొన్నారు
దువ్వాడ సెక్టార్ – 2 సీత రామాంజనేయ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల తీర్థ మహోత్సవ సందర్భంగా దువ్వాడ ప్రీమియర్ లీగ్ క్రికెట్, షటిల్ టోర్నమెంట్స్ నిర్వహించారు. క్రికెట్ టోర్నమెంట్ విన్నర్స్ గా దువ్వాడ రైడర్స్, రన్నర్స్ గా దువ్వాడ లెజెండ్ జట్లు విజేత లు గా నిలిచాయి. కమిటీ మెంబర్స్ గుండాసు వెంకటరమణ, సిరసపల్లి అప్పారావు, గుండాసు నానాజీ, సిరసపల్లి శ్రీనివాసరావు పారుపల్లి అప్పారావు గంట్ల శ్రీను తదితరులు విజేత లకు బహుమతి ప్రదానం చేశారు. తీర్థ మహోత్సవం సందర్భంగా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.