Thursday, 5 March 2026

Blog

Featured ఆంధ్రప్రదేశ్

నెల్లూరు జిల్లాలో తొలి కరోనా మరణం – 

లాక్ డౌన్ కు సహకరిద్దము భౌతిక దూరాన్ని పటిద్దాము కరోనా వైరస్ బారిన పడి చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నెల్లూరుకు చెందిన ఆర్థోపెడిక్ డాక్టర్ లక్ష్మీ నారాయణ రెడ్డి కొద్ది సేపటి క్రితం చెన్నైలో కన్నుమూశారు. గత నెలాఖరున విదేశాలకు వెళ్లివచ్చిన డాక్టర్ లక్ష్మీ నారాయణ రెడ్డి ఈ నెల మొదటి వారం నెలూరులో నూతన హాస్పిటల్ భవనాన్ని కూడా ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన తీవ్ర అస్వస్థతకు గురికాగా నెల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించమించడంతో నెల్లూరులోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు తరలించారు. అక్కడ ఆయనకు పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఆ డాక్టర్ కోరిక మేరకు మెరుగైన చికిత్స కోసం చెన్నై అపోలో కు తరలించారు. అక్కడ కూడా ఆయన పరిస్థితి మెరుగుపడలేదు. పెద్ద వయసు కావడం, బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక రోగాలు ఉండటంతో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఇవాళ మధ్యాహ్నం చెన్నై అపోలో హాస్పిటల్ లో కన్నుమూసినట్లు ఆయన సన్నిహితులు తెలియజేసారు. మృతి చెందిన డాక్టర్ భార్యకు, హాస్పిటల్ ఫార్మాసిస్ట్ కు కూడా కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. ఆయన మృతదేహాన్ని నెల్లూరుకు తీసుకురాకుండా చెన్నైలోనే అంత్యక్రియలు నిర్వహించేలా కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అయితే డాక్టర్ మృతి విషయం    జిల్లా అధికారులు ఇంకా దృవీకరించలేదు.జిల్లా ప్రజలు నష్టం జరిగిందని భాధ పడటం కాకుండా కనీసం పద్దతులను పాటిస్తూ  లాక్ డౌన్ ద్వారా ప్రభుత్వానికి పోలీసులకు సహకరించాలని పున్నమి కోరుకుంటుంది.

Featured ఆంధ్రప్రదేశ్

నెల్లూరు ఎంఎల్ఏలు వర్సెస్ అధికారులు

కరోనా విపత్తు ఇప్పుడు నెల్లూరు జిల్లాలో అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, అధికారుల మధ్య చిచ్చురేపింది. జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పేదలకు ఉచిత సరుకుల పంపిణీ కార్యక్రమం వివాదాస్పదంగా మారింది.నిన్న బుచ్చిరెడ్డిపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో పేదలకు ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ కార్యక్రమంలో లాక్ డౌన్ లోని144 సెక్షన్ను అతిక్రమించడం టూ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి పై అధికారులు కేసు నమోదు చేశారు. స్థానికంగా బుచ్చిరెడ్డిపాలెం లో ఈ పంపిణీ కార్యక్రమం జరగడంతో అక్కడి సీఐ సురేష్ బాబు ఉ ఎస్ఐలను జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ సెట్లో తీవ్రంగా మందలించారు. దీనిపై ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఆగ్రహించారు. ఇవాళ బుచ్చిరెడ్డిపాలెం లోని పోలీస్ స్టేషన్ వద్ద ఆయన బైఠాయించారు కరోనా విపత్తు సమయంలో పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేస్తే దానిపై అధికారులు రాద్ధాంతం చేయడం, కేసులు నమోదు చేయడం ఏమిటంటూ ఆయన మండిపడ్డారు. ఇవాళ ఉదయం 10 గంటలకు బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్కు చేరుకున్న ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి దాదాపు మూడు గంటల పాటు ఆందోళన చేశారు. దాంతో జిల్లా కలెక్టర్ రంగప్రవేశం చేసి వివాదాన్ని సర్దుబాటు చేశారు. ఇదే సమయంలో జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డికి మద్దతుగా నిలిచారు.. జిల్లా వైసీపీ అధ్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లా అధికారుల పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ముత్తుకూరు లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అధికారుల తీరును తప్పుపట్టారు.. ఎమ్మెల్యే పైనే కేసు కడతారా.. అంతటి నేరం ఏమీ చేసారంటూ.. మండిపడ్డారు. విపత్తుల సమయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్న వారిపై ఇలా కేసులు పెట్టడమేమిటని ప్రశ్నించారు. అధికారుల తీరులో మార్పు లేకుంటే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. మొత్తానికి నెల్లూరు జిల్లాలో కరోనా నేపథ్యంలో పేదలకు నిత్యావసరాలు అందజేసే ఈ కార్యక్రమం ఇప్పుడు అధికారులకు అధికార పార్టీ శాసనసభ్యులకు మధ్య చిచ్చు పెట్టింది.. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న చర్చ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

Featured ఆంధ్రప్రదేశ్

మేము సైతం

  *మేము సైతం” అంటూ దొరవారిసత్రం ఎసై సుధాకర్ రెడ్డి, సిబ్బంది మరియు సూళ్లూరుపేట ఎలక్ట్రానిక్ మీడియా సాయం* *సూళ్ళూరుపేట నియోజకవర్గం* *దొరవారిసత్రం:-* చేసు కోవడానికి చేతిలో పనులు లేక జేబుల్లో పైసలు లేక రెక్కాడితే గాని డొక్కాడని వలస కూలీలకు స్థానిక ఎసై యల్ సుధాకర్ రెడ్డి మరియు సిబ్బంది, సూళ్లూరుపేట పట్టణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ లు నేడు అనగా శుక్రవారం ఉదయం “మేము సైతం” అంటూ ముందు కొచ్చి తమ వంతు సాయం గా “మనల్ని మనమే కాపాడుకోవడం తప్ప మరో మార్గం లేదిప్పుడు” అని వారికి బియ్యం , కూరగాయలు , కిరాణా వస్తువులను కూలి పనుల నిమిత్తం వచ్చి కరోనా వైరస్ మహమ్మారి కట్టడి లో భాగం గా బయటకు రాలేక ఇళ్ల లోనే ఉంటూ రోజు కూలీలు ఆకలి తో అలమ టిస్తున్న విషయం తమ ద్రుష్టి కి రాగానే మీడియా సోదరులు స్పందించి వారికి కొంతైన తమవంతు సాయం గా ఈ చిన్ని సహాయం చేయడం పై పలువురు తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు . వివరాల్లో కెళితే సూళ్లూరుపేట నియోజక వర్గం పరిధి లోని దొరవారిసత్రం (మండలం) లో రైల్వే కూలి పనుల కోసం బీహార్ , జార్ఖండ్ వంటి రాష్ట్రాల నుండి వచ్చి కరోనా వైరస్ లాక్ డౌన్ లో చిక్కుకుని దిక్కు తోచని స్థితి లో ఉన్న కారణము గా ఇక్కడే చిక్కుపోయిన కూలీల ఆకలి తీర్చడానికి సూళ్లూరుపేట ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ లు సాహసో పేతమైన పట్టుదల తో మంచి మనస్సు తో ముందుకు వచ్చి నేడు దొరవారిసత్రం పోలీసుల తో కలిసి సంయుక్తం గా జర్నలిస్ట్ లు ఆపదలో ఉన్న కూలీలకు సహాయం చేశారు . ఈ కార్యక్రమం లో స్థానిక ఎస్ ఐ .యల్ సుధాకర్ రెడ్డి చేతుల మీదు గా 40 మంది కూలీ కుటుంబాలకు నెల రోజుల కు సరిపడే బియ్యం తో పాటు కిరాణా వస్తువులు , కూరగాయలు అందించారు . ఆకలి తో ఉన్న కూలీలను మీడియా వారు ఆదుకోవడం పట్ల ఎస్ ఐ . సుధాకర్ రెడ్డి జర్నలిస్ట్ ల నుద్దేశించి “పది మంది కి అన్నం పెట్ట గలిగిన శక్తీ ని భగవంతుడు మీలాంటి జర్నలిస్ట్ లకు ఇచ్చినందుకు నేను మిమ్మల్నెనెంతగానో అభినందిస్తున్నాను . అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన కున్నవి రెండే కులాలు . అవేమి టంటే ఒకటి పాజిటివ్ రెండవది నెగిటివ్ . గతం లో అందరు బతికి చచ్చేవారు . కానీ ఇప్పుడు మనం అంటే మనందరం క్షణం క్షణం చస్తూ బతుకు తున్నాం ఎప్పుడెవరికి కరోనా వస్తుందో తెలియక . ముఖ్యం గా కరోనా వైరస్ ను కట్టడి చేయాలంటే మనిషి మనిషి కి రెండు మీటర్లు దూరం , ప్రతి రోజు ఓ గంట యోగ , జలుబు , దగ్గు , తుమ్ములు వచ్చి నప్పుడు నోటికి ఖచ్చిఫ్ పెట్టు కోవడం , , సెల్ ఫోన్ ను రోజు కు ఒక్క సారైన ఖచ్చిఫ్ తో శుభ్రం చేసుకోవడం , వంటివి చేస్తే చాలు . దేశ భద్రత కోసం పోరాట యోధులు ఐన పోలీసు వీరులు , రేయింబవళ్లు విధులు నిర్వర్తిస్తున్న మునిసిపల్ కార్మికులు , తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్నడాక్టర్లు , వైద్య సిబ్బంది కి శత కోటి వందనాలు” అంటున్నారు . అలాగే “దేశ భవిత కోసం వారు చేస్తున్న సేవలు అనంతమైన వని చరిత్ర మరువదు వారి సేవలను అని ఈ కరోనా వైరస్ ను అరికట్టాలంటే కొన్ని జాగ్రత్త లు , నివారణా చర్యలు పాటించడం ముఖ్యమని , అలాగే మన దేశ ప్రధాని మోడీ ప్రవేశ పెట్టిన స్వచ్ఛ భారత్ ను మనం గౌరవించి పాటిస్తే ఏ కరోనా మన దరి చేరదని అన్నారు . అభాగ్యులను ఆదుకోవడానికి ఎంతోమంది దాతలు ముందుకు రావాలని ఎస్ ఐ సుధాకర్ రెడ్డి పిలుపు నిచ్చారు . ఈ కార్యక్రమం లో ఏ ఎస్ ఐ . చెంగయ్య , పోలిస్ సిబ్బంది మరియు సూళ్ళూరుపేట ఎలక్ట్రానిక్ మీడియా కి చెందిన వి . రమణయ్య , డి . కిరణ్ , బి . సుధా, సిహెచ్ . గురవయ్య , ఏ . అశోక్ , వి . నాగరాజు కె . జోసఫ్ , యన్ . శ్రీనివాసులు , సర్ధార్ , మూర్తి తదితరులు పాల్గొన్నారు .    

Featured ఆంధ్రప్రదేశ్

నిత్యావసర సరుకులు పంపిణీ.

కరోనా వైరస్ దేశమునుండి వెళ్ళేదాకా పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ. వైయస్సార్ సిపి నాయకులు కామిరెడ్డి రాజారెడ్డి. నెల్లూరు జిల్లా నాయుడుపేట వైయస్సార్ సిపి నాయకుడు కామిరెడ్డి రాజారెడ్డి ఆధ్వర్యంలో మర్లపల్లి గ్రామాo తదితర గ్రామాల్లో ముమ్మరంగా ప్రతి కుటుంబానికి నిత్యవసర సరుకులు కూరగాయలు ను పంపిణీ చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ సందర్భంగా పనులకు పొకుండా ఇంటికే పరిమితమై ఉండి ఆకలితో అలమటిస్తున్న వారు గ్రామాల్లో చాలా మంది పేదలు ఉన్నారని తెలుసుకుని వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మర్లపల్లి,మర్లపల్లి మిట్టా, హరిజనవాడ,నరసారెడ్డి కండ్రిగ, పెరిగిలపాటి కండ్రిగ గ్రామాలలో సులూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య పిలుపుతో సుమారు 250 కుటుంబాలకు ఎటువంటి డోకా లేకుండా నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు రాజారెడ్డి తెలిపారు,ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దొప్పల చంద్రశేఖర్,రవి కుమార్, అశోక్ ,వెంకయ్య, తదితరులు పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

భోజనాలు, అరిటిపండ్లు పంపిణి

బ్రహ్మదేవి గ్రామం మెయిన్ రోడ్ ,వరకవిపూడి ఇండియన్ పెట్రోలు బంకు ప్రక్కన చెట్లు కింద ఏ ఆధారం లేని అనాధలకు, బ్రహ్మ దేవం ప్రణయ్ కుమార్ హెల్పింగ్ నేచర్ వారి ఆధ్వర్యంలో 50 మంది కి భోజనాలు మరియు అరిటిపండ్లు పంచినాము ,ఇలాగే దాతలు ముందు కు వచ్చి ఇలాంటి వాళ్లును ఆదుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటు ,మీ భరధ్వాజ మల్లి ఖార్జునరావు మరియు కుటుంబ సభ్యులు.9441232654, 8309006426 .మాటలు చెప్పె పెదవులకన్నా సాయం చేచె చేతులు గొప్ప అందరూ సహాయం చెయ్యలని కొరుకుంటునాము.

Featured ఆంధ్రప్రదేశ్

పేదలకు ఆహార పంపిణి

కరోనా వైరస్ వాళ్ళ లాక్ డౌన్ చేయడం వల్ల ఆహరం దొరక్క ఇబ్బంది పడుతున్న నిరాశ్రయులైన వారికి జంగాల కండ్రిగ యువత 200 మందికి ఆహార పంపిణి చేసింది. ఈ సందర్బంగా గ్రామా యువకులు మాట్లాడుతూ కరోనా వైరస్ వల్ల అనేక మంది ఆహారం దొరక్క అనేక ఇబ్బందులు పడుతున్నారని తమ వంతు సహాయం చేయాలనీ గ్రామా యువత సంకల్పించి పెదాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమములో గ్రామా యువకులు కల్పం శివ సాయి, ముత్యాల మల్లయ్య, కోట సతీష్, కోట లింగం పేట రాజశేఖర్, పెళ్లకురు వంశి, షైక్ రహీమ్, షాజహాన్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

ఈ లాక్ డౌన్ సమయంలో ఫ్రెండ్స్ తో ఆనందంగా గడపడం అందరికి ఆదర్శం:: VR కాలేజీ గ్రూప్

నెల్లూరు వీఆర్ కాలేజీలో 1976-79 లో బీ.యస్సీ చదివిన మిత్రులు దాదాపు తొంభై మంది కుటుంబ సభ్యులు తో ఉన్న VRC గుర్తుకొస్తున్నాయి గ్రూపులో విభిన్నంగా తమ ఇళ్ళలో కూర్చుని లాక్ డౌన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. రోజూ సాయంత్రం రకరకాల క్విజ్ లు జరుపుకుంటూ కుటుంబ సభ్యులు కలిసి వారి పిల్లలు ఇతర ప్రాంతాలలో ఉన్న వారితోనూ షేర్ చేసుకుంటూ సరదాగా గడిపేస్తున్నారు. దేశంలో వివిధ ప్రాంతాలలోనూ..విదేశాలలోనూ విస్తరించి ఉన్న తమ మిత్రులు వారి కుటుంబ సభ్యులుకు సాయంత్రం ఐదు గంటలకు క్విజ్ మాష్టారు సత్యం రిటైర్డు సైన్సు టీచర్ ప్రశ్నా పత్రాన్ని విడుదలచేస్తారు. ఒకరోజు సినిమా పాటలు పెట్టీ అవి సినిమా లు హీరోహీరోయిన్లు చెప్పడం..సీన్లు ఆడియో పెట్టి ఏ సినిమా లోవో గుర్తించడం..అంత్యాక్షరి.. అలా..పాటలకు ఒక బిట్ వేస్తే పల్లవి చెప్పడం ఇలా దాదాపు పది రోజులుగా ప్రతిరోజు క్విజ్ లు…అందరూ వివిధ వృత్తుల్లో ఉండి రిటైరైనవారు…పిల్లలకూ ఆ క్విజ్ లు షేర్ చేసి ఒక గంట సమయంలో ఆ సమాధానాలు క్విజ్ మాష్టారు కు పర్సనల్ నెంబర్ కి పంపాలి. ఆ తరువాత ప్రతిరోజూ ఫలితాలు రాత్రికి అనౌన్సు చేస్తారు. లాక్ డౌన్ అనంతరం గ్రూపునుంచి బహూమతులూ ఇవ్వనున్నారు అని అడ్మిన్ నాగరాజరావు తెలిపారు. ఈ గ్రూపులో కరోనా పై అన్ని సందేశాలు ఫేక్ న్యూస్ బ్యాన్ చేసారు. అవసరమైన మేరకు అధికారిక సమాచారం మాత్రమే గ్రూపులో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ రోజు ఉదయాన్నే ఏం క్విజ్ ఉంటుందో సత్యం మాష్టారు పోస్ట్ చేస్తారు. సరదాగా ఈ విధంగా క్విజ్ తో మిత్రులతో వీడియో వాయిస్ కాలింగ్ ద్వారా ఈ లాక్ డౌన్ ఎంజాయ్ చేస్తూ ఉన్న ఈ మిత్రబృందం నిజంగా స్పూర్తిదాయకమే…తాము నలభై మూడేళ్ళ క్రితం కలిసి చదువుకున్న ససమయంలో జరిగిన జ్ఞాపకాలనూ షేర్ చేసుకుంటూ….ఇలా…గడపడం ఇతరులకూ స్పూర్తి కావాలనీ…తమ గ్రూపులో రాజకీయ ప్రేరేపిత సందేశాలనూ…ఈ కరోనా పై వచ్చే అసత్య వార్తలనూ సంపూర్ణంగా నిషేధం అమలుచేస్తున్నట్లూ ఈ వీఆర్సీ గుర్తుకొస్తున్నాయి టీం తెలిపారు.

Featured ఆంధ్రప్రదేశ్

పినాకిని సత్యాగ్రహ(గాంధీ)ఆశ్రమం కి 100వ పుట్టినరోజు 

భారతదేశ చరిత్రలో  మహాత్మా గాంధీ స్థాపించిన ఆశ్రమాలలో ముఖ్యమైనవి మొదటిది  ఉత్తర భారతదేశంలో స్థాపించిన ఆశ్రమం “సబర్మతి  ఆశ్రమం” అయితే దక్షిణ  భారతదేశంలో స్థాపించిన ఆశ్రమం” పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం”.దీన్నే “దక్షిణ సబర్మతి” అని  పిలుస్తారు. ఈ ఆశ్రమం 1921  ఏప్రిల్ 7 వ తేదీ  మహాత్మా గాంధీ  స్వయంగా,స్వహస్తాలతో ప్రారంభించారు. ఈ మహిమాన్విత క్షేత్రం 7-4-2020  నాటికి 100 వ పుట్టిన రోజు జరుపుకోబోతున్నది.  సత్యం అహింస మీద ఆధారపడి గాంధీ గారు సాగించిన స్వాతంత్ర పోరాటంకి సత్యాగ్రహ సైనికులను తయారు చేయడానికి దక్షిణ భారతదేశంలో శిక్షణాలయం ప్రారంభించాలని ఆలోచిస్తుండగా,1890 సంవత్సరంలో ఒరిస్సా రాష్ట్రంలోని,గంజాంజిల్లాలో జన్మించిన హనుమంతరావుగారు తన జీవితాన్ని అంకితం చేయాలని నిశ్చయించుకుని, 1915 సంవత్సరంలో గాంధీగారిని హనుమంతరావు పూనా నగరంలో కలిశారు. గాంధీ వ్యక్తిత్వం పట్ల ఆకర్షితులై సబర్మతి ఆశ్రమంలో చేరి సేవ చేయడం ఆరంభించారు. హనుమంతరావు గారి క్రమశిక్షణ,అంకితభావం గమనించి, గాంధీ గారు ఆశ్రమం నడుపుటకు కావలసిన అన్ని లక్షణాలు  హనుమంతరావులో ఉన్నాయని గుర్తించి ఆశ్రమం ఏర్పాటు చేసే బాధ్యత  హనుమంతరావు భుజస్కందాలపై   ఉంచారు.పల్లిపాడులో 1894 వ సంవత్సరం లో పుట్టిన  చతుర్వేదుల వెంకటకృష్ణయ్య సబర్మతి ఆశ్రమంలో ఉంటూ హనుమంత రావు తో గాఢమైన స్నేహం ఏర్పడింది. పల్లెపాడు లో పినాకినీ నది ఒడ్డున ఆశ్రమ ఏర్పాట్లు అన్నివిధాలా తగినదని చెప్పటంతో ఇద్దరు గాంధీ గారి అనుమతితో పల్లెపాడు చేరుకున్నారు.కొండపర్తి పున్నయ్య గారు  వీరికి  తోడయ్యారు.   ఒక చేత స్వాతంత్ర్య సమరాన్ని,ఇంకొక చేత జమిందారు రైతు ఉద్యమాన్ని నడిపిన వీరనారీ,సవ్యసాచి  శ్రీమతి పొణకా కనకమ్మ గారు ఆశ్రమానికి కావాల్సిన  స్థలాన్నిఇచ్చారు. చిదంబరం పెళ్లై మున్నగు వారితో  కలసి తుపాకీ కేంద్రంగా ఉన్న ఆ స్థలాన్ని గాంధీ గారి పరిచయంతో అహింసా కేంద్రంగా మార్చే ఆలోచన చేసి 9 ఎకరాల మామిడి తోపును కొని  ఆశ్రమ స్థాపనకై ఇచ్చారు. చతుర్వేదుల వెంకట కృష్ణయ్య  మరి కొంత భూమిని సేకరించి  సమకూర్చారు. 1921 ఏప్రిల్ 7న మహాత్మా గాంధీ నెల్లూరుకు రైలులో వచ్చారు. శ్రీమతి పొణకా కనకమ్మ భర్త సుబ్బరామిరెడ్డి  ఇరువురు రైల్వే స్టేషన్ దగ్గరకు ఎద్దుల బండిలో వచ్చారు. బండిలో పెద్ద పరుపు వేసి గాంధీగారిని కూర్చుండబెట్టి  పల్లెపాడు కి తీసుకుని వెళ్లారు. నిర్మాణానికి గాను తన ఒంటి మీద నగలను మహాత్మునికి  విరాళంగా ఇచ్చింది. జీవితంలో తిరిగి నగల ధరించని వద్దని మహాత్ముడు  ఆమె వద్ద ప్రమాణం తీసుకున్నాడు. 1921వ  సంవత్సరం నవంబర్ 25 తేదీన ట్రస్ట్ డీడ్ ద్వారా ఆశ్రమాన్ని రిజిస్టర్ చేయించి, ప్రథమ ట్రస్టీలైన శ్రీ దిగుమర్తి హనుమంతరావు, వారి సతీమణి శ్రీమతి  దిగుమర్తి బుచ్చి కృష్ణమ్మ, శ్రీ చతుర్వేదుల  వెంకట కృష్ణయ్య,శ్రీ కొండపర్తి పున్నయ్య యావజ్జీవ ట్రస్టీలుగా,ఆశ్రమ సభ్యులనుండి ఎన్నుకోబడి మరి ఇద్దరు కలిసి బోర్డు గా వ్యవహరించుటకు ఏర్పాటు చేశారు. ట్రస్టు బోర్డు సభ్యుల సంఖ్య ఆరుగురికి మించ రాదని ఏర్పాటు చేశారు. గాంధీగారి గుజరాతీ స్నేహితులైన రుస్తుంజీ ,గాంధీగారి నిరాడంబరత ,ప్రేమ ఆదర్శ జీవితం,వారిపట్ల ఆకర్షితులై ఆశ్రమ నిర్మాణానికై 5వేల రూపాయల విరాళం ఇచ్చారు. జాతీయ కాంగ్రెస్ వారు 10.000 రూపాయలు, మునగాల రాజా 2 వేల రూపాయలు మరియు  కొంత ధనాన్ని  చందాల రూపంలో వసూలు చేసి  ఆశ్రమాన్ని నిర్మించడం జరిగింది. తొలుత పూరిపాకలతో ప్రారంభమైన ఆశ్రమం 1925 నాటికి ఆశ్రమంలో భవనాలు ఏర్పడ్డాయి. ఆ భవనానికి”రుస్తుంజీ భవన్” అని నామకరణం చేసారు. చతుర్వేదుల కృష్ణయ్య జనాన్ని సమీకరించడంలోనూ, సభలను చేయడంలో సమర్థులు,వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించేవారు. అస్పృశ్యత నిర్మూలన హరిజనోద్ధరణ వంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ జిల్లాలో తొలి హరిజన హాస్టల్ ను ప్రారంభించిన ఘనత వీరికి దక్కింది. కొంత కాలం గడిచిన తర్వాత ఈ బృందంలో   ఇస్కాచెంచయ్య దంపతులు ,కాళ్ళకూరి వెంకటరావు దంపతులు, హనుమంతరావు గారి సోదరులు వెంకటరామస్వామి, ఆయన భార్య జానకి దేవి చేరారు. పత్రికా సంపాదకులు ఖాసా సుబ్బారావు ,భార్య, వారి తల్లి, వాడ్రేవు జగ్గరాజు, శ్రీ గుణదల సుబ్బారావు గారు, తిరుపతి నాయుడు గారు, మణికొండ సత్యనారాయణ గారు, కొంతకాలం ఆశ్రమంలో ఉండి ఆశ్రమ కార్యక్రమాలలో సేవ చేస్తూ గడిపారు. పాటూరు సుబ్బరామయ్య,సరస్వతమ్మ దంపతులు,శ్రీమతి పొణకా కనకమ్మ,వెన్నెలకంటి రాఘవయ్య,తిక్కవరపు రామిరెడ్డి వంటి గాంధేయవాదులు ఆశ్రమ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు.1923 లో ఆశ్రమం లో బందిపోటు దొంగలు జోరపడి ఆశ్రమవాసులను కొల్లగొట్టి స్త్రీల వద్ద ఉన్న నగలను కూడా దొంగిలించడంమే కాకుండా, గాయాలపాలు చేసి పారిపోయారు.  అయినప్పటికీ ఆశ్రమవాసులు పోలీస్ రిపోర్ట్ ఇవ్వకుండా తిండికి లేని వారు ఈ పని చేసి ఉంటారని సమాధానపడి ఊరుకుండినారు. ఈ ఉదంతము ఇతరుల అందరిలో సంచలనం కలిగించింది రిపోర్టు లేనప్పటికీ పోలీసులు ఈ దొంగలముఠాను పట్టుకుని ఆశ్రమవాసులను నిందితులపై సాక్ష్యాన్నిఇస్తే బందీలుగా చేస్తామని చెప్పినా, ఆశ్రమవాసులు నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వకుండా వదిలివేశారు.దొంగతనం చేసిన కొన్ని బంగారు ఆభరణాలను  పోల్చుకొనుటకు దిగుమర్తి వచ్చి కృష్ణమ్మ గారిని కోరగా  నగలు తమవి వలె ఉన్నవి కాని తమవే అని నిర్ధారణగా చెప్పలేమని,అంగీకరించని కారణంగా ఆమె ప్రవర్తన చూసినంతనే దొంగలు విస్మయం చెంది, నేరగాళ్లను తామే ఒప్పుకొని,ఆ వృత్తాంతమును చేసింది వారేనని చెప్పి వేసినారు. కేసు రుజువై దొంగలకు శిక్ష పడింది. ఈ విషయం గాంధీ గారికి తెలిసి ఆశ్రమవాసులు యొక్క, ముఖ్యముగా శ్రీమతి కృష్ణమ్మ గారి యొక్క ధైర్యం ముందు ప్రవర్తనను  మెచ్చుకున్నారు. ఆశ్రమవాసులు ఒక గుణపాఠం అని, అస్తేయము ఆదర్శముగా గల ఆశ్రమ సభ్యులు ఆకర్షించు ఆభరణములను ధరించుటకానీ, బంగారం ఉంచుకొనుటగాని కూడదని విషయమును గ్రహించి అప్పటినుంచి ఆశ్రమంలో విలువైన ఆభరణములు ధనమును కలిగి ఉండటం మానివేశారు.చక్కగా నడుస్తూ ఉండగా 1925లో దిగుమర్తి హనుమంతరావు ప్రకృతి చికిత్సని పొందుతూ,మూత్రపిండ వ్యాధితో బాధపడుతూ 1926 నాటికి భౌతిక దేహాన్నివిడిచి పరమపదించడం జరిగింది. ఆయన భార్య అక్కడ ఉండకపోవడం, పిమ్మట చతుర్వేదుల వెంకట కృష్ణయ్య  హనుమంతరావు మరణంతో మనస్థాపం చెంది తుదకు ఆధ్యాత్మిక మార్గాన్ని పట్టి, పాండిచ్చేరి,అరవింద ఆశ్రమం వెళ్లిపోవడం  జరిగింది.హనుమంతరావుగారు మరణించిన తర్వాత కొంతకాలం కృష్ణమ్మగారు ఆశ్రమాన్ని నిర్వహించి సీతానగరం వెళ్ళిపోవడం జరిగింది.1929లో  రెండవ సారి మే11వతేదీన గాంధీగారు ఆశ్రమం కి విచ్చేయడం జరిగింది. అదే రోజు రాత్రి పల్లెపాడులో ఆశ్రమానికి విచ్చేసి ఆ రోజు రాత్రి అక్కడే బస చేయడం జరిగింది.ఆ సందర్భంలో ఆ ఊరి బ్రాహ్మణలు, బ్రాహ్మణ అగ్రహారంకి గాంధీజీని రావలసినదిగా కోరగా ,దళితులను కూడా ఆ వీధిలో అనుమతిస్తేనే వస్తానని చెప్పి ఆతర్వాత వారికి కూడా అనుమతి ఇస్తామని చెప్పినట్లు,అప్పుడే గాంధీ గారు బ్రాహ్మణ వీధికి వెళ్లారని, దారి పొడుగూతా వారు పోసుకుంటూ గాంధీ గారిని ఆహ్వానించారని గ్రామ ప్రజలు చెప్తుండేవారు. తర్వాతి కాలంలో కొండపర్తి పున్నయ్య గారు ఖాదీ సంస్థ లో పనిచేయుటకు వెళ్లిపోవడం, శ్రీ ఖాసా సుబ్బారావు గారు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి “స్వరాజ్య పత్రిక “సంపాదకులుగా, దిగుమర్తి వెంకటస్వామిగారు కాంగ్రెస్ సేవకులుగా వెళ్లి పోవడం,ఇస్కా చెంచయ్య గారు ఆయన భార్య బ్రహ్మసమాజం ఆడపిల్లల హాస్టల్ నడుపుటకు వెళ్లిపోవడం, శ్రీ కాళ్లకూరి వెంకట్రావు, వారి కుటుంబం కూడా ఆశ్రమం విడిచి పోవడం, శాశ్వత ధర్మకర్తల అందరూ ఒకరి తర్వాత ఒకరు ఆశ్రమాన్ని వదిలి వేయడం జరిగింది. ఆశ్రమం స్థాపించిన తొలి రోజుల్లో  రెంటాల కృష్ణమ్మ(య్య), ఆయన భార్య సుబ్బమ్మ  ఆశ్రమంలోనే స్థిరపడి, సేవచేస్తూ ఉండిపోయారు.1930లో ఉప్పు సత్యాగ్రహం,క్విట్ ఇండియాఉద్యమాలు  ఆశ్రమం తరపున కార్యకర్తలు నిర్వహించారు.గాంధీగారు బాధ్యతలను1942లో  శ్రీ దేశభక్త కొండా వెంకటప్పయ్యకి అప్పగించడం జరిగింది. వెంకటప్పయ్య గారు ఆశ్రమంలో ఖాదీ ఉత్పత్తి ,హిందీ భాష ప్రచారం ,వయోజన విద్య, అంటరానితనం నిర్మూలనా కార్యక్రమాలను చేపట్టారు. వెంకటప్పయ్య గారి కోరిక మీద ఓరుగంటి వెంకటసుబ్బయ్య గారు ఆశ్రమ బాధ్యతలు  స్వీకరించారు. ఓరుగంటి వెంకటసుబ్బయ్య  వారి భార్య మహాలక్ష్మమ్మ ,వెంకటసుబ్బయ్య కుటుంబంతో పాటు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ ఉపేంద్ర దంపతులు ఆయన తండ్రి ఆశ్రమంలోని కాపురం ఉంటూ ఆయుర్వేద ప్రకృతి చికిత్సలు  నిర్వహిస్తూ, శిక్షణ ఇవ్వడం జరిగింది. 1952లో  ఈ కృష్ణమ్మగారు  తర్వాత  సీతానగరం నుండి తిరిగి వచ్చి  పినాకిని సత్యాగ్రహ ఆశ్రమానికి గ్రామస్థాయి సహాయకులకు ఆరోగ్యసంక్షేమానికి,బాలవాడి, తేనె ఉత్పత్తి ,స్త్రీలకు వృత్తి విద్యలు నేర్పటం  వంటి శిక్షణా కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరిగింది. కొన్నాళ్లు కస్తూరిబా స్మారక నిధి నుండి కొంత ధన సహాయముతో శ్రీమతి ప్రభవ గారు మరియు మరుపూరు రుక్మిణమ్మ గారు  కొంతకాలం కాపాడారు. తర్వాత ఆ ఆశ్రమాన్ని స్వరాజ్ సంస్థకు కౌలుకు నిర్వహణ నిమిత్తమై ఇవ్వడం జరిగింది. 1983-89 వరకు సుప్రసిద్ధ విద్యావేత్త శివరాం ఆంగ్లేయ వనిత ఎలిన  వాట్స్ పల్లెపాడు  గ్రామంలో “సృజన “పాఠశాలను,1990లో పినాకిని విద్యా సొసైటీ వారికి, పల్లిపాడువాసి హైదరాబాదు గొల్లపల్లి చక్రవర్తి, నెల్లూరు వాసి అల్లాడి వాసుదేవన్ చివర నిర్వాహక ట్రస్టీలుగా, 1991 లో బుచ్చి కృష్ణమ్మగారు మరణించటంతో ఆశ్రమం ట్రస్ట్ స్థాపన,1997 లో స్థానికులు వేదాచలం గారు, తిక్కవరపు వెంకటరెడ్డి,తిక్కవరపు సుకుమార్ రెడ్డి, 2002 సంవత్సరంలోగ్రామ సర్పంచ్  శ్రీ వేదాచలం హయాంలో ఆశ్రమం బాగా దెబ్బతిని ఉంటే దాన్ని మరమ్మతులు  చేయించి, ఇంక నడిపించచాలమని భావించి,  ట్రస్ట్ ని రద్దు చేసి,తర్వాత 2003లోఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ 2005లో  నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ సంస్థ వారిని  కోరడం జరిగింది.వారంగీకరించిన మీదట ఆశ్రమాన్ని  అప్పటి రెడ్ క్రాస్ చైర్మన్  డాక్టర్ శ్రీ ఏ. వి. సుబ్రహ్మణ్యం గారికి బాధ్యత అప్పగించారు.ఉపసంఘానికి  సమన్వయకర్తగా శ్రీ గణేశం  కృష్ణా రెడ్డి గారు, కొంత మంది  సభ్యులను ఆహ్వానించి సహాయ సహకారాలతో అనేక కార్యక్రమాలు నిర్వహించారు.భవనాన్ని సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి,జిల్లా పరిషత్ శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి   ప్రధాన విరాళంతో పూర్తిస్థాయిలో జీర్ణోద్ధరణ కావించారు.                  ఆశ్రమ వ్యవస్థాపకులు, గాంధీజీ పై డాక్యుమెంట్లు, జీవిత చరిత్ర విశేషాలు అందుబాటులో

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.