Friday, 6 March 2026

Blog

Featured

మనుబోలు మండలంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన లు చేసిన కాకాణి

29-05-2020 మనుబోలు( పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలం, అక్కంపేట గ్రామంలో పర్యటించి, ₹1కోటి 73లక్షల రూపాయలతో చేపట్టిన పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు. లబ్దిదారులకు ఆరోగ్య శ్రీ కార్డుల పంపిని మనుబోలు మండలంలో చిన్న గ్రామమైన అక్కంపేట గ్రామ పంచాయతీ లో ₹1కోటి 73 లక్షల రూపాయలతో పనులు చేపట్టడం సంతోషంగా ఉంది. గ్రామంలో ₹55 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ప్రారంభించాం. గ్రామంలో ₹ 33 లక్షల రూపాయలతో సైడు కాలువల నిర్మాణాన్ని పూర్తి చేసి, ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నాం. గ్రామంలో ₹57 లక్షల రూపాయలతో గ్రామ సచివాలయ భవనానికి, రైతు భరోసా కేంద్రానికి శంకుస్థాపన చేశాం. గ్రామంలోని స్కూళ్లు మరమ్మతులకు మరియు ప్రహరీ గోడ మరమ్మతులకు ₹28లక్ష రూపాయల నిధులను మంజూరు చేసి, పనులు ప్రారంభించాం. ప్రతి గ్రామంలో అన్ని వసతి సదుపాయాలను కల్పించి, సర్వేపల్లి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తా. ప్రజలకు అవసరమైన సిమెంట్ రోడ్లు, సైడు కాలువలు, తాగునీరు, సాగునీరు సదుపాయం, పిల్లల చదువుకు అవసరమైన అంగన్ వాడీ భవనాలు, పొలాలకు వెళ్లేందుకు దారులు, స్మశాన వాటికల అభివృద్ధి, మొదలైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. గ్రామాల్లో పర్యటిస్తే, ప్రజలు వ్యక్తిగత సమస్యల కొరకు అర్జీలు ఇవ్వాల్సిందే తప్పా, సామాజిక అవసరాల కోసం అర్జీలు ఇచ్చే అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటాం. అధికారులు చిత్తశుద్ధితో పని చేసి, అభివృద్ధి కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాలి. జగనన్న ముఖ్యమంత్రిగా సంవత్సర కాలం పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. సర్వేపల్లి నియోజకవర్గంలో ఏడాది కాలంలో మీ ఇంటి బిడ్డగా ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టా. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు అతిపెద్ద సేవకుడిగా సేవా కార్యక్రమాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నానాని తెలిపినారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామిలో భాగంగా ఒక్కో క్కటిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తూ వస్తున్నారన్నారు. చేయబోయే సంక్షేమ పథకాలు ను తేదిలవారిగా ముందుగా ప్రకటించిన ఘనత జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందన్నారు. సర్వే పల్లిలో ముందుగా కూరగాయల పంపిణీ చేశామని దీనిని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయలు పంపిణీ జరిగిందని తెలిపారు.. రైతన్నకానుక రంజాన్ తోఫా అందించామని ఈ కార్యక్రమంలో అధికారులు చురుకుగా పనిచేశారని తెలిపారు. నియెజకవర్గంలో ఏ గ్రామంలో కూడా పలాన పని మిగిలివుంది అనిచెప్పకుండా చేస్తామని తెలిపారు. కరోనాకల్లోలంలో తొమ్మిది నెలలు మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగామని తెలిపారు. ప్రభుత్వం ప్రతిఅర్హుడికి ఇళ్శ పట్టాలు రైతులకు రైతుభరోసా మత్స్యకారులు కు చేయూత దర్శిలకు ఆటోవాలాలకు చేయూత నిస్తుందన్నారు. కరోనాకారణంగా అభివృద్ధి మూడునెలల పాటు కుంటుపడిందన్నారు. అంతకముందు తమగ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే కు బాణా సంచా మేళా తాళాలతో కిరణ్ కుమార్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి,బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి ,కడివేటి చంద్రశేఖర్ రెడ్డి ,దాసరి భాస్కర్ గౌడ్ ,దాసరి మహేంద్ర వర్మ అంబటి శీనువాసురెడ్డి దోడ్ల శీనువాసురెడ్డి వైకాపా నాయకులు అన్ని శాఖ ల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Featured

ఆదర్శప్రాయుడు జక్కా వెంకయ్య జక్కా వెంకయ్య .. ముత్యాల గురునాథం

ఆదర్శప్రాయుడు జక్కా వెంకయ్య జక్కా వెంకయ్య గారు యువతకు ఆదర్శమని సిఐటియు మండల కార్యదర్శి మల్లికార్జున పేర్కొన్నారు శుక్రవారం బస్టాండ్ లో సిఐటియు ఆధ్వర్యంలో ముఠా వర్కర్స్ ఏర్పాటుచేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ జక్కా వెంకయ్య గారు జిల్లాలో పీడిత బాడీ బాధిత ప్రజల పక్షాన నిలిచి వారి అన్నారు ఆయన అనేక భూ పోరాటాలు ఇళ్ల స్థలాల పోరాటాలు నిర్వహించారు జిల్లాలో అనేక వేల మందికి ఇండ్ల స్థలాలు చౌడు భూములు ఆయన ఆధ్వర్యంలో చేసిన భూ పోరాటాలు వాళ్లని వచ్చాయన్నారు ఆయనకి స్వర్గీయ పుచ్చలపల్లి సుందరయ్య ఆదర్శం అన్నారు ఆయన అడుగు జాడల్లో వెంకయ్య గారు నడిచి తన యావదాస్తిని సిపిఎం పార్టీ కోసం పేద ప్రజల కోసం ఖర్చు చేశారన్నారు ఆయన నిరాడంబరంగా జీవించేవారు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ముత్యాల గురునాథం మాట్లాడుతూ తూ రెండు పర్యాయాలు అల్లూరు నియోజకవర్గం నుండి ఇ ఇ ఎమ్మెల్యేగా గా గెలుపొంది నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు అభివృద్ధి చేసి పెట్టారన్నారు పట్టణంలో ఆయన కృషి వల్లనే కూరగాయల మార్కెట్ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు పార్టీలకతీతంగా ఆయన పేదలకు సేవ చేశారన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి జానీ భాష నాయకులు కుంకాలు వెంకటేశ్వర్లు పడవల సుబ్రమణ్యం పులి మల్లయ్య ఆటో యూనియన్ నాయకులు రాదయ్య mohta యూనియన్ కార్యకర్తలు పాల్గొన్నారు దారు మండల్ గ్రామం లో లో వెంకన్న వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గన్నవరం శ్రీనివాసులు సురేష్ బెజవాడ మోహన్ రాగి రాములయ్య ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు కాగుల పాడు గ్రామంలో జక్కా వెంకయ్య రెండో వర్ధంతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిల్లా రఘురామయ్య రఘురామయ్య నేటి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు పెనుబల్లి గ్రామంలో లో జక్కా వెంకయ్య రెండో వర్ధంతి నిర్వహించారు ఈ కార్యక్రమంలో నం నం మాధవ అ బాబు రమణయ్య తాళ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు జొన్నవాడ లో వెంకన్న వర్ధంతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తమ్మి రమణయ్య వెంకట రమణయ్య ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు minagallu గ్రామంలో వెంకన్న వర్ధంతిని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళ్ల గుంట అంకయ్య బాలకోటయ్య లక్ష్మణ్ బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు 

Featured

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంట మనుబోలు లో చలివేంద్రం వేర్పాటు …కాకాణి గోవర్దన్ రెడ్డి

29-05-2020 మనుబోలు (పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు గ్రామంలో వై. ఎస్. ఆర్.కూడలి వద్ద చలివేంద్రం ప్రారంభించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డిగారు.సర్వేపల్లి నియోజకవర్గంలో వేసవి తీవ్రత దృష్ట్యా, ప్రజల దాహార్తిని తీర్చేందుకు అవసరమైన చోట ప్రజలకు ఉపయోగపడే విధంగా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి చలివేంద్రలో పరిశుభ్రమైన తాగునీరుతో పాటు మజ్జిగ కూడా అందుబాటులో ఉంచుతున్నాం. ఉదయం నుండి సాయంత్రం వరకు చలివేంద్రాల ద్వారా తాగునీరు అందించడంతో పాటు, వృద్ధులకు, మహిళలకు మజ్జిగ అందజేస్తున్నాం. కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకొని సామాజిక దూరాన్ని పాటించే విధంగా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, డిస్పోజబుల్ గ్లాసులను ఉపయోగిస్తూ, ప్రజలకు సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం సూక్ష్మమైన, చిన్నపాటి పనులను కూడా ప్రజల అవసరాన్ని బట్టి చేపట్టేందుకు సిద్దంగా ఉన్నాం. ప్రజల అవసరాలను తీర్చడం, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తా. మండలకేంద్రమైన మనుబోలు రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద శుక్రవారం ఎమ్మెల్యే కాకాణి మజ్జిగ చలివేంద్రం ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతప్రభుత్వంలో ఎన్నికల పుడు చలివేంద్రాలు వెలిసేవని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం లో గెలిచిన సంవత్సరం నుంచే చలివేంద్రం ప్రారంబిస్తున్నామన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దల సహకారంతో కార్యక్రమం చేపట్టడం అభినందనియమన్నారు. ఈ కార్యక్రమంలో చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి, బొమ్మిరెడ్డి హర గోపాల్ రెడ్డి ,దాసరి భాస్కర్ గౌడ్, కడివేటి చంద్ర శేఖర్ రెడ్డి,చేరెడ్డి పట్టాభి రామిరెడ్డి,దాసరి మహేంద్ర వర్మ ,అన్నమాల ప్రభాకర్ రెడ్డి, మన్నేమాల సాయి మోహన్ రెడ్డి,ముంగర విజయభాస్కర్ రెడ్డి ,భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Featured

రాపూరు పట్టణములో శ్రీ నందమూరి తారక రామారావు గారి 98 జన్మదిన వేడుకలు

రాపూరు, మే 28, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు పట్టణములో తెలుగుదేశం వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 98 జన్మదిన వేడుకలు ఘనంగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ ముక్తార్ అధ్యక్షతన జరిగింది పట్టణ అధ్యక్షులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలోనే ఎస్సీ, ఎస్టీ, బి సి, మైనార్టీలు రాజకీయంగా ఆర్థికంగా ఎదగడానికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలుపరిచిన ఘనత తెలుగుదేశం లోనే అందుకే నందమూరి తారక రామారావు గారు ఇప్పటి నాయకులకు ఆదర్శంగా నిలిచారని చెప్పారు. ఈరోజు నందమూరి తారక రామారావు గారి వేడుకలను జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు మాజీ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ గారి. ఆధ్వర్యంలో ఈ వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నాము ఈ కార్యక్రమంలో మండల నాయకులు జిల్లా నాయకులు నువ్వుల శివ రామకృష్ణ ,కొండల పొడి రాఘవ రెడ్డి, శీలం వెంకటేశ్వర్లు నాయుడు, మాధవ్, రమణమ్మ , బిసి నాయకులు సంకల పాపయ్య, మైనారిటీ నాయకులు షేక్ అహ్మద్, సయ్యద్ కాజా,సయ్యద్ షఫీ, సయ్యద్ కరీమ్, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Featured

రాపూరు పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో చాలివేంద్రం ఏర్పాటు

రాపూరు, మే 28, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు పట్టణంలో గ్రంధాలయం వద్ద పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా వెంకటగిరి సిఐ అన్వర్ బాషా చేతుల మీదుగా రిబన్ కటింగ్ చేసి త్రాగునీరు చాలివేంద్రం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సిఐ అన్వర్ బాషా మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాలమేరకు వెంకటగిరి సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లు పరిధిలో ఒకటి లేదా రెండు చాలివేంద్రాలు ఏర్పాటు చేయటం జరుగుతుందని అందులో భాగంగా రాపూరు పోలీసు వారు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగినది రాబోయే రోజుల్లో ఎండలు అధికంగా ఉంటాయని వాతావరణశాఖ వారు హెచ్చరించడం జరిగినది కావున ప్రజలు అప్రమత్తంగా ఉండి ఈ చలివేంద్రాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ చాలివేంద్రం ఏర్పాటు చేసిన రాపూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ కోటిరెడ్డి,ఎస్ఐ స్వప్న,ఏ ఎస్సై వెంకటేశ్వరరావు మరియు సిబ్బంది సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు

Featured

రాపూరు మండలంలో తొలి కరోనా కేసు నమోదు

రాపూరు, మే 28, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు మండలంలోని మునగాల వెంకటాపురం పంచాయతీ లో నాయనపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి కరోనా పాజిటివ్ గా నిర్దారించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇది కోయంబేడు లింకు గా నిర్దారించడం జరిగింది ఈ వ్యక్తి చెన్నై ప్యారిస్ సెంటర్ నందు చిల్లర దుకాణంలో పనిచేస్తు ఎటువంటి అనుమతి లేకుండా ఈ నెల 9 వ తేదీన బైక్ మీద రావడం జరిగినది. వచ్చినప్పుడు నుండి హోమ్ కోరంటైన్ లో ఉంచి పరిశీలన లో ఉంచారు అతనికి నెల్లూరులో పరిక్షలు నిర్వహించిగా కరోనా పాజిటివ్ గా నిర్దారించారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.ప్రస్తుతం నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచారు. గ్రామన్ని పరిశీలించిన వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ షేక్ అన్వర్ బాషా మాట్లాడుతూ రాపూరు మండలంలో తొలి కరోనా కేసు నమోదైనడని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కేసు నమోదైన ప్రాతంలో కొన్ని రోజులు ప్రత్యేక ఆంక్షలు ఉంటాయని గ్రామస్తులు వాటిని తప్పక పాటించాలి లేనియెడల వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Featured

కావ్య, కళ్యాణి కి స్నేహ హస్తం పౌండేషన్ చేయూత

రాపూరు, మే 28, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : బాలాయపల్లి మండలం సుబ్రమణ్యం గ్రామం ఎస్సీ కాలనీ కు చెందిన కాటయ్య కుమార్తెలకు రాపూరు కు చెందిన స్నేహ హస్తం ఫౌండేషన్ ఐదు వేల రూపాయల నగదు, మందులు ,పండ్లు అందించింది అక్క చెల్లెలు అయిన కావ్య కళ్యాణి ఇద్దరు చిన్నప్పటినుంచి చర్మ క్యాన్సర్ తో బాధపడుతున్నారు తల్లిదండ్రులది మేనరికపు వివాహం కావడంతో ఈ తరహా సమస్యలు ఉత్పన్నం అవుతాయని వైద్యులు తెలిపారు సుమారు 14 సంవత్సరాలు గా ఈ పిల్లలిద్దరికీ అనేక ఆర్థిక ప్రయాసలకోర్చి రక్షిస్తూ ఉన్నారు వీరికి ప్రభుత్వం తరఫున ఎటువంటి సహాయం లేదు తనకు ఉన్నటువంటి కొద్ది భూమిని అమ్మి వారి వైద్య ఖర్చులకు ఖర్చు చేస్తున్నారు ప్రస్తుతం హైదరాబాదులోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర వైద్యశాల లో కంటికి సంబంధించిన చికిత్సను అందిస్తున్నారు వారి పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది ఎవరైనా సహాయం చేస్తే కానీ వారి పిల్లలకు చికిత్స అందించలేని దయనీయ పరిస్థితి ఎవరైనా దాతలు స్పందించి సహాయం చేసినట్లయితే తమ పిల్లలను మరి కొంత కాలం చికిత్స అందించగలమని వారు ప్రాధేయ పడుతున్నారు.ఈ కార్యక్ర మానికి పెరుమాళ్ళ ప్రసాద్ జ్ఞాపకార్థం వారి అక్క సుజాత గారు మరియు తల్లి రంగనాయకమ్మ గారు సహాయం చేశారు.మరియు వారికి అవసరమైన మందులను ప్రతి నెల స్నేహ హస్తం ఫౌండేషన్ నిర్వాహకులు దగరా పాండు రంగా రెడ్డి గారు ఉచితంగా అందజేస్తము అని తెలియజేశారు.

Featured

శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం స్పెషల్ క్యాలెండర్ ఆనం రామనారాయణ రెడ్డి ఆవిష్కరించారు

రాపూరు, మే 28, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం వారిచే భక్తుల సమాచారం కోసం ముద్రించిన 2020 స్పెషల్ క్యాలెండర్ ను నెల్లూరు ఆనం నివాసంలో మాజీ మంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి జే వెంకటసుబ్బయ్య మరియు దేవస్థానం అర్చకులు పలువురు పాల్గొన్నారు.

Featured

రాపూరు మండలం లో 18 రైతు భరోసా కేంద్రాల

రాపూరు, మే 28, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు మండల పరిధిలో 18 సచివాలయాలకు సంబంధించి 18 రైతు భరోసా కేంద్రాలను ఈనెల 30 తేదీన ప్రారంభించడం జరుగుతున్నది అని మండల వ్యవసాయ అధికారి ప్రతాప్ తెలిపారు ఇకనుండి రైతులకు వ్యవసాయ శాఖ సేవలను గ్రామ స్థాయిలో పొందవచ్చు అనగా నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు రైతులకు రైతు భరోసా కేంద్రాల నుండి సరఫరా చేస్తారు అని తెలియజేశారు.

Featured

చలివేంద్రాలను ప్రారంభించిన సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డిగారు.

రాపూరు, మే 28, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : సర్వేపల్లి నియోజకవర్గంలో వేసవి తీవ్రత దృష్ట్యా, ప్రజల దాహార్తిని తీర్చేందుకు అవసరమైన చోట ప్రజలకు ఉపయోగపడే విధంగా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం.ప్రతి చలివేంద్రలో పరిశుభ్రమైన తాగునీరుతో పాటు మజ్జిగ కూడా అందుబాటులో ఉంచుతున్నాం.ఉదయం నుండి సాయంత్రం వరకు చలివేంద్రాల ద్వారా తాగునీరు అందించడంతో పాటు, వృద్ధులకు, మహిళలకు మజ్జిగ అందజేస్తున్నాం.కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకొని సామాజిక దూరాన్ని పాటించే విధంగా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, డిస్పోజబుల్ గ్లాసులను ఉపయోగిస్తూ, ప్రజలకు సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం సూక్ష్మమైన, చిన్నపాటి పనులను కూడా ప్రజల అవసరాన్ని బట్టి చేపట్టేందుకు సిద్దంగా ఉన్నాం.ప్రజల అవసరాలను తీర్చడం, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తా అని తెలిపారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.