Friday, 6 March 2026

Blog

ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం జిల్లా హెల్త్ బులిటెన్ విడుదల చేసిన జిల్లా కలెక్టర్ నివాస్

శ్రీకాకుళం జిల్లాలో నేటి ఆదివారం కరోనా హెల్త్ బులిటెనను జిల్లా కలెక్టర్ జె.నివాస్ వెల్లడించారు. మొత్తం 45601 మంది నమూనాలు సేకరించి పరీక్షలకు పంపగా..39580 మందికి రిపోర్టులు నెగిటివ్ వచ్చాయని చెప్పారు. ఇంకా 6021 మంది రిపోర్టులు రావాల్సి ఉందని చెప్పారు.అదివారం 1937 మంది నమూనాలను పంపినట్లు తెలిపారు.ఈ రోజు కొత్తగా కేసులు నమోదు కాలేదన్నారు.కాగా ప్రస్తుతం ఐదుగురు డిశ్చార్జి అయ్యి 9మంది చికిత్స పొందుతున్నారు

చిత్తూరు

చంద్రగిరి మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

అట్టహాసంగా.. * చంద్రగిరి మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం * నిబద్ధత, అవగాహన కలిగిన పాలక మండలి * ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి   తిరుపతి,   చంద్రగిరి మార్కెట్ యార్డ్ నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమక్షంలో అట్టహాసంగా సాగింది. మార్కెట్ యార్డ్ చైర్మెన్ గా మస్తాన్, ఉపాధ్యక్షులుగా కుప్పిరెడ్డి భాస్కర్ రెడ్డి, మరో పద్నాలుగు మంది సభ్యులచే గౌరవ అధ్యక్షులు హోదాలో ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఆదివారం మార్కెట్ యార్డ్ వేదికగా పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. రైతు సమస్యలపై అవగాహన, పరిష్కరించడంలో నిబద్ధత కలిగిన సభ్యులు పాలకమండలి లో ఉన్నారని తెలియజేశారు. రాష్ట్రంలోనే చంద్రగిరి మార్కెట్ యార్డ్ అతి త్వరలో ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రైతే రాజు దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఎర్ర వారిపాలెం, చిన్నగొట్టి గాల్లు, చంద్రగిరి మండలాల పరిధిలోని రైతులకు నాణ్యమైన సేవలు అందించాలని పాలక మండలి సభ్యులకు తెలియజేశారు. రైతులకు 24×7 అందుబాటులో ఉంటారని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే చెవిరెడ్డి ని పాలకమండలి చైర్మెన్ మస్తాన్, వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి నాగలిని బహూకరించి, గజమాలతో సత్కరించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి స్పూర్తితో రైతులకు సేవలు అందిస్తామని నూతన పాలకమండలి సభ్యులు స్పష్టం చేశారు. అంతకు ముందు ఎమ్మెల్యే చెవిరెడ్డి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ కమిటీ చైర్మన్ సహదేవ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు, ఎంపీడీవో రాధ తదితరులు పాల్గొన్నారు.

Featured

బిజెపి మనుబోలు మండల నూతన అధ్యక్షుడుగా ఓడూరు శ్రీనివాసులు రెడ్డి

31-05-2020మనుబోలు ( పున్నమి ప్రతినిధి)తిరుపతి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శ్రీ.సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారి అధ్యక్షతన మనుబోలు మండలం గోవిందరాజపురం గ్రామంలో బిజెపి మండల స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మనుబోలు మండల బిజెపి అధ్యక్షుడిగా ఓడూరు శ్రీనివాసులురెడ్డి ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ సమావేశంలో నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ మండల స్థాయిలో బిజెపి పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు తనను బిజెపి మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల నాయకులకు కార్యకర్తలకు తన కృతజ్ఞతలు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు బోలా శ్రీనివాసులు మాట్లాడుతూ నాయకులు అందరం కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీని మనుబోలు మండలం లో గ్రామస్థాయిలో బలోపేతం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మనుబోలు మండల ప్రధాన కార్యదర్శి పట్నం వీర ప్రతాప్ మరియు మనుబోలు మండల బిజెపి నాయకులుచల్లా లక్ష్మయ్య ,దగ్గవోలు రామిరెడ్డి ,ముప్పవరపు చిన్న, ఇరగ రాజ అంకయ్య మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Featured

మినగల్లు సేవాసమితి ఆధ్వర్యంలో 300కుటుంబాలకు కూరగాయలు కోడిగుడ్లు పంపిణీ..

31-05-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం మండలం మినగల్లు గ్రామంలో షుమారు 300కుటుంబాలకు కూరగాయలు, కోడిగుడ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగానే త్రాగు నీరు, మజ్జిగ చలివేంద్రం కూడా ప్రారంభోత్సవం జరిగింది. మినగల్లు సేవాసమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు వెంకటరమణ దాతగా వ్యవహరించారు. చలివేంద్రం ప్రారంభించిన అనంతరం వెంకటరమణ మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టామని.. భవిష్యత్తులో సైతం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు అమర్నాథ్ రెడ్డి, శేఖర్, ఏకొల్లు శ్రీనివాసులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

అంకిత భావంతో పనిచేసి పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులు కు ఘనంగా సన్మానం. ఎస్పీ ఆర్. ఎన్. అమ్మిరెడ్డి

 శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరం లో ఆదివారం పదవీ విరమణ పొందిన అదనపు ఎస్పీ శ్రీ జి.గంగరాజు, డిస్పీ  టి.పాల్గుణరావు, Offce Supdt., పి. రాజేశ్వరరావు, AR RSI జి. నాగరాజు, AR హెడ్ కానిస్టేబుల్  ఆర్ సి హెచ్ ప్రధాని గార్లను ఎస్పీ ఆర్. ఎన్. అమ్మిరెడ్డి వారు భౌతిక  దూరం పాటిస్తూ దుశ్శాలువ తో సన్మానం చేసి, చిరు జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్బంగా ఎస్పీ వారు మాట్లాడుతూ, గంగరాజు గారు మృదు స్వభావని, అంకిత భావంతో పనిచేసి, తనదైన శైలిలో క్రైమ్ కేసులు ను ఎన్నో ఛేదించారని, విధుల్లో ముక్కుసూటి గాఉంటారని, మంచి మనసుతో క్రింది స్థాయి తన సిబ్బంది అభిమానాన్ని పొందారని అన్నారు. గంగరాజు గారు మాట్లాడు తూ శ్రీకాకుళం జిల్లా ప్రజలు, ఇక్కడ సిబ్బంది ఎంతో సౌమ్యులని, కష్టపడి పనిచేస్తారని, ఈ జిల్లా వచ్చే ముందు చాలా దూరం బదిలీ అయిందని బాధపడుతూ వచ్చాను కానీ ఈ రోజు వెళ్లేందుకు బాధపడుతున్నా అని బావుద్వేగంతో అన్నారు G.గంగరాజు గారు 1984 సం లో RSI  గాను చేస్తూ, గ్రూప్ ll లో ఎంపికై  1985 లో సివిల్  ఎస్.ఐ గా  చేస్తూ Ci, DSP, అదనపు ఎస్పీ గా పదోన్నతి ని పొందినారు. డిఎస్పీ టి.పాల్గుణరావు గారు 1989 లో ఎస్. ఐ  గా పోలీస్ శాఖ లో చేరి డిస్పీ గాను, పి. రాజేశ్వరరావు గారు 1986 లో  జూనియర్ అసిస్టెంట్ గా పోలీస్ శాఖ లో చేరి Offce Supdt., గాను, G.నాగరాజు  1979 లో AR కానిస్టేబుల్ గా చేరి RSI గాను, ఆర్ సి హెచ్ ప్రధాని గారు 1984 లో కానిస్టేబుల్ గా చేరి హెడ్ కానిస్టేబుల్ గాను పదోన్నతిలు పొంది ఈ రోజు ఆరోగ్యం గా పదవీ విరమణ పొందడం ఎంతో అదృష్టవంతులుగా భావించాలని ఎస్పీ అన్నారు. * ఈ కార్యక్రమం లో అదనపు ఎస్పీ కె. శ్రీనివాసరావు గారు, డిఎస్పీ DSRVSN మూర్తి, రారాజు ప్రసాద్, సత్యనారాయణ, శివరామ రెడ్డి, Ch.G.V.ప్రసాద్, శ్రీనివాసరావు, శ్రీలత,పరిపాలన అధికారి ప్రసాద్ గారు, కార్యాలయ సిబ్బంది,  సి.ఐ లు, ఆర్. ఐ  లు, కుటుంబ సభ్యులు, అధికారుల సంఘం ప్రెసిడెంట్ కె అప్పన్న తదితరులు పాల్గొన్నారు.

Featured

గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీ చేసిన ఎం.పి. చింతా. అనూరాధ అమలాపురం, మే 31,2020 (పున్నమి విలేఖరి) రక్త హీనత లేకుండా గర్భిణీ స్త్రీలు క్రమం తప్పకుండా పౌష్టికాహారాన్ని తీసుకోవాలని అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి చింతా అనూరాధ సూచించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఈ రోజుకు సంవత్సర కాలం పూర్తి అయిన సందర్భంగా మామిడికుదురు మండలం పాసర్లపూడి గ్రామంలో పి.గన్నవరం శాసన సభ్యులు కొండేటి చిట్టిబాబు తో కలిసి గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం ఎం.పి. చింతా.అనురాధ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగరం ఏ.ఎం.సి. చైర్మెన్ కొమ్ముల కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

‘తోటపల్లి’ సైఫూన్ బీటల పరిశీలన

పాలకొండ : మండలంలోని మల్లివీడు వద్ద గల తోటపల్లి ప్రధాన కాలువ సైఫూన్ కు పడిన బీటలను తోటపల్లి సాధన సమితి కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంటనే మరమ్మతులు చేపట్టకపోతే ఖరీఫ్ కు సాగు నీరు కష్టమేనని పేర్కొన్నారు.  వెంటనే మరమ్మతులు చేపట్టాలని,  లేకుంటే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.

Featured

వెంకటేశ్వర ఆలయంలో ధన్వంతరి యాగం

వెంకటేశ్వర ఆలయంలో ధన్వంతరి యాగం పలమనేరు మే31,2020(పున్నమి విలేకరి ): పలమనేరు రూరల్ మండలం గొల్లపల్లి గ్రామంలోని తిరు వెంకట నగరిలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం నందు జ్యేష్టాభిషేక పూజలను అత్యంత వైభవంగా మూడు రోజుల పాటు నిర్వహించారు ఇందులో భాగంగా ఆదివారం ఉదయం ధన్వంతరియాగము ,సుదర్శన్ హోమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం మహాపూర్ణాహుతి చేసి మంగళ హారతులతో స్వామి వారి యాగాన్ని పరిసమాప్తం చేశారు. పవిత్ర కలశాల్లోని జలాలను శ్రీచక్ర ఆళ్వార్లకు నాగదేవతలకు కుంభ అభిషేకాన్ని నిర్వహించి పూజలను ఘనంగా జరిపారు. సామాజిక దూరం పాటిస్తూ లాక్డౌన్ నిబంధనలతో ఆలయ అర్చకులురంగనాథ ఆచార్యులు ధర్మకర్తల కమిటీ కొద్దిమందితో మాత్రమే పూజా కైంకర్యాలను నిర్వహించారు అనంతరం రంగనాథ ఆచార్యులు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహాయ సహకారాలతో నిర్మించిన ఈ ఆలయం దినదిన అభివృద్ధి చెందుతూని పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం పూజా కైంకర్యాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టిటిడి వారి సహాయ సహకారానికి గ్రామస్తులు తరఫున ఆలయ అర్చకులు కృతజ్ఞతలు తెలిపారు

Featured

అప్రమత్తత అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట

శ్రీకాకుళం :  అప్రమత్తత, అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాలని ఎస్పి ఆర్ఎన్ అమ్మిరెడ్డి  పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ సమీక్ష సమావేశాన్ని శ్రీకాకుళంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై సైబర్ క్రైమ్  అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని అన్నారు, ఫిర్యాదుదారుడికి భరోసా కల్పించేలా దర్యాప్తు చేయాలన్నారు,  సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు.అప్రమత్తత అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట

Featured

తర్లుపాడు మండలం లో మహిళ ఉరి వేసుకొని మృతి

ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం లోని నాగెళ్లముడుపు గ్రామానికి చెందిన బోగెం నాగమణి అనే మహిళ ఉరి వేసుకొని అనుమానాస్పదంగా చనిపోయి ఉన్నట్లు తెలియజేశారు. విషయం తెలుసుకున్న తాడివారిపల్లి ఎస్ఐ ఆవుల వెంకటేశ్వర్లు వారి సిబ్బంది వాహనంలో సంఘటన స్థలానికి చేరుకొని మృతురాలిని పరిశీలించి చనిపోవడానికి గల కారణాలను బంధువులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఆవుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భోగెము నాగమణి అనే మహిళ రాత్రి 11 గంటల సమయాన ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందా లేక హత్యనా అని తెలియాల్సి ఉంది. మృతురాలి తల్లి మీనిగ లక్షమ్మ పిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకొని మృతురాలిని పరిశీలించామని ఈమెకు భర్త చెన్నకేశవులు, అబ్బాయి, అమ్మాయి ఉన్నారని తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణారెడ్డి, కానిస్టేబుల్ సత్యం, వీఆర్వో రామకోటేశ్వరరావు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.