Friday, 6 March 2026

Blog

Featured

” మనం – మన పరిశుభ్రత ” కార్యక్రమంలో ప్రజలు అందరూ భాగస్వాములు కావాలి – ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి.

01-06-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం మండలం చెల్లాయపాలెం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ” మనం – మన పరిశుభ్రత ” కార్యక్రమంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో భాగంగానే ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే గ్రామాలలో నివసించే ప్రజలు కూడా ఆరోగ్యముగా ఉంటారని అన్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రతి కుటుంబం నుంచి రోజుకు రెండు రూపాయల చొప్పున వసూలు చేస్తూ అలా వచ్చిన డబ్బును గ్రామంలో పరిసరాలను పరిశుభ్రం పరిచే ఈ కార్యక్రమానికి ఉపయోగిస్తారని అన్నారు. ఇందులో భాగంగానే చెల్లాయపాలెం గ్రామములో సేకరించిన చెత్తను డంప్ చేయడానికి డంపింగ్ యార్డ్ కూడా ప్రారంభించారు. అంతే కాకుండా ఆయన మొక్కలను నాటుతూ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలంటే, ప్రతిఒక్కరు చెట్లను నాటాలని అన్నారు. ఈ సందర్భంగా మనం మన పరిశుభ్రత కార్యక్రమం గురించి మాట్లాడుతూ మన జిల్లాలోని ప్రతి మండలంలో రెండు గ్రామాలను ఎంపిక చేసుకొని ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలో పరిశుభ్రత పైన చైతన్యం తీసుకురావాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కరోనా కట్టడి నేపథ్యంలో లాక్ డౌన్ విధించదముతో ప్రభుత్వం అందించిన సహాయ సహకారాలు మాత్రమే కాకుండా కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా, దాతలు ద్వారా, వైసిపి నాయకులు కార్యకర్తలు ద్వారా కూడా 13 జిల్లాల్లో అన్ని ప్రాంతాలలో ముందుకు వచ్చి ఉడతాభక్తిగా నిత్యవసర వస్తువులు రైస్, కూరగాయలు, పాలు, వంటివి పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగానే మన కలెక్టర్ శేషగిరిరావు అరవింద్ ఫార్మసీ వాళ్ళతో మాట్లాడి మన జిల్లాకు కూడా ఏదో ఒక సహాయం చేయండని కోరిన మీదట నెల్లూరు జిల్లాకి నిత్యావసర సరుకుల కిట్లను పంపించడం జరిగింది. మన నియోజకవర్గానికి మూడు వందల కిట్లును ఇచ్చారు. ఇవి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో చల్లా గిరిజనులను ఎంపిక చేసుకొని వారికి అందించాలని అనుకున్నామన్నారు. అందులో భాగంగానే ఈ రోజు బుచ్చిరెడ్డిపాలెం మండలం చెల్లాయపాలెం గ్రామంలో 65 కిట్లను పంపిణీ చేస్తున్నాము అని అన్నారు. కలెక్టర్ గారు అరవింద్ ఫార్మసీ వాళ్ళతో మాట్లాడి మన జిల్లాకు కిట్లను ఇచ్చినందుకు కలెక్టర్ గారికి మరియు జిల్లా పరిషత్తు సి ఈ ఓ గారికి కి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరంలో దాదాపు మూడు కోట్ల 58 లక్షల మంది లబ్ధిదారులకు 40 వేల కోట్లకు పైగా లబ్ది చేకూరే విధంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏర్పడకముందు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నది. అయినా ఇచ్చిన హామీల ప్రకారం అన్నిటినీ నెరవేర్చుకుంటూ ప్రజల హృదయాలను గెలుచుకోవడంలో విజయం సాధించారు. ఈ విజయాన్ని చూసి చంద్రబాబు నాయుడు సహించలేకపోతున్నాడని ఆయన అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విధంగా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు కార్యకర్తలు ప్రతి ఒక్కరు పని చేస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరం రోజుల్లో ఎక్కడ అవినీతికి తావు లేకుండా పరిపాలన సాగించిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంతవరకు మా జగన్ మోహన్ రెడ్డి గారి వెంట్రుక కూడా చంద్రబాబు పీకలేడు అని ఆయన ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగానే వవ్వేరు బ్యాంకు చైర్మన్ సూరా శ్రీనివాసులు రెడ్డి కానుగ చెట్ల కాలనీ సెంటర్లో సుమారు 50 కుటుంబాలకు నిత్యవసర సరుకులను ప్రసన్న కుమార్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వవ్వేరు బ్యాంకు చైర్మన్ సూరా శ్రీనివాసులురెడ్డి, సి ఐ సురేష్ బాబు, ఎమ్మార్వో షఫీ మాలిక్, ఎంపీడీవో నరసింహారావు, ఎస్సై జిలాని, మైనార్టీ నాయకులు అల్లాబక్షు, అన్ని శాఖలకు సంబంధించిన మండల స్థాయి అధికారులు, వైసీపీ కార్యకర్తలు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Featured

రెండు బైకులు ఢీ -ప్రాణాలు కాపాడిన హెల్మెట్

పలమనేరు, జూన్1,2020(పున్నమి విలేకరి): పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని చెన్నై-బెంగళూరు జాతీయ రహదారి పెద్ద చెరువు వద్ద రెండు వాహనాలు ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో ముత్తుకూరు క్రాస్ జంగలపల్లి చెందిన మదన్ మోహన్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కానీ వాహనం నుజ్జునుజ్జయింది.హెల్మెట్ ఉండడంతో తలకు ఎటువంటి గాయాలు కాలేదు. క్షతగాత్రులను పలమనేరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Featured

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో తిరుమల లడ్డూలు పంపిణీ

పొదలకూరు  : పట్టణంలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్ధానం ప్రాంగణంలో సోమవారం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో 300 మందికి తిరుమల లడ్డూలను ఉచితంగా పంపిణీ చేశారు.అనంతరం అన్నదానం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వాసవి క్లబ్ మండల అధ్యక్షులు వడ్లపూటి బాలమురళీకృష్ణ మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ తో దేశం అతలాకుతలం అయ్యిందని లాక్ డౌన్ విధించి సుమారు రెండు నెలలు గడుస్తుంటే వాసవి క్లబ్ తరపు నుంచి నిరుపేదలకు అన్నదానం , మజ్జిగ ప్యాకెట్లు , శ్యానిటైజర్లు , మాస్కులు పంపిణి చేశామని తెలిపారు.అందులో భాగంగా నేడు తిరుమల తిరుపతి దేవస్ధానం లడ్డూలను 300 మందికి ఉచితంగా పంపిణి చేశామని తెలిపారు.అంతే కాకుండా రానున్న రోజుల్లో మా క్లబ్ ఆధ్వర్యంలో మరెన్నో సేవకార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు రాచపూటి వెంకట రమణయ్య , పొట్టి సుధాకర్ , చెంచయ్య , ఆకులూరు విజయ్ , ఆకులూరు మధు ,కృష్ణం వెంకటరమణయ్య , అనిశెట్టి వెంకటేశ్వర్లు , ప్రభాకర్ , రవి , అమరా శివ , దేవస్ధానం కమిటి సభ్యులు సన్నికంటి శ్రీనయ్య , శ్యామ్ , చొప్పా వెంకటేశ్వర్లు , శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

పిటిడి ఉద్యోగులకు రూ. 27 వేల కనీస వేతనం ఇవ్వాలి

శ్రీకాకుళం : ప్రజా రవాణా సంస్థ (పిటిడి / ఆర్టీసీ) ఉద్యోగులకు కనీస వేతనం రూ.27వేలు ఇవ్వాలని  ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదరరావు కోరారు. పే రివిజన్ కమిషన్ కు సమర్పించనున్న ప్రతిపాదనను సోమవారం శ్రీకాకుళం లో విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 68 శాతం ఫిట్ మెంట్ ను అవును చేయాలన్నారు. పాత పెన్షన్ విధానాన్ని వర్తింప చేయాలని కోరారు.

హెల్త్ టిప్స్

రోబోతో కరోనా సేవలు

పలమనేరు జూన్1,2020(పున్నమి విలేకరి): పలమనేరు రూరల్ మండలంలోని మొరం గ్రామం చెందిన యువ శాస్త్రవేత్త పవన్ కుమార్ చాలా ప్రయోగాలు చేసాడు. తాజాగా మరో అద్భుతం సృష్టించాడు. దేశ వ్యాప్తంగా కరోన వైరస్ అలాడుతున్నదన్నారు కరోన రోగులకు సేవలు అందించేందుకు అందరూ భయపడుతున్నారు.కరోన రోగులకు వైద్యం చేయడానికి, వారికి మందులు ఇవ్వడానికి వైద్యులు ఇక భయపడవలసిన పనిలేదని శాస్త్రవేత్త పవన్ కుమార్ అంటున్నారు ఇందుకోసం తాను ఒక రూపం తయారు చేసినట్లు తెలిపారు తయారు చేసిన రోబో ను పలమనేరు పట్టణంలోని ఈమాస్ లెప్రసీ ఆస్పత్రిలో ప్రయోగాత్మకంగా పని చేయించారు.కారోనా సోకిన రోగులు దగ్గరికి ఆస్పత్రి సిబ్బంది వెళ్లి పని ఉండదన్నారు . అందులోని ప్రోగ్రాం ప్రకారం రోబోనే నేరుగా వెళ్లి మందులు అందిస్తుందని తెలిపారు. అంతేకాకుండా నిర్ణిత దూరం నుంచి రోగికి అవసరమైన వాటిని అందించి ఫోటో తీసుకుందని తెలిపారు. కరోనా రోగికి చికిత్స సమయంలో మందులు, భోజనం రిమోట్ ద్వారా రోబో చేతులతో అందించే ఏర్పాటు చేసుకోవచ్చున్నారు.త్వరలో ఒక రోబోను తిరుపతి రుయా ఆస్పత్రికి ఇవ్వాలనుకుంటున్నాను అని ఆయన తెలిపారు.

ప్రకాశం

ఉలవపాడు లో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు

ఉలవపాడు మండలంలో మరో రెండు కరోన పాజిటివ్ కేసులు నమోదు. ఉలవపాడు లో ఒకరికి, కరేడు లో మరొకరికి టెస్ట్ ల ద్వారా నిర్ధారణ కాగా, ఉలవపాడు లో వచ్చిన వ్యక్తి ఉలవపాడు రాక ముందే సూరత్ నుండి వస్తున్న సమయంలో ఒంగోలు క్వారంటైనే లో ఉంచి పరీక్షలు జరిపారు. దీని వలన గ్రామంలో అధికారులకు, గ్రామస్తులుకు కాస్త ఊరట లభించింది.

Featured

సచివాలయంలోనే మీసేవలు

సచివాలయంలోనే మీసేవలు పలమనేరు,జూన్1(పున్నమి విలేకరి): పలమనేరు రూరల్ మండలంలోని గ్రామ సచివాలయంలో మీసేవలు అందుబాటులోకి వచ్చాయని ఎంపిడిఓ విద్యాసాగర్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామ సచివాలయంలో ద్వారా ఇక నుండి మీసేవ అందుబాటులో వచ్చని ప్రజలందరూ రూ.15 రుసుము చెల్లించి వారికి అవసరమైన సేవలు రెవిన్యూ సర్వీసులు ఆధార్ ఈకెవైసి కాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికెట్, పట్టాదారు పాసు పుస్తకం,ఫ్యామిలీ మెంబెర్,ఈ సి,బర్త్,డెత్ ,మొదలగు సేవలు పొందవచ్చున్నారు.

Featured

మితిమీరిన వేగం అత్యంత ప్రమాదకరం

పలమనేరు జూన్1,2020(పున్నమి విలేకరి): పలమనేరు పట్టణ సమీపంలోని కేటీల్ ఫారం పలమనేరు- కుప్పం రహదారి గుండా వెళ్లే వాహనాలను ఏఎస్ఐ శ్రీధర్ తన సిబ్బందితో కలిసి తనిఖీ చేపట్టారు. అతి వేగంతో ప్రయాణిస్తున్న వాహనాలను అపి జరిమానాలు వేశారు. అలాగే ఓవర్ లోడ్ తో వెళుతున్న ఆటోలకు కూడా జరిమానాలు విధించారు. ఏఎస్ఐ శ్రీధర్ మాట్లాడుతూ… ద్విచక్ర వాహనం నడిపే చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అలాగే కారులో ప్రయాణించే సమయంలో డ్రైవర్ తో పాటు ప్రయాణికులు సీటు బెల్టు ధరించాలని సూచించారు. అతి వేగంతో వాహనం నడిపితే ప్రమాదం తప్పదన్నారు.అతి వేగంతో వాహనం నడిపితే ప్రమాదం తప్పుదన్నారు. అధిక శాతం ప్రమాదాలు మితిమీరిన వేగంతో జరిగినట్లు చెప్పారు. మీరు క్షేమంగా ఇంటికి వెళితే కుటుంబంతో సంతోషంగా ఉంటుందని భావన కలగాలన్నారు. ప్రమాదం తగ్గించాలనే లక్ష్యంతో నే వాహనచోదకులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు పాటించకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

గూడూరు

అప్పాచి విధులకు వెలుతున్న కార్మికులను అడ్డుకున్న గ్రామస్తులు

నెల్లూరు జిల్లా తడ మండలం చేనిగుంట గ్రామంలో అపాచీ కంపెనీకి వెళ్తున్న కార్మికులను ఆ ఊరి గ్రామస్తులు అడ్డుకుని కరోనా నేపద్యంలో విధులకు ఎవరు వెళ్ళద్దని మన ఊరి చూట్టు ప్రక్కల కరోనా ఉందని దయచేసి కంపెనీలకు ఎవరు వెళ్లద్దు అని చెప్పి కార్మికులను పంపించివేసారు.ఈ విషయం గురించి గ్రామ mptc చంద్ర గారు  మాట్లాడుతూ ఎవరు ఇంటి నుండి బయటకు రాకుండా తగు జాగ్రత్తలు పాటించాలి అని చెప్పారు, ఇందుకు సహకరించిన మన ఊరి వాళ్ళందరికి ధన్యవాదలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

బైరిదేశిగెడ్డ శివారు భూములకు సాగునీరు అందించాలి

శ్రీకాకుళం :  భైరిదేసిగెడ్డ శివారు భూములకు కూడా సాగునీరు అందించాలని జలవనరుల శాఖ అధికారులను ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఆదేశించారు. శ్రీకాకుళంలోని తన క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ ఉపాధి హామీ పథకం అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సాగు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.