Thursday, 5 March 2026

Blog

Featured

పర్యావరణాన్ని కాపాడు

తూర్పుగోదావరిజిల్లా అమలాపురం : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని అమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి బి.హెచ్. భవానీ శంకర్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం అమలాపురం ఆర్.డి. ఓ కార్యాలయం ఆవరణ లో ఆర్.డి. ఓ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రకాల కాలుష్యాల వల్ల వాతావరణ సమతుల్యం దెబ్బతిని పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, ఇందుకు గాను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటాలని ఆర్.డి. ఓ పిలుపునిచ్చారు. మొక్కలు నాటడమనేది భాద్యతగా స్వీకరించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్.డి. ఓ కార్యాలయం పరిపాలనాధికారి శ్రీనివాస్, కె .ఆర్. సి. తహసీల్దార్ జి. లక్ష్మీపతి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే సత్తి నాగేశ్వరరావు, డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్, మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Featured

పేరూరు హై స్కూల్ లోకి జొరబడిన రక్త పింజరి పాము..

తూర్పుగోదావరిజిల్లా, అమలాపురం మండలం పేరూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోకి జొరబడిన 4 అడుగుల రక్త పింజరి పాము స్థానికులను హడలెత్తించింది. దీనితో స్ధానికంగా పాములను పట్టణంలో నేర్పరియైన స్నేక్ క్యాచర్ అయిన వర్మ అత్యంత చాకచక్యంగా పట్టుకుని ఈ రక్త పింజరిని బంధించాడు స్నేక్ క్యాచర్ వర్మ, అనంతరం పామును ఫారెస్ట్ సిబ్బందికి అప్పగించారు.

ఆంధ్రప్రదేశ్

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత.

శ్రీకాకుళం, జూన్ 5 : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీరు ఎస్.శంకర్ నాయక్ అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నగరంలోని గుజరాతిపేట పి.యన్.కాలనీలో గల కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పర్యావరణ ఇంజనీరు మాట్లాడుతూ ప్రపంచం కాలుష్య కోరల్లో చిక్కు కుందని, మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలన్నారు. ప్రస్తుతం వాతావరణంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయని, ఒకప్పుడు పేదవాడి ఊటీ గా పేరొందిన శ్రీకాకుళంలో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటి దాని సంరక్షణ చూడాలని, వృక్ష సంపద ఎంత పెరిగితే మనం అంత పరిరక్షించ బడతామని ఆయన పేర్కొన్నారు. అనంతరం తమ సిబ్బందితో “పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ”  చేశారు. నగరంలో పలు కూడళ్లలో పర్యావరణంకు సంబంధించిన బ్యానర్లు, గోడ పత్రికలు అతికించారు. కరపత్రాలను పంపిణీ చేశారు. కోవిడ్-19 నిబంధనల ప్రకారం సామాజిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు పరిశ్రమల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి సహాయ ఇంజనీర్లు బి.కరుణశ్రీ, సి.హెచ్.హరీష్, కార్యాలయ సిబ్బంది, క్షేత్ర సిబ్బంది పాల్గొన్నారు.

Featured

ప్రతి ఒక్కరిని విద్యావంతులుగా తీర్చిదిద్దడమే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం-సర్వేపల్లి విశ్వరూప చారి

రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తు ఉన్నత శిఖరాలకు చేర్చే దిశగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది అని వైయస్సార్  విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్వేపల్లి విశ్వరూప చారి విలేకరుల్ల తో మాట్లాడుతూ  జీవో నెంబర్ 43 రద్దుచేసి పీజీ మెడికల్ సీట్ల లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు న్యాయం చేసి విద్యార్థుల పక్షాన నిరంతరం కృషి చేసే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు,గతంలో 2013వ సంవత్సరంలో ఉన్న అప్పటి ప్రభుత్వం జీవో నెంబర్ 43 పెట్టి పీజీ మెడికల్ సీట్లలోనూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు అన్యాయం చేకూర్చింది . కాని ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి విద్యార్థులు తీసుకెళ్లగానే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే చర్యలు తీసుకొని జీవో నెంబర్ 43 పై విచారణ జరిపి రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన విద్యార్థినీ విద్యార్థులకు న్యాయం చేకూర్చే విధంగా జీవో నెంబర్ 43 రద్దు చేసి ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ విద్యార్థులకు అండగా కొత్త జీవో నెంబర్ 52 తీసుకొచ్చి వారి జీవితాలలో బంగారుబాటలకు అడుగులు వేసే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉంటుంది అని మరోసారి నిరూపించారు అలాగే బడుగు బలహీన వర్గాల పిల్లల తల్లిదండ్రులు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు వైయస్సార్ విద్యార్థి విభాగం తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విద్యార్థినీ విద్యార్థుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు…

ప్రకాశం

నిబంధనలు తప్పనిసరి – మున్సిపల్ అధికారి ఆవుల సుధాకర్

దర్శి, జూన్ 5, 2020(పున్నమి విలేఖరి): దర్శి మున్సిపాలిటీ పరిధిలో వ్యాపార సంస్థలు, కొనుగోలు, అమ్మకం దారులు కోవిడ్ 19 నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని శుక్రవారం మున్సిపల్ అధికారి ఆవుల సుధాకర్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షాపుల వద్ద ఐదు మంది కంటే ఎక్కువగా ఉండరాదని, మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని, శానీటైజర్ లు వినియోగించాలని, సామాజిక దూరం పాటించాలని ఆయన అన్నారు. మాస్క్ ధరించని వారికి 50 రూపాయల జరిమానా, వ్యాపార సంస్థల వారు నిబంధనలు ఉల్లంఘించి నట్లయితే 500 రూపాయలు జరిమానా తదితర అంశాలను మున్సిపల్ కమిటీ నిర్ణయం మేరకు నిర్వహించుచున్నట్లు తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్

శ్రీ రాజ్యలక్ష్మి పోల్స్ పరిశ్రమ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నాయకులు కలెక్టర్ కు వినతి.

శ్రీ రాజ్యలక్ష్మి పోల్స్ పరిశ్రమ కార్మికుల సమస్యలు పరిష్కారానికై జూన్ 15న మహరాయభారం జయప్రదం చేయాలని కార్మిక,కర్షక,ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రజా సంఘాల నాయుకులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని శ్రీ రాజ్యలక్ష్మి పోల్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్మిక,ఉద్యోగ, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో  కలెక్టర్ కార్యాలయం వద్ద ప్లే కార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ జె.నివాస్ గారికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయుకులు మాట్లాడుతూ పొందూరు వద్ద గల  శ్రీ రాజ్యలక్ష్మి పోల్స్ పరిశ్రమ యాజమాన్యం గత 10 సంవత్సరాలు నుండి కనీస వేతనాలు, పి.ఎఫ్, ఇ.ఎస్.ఐ గుర్తింపు కార్డులు, విడిఎ, చట్టబద్దమైన సెలవులు వంటి చట్టపరమైన సౌకర్యాలు అమలు చేయడం లేదని తెలిపారు. అమలు చేయాలని కోరితే పరిశ్రమలో పనిచేస్తున్న 8మంది కార్మికులను ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా శ్రీ రాజ్యలక్ష్మి పరిశ్రమ యాజమాన్యం అక్రమంగా ఉద్యోగాలు నుండి తొలగించిందని అన్నారు. చట్టపరమైన సౌకర్యాలు అమలు చేయాలని అడుగుతున్నారని యాజమాన్యం ఏకపక్షంగా ఎటువంటి తప్పు లేకపోయినా కక్ష పూరితంగా తొలగించింది. ఇలా తొలగించడం  చట్ట వ్యతిరేక చర్య అని అన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఏ ఒక్క పరిశ్రమ యాజమాన్యం ఏ ఒక్క కార్మికుడిని తొలగించరాదని ఆదేశాలు ఇచ్చినప్పటికీ శ్రీ రాజ్యలక్ష్మి పి.ఎస్.సి.సి యాజమాన్యం కార్మికులను అన్యాయంగా, ఏకపక్షంగా తొలగించడం కార్మిక చట్టాలకు విరుద్దమైన చర్య అని అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కాలానికి కార్మికులందరికీ పూర్తిస్థాయి వేతనాలు చెల్లించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయని, శ్రీ రాజ్యలక్ష్మి పరిశ్రమలో పనిచేస్తున్న కొంతమందికి లాక్ డౌన్ కాలానికి యాజమాన్యం వేతనాలు చెల్లించి కొంతమందికి చెల్లించలేదని ఇది చట్టవ్యతిరేక చర్య అని అన్నారు. యాజమాన్యం కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు తలపడుతున్నదని యూనియన్ ను లేకుండా చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తూ యూనియన్ నాయకులను ఉద్యోగాలను నుంచి తొలగిస్తున్నారని విమర్శించారు. యాజమాన్యం కార్మికులపై వేధింపులు కక్షసాధింపు చర్యలు చేస్తుందని అన్ ఫెయిర్ లేబర్ ప్రాక్టీసుకు పాల్పడుతుందని అన్నారు. కార్మికుల శ్రమతో కోట్లాది రూపాయలు లాభాలు అర్జించిన రాజ్యలక్ష్మి యాజమాన్యం నేడు కార్మికులను రోడ్డు పాలు చేసి ప్రభుత్వ అండతో కార్మిక చట్టాలు ఉల్లంఘిస్తూ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. యాజమాన్యం కార్మిక సమస్యలు పరిష్కరించకుండా మద్యం, డబ్బులు విచ్చలవిడిగా వెదజల్లి పారిశ్రామిక అశాంతి సృష్టిస్తుందని విమర్శించారు. చట్టాలన్నింటిని ధిక్కరించి కార్మికులపై పగ సాధిస్తున్న శ్రీ రాజ్యలక్ష్మి యాజమాన్యం దుశ్చర్యలను అన్ని కార్మిక, ప్రజా సంఘాల నాయుకులు ఖండించారు. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కాలానికి కార్మికులందరికీ వేతనాలు చెల్లించాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు అమలు చేయాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేసారు. కార్మికశాఖ అధికారులు నిర్వహించిన జాయింట్ సమావేశాలకు హజరుకాకుండా యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తుందని విమర్శించారు. సమస్యలు పరిష్కారానికి హక్కుల సాధనకు శ్రీ రాజ్యలక్ష్మి పవర్ ఇన్ ఫ్రా వర్కర్స్ యూనియన్ ఆద్వర్యంలో జరుగుతున్న ఆందోళనలకు అన్ని కార్మిక,ప్రజా సంఘాలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. తక్షణం ప్రభుత్వం యంత్రాంగం జోక్యం చేసుకొని  కార్మిక చట్టాలు ఉల్లంఘిస్తున్న శ్రీ రాజ్యలక్ష్మి పి.ఎస్.సి.సి యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని, తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకునే విధంగా, ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కాలానికి కార్మికులందరికీ వేతనాలు చెల్లించేలా, కనీస వేతనాలు, పి.ఎఫ్, ఇ.ఎస్.ఐ మొదలగు చట్టపర సౌకర్యాలు అమలు చేసేలా తగు చర్యలు తీసుకోవాలని జూన్15న  యాజమాన్యానికి మహరాయభారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు, ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.మోహనరావు, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఈశ్వరమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.సింహాచలం,  మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లు.మహాలక్ష్మి, యుటిఎఫ్ జిల్లా కోశాధికారి పొందూరు అప్పారావు, జిల్లా కార్యదర్శి ఎండ ఉమాశంకర్ స్మార్ట్ కెమ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పి.జగ్గారావు, శ్యాంపిస్టన్స్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి గొర్లె.కిరణ్, శ్యామ్ సుందర్,కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోలాకి. ప్రసాదురావు, అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఎ.లక్ష్మీ, వి.ఆర్.ఎ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు అల్లు. సత్యనారాయణ, రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు  డి.పార్

ఆంధ్రప్రదేశ్

పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు అందించండి – గౌతమ్ రెడ్డిని కలిసిన యువనేత. డా. ధర్మాన కృష్ణ చైతన్య

నరసన్నపేట, జూన్ 5:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య వెలగపూడి సచివాలయంలో శుక్రవారం ఉదయం కలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి సంబంధించి పరిశ్రమల ఏర్పాటు ఆవశ్యకతపై మంత్రితో చర్చించారు. ఏళ్ల తరబడి వలసలు పోతున్న వారికి చిరునామాగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో కరోనా కారణంగా  చాలా మంది వెనక్కి వస్తున్నారని, వారికి ఉపాధి కరువై ఆందోళనలో ఉన్నారని చెప్పారు. దీనికి పర్యావరణ హితమైన  సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు ఒక్కటే మార్గమని చెప్పారు. జిల్లాలోనూ ప్రత్యేకించి నరసన్నపేట నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని, భూమి, నీటి లభ్యతకు ఇబ్బంది లేదని ప్రధాన జాతీయ రహదారి,  రైల్వే మార్గం ఉండటం కలిసి వచ్చే అంశాలు అని చెప్పారు.  ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎమ్ఎస్ఎమ్ఈ ( సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ) ల కష్టాలు తీర్చడమే లక్ష్యంగా రూపొందించిన ‘వైఎస్ఆర్ నవోదయం’ పథకం ఎంతో మేలు చేసిందని కృష్ణ చైతన్య మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

జాతీయ అంతర్జాతీయ

*ఏనుగు కేసులో పురోగతి:కేరళ సీఎం*

పున్నమి తెలుగు దిన పత్రిక ✍️ కేరళలో ఏనుగు మృతి ఘటనపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఘటనను సీరియస్ గా తీసుకుంది.దీనికి బాద్యులుగా భవిస్తూ ముగ్గురు అనుమనితుల్ని గుర్తించి అదుపులోకి తీసుకొంది.వారిని విచారిస్తున్నామని,నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేరళ CM పినరయి విజయన్ తెలిపారు. పోలీస్ శాఖ అటవీశాఖ అధికారులు సంయుక్తంగా కేసును దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ చిత్తూరు

వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం

చిత్తూరు జిల్లా: పూతలపట్టు నియోజకవర్గం లోని తవణంపల్లి మండలం ఎగువ మత్యం గ్రామంలోని నవీన్ కుమార్ రెడ్డి కుమారుడు హావిష్ రెడ్డి( 5) వైద్యం కోసం మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధిని అందజేస్తున్న పూతలపట్టు ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు,

Featured

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే చంపుతానని బెదిరిస్తున్నాడు.

04-06-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం మండలం లోని కాగులపాడు గ్రామంలోని జె.అనిత అనే ఒక వివాహిత తన భర్త సుకుమార్ తనను చంపుతానని బెదిరిస్తున్నాడని బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే ఒకే గ్రామానికి చెందిన సుకుమార్ అనితకు 2013లో ఒకరికొకరు పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు. సుకుమార్ తల్లిదండ్రులు ఈ ప్రేమ వివాహాన్ని అంగీకరించలేదు. ఈ నేపధ్యంలో అనిత వాళ్ళ ఇంటికి వెళ్లారు. కానీ వెళ్లిన రోజు నుండి సుకుమార్ ప్రవర్తనలో మార్పు వచ్చిందని, తమను ఐదు లక్షలు కట్నం తీసుకురమ్మని తరచూ వేధించేవాడని బాదితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈనేపథ్యంలో ఇరువురు పోలీసు కేసులు పెట్టుకోవడం జరిగింది. ఈ కేసులు కోర్టులో నడుస్తూ ఉన్న నేపథ్యంలో సుకుమార్ మళ్లీ తన దగ్గరకు వచ్చి నువ్వంటే నాకు ఇష్టం నీ దగ్గర ఉండడం మా తల్లిదండ్రులకు ఇష్టం లేదని అన్నాడని, అప్పటి నుండి మాఇంటికి వచ్చి వెళ్ళేవాడని బాధితురాలు చెప్పడం జరిగింది. అలా కొద్ది రోజులు జరిగిన తర్వాత ఇప్పుడు బాధితురాలు గర్భవతి కావడంతో సుకుమార్ నువ్వు ఎవరో నాకు తెలియదు అంటున్నాడని, అంతేకాకుండా నన్ను నా కడుపులోని బిడ్డను చంపుతానని బెదిరిస్తున్నాడు అని బాధితురాలు వాపోతుంది. సుకుమార్ తనకు రాజకీయ పలుకుబడి ఉండడంతో నన్ను చంపుతాడని భయంగా ఉంది. కాబట్టి పోలీసు వారు నాకు ప్రాణ రక్షణ కల్పించాలని కోరుకుంటున్నానని బాధితురాలు అన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.