Thursday, 5 March 2026

Blog

Featured

పోలీసులకు థర్మామీటర్ వితరణ

పలమనేరు, జూన్28,2020(పున్నమి విలేకరి): పలమనేరు నియోజకవర్గం లోని గంగవరం నేషనల్ ఏహ్యూమన్ రైట్స్ కరప్షన్ అండ్ ఎరడ్యుకేషన్ ఫోరమ్ జాతీయ ఉపాధ్యక్షుడు దండు రవి ఆదివారం గంగవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణఆచారికి ఇన్ ఫ్రారెడ్ ధర్మామీటర్ వితరణ చేశారు. ఈ సందర్భంగా దండు రవి మాట్లాడుతూ… పోలీసులు కరోనా వైరస్ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నిత్యం విధులు నిర్వహిస్తున్నారు. పోలీసులకు తన వంతు సాయంగా ఇన్ ఫ్రారెడ్ థర్మామీటర్, శానిటైజర్ వితరణ చేసినట్లు ఆయన తెలిపారు.

Featured

గ్రామంలో కరోనా పట్టించుకొని అధికారులు

నెల్లూరు జిల్లా తడ మండలం చేనిగుంట గ్రామంలో ఒక వ్యక్తికి కరోనా వచ్చిందని శనివారం నాడు వైద్యశాఖ అధికారులు తెలిపారు, ఈ విషయం తెలియగానే గ్రామంలో భయాందోళనలు.., కాని గ్రామరెవిన్యూ అధికారులు ఇంతవరకు పట్టించుకోలేదు … కనీసం గ్రామంలో ఇప్పటివరకు శానిటైజ్ చేయకపోవడం విడ్డూరం.

Featured జాతీయ అంతర్జాతీయ సక్సెస్ స్టోరీస్

చరిత్రకే పాఠాలు నేర్పిన నెల్లూరు పండితులు

జులై 1 యాధృచ్చికంగా ఇద్దరు దిగ్గజాలకు జన్మనిచ్చింది. ఒకరేమో నెల్లూరు జిల్లా నుంచి తమ తాతల కాలంలో తమిళనాడుకు వలస వెళ్లిన వారు. ఇంకోరేమో నెల్లూరులోనే పుట్టి పెరిగి ఉద్యోగరీత్యా తమిళనాడుకు వెళ్ళినవారు. ఇద్దరు పురావస్తు శాఖలోనే శాసన అధ్యయన విభాగంలో పనిచేసినవారే. చరిత్రకే పాఠాలు నేర్పి, సరికొత్త విధానాలు రూపొందించి అజరామరమైన కీర్తి ప్రతిష్టలు పొందారు. భారతదేశ చరిత్ర నిర్మాణంలో వీరిద్దరి పాత్ర అసమానమైనది. జులై ఒకటి వి.వెంకయ్య, కృష్ణమాచార్యుల పుట్టినరోజు సందర్బంగా పున్నమి ప్రత్యేక కథనం…. భారతీయ చరిత్ర నిర్మాణంలో శాసనాలు అద్భుతమైన పాత్రను పోషిస్తాయి. మిగతా ఆధారలకంటే ఖచ్చితమైన సమాచారాన్ని శాసనాలు మాత్రమే ఇస్తాయి. చరిత్రకు ప్రామాణికమైన మూలం మరియు మన గత చరిత్రను పునర్నిర్మించడానికి ఇవి నిచ్చెనలా పనిచేస్తాయి. ఇందులో లిఖిత శాసనాలు పోషించే పాత్ర అతి ముఖ్యమైనది. ముఖ్యంగా మన దేశంలో ఈ శాసనాలు ఏ సందు గొందుల్లో చూసిన ఉంటాయి. గ్రామాల సరిహద్దుల్లో, పాత దేవాలయాల్లో శాసనాలు విరివిగా కానవస్తాయి. ఈ శాసనాలను పరిరక్షించడానికి మరియు వాటిని అధ్యయనం చేయడానికి స్వాతంత్ర్యానికి ముందే భారతీయ పురావస్తుశాఖ ఏర్పడటంతో పాటు శాసన అధ్యయన విభాగం ప్రారంభమైంది. తెలుగుతో సహా మిగతా భాషల శాసన అధ్యయన విభాగం తమిళనాడులోని ఫోర్ట్ సెయింట్ జార్జి కోటలోని పురావస్తు కార్యాలయంలో వుంది.                                                                                                   వి.వెంకయ్య పురావస్తు శాఖకు సంబంధించి మన తెలుగువారు అందులో ముఖ్యంగా మన నెల్లూరీయులు ఎంతోమంది భారతీయ చరిత్ర నిర్మాణంలో సేవ చేశారు. వారిలో రావు బహదూర్ వి. వెంకయ్య గారు ఒకరు. వీరి పూర్వీకులు నెల్లూరు నుంచి వలస వెళ్లారు. తిరువణ్ణామలై జిల్లాలోని వాళైయాత్తూర్ గ్రామంలో 1864 జులై ఒకటిన వెంకయ్య జన్మించారు. చదువు నిమిత్తం మద్రాసుకి వచ్చి మాంబళంలో స్థిరపడిపోయారు. ఆ తర్వాత మద్రాస్ ఎపిగ్రఫీ (శాసన అధ్యయన శాఖ ) లో ఉద్యోగం సంపాదించి డాక్టర్ హుల్ట్జ్ దగ్గర శిష్యరికం చేశారు. తంజావూరులోని బృహదీశ్వర ఆలయంలోని శాసనాలు, పాండ్య దేశాలలోని పల్లవ దేవాలయాలను అధ్యయనం చేయడంలో వెంకయ్య ఒక మార్గదర్శక ప్రయత్నం చేశారు. ఎపిగ్రాఫియా ఇండికాకు విశేష కృషి చేశారు. తంజావూరులోని ప్రసిద్ధ రాజరాజేశ్వర ఆలయం యొక్క సుదీర్ఘమైన మరియు సంక్లిష్టమైన శాసనాలను దక్షిణ భారత శాసనాలు వాల్యూమ్ 2 గా ప్రచురించారు . ఇది ప్రపంచంలోని పండితుల ప్రశంసలను పొందింది. ఈ శాసనాల ద్వారా విస్మయపరిచే విషయాలను ప్రపంచానికి తెలియపరచారు . ఆలయ గోడలపై చెక్కబడిన శాసనాల సంపదను నాశనం కాకుండా చాలా ప్రయత్నాలు చేశారు. మరమ్మత్తులు, పునర్నిర్మాణం పేరిట ధ్వంసం చేయబడటాన్ని చాలావరకు నిలువరించారు. పునర్నిర్మాణం యొక్క వినాశకరమైన అభ్యాసాన్ని ఆపాలని వీరు ప్రభుత్వాన్ని పదే పదే విజ్ఞప్తి చేశారు. ఎపిగ్రాఫియా ఇండికా వాల్యూమ్లను IV, V మరియు VIII లను సవరించారు. వివిధ పత్రికలలో అనేక వ్యాసాలను రాశారు.నెల్లూరు జిల్లా చరిత్రకు వీరు ఎనలేని సేవ చేశారు. వీరు ఏన్సియంట్ హిస్టరీ అఫ్ నెల్లూరు అనే వ్యాసాన్ని రాసారు. నెల్లూరు జిల్లాపై తనకున్న అభిమానంతో తరచు జిల్లాకు వచ్చేవారు. నెల్లూరు జిల్లాలో జైనుల ఉనికిని తెలియపరచి, ఇప్పుడున్న నెల్లూరు జిల్లా కలెక్టర్ ప్రాంతం ఒక్కప్పుడు జైనుల స్థావరంగా తేల్చారు. సుందరమైన జైన విగ్రహాలు, ప్రాచీన జైన కోనేరు వెలికి తీయడంలో వీరి పాత్ర ఎంతో వుంది. దురదృష్టవశాత్తు 1912 లో 48 సంవత్సరాల వయస్సులోనే వెంకయ్య గారు మరణించారు.                                                                                                  సి. ఆర్. కృష్ణమాచార్యులు రావు బహదూర్ సి. ఆర్. కృష్ణమాచార్యులు నెల్లూరు జిల్లాలోని గంగవరం గ్రామంలో, వైష్ణవ కుటుంబంలో జూలై 1, 1888 న, జన్మించారు. కృష్ణమాచారి నెల్లూరులోని వి.ఆర్. హైస్కూల్ లో మెట్రిక్యులేషన్ చేసి, మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చేరారు. ఆ కళాశాలలో ఎఫ్. ఎ పూర్తి చేసిన తరువాత, మద్రాసులోని పచ్చయప్ప కళాశాల నుండి విశ్వవిద్యాలయ పట్టా పొందారు. నెల్లూరులోని ఎం. ఎస్. లోయర్ సెకండరీ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా తన వృత్తిని ప్రారంభించి తరువాత నెల్లూరు కలెక్టరేట్‌లో చేరారు. అక్కడ కొంతకాలం సేవలందించిన తరువాత, ఎపిగ్రాఫికల్ విభాగంలో చేరారు. హెచ్. కృష్ణ శాస్త్రితో కలిసి పనిచేసి, 1925 లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ గా పదోన్నతి పొంది 1931 లో సూపరింటెండెంట్ అయ్యారు. 1942 లో భారతదేశ ప్రభుత్వ ఎపిగ్రాఫిస్ట్ అయ్యారు, తన పదవీకాలంలో శాసన అధ్యయన శాఖను ఆధునిక పద్దతిలో ఆవిష్కరించారు. వందల శాసనాలను వెలికితీసారు. కృష్ణమాచార్యులు సంస్కృత మరియు తెలుగు భాషలలో ఉత్తమ పండితులు కావడంచేత దక్షిణ భారత భాషలలో అత్యుతమ ఎపిగ్రాఫిస్ట్ గా పేరు గడించారు. 1931 నుండి దక్షిణ భారత ఎపిగ్రఫీపై వార్షిక నివేదికలు రూపొందించడంలో, శాఖ సిబ్బందిని సమర్ధవంతంగా సమన్వయ పరచడంలో కృష్ణమాచార్యులు అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉండేవారు. పల్లవుల చరిత్రకు సంబంధించి ఖచ్చితమైన శాసన సామాగ్రిని వెలికితీసి పరిశోధన పండితులకు అందించారు. అనేక తామ్ర శాసనాలను భద్రపరిచారు. చాలా విలువైన పత్రాలను సేకరించారు. ఈ ఆవిష్కరణలన్నీ కృష్ణమాచార్యులు యొక్క ఘనతను సూచిస్తున్నాయి. రచనాపరంగా హైదరాబాద్ పురావస్తు సిరీస్ కోసం కన్నడ శాసనాలు, దక్షిణ భారత ఎపిగ్రఫీపై వార్షిక నివేదికకు విషయ సూచిక, శాసనం జాబితాలు, ఎపిగ్రాఫియా ఇండికాలో వ్యాసాలు. ఇలా అన్నిటిలో అత్యుత్తమ ప్రతిభను కనపరిచారు. పురావస్తు అన్వేషణలో, చరిత్రపూర్వ యుగపు ప్రదేశాలను గుర్తించడంలో నేర్పరితనం చూపారు. మొదటిసారిగా దక్షిణ భారతదేశ శాసనాల పట్టిక, ఇండెక్స్, టోపోషీట్స్ లాంటి వినూత్నమైన పద్దతులను ఆవిష్కరించారు. ఈ విధానాలనే భారతీయ పురావస్తు శాఖ నేటికీ పాటిస్తుండడం కృష్ణమాచార్యుల యొక్క గొప్పతనమేనని చెప్పవచ్చు. పదవీ విరమణ తరువాత దక్షిణ భారతదేశంలో చరిత్ర పూర్వప్రదేశాల జాబితాను సిద్ధం చేసే క్రమంలో 1947 ఆగస్టు 31 న మద్రాసులో మరణించారు. కృష్ణమాచార్యుల మరణం భారతీయ ఎపిగ్రఫీకి తీరని లోటుగా పురావస్తు శాఖ పేర్కొంది. నెల్లూరు నుంచి కొంతమంది ఔత్సాహిక పరిశోధకులు అడిగిందే తడవుగా నేటి తెలుగు శాసన అధ్యయన విభాగ అధిపతులు, మన తెలుగువారు అయిన ఎం.యేసుబాబు గారి కృషితో పురావస్తు శాఖ తమ శాసన estampage విభాగానికి సి.ఆర్. కృష్ణమాచార్యుల భవనంగా నామకరణం చేసి వారు లేని లోటును తీర్చుకొని, వారికి ఘనమైన నివాళులర్పించారు.భారతీయ చరిత్రకు గట్టి పునాదులు వేసిన వెంకయ్య, కృష్ణమాచార్యులు తెలుగు వారు కావడం అందులో మన నెల్లూరీయులు కావడం మనం గర్వించదగ్గ విషయమైనప్పటికీ వారి సేవలను గుర్తించడంలో అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు ప్రజలు విఫలమయ్యారనే చెప్పవచ్చు.

Featured ఆంధ్రప్రదేశ్ హెల్త్ టిప్స్

భారత్ లో ఐదు లక్షలకు చేరిన కరోనా కేసులు

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ కరోనా జనవరి 30న మన దేశంలో ప్రవేశించి ఈరోజుకి(27-6-20 ఉదయం 10గంటలకు) 5 లక్షల పది వేల మందికి సోకింది . రోజు రోజుకీ ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. * మొదటి కేసు నమోదు అయినది జనవరి 30 . * మే 18 నాటికి లక్ష కేసులు. * జూన్ 6 నాటికి 18 రోజులలో లక్ష కేసులు 2 లక్షలు అయ్యాయి * జూన్ 11నాటికి 5 రోజులలో 2లక్షల కేసులు 3 లక్షలయ్యాయి. * జూన్ 20 నాటికి 9 రోజులలో ఈ 3లక్షలు 4 లక్షల కేసులు అయ్యాయి. * జూన్ 26 నాటికి 7 రోజులలో 4లక్షల కేసులు 5లక్షలకు చేరాయి. భవిష్యత్తులో సగం జనాభాకి సోకవచ్చనే అంచనాను ఊహించికోవడమే కష్టంగా వుంది. మందులు, వ్యాక్సిన్లు వచ్చేశాయని కరోనా నివారణ చర్యల్లో అలసత్వం చెయ్యవద్దు. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి సంవత్సరకాలం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది. ధైర్యంగా ఉందాం! నివారణ మార్గాలను ఆచరిద్దాం!! కరోనాను ఎదుర్కొందాం!!!

Featured

ఘనంగా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఆవిర్భావ దినోత్సవం ✍️✍️

  పున్నమి తెలుగు దిన పత్రిక ✍️ విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఆవిర్భావ దినోత్సవాన్ని అట్టహసంగా నిర్వహించారు. ఈ సందర్బంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రొక్కం సుదర్శన రావు గారు మాట్లాడుతూ మన విశ్వవిద్యాలయం ఈ 13 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎనో విజయాలు సాధించాము అని తెలిపారు.  ఈ సందర్బంగా పూర్వ ఉపకులపతులు మరియు రిజిస్ట్రార్ల కృషిని ప్రశంసించారు. మన పూర్వ ఉపకులపతి ఆచార్య సి ఆర్ విశ్వేశ్వరావు గారు విశ్వవిద్యాలనికి స్థల సేకరణ మరియు ఎంతో మందికి ఉద్యోగ కల్పన గాని మరియు తర్వాత వచ్చిన ఆచార్య జీ రాజా రమి రెడ్డి గారు కొత్త భవనాలు కట్టడానికి పూనుకోవటం మరియు ఎంతో మందికి అధ్యాపక అధ్యాపకేతర సిబందిని నియమించడంలో, ఆచార్య వీ వీరయ్య గారు కొత్త కోర్సులు తేవడంలో గాని ఎంతో కృషి చేసారు.మన విశ్వవిద్యాలయం తో పాటి స్థాపించిన ఇతర విశ్వవిద్యాలయాల కంటే మనం ఎంతో ముందు ఉన్నాము అని తెలిపారు. ఈ సంవత్సరం నుంచి కొత్త కోర్సులు మొదలుపెడతామని, కొత్త భవనాలు కడతామని, విద్యార్థులకు ఇంకా ఎనో వసతులు కలిపిస్తామని తెలిపారు. మన విశ్వవిద్యాలయానికి యూజీసీ 12 బి గుర్తింపు రావడం, మన కానవొకేషన్ కార్యక్రమానికి దేశ ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు మరియు మన రాష్ట్ర గవర్నర్ బిశ్వభుసం హరిచందన గారు హాజరు అవడం వంటి కార్యక్రమాలు మన విశ్వవిద్యాలయానికి ఎంతో ఖ్యాతిని తెచ్చాయి అని తెలిపారు. ఈ ఆవిర్భావదినోత్సవ సందర్బంగా కొత్తగా అధ్యాపకులకు మరియు అధ్యాపకేతర సిబందికి అవార్డు లు ప్రధానం చేసే సంస్కృతిని ప్రారరభించబోతున్నామని తెలిపారు. ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా డాక్టర్ ఏ పీ జె అబ్దుల్ కలం విగ్రహాన్ని ఉపకులపతి ఆచార్య రొక్కం సుదర్శన రావు, రెక్టర్ ఆచార్య ఎం చంద్రయ్య మరియు రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ విజయ కృష్ణ రెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ ఆవిర్బాహ్వ దినోత్సవం లో ఆధాపకులు, అధ్యాపకేతర సిబంది, ప్రిన్సిపాల్ ఆచార్య సుజా ఎస్ నాయర్, కంట్రోలర్ అఫ్ ఎక్సమినేషన్ డాక్టర్ సాయి ప్రసాద్ రెడ్డి గారు పాలుగొన్నారు.  

Featured

మనుబోలు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన:కాకాణి

25-06-2020మనుబోలు( పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం కాగితాలపూరు, లక్ష్మీ నరసింహపురం గ్రామాలలో పర్యటించి, ₹3కోట్ల 25 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేసిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు . ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులోకి రావడం, ఆ తర్వాత కరోనా కారణంగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించలేకపోయాము. ప్రస్తుతం గ్రామాల్లో పూర్తి చేసిన పనులను ప్రారంభిస్తూ, గ్రామస్థులకు అవసరమైన పనులను ప్రణాళిక బద్దంగా చేపట్టి, పూర్తి చేస్తాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి గ్రామానికి కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించి, అభివృద్ధి పనులు చేపడుతున్నాం. గతంలో సంక్షేమ పథకాలలో అర్హులైన వారిని పక్కనపెట్టి, జన్మభూమి కమిటీల సభ్యులు ఇష్టానుసారంగా ప్రవర్తించారు. తెలుగుదేశం పాలనలో జిల్లా కలెక్టర్ సైతం జన్మభూమి కమిటీలను కాదని ఏమి చేయలేని పరిస్థితి. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి సంక్షేమ పథకాలను ఇంటి ముంగిటకు చేర్చే వాలంటీర్ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. టిడిపి ప్రభుత్వంలో రాష్ట్రాన్ని దోచుకొని అవినీతి చేసిన వారిని అరెస్టు చేస్తే, చంద్రబాబు దానితో కుల రాజకీయాలు చేస్తున్నాడు. చంద్రబాబు రాజ్యాంగానికి అతీతుడు కాదు, తప్పు చేస్తే చంద్రబాబు, ఆయన కుమారుడు కూడా జైలుకు వెళ్లాల్సిందే!. ఆంధ్ర రాష్టాన్ని అప్పుల ఊబిలో ముంచి, అవినీతికి పాల్పడి, అగాదంలోకి నెట్టిన చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి!. అన్ని వర్గాల గురించి ఆలోచన చేసి అనేక సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు. అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పేదలకు సంబంధించిన ఇళ్ల స్థలాల పంపిణీని కొందరు అడ్డుకుంటున్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు అందించే బాధ్యత నాది. ముస్లింల మనోభావాలు దెబ్బతినకుండా అసెంబ్లీలో NRC పై తీర్మానం ప్రవేశపెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది రాజకీయాలను పక్కన పెట్టి నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నాను. నిరుపేద లందరికీ ఇళ్ళు ఇప్పిస్తా నని ఎమ్మెల్యే కాకాణి హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ రంగుల వలన ఎవరికైనా నష్టం జరిగిందా అని ప్రశ్నించారు చంద్రబాబు నీఛరాజకీయాలు చేస్తున్నాడన్నాడు ప్రజల ఆస్తులు కొల్లగొట్టిన ఘనత టీడీపీ దేనన్నారు. అభివృద్ధి లో తండ్రి ఒకడుగువేస్తే జగన్మోహన్ రెడ్డి రెండుఅడుగులు వేశారన్నారు చల్లాయానాదులకు ముందుగా ప్రత్యేక శ్రద్ధతో ఇళ్ళునిర్మించి ఇస్తామన్నారు. ఎన్నికల్లో గెలిచాక అభివృద్ధి అజెండా గా పని చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో సమస్యలపై ఒక్క అర్జీకూడా రాకుండా చేస్తామన్నారు. 15సంవత్సరాల అభివృద్ధి చేసిచూపుతామని తెలిపారు. కాగితాలపూరు నాయకులు రాజా, రవి, ఏడుకొండలు ఆధ్వర్యంలో ఎల్ఎన్ పురంలో ఎంపిటిసి వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో మేళతాళాలు శాలువా లతో ఘనస్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో మండలంలోని వైకాపా నాయకులు,వివిధ శాఖల అధికారులు వై.ఎస్.ఆర్.సి.పి కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Featured

వైసిపి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు పాల్పడుతోంది – మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి

పలమనేరు, జూన్25,2020(పున్నమి విలేకరి):వైసిపి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు పాల్పడుతోందిని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టు సరైంది కాదన్నారు. ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చేస్తున్న మోసం అన్యాయాలపై అచ్చెన్నాయుడు నిరంతరం పోరాడుతున్నారన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి రాత్రి పోలీసులు ఆయన ఇంటిపై పడి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. శాసనసభ పక్ష ఉప నేతగా ఉన్న ఆయనకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడం అత్యంత దారుణమైన విషయం అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నామనే మూర్ఖత్వంతో ముందుకెల్తుదన్నారు. ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు చేస్తున్నామనే ఆలోచన లేకపోవడం భాధాకరం అన్నారు. కక్షపూరిత, అణచివేత, బెదిరించే దోరణిని వీడాలన్నారు.ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేయాలిని అలాగే అధికారులు పారదర్శకంగా పనిచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలిని ఆయన డిమాండ్ చేశారు.

Featured

గుంతల రోడ్డు బాగు చేయండి

పలమనేరు, జూన్25,2020(పున్నమి విలేకరి): పలమనేరు రూరల్ మండలంలోని కొలమాసనపల్లె పంచాయితీ గొల్లపల్లి నుండి బండి వారి పల్లి గ్రామాలను కలిపే తారు రోడ్డు మట్టిరోడ్డు మారింది. రాకపోకలకు కష్టతరంగా అయిందని పలువురు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలు పాదచారులు కష్టంగా మారిందని వాపోయారు.గత ప్రభుత్వం ఈ రహదారులకు మరమ్మతులకు నిధులు మంజూరు చేసింది. సుమారు 22 కిలోమీటర్ల పొడవునా రోడ్డు మరమ్మతులకు నోచుకోని పరిస్థితి వల్ల గుంతలమయంగా మారిపోయింది. అయితే ప్రస్తుతం దీన్ని పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకోవాలని గ్రామస్తులు కోరుచున్నారు.

Featured

తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా

పలమనేరు,జూన్25,2020(పున్నమి విలేకరి): ఆశావర్కర్ల ఆల్ ఇండియా డిమాండ్స్ డే ని పురస్కరించుకుని తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్బంగా ఆశా వర్కర్ల జిల్లా ప్రధాన కార్యదర్శి భువనేశ్వరి మాట్లాడుతూ… ఆశాలను రెగ్యులరైజ్ చేసి,చట్ట బద్ధమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. కోవిడ్ డ్యూటీ లో ఉన్న ఆశా లకు నెలకు ప్రత్యేక అలవెన్సు రూ.10000 ఇవ్వాలని, భద్రతా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రమాద బీమా 50 లక్షలు వర్తింపజేయాలని,3సంవత్సరాల నుండి పెండింగులో ఉన్న యూనిఫామ్స్ వెంటనే అందచేయాలన్నారు.రక్షణ చర్యలు చేపట్టకుండా రోగులను ఆసుపత్రికి చెకప్ ల కోసం తీసుకురావాలని ఒత్తిడి చేవడం మానుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ ఆశాలకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆశా డివిజన్ కార్యదర్శి సావిత్రి,సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గిరిధర్ గుప్తా, ఆశాలు సలోమీ,పద్మ,కైరున్నిసా,గీత లతో పాటు మండలం లోని ఆశావర్కర్లు పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

చంద్ర‌బాబు పాచిక పారేనా ?

చంద్ర‌బాబు పాచిక పారేనా ? టీడీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ కాషాయంవైపు చూస్తున్నారా ? మోడీతో చెలిమి చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారా ? అందుకే ప్ర‌ధానిపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారా ? ప‌రిణామాలు చూస్తుంటే అలాగే క‌నిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో బీజేపీపై ఒంటి కాలుపై లేచిన చంద్రబాబు ఇప్పుడు నెమ్మదించారు. అధికారంలో లేరు. ఘోరంగా ప‌రాజ‌యం పాల‌య్యారు. దీనికి తోడు ఉన్న కొద్దిమంది నాయ‌కులు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో రాష్ట్రంలో పార్టీని గాడిలో పెట్టేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి స్కెచ్ తో ముందుకెళ్తే బలపడవచ్చనే దానిపై చంద్రబాబు ఫుల్ ఫోకస్ పెట్టారు. 151 సీట్ల మెజార్టీతో బ‌ల‌మైన స్థానాన్ని సంపాదించుకున్న సీఎం జ‌గ‌న్ జెట్ స్పీడుతో ముందుకెళుతున్నారు. అభివృద్ది సంక్షేమ ప‌ధ‌కాలు అమ‌లు చేస్తూ త‌న‌దైన ముద్ర వేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేతలు ప్ర‌భుత్వంపై కౌంటర్ లు కూడా వేయలేని స్థితికి తీసుకొచ్చారు. అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ ఆరు నెల‌ల పాల‌న అనంత‌రం విమ‌ర్శ‌లుగానీ, ఆరోప‌ణ‌లుగానీ చేస్తామ‌న్న చంద్ర‌బాబు, ‌వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన 3నెలలకే విమర్శలు మొదలుపెట్టారు. అయినా అధికార‌పార్టీని ధీటుగా ఎదుర్కోలేక పోతున్నారు. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు తక్కువగా గెలవడం.. గెలిచినవారు కూడా ప‌క్క‌చూపులు చూస్తుండ‌డం, ఇత‌ర పార్టీల‌కు జంప్ చేయ‌డంతో చంద్ర‌బాబు మ‌రింత కుంగిపోతున్నారు. ఇక టీడీపీ నేత‌లపై కేసులు న‌మోదు కావ‌డం, అరెస్టులు జ‌ర‌గ‌డంతో ఏం చేయాలో తెలియ‌ని సందిగ్ధంలో ప‌డిపోయారు. ఒక‌వైపు పార్టీ ఏమైపోతుంది అన్న టెన్ష‌న్ వుంటే మరోవైపు ఏడాది కాలంలోనే టీడీపీ బలాన్ని, బలగాన్ని నిర్వీర్యం చేసే పనిలో సీఎం జగన్ పడడంతో ఎన్నడూ చూడని రాజకీయ విచిత్రాల‌ను చంద్ర‌బాబు తొలిసారి చ‌విచూస్తున్నారు. ఇంకోవైపు కరోనా ప్ర‌బ‌లిపోతుండ‌డంతో గ‌తంలోలాగా జనంలోకి వెళ్ళలేకపోతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో రాష్ట్రంలో బలంగా ఉన్న వైసీపీని ఢీ కొట్టాలంటే త‌న ఒక్క‌డితో సాధ్య‌మ‌య్యే ప‌నికాదన్న విష‌యాన్ని గ్ర‌హించారు. ఈ త‌రుణంలో కేంద్రంలో ఉన్న బీజేపీతో కలిసి ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే చంద్రబాబు నాయుడు తనకు మోడీతో వ్యక్తిగత విబేధాలు లేవని, రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మే పోరాటం చేశానంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మోదీ స‌ర్కార్ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ పట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే బీజేపీపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు రాష్ట్రానికి అన్యాయం చేస్తుందోంటూ బీజేపీ ప్ర‌భుత్వంపైన ఆరోప‌ణ‌లు చేసిన చంద్ర‌బాబు, అంత‌టితో ఆగ‌కుండా ఏకంగా మోడీపై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగారు. ఇప్పుడు యూట‌ర్న్ తీసుకుని మోడీతో దోస్తీకి సై అంటూ సంకేతాలిస్తున్నారు. అయినా అటువైపు నుంచి స‌మాధానం రావ‌డం లేదు స‌రిక‌దా బాబుని క‌న్నెత్తైనా చూడ‌డం లేదు. దీంతో చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాయ మార్గాల‌ను అన్వేషిస్తున్నారు. సుజనా చౌదరి, సీఎం ర‌మేష్‌, కామినేని శ్రీనివాసరావు వంటి నేతలు టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన వారే. అయితే వీరి ద్వారా రాయ‌బారం న‌డుపుతారా ? అలా అనుకున్నా చంద్ర‌బాబు గురించి నేరుగా మోడీతో మాట్లాడేందుకు సాహ‌సిస్తారా ? అనేది ప్ర‌శ్నార్ధకం. ఎన్నిక‌ల ముందు మోడీతో సున్నం పెట్టుకున్న చంద్ర‌బాబుకు, ఇప్పుడు ఆయ‌న‌ను ఎలా ప్ర‌స‌న్నం చేసుకోవాలో మాత్రం బోధ‌ప‌డ‌డం లేదు. ఇక‌ ఎప్ప‌టినుంచో ఏపీలో ఒంట‌రిగా ఎద‌గాల‌ని బీజేపీ క‌ల‌లు కంటూ వ‌స్తోంది. ఇప్పుడు టీడీపీ హ‌వా త‌గ్గ‌డం, మ‌రో బ‌ల‌మైన పార్టీ లేక‌పోవ‌డంతో త‌న‌దైన శైలిలో పావులు క‌దుపుతోంది. ఇలాంటి స‌మ‌యంలో టీడీపీతో బీజేపీ చెలిమి చేసే అవ‌కాశ‌ముందా ? అస‌లు అంత అవ‌స‌రం వుందా ? అందులోనూ ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో మోడీని దూషించిన చంద్ర‌బాబుతో దోస్తీ చేసేందుకు ముందుకొస్తుందా ? అన్న‌ది అనుమాన‌మే. అయినా చంద్ర‌బాబు ప్ర‌స్తుతం అవేవీ ప‌ట్టించుకోవ‌డం లేదు. బీజేపీతో స‌ఖ్య‌త‌తో ఉంటే భ‌విష్య‌త్తులోనైనా స‌త్ఫ‌లితాలిస్తాయ‌నే భావ‌న‌లో ఉన్నారు. రాష్ట్రంలో వైసీపీని ఎదుర్కోవాలన్నా, జ‌గ‌న్ దూకుడుకు క‌ళ్ళెం వేయాల‌న్నా క‌మలంతో జ‌ట్టు క‌ట్ట‌క త‌ప్ప‌ద‌ని తెలుసుకున్న చంద్ర‌బాబు అదే ఆలోచ‌న‌తోనే ముందుకు సాగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకు నిద‌ర్శ‌నం ఇటీవ‌లికాలంలో ప్ర‌ధానిపై ప్ర‌శంస‌లు కురిపించ‌డ‌మే. అయితే మోడీ ఏమీ చంద్రబాబుకి చుట్టం కాదు, ఏది చెప్పినా వినేయ‌డానికి, న‌మ్మేయ‌డానికి. రాజకీయాలలో ద్వంద్వ వైఖరితో చ‌క్రం తిప్ప‌డంలో, ఎప్పటికప్పుడు నాలుక మడత వేయ‌డంలో దిట్టగా పేరొందిన చంద్ర‌బాబు… మోడీ ముందు వేస్తున్న స్నేహ‌ పాచిక పారేనా ? అది జ‌రిగే ప‌నేనా ?

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.