Thursday, 5 March 2026

Blog

Featured

బిజెపి ఆధ్వర్యంలో మహనీయునికి ఘనంగా నివాళులు

మనుబోలు (పున్నమి విలేఖరి)6, డిసెంబర్ :మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో జన్మించడం మనందరి అదృష్టం అని బిజెపి మండల అధ్యక్షుడు ఓడూరు శ్రీనివాసులు రెడ్డి అన్నారు 64 వ వర్ధంతి కార్యక్రమాన్ని మనుబోలు మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ భారతదేశం ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, పాలన సజావుగా, సాఫీగా సాగడానికి బి.ఆర్.అంబేద్కర్ రచించి, మనకు అందించిన రాజ్యాంగమే ప్రధాన కారణం అన్నారు .బిజెపి జిల్లా నాయకులు బోలా శ్రీనివాసులు మాట్లాడుతూ దళితులు, అణగారిన వర్గాలు, బలహీనవర్గాల ఉన్నతి కోసం జీవిత కాలం పోరాటం చేసి, తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు బి.ఆర్ అంబేద్కర్ గారు అన్నారు. అంబేద్కర్ గారి అడుగుజాడల్లో పయణిస్తూ పేద, బడుగు, బలహీన వర్గాలకు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ చరిత్ర సృష్టించనదని అన్నారు. మహనీయుడు బి.ఆర్. అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం, ఆయన ఆలోచనలకు అనుగుణంగా మనమందరం కలిసి పని చేద్దాం అని ఆయన పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జి షేక్. షఫీ మండల ,ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చల్లా. లక్ష్మయ్య,బిజెపి రాష్ట్ర నాయకుడు మస్తాన్ గౌడ్,మండల ఉపాధ్యక్షుడు ముప్పవరపు చిన్న, మైనార్టీ మోర్చ్ అధ్యక్షుడు అల్లాభక్షు, పట్నం.వీరప్రతాప్, ఉప్పు. మనెయ్య, తురక. అంకయ్య, రాచురు. వెంకయ్య, రాజాయాదవ్,శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

*మంత్రి పేర్ని నాని పై హత్యాయత్నం*

  * రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని నాని పై హత్యాయత్నం * కృష్ణజిల్లా మచిలీపట్నంలో తన నివాసం వద్ద గుర్తు తెలియని వ్యకి తాపీ తో దాడి.. మంత్రి నానికి తృటిలో తప్పిన ప్రమాదం.. చినిగిన మంత్రి నాని చొక్కా వెంటనే నిందితుడిని పట్టుకున్న అనుచరులు.. తాపీ మెస్ట్రీ బడుగు నాగేశ్వరరావు గా గుర్తింపు…నిందితుడు మద్యం మత్తులో దాడి చేసినట్లు గుర్తింపు ఉద్దేశపూర్వకంగానా,లేక కక్షపూరితంగా, పథకం ప్రకార మా ప్రతిపక్ష కుట్ర అనే కోణంలో.దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

Featured

*నివార్ తుఫాను కారణంగా వి.ఎస్.యూ లో డిగ్రీ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా*

నెల్లూరు జిల్లా ,పున్నమి దినపత్రిక,నవంబర్ 28, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఈ నెల 30వ తేది  నుంచి నిర్వహించాల్సిన  డిగ్రీ అడ్వాన్సు సప్లీమెంటరీ పరీక్షలను నివార్ తుఫాను కారణంగా వాయిదా వేయడం జరిగిందని , జిల్లా లో నివార్ తుఫాను వల్ల రోడ్లు మరియు రవాణా వ్యవస్థ దెబ్బ తిన్న కారణంగా విద్యార్థుల సౌకర్యార్థం పరీక్షలను వాయిదా వేయడం జరిగిందని , తిరిగి మరలా పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియ జేస్తామని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. సవరించిన కొత్త పరీక్షల టైం టేబుల్ కొరకు విశ్వవిద్యాలయ వెబ్సైటు ను సందర్శించి తెలుసుకోవచ్చునని మరియు సంబంధిత ప్రిన్సిపాల్ ద్వారా పరీక్షల సమాచారాన్ని తెలుసుకోవచ్చునని విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి తెలియజేసారు._

Featured

ఆపద కాలంలో ఆపద్బాంధవులు మనుబోలు గ్రామ దాతలు

ఆపద కాలంలో ఆపద్బాంధవులు మనుబోలు గ్రామ దాతలు విపత్కర పరిస్థితుల్లో సేవా కార్యక్రమాలు నివర్ తుఫాన్ లో దాతృత్వం చాటిన మానవత వాదులు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్న వాహనదారులు ఆకలి తీర్చిన సేవా మూర్తులు వైసీపీ, జనసేనా, తెలుగుదేశం నేతలు దాతృత్వం స్ఫూర్తి దాయకం మనుబోలు( పున్నమి విలేఖరి) 28,నవంబర్ :ప్రకృతి విపత్తులు సంభవించిన, తుఫాను, వరదలు వచ్చిన, కరోనా లాంటి మహమ్మారి విజృంభించిన పేద ప్రజలు, బాధితులకు అండగా నిలబడి అన్నీ విధాల సహాయ సహకారాలు అందించడంలో ముందుఉంటారు ప్రాంతాలు,భాషలు,మతాలు, కులాలు వంటివి చూడకుండా కేవలం మనుషులు గా మానవత మూర్తులుగా సేవలు అందించడం జరిగింది నివర్ తుఫాను ప్రభావంతో గత మూడు రోజుల గా కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి, ఈ పరిస్థితులలో గూడూరు ఆదిశంకర కళాశాల జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తూ ఉండటం వల్ల గురువారం ఉదయం నుండి నెల్లూరు, చెన్నై మధ్య వాహన రాకపోకలు నిలిచిపోయాయి, దింతో వాహనాలు రోడ్డు పై బారులు తీరాయి, వర్షాలు కురవడంతో ఏక్కడ కూడా ఆహారం దొరకని పరిస్థితి, ఈ తరుణంలో ఆపద్బాంధవులు అయినా మనుబోలు దాతలు వెంటనే స్పందించి గురువారం రాత్రి నుండి వాహనదారులకు ఆహారం అందిస్తూ తమ దాతృత్వం చాటుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గూడూరు జాతీయ రహదారిపై నివర్ తుఫాన్ కారణంగా గురువారం నుండి జాతీయ రహదారిపై బారి సంఖ్యలో వాహనాలు నిలచి పోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహకారంతో అవస్థలు పడుతున్న ప్రయాణికులకు టీ,ఆహారం మంచినీరు అందించి తమ దాతృత్వం చాటారు,లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ మనుబోలుఎస్సీ బాయ్స్ హాస్టల్ బిసి గర్ల్స్ హాస్టల్ కు తరలించి వాళ్లందరికీ భోజన వసతి కల్పించారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొమ్మిరెడ్డి హర గోపాల్ రెడ్డి ,కడివెటి చంద్రశేఖర్ రెడ్డి,దాసరి భాస్కర్ గౌడ్, కిషోర్ నాయుడు ,ముంగర విజయ భాస్కర్ రెడ్డి ,చేరెడ్డి పట్టాభిరామిరెడ్డి ,దాసరి మహేంద్ర వర్మ ,భాస్కర్ రెడ్డి,సుధాకర్ రెడ్డి మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో లో సేవలు* _ నీవర్ తుఫాను కారణంగా గూడూరు జాతీయ రహదారిలో ట్రాఫిక్ జామ్ తో చిక్కుకొన్న ప్రయాణికులకు మనుబోలు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు టమాటా అన్నం అందజేసి తమ దాతృత్వం చాటారుఈ కార్యక్రమంలో నాయకులు పచ్చిపాల రామిరెడ్డి, కలికి రమేష్ రెడ్డి ,శివుడు రాజా ,సాని వెంకటరమణయ్య ,నల్ల గల వెంకయ్య తదితరులు పాల్గొన్నారు జనసేనాఆధ్వర్యంలో నివర్ తుఫాను కారణంగా గూడూరు- నెల్లూరు జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహించడం వల్ల జాతీయ రహదారిపై ట్రాఫిక్ చిక్కుకొని ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు జనసేన ఆధ్వర్యంలో రెండువందల మంది ప్రయాణికులకు వాహనదారులకు అల్పాహారం అందించడం జరిగింది మరియు మధ్యాహ్నం పొంగలి అందించడం జరిగింది . ఈ సందర్భంగా జనసేన, నాయకులు మాట్లాడుతూ జనసేన దృక్పథంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్న ప్రయాణికులకు సహాయం అందించడం జరిగిందని తెలిపారు. సేవా కార్యక్రమాలకు సహకరించిన జన సైనికులు, మెగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. తుఫాను సహాయక చర్యల్లో అధికారులకు మా సహకారం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మెగా అభిమానులు శ్రీకాంత్ ,సందీప్ ,ఉదయ్ ,సురేష్, బాబు, పవన్ పాల్గొన్నారు.

Featured

దేశ రాజకీయాలను మలుపు తిప్పిన మహానేత ఎల్.కె.అద్వానీ :బిజెపి జిల్లా నాయకులు బోలా

మనుబోలు(పున్నమి విలేఖరి ) 8, నవంబర్: రామ మందిర నిర్మాణంపై అలుపెరుగని పోరాట యోధుడు అభినవ ఛత్రపతి బి.జె.పి సీనియర్ నాయకులు యల్.కె.అద్వానీ గారి జన్మదినోత్సవ సందర్భంగా కాగితాలపూర్ గ్రామమునందుబిజెపి జిల్లా నాయకులు బోలా శ్రీనివాసులు ఆధ్వర్యంలో చెట్లను నాటినారు ఈ సందర్భంగా బోలా శ్రీనివాసులు మాట్లాడుతూ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయితో కలిసి బీజేపీని స్థాపించడంలో అద్వానీ ప్రముఖులు అని అద్వానీ బీజేపీ అధ్యక్షుడిగా అత్యధిక కాలం పనిచేశారు అన్నారు అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం ప్రచారంలో భాగంగా రథయాత్ర చేపట్టారు అన్నారు1984లో రెండు సీట్లు గెలుచుకున్న బీజేపీ నేడు భారతదేశ రాజకీయాల్లో ఉన్నతమైన శక్తిగా ఎదిగిందంటే అందుకు అద్వానీనే కారణమని తెలిపారు ఇప్పటి వరకు ఐదుసార్లు లోక్‌సభకు పోటీచేసి విజయం సాధించారు అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు .

Featured

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే కాకాణి

మనుబోలు (పున్నమి విలేకరి) 23, అక్టోబర్ : మనుబోలు మండలంకాగితాలపూరులో శుక్రవారం సచివాలయ సిబ్బంది వాలంటీర్లతో సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్షన్లు ఇళ్ళస్ధలాలు రైతుభరోసా తదితర ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందుతున్నాయాలేదా అని అడిగి తెలుసుకున్నారు. ఇళ్ళస్ధలాలు ప్రతిఒక్కరికి అందేలాచూడాలని అధికారులు నుఆదేశించారు ఈ సందర్భంగా స్ధానిక విలేఖరులతో మాట్లాడుతూ గత టీడిపి ప్రభుత్వంలో పెన్షన్లు మంజూరుకావలంటే సంవత్సరంకు జన్మభూమిసభలు పెట్టి ఇచ్చేవారని వైకాపా ప్రభుత్వంలో నెలకు పెన్షన్ ఒక్కరోజులో రేషన్ కార్డు మంజూరుచేస్తున్నామని ఇదే మా ప్రభుత్వ ప్రత్యేకతన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలకంటే మిన్నగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నారన్నారు. రైతులకు ఎళ్ళవేళల అందుబాటులో వుండి వారిసంక్షేమం కొరకు పాటుపడుతున్నామన్నారు. అనంతరం పలుసమస్యలపై అర్జీలను స్వీకరించి సమస్యలు పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకముందు గ్రామ యువ నాయకులు, రాజా,రవి దశయ్య ,ఏడుకొండలు ఆధ్వర్యంలో బాణాసంచా బొకే శాలువాలతో ఘనస్వాగతం పలికారు. ఈ సమీక్షలో ప్రతిలబ్దిదారుని సమస్యలు అడిగితెలుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో హరిగోపాల్ రెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి , భాస్కర్ గౌడ్,శివకుమార్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, గుండాల ఆదినారాయణ, అశోక్ స్ధానిక నాయకులతోపాటు ఎమ్మార్వో ఎంపిడిఓ అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు .ఎస్ఐ సూర్యప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

Featured

దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో తొలిసారిగా బిసిలకు పెద్దపీట

మనుబోలు( పున్నమి విలేఖరి)19 ,అక్టోబర్ : ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారు 139 B.C కులాలకు చెందిన 56 B.C కార్పొరేషన్ చైర్మన్లను ఎన్నిక చేస్తూ నిర్ణయం తీసుకున్నా సందర్భంగా ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సర్కిల్ లోని స్వర్గీయ డాక్టర్ వై.యస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలవేసి, మండల వైయస్ఆర్ సీపీ నాయకులు పాలాభిషేకం చేశారు బీసీ పక్షపాతిగా దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేసిన ఘనత ఆయనకు దక్కుతుందని బీసీలకు రాజాధికారం అందించాలన్న ఆశయంతో ముందుకు వెళుతున్నారని తెలియజేశరు జగన్ చూసి చంద్రబాబు బుద్ది తెచ్చుకోవాలి అని అన్నారు బిసి లకి తగ్గిన ప్రాధాన్యత ను ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని చూసి ఇంకనైన చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకోవాలని జిల్లా బీసీ నాయకులు,జిల్లా మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ దాసరి భాస్కర్ గౌడ్ అన్నారు.బిసిల అభివృద్ధి కోసం 56 కార్పొరేషన్ లు చేసిన సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. చంద్రబాబు బిసి లను అడ్డంగా చేసుకొని అధికారంలోకి వచ్చి బీసీలను మరచిపోయి నాడని విమర్శించారు.బీసీ ల అభివృద్ధి కి పైసా కేటాయించిన దాఖలాలు లేవని అన్నారు తమ ప్రభుత్వం బిసి సంక్షేమ దిశగా అడుగులు వేస్తోందన్నారు ఈ కార్యక్రమంలోనాయకులు బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి ,దాసరి మహేంద్ర వర్మ ,కుడుముల వెంకటరమణయ్య,రంగారెడ్డి ,భాస్కర్ రెడ్డి,సుధాకర్ రెడ్డి, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు

Featured

నూతన వ్యవసాయ చట్టాలు చరిత్రాత్మకం: భాజపా మండల అధ్యక్షుడు ఓడూరు శ్రీనివాసులు రెడ్డి

మనుబోలు (పున్నమి విలేకరి)18,అక్టోబర్: ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలు చరిత్రాత్మకంగా నిలిచిపోతాయని భాజపా మనుబోలు మండల అధ్యక్షుడు ఓడూరు శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ఆయా చట్టాల గురించి వివరించే కరపత్రాలను ఆదివారం ఆయన మండలకేంద్రంలో రైతులు, ప్రజలకు పంపిణీ చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు నచ్చిన ధరలు నిర్ణయించుకుని స్వేచ్ఛగా అమ్ముకునే అవకాశం కల్పించిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. ఆయన మాట్లాడుతూ  జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో భారత ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాన్ని పార్లమెంట్లో మరియు రాజ్యసభ లో అనుమతి పొందటం జరిగిందని, ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పండించిన పంటలను దళారీ వ్యవస్థ ద్వారా కాకుండా రైతులు నేరుగా వారు పండించిన పంటలు వారే ధరలు నిర్ణయించి అమ్ముకునే వెసులుబాటు కలుగుతుంది, రైతులు ఆదాయం రెట్టింపు అవుతుంది అని చెప్పటం జరిగింది.ఈ పధకం లోని ముఖ్య సమాచారం కరపత్రాలు ద్వారా ప్రచురించి మండలంలోని రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. మనుబోలు మండల బిసి మోర్చా మండల అధ్యక్షుడుగా వీరంపల్లి. గ్రామానికి చెందిన రాచురు. వెంకయ్య ను మండల కమిటీ ఆద్వర్యంలో మండల అధ్యక్షుడు. ఓడూరు.శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బోలా.శ్రీనివాసులు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చల్లా.లక్ష్మయ్య, మండల ప్రధాన కార్యదర్శి ఇరగరాజు వెంకయ్య, ఉపాధ్యక్షుడు ముప్పవరపు చిన్న, మండల నాయకులు యనమల. శ్రీనివాసులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Featured

కమ్యూనిస్టుదే సంపూర్ణ స్వాతంత్ర నినాదం

 ప్రపంచానికి కమ్యూనిజమే ప్రత్యామ్నాయ : కమ్యూనిస్టు పార్టీమండల కార్యదర్శి దేవదానం మనుబోలు (పున్నమి విలేఖరి)17, అక్టోబర్ :భారత కమ్యూనిస్టు ఉద్యమ శత వార్షికోత్సవాల కార్యక్రమాన్ని మనుబోలు మండల సిపిఎం కార్యాలయంలో శనివారం నిర్వహించారు. సిపిఎం మండల కార్యదర్శి దేవదానం పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో మార్క్సిస్టు, లెనిస్టు సిద్ధాంతాలకు అంకితం అయిన కమ్యూనిస్టుపార్టీ 100 సంవత్సరాల క్రితం ఆవిర్భవించిందన్నారు.ఆనాటి నుండి నేటి వరకు రైతాంగం, మహిళలు, గిరిజనులు, దళితుల కోసం కమ్యూనిస్టులు ఎన్నో పోరాటాలు నిర్వహించారని గుర్తుచేశారు. ఎన్నో జమీందారి వ్యతిరేక, రైతాంగం ఉద్యమాలు, కార్మిక ఉద్యమాలు నిర్వహించారని, జాతీయోద్యమంలోనూ కమ్యూనిస్టులు ఉద్యమించారని, ఆ పోరాటాల పర్యవసానంగానే రైతులకు, మహిళలకు కొన్ని హక్కులు వచ్చాయన్నారు. పోరాటాల ఫలితంగా వచ్చిన హక్కులు నేటి బిజెపి పాలనలో ప్రమాదంలో పడ్డాయని అన్నారు. పార్లమెంటులో కార్పొరేట్‌ వ్యవసాయానికి అనుకూలంగా మూడు చట్టాలను బిజెపి ప్రభుత్వం చేసిందని తెలిపారు. కార్మికుల హక్కులను ప్రమాదంలోకి నెట్టే విధానాలను కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తోందన్నారు. కమ్యూనిస్టు ఉద్యమానికి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. కమ్యూనిస్టు ఆశయాలను సాధించేందుకు కమ్యూనిస్టులంతా పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి ఆదిశేషయ్య, సిపిఎం నాయకులు మోహన్ పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు

Featured

లక్ష ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగే లక్ష్యం :కలెక్టర్ చక్రధర్ బాబు

మనుబోలు (పున్నమి విలేఖరి) 13 ,అక్టోబర్ : నెల్లూరు జిల్లాలో 57వేల హెక్టార్లలో ఉద్యాన పంటల సాగు జరుగుతుందని లక్ష హెక్టార్లలో చేర్చడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ చక్రధర్ పేర్కొన్నారు. మంగళవారం పిడూరులోని వివిధ రకాల ఉద్యాన పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్ధానిక విలేకరులతో మాట్లాడుతూ అగ్రికల్చర్ హార్టీకల్చర్ అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ మూడు శాఖల సమన్యాయంతో రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు కావలసిన ఎరువులు విత్తనాలు అందేవిధంగా ఏర్పాట్లు చేశామన్నారు. రైతులకు అవగాహన కల్పించి వారికి కావలసిన పరికరాలు యంత్రాలు రైతుభరోసా కేంద్రాల ద్వారా అందచేయడం. అలాగే బ్యాంకులో రుణసదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు. వ్యవసాయం ఉద్యాన పంటలు లాభసాటిగా సాగేందుకు కృషిచేస్తున్నామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గిట్టుబాటు ధర కల్పించడం జరిఢిందని రైతులందరూ దళారులను నమ్మి మోసపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయాలు జరపుకోవాలన్నారు. ప్రతిధాన్యం గింజ ప్రభుతమే కొనుగోలు చేస్తుందన్నారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా వచ్చే సంవత్సరం నుండి 175 గోడౌన్లు మంజూరు చేయించేవిదంగా ప్రణాళికలు సిధ్ధంచేస్తున్నామన్నారు. రాబోయే రెండుమూడు సంవత్సరాలలో గ్రామాల్లోనే రైతులకు అన్ని వసతులు పూర్తి స్ధాయిలో అందేవిధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ఖాళీగావున్నా అగ్రికల్చర్ అసిస్టెంట్ల పోస్టులు భర్తీచేసి వీరందరు పొలాల్లో నేరుగా వెళ్లి రైతులకు సలహాలు సూచనలు ఇచ్చేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 665 రైతుభరోసా కేంద్రాలు పూర్తిస్థాయిలో వినియెగంలో వున్నాయన్నారు.జిల్లాలోని నీరు వుండడంతో సమృద్ధిగా సాగు తాగునీరుకు ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొన్నారు. అన్ని మునిసిపాలిటీలకు తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు కొరకు రీ సర్వేను జనవరి 1నుండి ప్రారంభిస్తున్నామని దీంతో చుక్కలు భూములు సిజెఎఫ్ ఎస్ 22 ఎ వంటి సమస్యలు లేకుండా పోతాయన్నారు. మార్కటింగుకు. రైతులకు ఎటువంటి సమస్య లేకుండా చేసేందుకు తమవంతు కృషిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం పి.డి సుభాని హార్టీకల్చర్ పి.డి ప్రవీణ్. గోపిచంద్. ఆనంద్ రైతు సూర్యప్రకాష్ ఎంటానిక్ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.