Saturday, 7 March 2026

Blog

Featured శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చలివేంద్రం ప్రారంభించిన ఏపీఎన్‌జీజీఓఎస్ అసోసియేషన్ నేతలు

చలివేంద్రం ప్రారంభించిన ఏపీఎన్‌జీజీఓఎస్ అసోసియేషన్ నేతలు నెల్లూరు, ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి): ఏపీ ఎన్‌జీ జీఓఎస్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో బుధవారం నాడు చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు మన్నేపల్లి పెంచలరావు అధ్యక్షత వహించగా, రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారుపల్లి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఎండలు తీవ్రతరంగా ఉండటంతో ప్రజలకు మజ్జిగ, మంచినీరు వంటి త్రాగునీటి అవసరాలు పెరిగాయని, దాహార్తి తీర్చేందుకు ఈ చలివేంద్రం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్న వేళ వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు బయట తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అత్యవసరంగా బయటకు రావాల్సిన పరిస్థితుల్లో శరీరాన్ని కప్పే బట్టలు ధరించి రావాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రామకృష్ణ, అసోసియేట్ అధ్యక్షులు ఆంజనేయవర్మ, ఆర్గనైజింగ్ కార్యదర్శి పెంచలయ్య, కోశాధికారి ప్రసాద్ రెడ్డి, రాష్ట్ర ల్యాబ్ టెక్నీషియన్ అధ్యక్షులు రఘుబాబు, జిల్లా ఉపాధ్యక్షులు కరుణమ్మ, కిరణ్, సంయుక్త కార్యదర్శులు రాజేంద్ర ప్రసాద్, విజయకుమార్, కృష్ణకుమార్, చైర్‌పర్సన్ చిన్నమ్మ, నవోదయ, నగర అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, సురేష్, స్వర్ణలత, షంషుద్దీన్, మధు, చెంచయ్య, మురళి, రమేశ్ బాబు, జానకి, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

Featured శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ముత్తుకూరు ప్రాంతంలో భారీ వర్షం, వాహనదారులకు తీవ్ర అసౌకర్యం

ముత్తుకూరు ప్రాంతంలో భారీ వర్షం, వాహనదారులకు తీవ్ర అసౌకర్యం ముత్తుకూరు, పన్నమి ప్రతినిధి – సుకుమార్: నేడు (బుధవారం) ఉదయం 7:30 గంటల నుంచి ముత్తుకూరు ప్రాంతాన్ని భారీ వర్షం చుట్టుముట్టింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. ఈ ఆకస్మిక వర్షం కారణంగా రహదారి మార్గాల్లో నీటి ప్రవాహం పెరిగిపోయింది, దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన వీధుల్లో జలమయమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రజలు అత్యవసరంగా తప్ప అయితే ప్రయాణాల వద్దకు పరిమితం కావాలని, వర్షానికి తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు పాలనపై మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తీవ్ర విమర్శలు

చంద్రబాబు పాలనపై మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తీవ్ర విమర్శలు     ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన పలు ప్రాజెక్టులపై మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో రైతుల నుంచి భారీ స్థలాలను ఆక్రమించడం, దాన్ని రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం వినియోగించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెద్ద ఎత్తున భూసేకరణ, ఆర్థిక వ్యయాలు, అసలు అవసరం లేని ప్రాజెక్టులపై ప్రభుత్వ వ్యయం వృథాగా మారుతోందని ఆయన ఆరోపించారు. “రాజధాని పరిపాలన కోసం 2700 ఎకరాలే సరిపోతే, 58 వేల ఎకరాలు ఎందుకు? ఇప్పుడు మళ్లీ అదనంగా 44 వేల ఎకరాలు ఎందుకు?” అంటూ ప్రశ్నించారు. ప్రజల అవసరాలకంటే ప్రాజెక్టులపై ఎక్కువ శ్రద్ధ? వడ్డే విమర్శిస్తూ, “ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టుల కన్నా, అవుటర్ రింగ్ రోడ్, మెట్రో రైలు వంటి మెగా ప్రాజెక్టుల మీద చంద్రబాబు శ్రద్ధ పెడుతున్నారు. హైపర్ లూప్ వంటి విదేశాల్లో కూడా నైతిక స్థిరతలేని ప్రాజెక్టును ఏపీలో చేపట్టడం అనాలోచిత చర్య” అని పేర్కొన్నారు. విద్యా రంగంలో కార్పొరేట్ ఆధిపత్యంపై వ్యాఖ్యలు వడ్డే మాట్లాడుతూ, “రాష్ట్రంలోని ముఖ్యమైన విద్యాసంస్థలు మీ నాయకులవి. నిజంగా పేదల గురించి ఆలోచిస్తే, భాష్యం, నారాయణ విద్యాసంస్థల్లో కనీసం పది శాతం సీట్లు పేద విద్యార్థులకు ఇచ్చేలా చూడాలి. మీ హెరిటేజ్ సంస్థ నుంచి విద్యార్థులకు పాలు, పెరుగు, మజ్జిగ ప్యాకెట్లు అయినా ఇవ్వండి,” అని సూచించారు. వైద్య సేవలు, సాగునీరు – మౌలిక అవసరాలపై దృష్టి పెట్టాలి శ్రీకాకుళంలో విమానాశ్రయం కాదు, సాగునీరు అవసరమని, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న ప్రజలపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదని ఆయన విమర్శించారు. “పీ4 స్కీమ్ మేలు చేస్తే, ముందుగా మీ వ్యక్తిగత, కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతను నిర్వర్తించాలి,” అని హితవు పలికారు. చివరగా ఆయన వ్యాఖ్య: “ప్రజలకు ఎత్తైన భవనాలు కాదు, మంచి పరిపాలన అవసరం. ఆలోచనల్లో మార్పు అవసరం. చంద్రబాబు గారు ప్రజల అవసరాల వైపు మొగ్గు చూపాలి,” అని వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు. ⸻

Featured సాహితీ

హాస్యానికి హృదయాన్ని ఇచ్చిన మహానుభావుడు – చార్లీ చాప్లిన్ జయంతి ప్రత్యేకం

హాస్యానికి హృదయాన్ని ఇచ్చిన మహానుభావుడు – చార్లీ చాప్లిన్ జయంతి ప్రత్యేకం   (పున్నమి సాంసృతిక ప్రతినిధి ప్రసాద్ బాబు) 16 ఏప్రిల్ – నిశబ్ద హాస్యానికి పరిపూర్ణ రూపం, ప్రపంచ సినీ చరిత్రలో చిరస్మరణీయుడైన చార్లీ చాప్లిన్ జన్మదినం. చాప్లిన్ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకువచ్చేది – మొహంలో చిరునవ్వు, లోపల బాధల తుపాన్లు. ఆయన జీవితం ఒక వైపు దుఃఖంతో, మరోవైపు వినోదంతో నిండి ఉంది. తన జీవితాన్ని తెరమీద హాస్యంగా మలిచాడు, కానీ ప్రతి రూపం వెనక ఒక లోతైన సందేశం దాగి ఉంది. చాప్లిన్ తన సినిమాలలో మానవ విలువలు, సమాజపు అసమానతలు, మరియు ఆధునిక జీవన ఒత్తిడిని అద్భుతంగా చూపించారు. ‘ది కిడ్’ లో ఆకలితో బాధపడే బాలుడు, ‘సిటీ లైట్స్’ లో ప్రేమలోని అమాయకత్వం, ‘మాడర్న్ టైమ్స్’ లో యంత్రాల మధ్య మానవుల బాధల ప్రతిబింబం – ఇవన్నీ ఆయన సినీ మేధస్సుకు నిదర్శనాలు.   “చాప్లిన్ అంటే హాస్యం వ్యంగ్యం వినోదం కానీ తాను ఓ చక్కెర పూసిన చేదుమందు” అంటూ ఈ కవితలో ఆయన జీవితంలోని వ్యతిరేక స్వభావాల మధ్య సమతుల్యతను చూపించారు. ఈ రోజు, చాప్లిన్ జయంతి సందర్భంగా, మనం ఒక్కసారి మనిషిని నవ్వించడం వెనక దాగిన బాధలను గుర్తు చేసుకోవాలి. హాస్యం ఎప్పుడూ తేలిక కాదు – అది లోతైన చింతనకు, అనుభూతికి ప్రతీక. చార్లీ చాప్లిన్ – నీకు వినమ్ర నివాళి.

Featured శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పేద విద్యార్థులకు క్రీడా బూట్ల పంపిణీ – కాజ్ సంస్థ సేవా కార్యక్రమం

పేద విద్యార్థులకు క్రీడా బూట్ల పంపిణీ – కాజ్ సంస్థ సేవా కార్యక్రమం నెల్లూరు, ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి) నగరంలోని MCUP దర్గామిట్ట స్కూల్‌లో ఢిల్లీకి చెందిన కాజ్ సంస్థ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు క్రీడా బూట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని నాలుగు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 75 మంది బాలబాలికలకు ఉచితంగా బూట్లు అందజేశారు. కాజ్ సంస్థ డైరెక్టర్ చక్రవర్తి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కొన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బూట్లు ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం నగర పాలక ప్రాథమికోన్నత పాఠశాల, దర్గామిట్ట, క్రాంతినగర్ స్కూల్, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, మూలపేట మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మదరాజుగూడూరు కు చెందిన బాలబాలికలకు బూట్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో MCUP దర్గామిట్ట స్కూల్ హెచ్‌ఎం కొమ్మల కృష్ణయ్య, నెల్లూరు జిల్లా హాకీ అసోసియేషన్ డైరెక్టర్ థామస్ పీటర్, వ్యాయామ ఉపాధ్యాయులు జి.డి. సురేష్, నాగేంద్ర కుమార్, సురేఖ, మాలిని, సీనియర్ హాకీ క్రీడాకారులు అఖిల్, జశ్వంత్, భువన్, ఇంకా పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ సేవా కార్యక్రమం విద్యార్థుల్లో క్రీడాపట్ల ఆసక్తిని పెంపొందించడంలో తోడ్పడుతుందని నిర్వాహకులు తెలిపారు.

Featured తెలంగాణ

కరీంనగర్ యువకుడు అశోక్ 37వ సారి రక్త కణాలు దానం

  కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డెంగీతో బాధపడుతున్న నగునూరు గ్రామానికి చెందిన వీఆర్‌ఏ అజయ్ (29)కు అత్యవసరంగా O+ రక్త కణాలు అవసరమయ్యాయి. ఈ నేపథ్యంలో, ఎలాబోతారం గ్రామానికి చెందిన బుచ్చాల అశోక్ తన 37వ సారి రక్త కణాలు దానం చేసి, అజయ్‌కు ప్రాణదాతగా నిలిచారు. అశోక్ గతంలో కూడా అనేక సార్లు అత్యవసర పరిస్థితుల్లో రక్త దానం చేసి, అనేక మందికి ప్రాణాధారంగా నిలిచారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్త దానం చేస్తూ, యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా గాలిపల్లి కుమార్ మాట్లాడుతూ, “వేసవి కాలంలో రక్త కొరత తీవ్రమవుతుంది. అందువల్ల, యువత రక్త దానానికి ముందుకు రావాలి. అశోక్ వంటి రక్తదాతలు సమాజానికి స్ఫూర్తి.” అని పేర్కొన్నారు. రక్త దానం చేయడం ద్వారా ప్రాణాలను రక్షించవచ్చు. అందరూ ముందుకు వచ్చి రక్త దానం చేయాలని పిలుపునిచ్చారు.

Featured ఆంధ్రప్రదేశ్

నెల్లూరు వ్యాపార రంగానికి గర్వకారణం: నలుబోలు వెంకట రమణా రెడ్డికి “బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్” గౌరవ డాక్టరేట్

నెల్లూరు వ్యాపార రంగానికి గర్వకారణం: నలుబోలు వెంకట రమణా రెడ్డికి “బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్” గౌరవ డాక్టరేట్ (పున్నమి ఏప్రిల్ ప్రసాద్ బాబు కల్చర్ రిపోర్టర్) నెల్లూరు జిల్లా వ్యాపార రంగానికి గర్వకారణంగా నిలిచిన ఘట్టం ఇది. స్థానిక పారిశ్రామికవేత్త శ్రీ నలుబోలు వెంకట రమణా రెడ్డి గారు “బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్” కేటగిరీలో The America University, USA నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఈ గుర్తింపు, ఆయన వ్యక్తిగత విజయమే కాకుండా, స్థానిక వ్యాపార వర్గాలకు, యువతకు ప్రేరణనిచ్చే ఘట్టంగా నిలిచింది. సాధారణ స్థితి నుండి సుస్థిర వ్యాపారవేత్తగా ఎదుగుదల పొతిరెడ్డి పాలెం గ్రామంలోని కుటుంబ పౌల్ట్రీ వ్యవసాయం నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించిన శ్రీ వెంకట రమణా రెడ్డి గారు, 1998లో Hi-Tech Pharma సంస్థను స్థాపించారు. ఆక్వాకల్చర్, పౌల్ట్రీ మరియు వెటర్నరీ రంగాలలో పోషణ, పర్యావరణం మరియు ఆరోగ్య నిర్వహణకు సంబంధించి ప్రీమిక్స్‌లు, ప్రొబయోటిక్స్, బయోథెరప్యూటిక్స్ వంటి ఉత్పత్తులను తయారు చేస్తూ, ఈ సంస్థ దేశవ్యాప్తంగా విశ్వసనీయతను సంపాదించింది. సాంకేతికత మరియు నూతనతకు ప్రాధాన్యత Hi-Tech Pharma సంస్థ, ISO మరియు GMP ప్రమాణాలతో కూడిన మూడు ఆధునిక తయారీ యూనిట్లను నెల్లూరులో నిర్వహిస్తోంది. ఈ సంస్థ, సాంకేతికతను ప్రోత్సహిస్తూ, నూతనతను ప్రదర్శిస్తూ, దేశవ్యాప్తంగా 500కి పైగా చానల్ పార్ట్‌నర్లతో కలిసి పనిచేస్తోంది. అలాగే, Nutri Bio Pharma వంటి అనుబంధ సంస్థల ద్వారా కూడా వ్యాపార విస్తరణను సాధించింది.  సమాజానికి సందేశం ఈ గౌరవ డాక్టరేట్, కృషి, నిజాయితీ, దృఢనిశ్చయం ఉంటే ఎవరైనా గొప్ప విజయాలను సాధించగలరనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. శ్రీ వెంకట రమణా రెడ్డి గారి విజయగాథ, నేటి యువ ఎంటర్ప్రెన్యూర్‌లకు మార్గదర్శకంగా నిలుస్తోంది. ఈ సందర్భంగా పున్నమి వారు ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

ఆత్మకూరులో టీడీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ:

ఆత్మకూరులో టీడీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ నెల్లూరు ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి) ఆత్మకూరు పట్టణంలోని బస్ స్టాండ్ వద్ద ఉన్న భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దావా పెంచలరావు గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం టిడిపి జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారెడ్డి గారి సూచనలతో జరిగింది. వేడుకలు బిఎస్సార్ సెంటర్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీతో ప్రారంభమయ్యాయి. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దావా పెంచలరావు గారు మాట్లాడుతూ, “డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భారతజాతికి ప్రతినిధి. ఆయనను కేవలం ఒక కులం, ప్రాంతం, వర్గానికి పరిమితం చేయడం సబబు కాదు. ఆయన సాంఘిక దురాచారాలను అధిగమించి, సమానత్వం కోసం పోరాడారు. ఆయన ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి” అని అన్నారు. అంబేద్కర్ విద్యకు ప్రాధాన్యతనిచ్చిన మహానేత అని, చదువు ద్వారానే మనిషి ఎదుగుదల సాధ్యమని నమ్మారని తెలిపారు. విధానపరమైన అన్యాయాలను ప్రశ్నించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే దిశగా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Featured ఆంధ్రప్రదేశ్

ఇంపాక్ట్” సంస్థ ఆధ్వర్యంలో ఉచిత Train The Trainer వర్క్‌షాప్

  హైదరాబాద్, ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి) ప్రసిద్ధ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంపా నాగేశ్వరరావు గారి నేతృత్వంలో “ఇంపాక్ట్” సంస్థ ద్వారా ఉచితంగా నిర్వహించబడుతున్న Train The Trainer వర్క్‌షాప్‌ ఏప్రిల్ 15న ప్రారంభమవుతోంది. వ్యక్తిత్వ వికాసం, భయాల నివారణ, కెరీర్ అభివృద్ధి వంటి అంశాలపై ట్రైనింగ్ ఇవ్వబడనున్న ఈ వర్క్‌షాప్ యువతకు జీవితం పట్ల కొత్త దృక్పథాన్ని అందించనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారిని వెంటనే రిజిస్టర్ అవ్వాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. “మీ భయాలను మీ బలంగా మార్చుకునే సమయం ఇది” అనే నినాదంతో ప్రారంభమవుతున్న ఈ శిక్షణ శిబిరానికి సీట్లు పరిమితంగా ఉన్నాయి. విశేష సమాచారం కోసం ఈ క్రింది నంబర్లకు సంప్రదించవచ్చు: సంతోష్ కుమార్ – 98491 87544 స్వాతి పబ్బా – 83742 89992 శ్రీనివాస్ పెరుమండ్ల – 93466 08326

Featured ఆంధ్రప్రదేశ్

గాజువాకలో అంబేద్కర్ జయంతి ఘనంగా: సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పార్థసారధి

  విశాఖపట్నం, ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని గాజువాకలోని స్వామి విద్యానికేతన్ హై స్కూల్ రోడ్, సాయిరాం నగర్లో స్కౌట్స్ మరియు గైడ్స్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ పార్థసారధి గారు హాజరై, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా పౌర హక్కుల సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు తుంపాల శ్రీరామ్ మూర్తి, అలాగే పెదగంట్యాడ మండల ప్రభుత్వ వైద్యశాల అధికారి మరియు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ పీ. హేమలత గారు పాల్గొన్నారు. అతిథులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారు దేశ ప్రజల హక్కుల కోసం చేసిన పోరాటం అమోఘమని, ఆయన చూపిన మార్గంలో నడిచేలా యువత సమాజానికి దోహదం చేయాలని సూచించారు. అంబేద్కర్ బోధనలు సమాజ సమానత్వానికి మార్గదర్శకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కౌట్స్, గైడ్స్ సభ్యులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పలువురు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతిని విద్యార్థుల్లో చైతన్యం నింపేలా నిర్వహించినందుకు హర్షం వ్యక్తమైంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.