Saturday, 7 March 2026

Blog

Featured సాహితీ

కార్డు ముక్క :వారాల ఆనంద్

కార్డు ముక్క వారాల ఆనంద్ సాహితీ పున్నమి) పోస్ట్ మాన్ కోసం ఎదురు చూసీ చూసీ అలసిపోయాక ఈ రోజు నన్ను వెతుక్కుంటూ ఓ పోస్ట్ కార్డు వచ్చింది నత్తనడకన ఎన్ని వూర్లు ఎన్ని వీధులు ఎన్ని రోజులు తిరిగిందో కార్డు మీద చూస్తే ఊరి పేరులేదు రాసిన తేదీలేదు రాసిన వారి పేరూ లేదు చాలాసేపటివరకూ ఖాళీ ఉత్తరాన్ని చదువుతూ కూర్చున్నాను తెల్లకాగితంలా ఉన్న ఆ కార్డు ముక్క ఎన్ని సంగతుల్ని చెబుతున్నదో ఎంత దుఃఖాన్ని మోస్తున్నదో వూర్లో ఏమీ మిగలలేదని వూరు బాధని గాధని నింపు కొచ్చిన కార్డు ఇంకా ఏమయినా చెప్పాలా నిశబ్దాన్ని మోసుకొచ్చిన కార్డు ముక్క కళ్ళల్లో ప్రవాహాన్నీ మనసులో ఎడారినీ నింపేసింది ******************** POST CARD ++++++ After weary days of waiting, The postman never visited Yet today, a postcard arrived, Wandering through nameless towns, Unnamed streets Countless days Upon its face No station whisper No breath of date No hand to claim its words. For a long time, I sat reading the hollow silence Of that blank piece of card How much it murmurs, How much sorrow it carries It echoes the empty village and Its grief poured into brittle paper What more could it confess? A fragment of silence in my hands It filled My eyes flooded, My heart with desert winds ***************** Original poem in Telugu and English translation By VARALA ANAND

శ్రీకాకుళం 

శ్రీ నిత్య నూతన చిట్ ఫండ్ Pvt Ltd 6 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా : ఏపీ చిట్ ఫండ్ ఫెడరేషన్ శుభాకాంక్షలు

శ్రీ నిత్య నూతన చిట్ ఫండ్ Pvt Ltd ఘన విజయాన్ని జరుపుకుంటూ 6 వసంతాలు శ్రీకాకుళం ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి) శ్రీ నిత్య నూతన చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ తన విజయయాత్రలో మరో మైలురాయిని అధిగమించింది. 6 వసంతాలను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ కార్యాలయంలో ఘనంగా వేడుకలు జరిగాయి. సంస్థ స్థాపన నుంచి నేటి వరకు నిరంతర అభివృద్ధి పథంలో సాగుతూ, కస్టమర్ల విశ్వాసాన్ని సంపాదించుకోవడంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు మాట్లాడుతూ, “మా సంస్థ ఎదుగుదలకు ప్రధాన కారణం కస్టమర్ల మద్దతు, విశ్వాసం. మేము ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాకుండా, ప్రతి ఒక్కరి ఆశలను తీర్చే విధంగా ముందుకు సాగుతున్నాము,” అని హర్షం వ్యక్తం చేశారు. సంస్థ నిర్వహణలో పారదర్శకత, నిబద్ధత ప్రధానమైన అంశాలుగా నిలిచాయని వారు పేర్కొన్నారు. గత ఆరు సంవత్సరాలలో శ్రీ నిత్య నూతన చిట్ ఫండ్ అనేక కొత్త చిట్ స్కీములను ప్రవేశపెట్టి వేలాది మంది సభ్యుల అభిమానం చూరగొంది. ముందున్న రోజుల్లో మరింత విస్తరణకు ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు. డిజిటల్ సేవల ద్వారా మెరుగైన సదుపాయాలను అందించేందుకు సంస్థ కృషి చేస్తోంది అని సంస్థ డైరెక్టర్స్ తెలిపారు.ఏపీ చిట్ ఫండ్ ఫెడరేషన్ శుభాకాంక్షలు తెలిపారు

Featured ప్రకాశం

గవర్నమెంట్ స్కూల్ సూపర్ విజయాలు: 600కి 598 మార్కులు

గవర్నమెంట్ స్కూల్ సూపర్ విజయాలు: 600కి 598 మార్కులు     ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు టెన్త్ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు. ప్రకాశం జిల్లా పరుచూరు(D) మండలంలోని ఒప్పంగి ZP హై స్కూల్‌కు చెందిన విద్యార్థిని పావని చందు 600కి 598 మార్కులతో అద్భుత విజయాన్ని సాధించింది. ఆమె ఇంగ్లిష్ సబ్జెక్టులో 99 మార్కులు. మిగిలిన సబ్జెక్టులన్నిటిలోనూ పూర్తి మార్కులు సాధించింది. అలాగే అదే మండలం, అదే స్కూల్‌కు చెందిన మరో విద్యార్థిని అలవలపాటి చందన 595 మార్కులతో రెండవ స్థానంలో నిలిచింది. ఈ విజయాలు ప్రభుత్వ పాఠశాలల విద్యను నమ్మి, కష్టపడి చదివితే ఎంత గొప్ప ఫలితాలు సాధించవచ్చో చక్కగా చూపిస్తున్నాయి.అభినందనలు విద్యార్థినిలకు మరియు వారి ఉపాధ్యాయులకు వారి తల్లిదండ్రుల కు పున్నమి పాఠకులు తరుపున అభినందనలు

Featured ఆంధ్రప్రదేశ్

AP SSC 10వ తరగతి ఫలితాలు విడుదల

  ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి (SSC) ఫలితాలు ఈ రోజు ఉదయం 10 గంటలకు విడుదలయ్యాయి. మొత్తం 6,14,459 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు, అందులో 4,98,585 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 81.14% కాగా, బాలికలు 84.09% ఉత్తీర్ణతతో బాలుర కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచారు. 1,680 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించాయి. విద్యార్థులు తమ ఫలితాలను bse.ap.gov.in లేదా results.bse.ap.gov.in వెబ్‌సైట్లలో తనిఖీ చేయవచ్చు. 

Featured జాతీయ అంతర్జాతీయ

LoC అంటే Line of Control.

  ఇది భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉన్న నియంత్రణ రేఖ (contested border)ను సూచిస్తుంది, ముఖ్యంగా జమ్మూ & కాశ్మీర్ ప్రాంతంలో. ఇది అధికారిక అంతర్జాతీయ సరిహద్దు కాదు, కానీ రెండు దేశాలు మధ్య తాత్కాలికంగా అంగీకరించిన నియంత్రణ గీత. ముఖ్యాంశాలు: 1972లో శిమ్లా ఒప్పందం తర్వాత LoC ఏర్పడింది. దీని పొడవు సుమారు 740 కిలోమీటర్లు. తరచూ ఇక్కడ కాల్పుల మార్పిడి, దొంగదారిన చొరబాట్లు వంటి ఘటనలు జరుగుతుంటాయి.

Featured జాతీయ అంతర్జాతీయ

పహల్గాం ఉగ్రవాద దాడి: కాశ్మీర్‌లో భద్రతా పరిస్థితులు క్షీణత

పహల్గాం ఉగ్రవాద దాడి: కాశ్మీర్‌లో భద్రతా పరిస్థితులు క్షీణత శ్రీనగర్, ఏప్రిల్( పున్నమి ప్రతినిధి) జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం సమీపంలోని బైసారన్ మైదానంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిలో కనీసం 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో 30 మందికి పైగా గాయపడ్డారు. దాడి సమయంలో నాలుగు మంది గన్‌మెన్‌లు పర్యాటకులపై సమీపం నుంచి కాల్పులు జరిపారు.  ఈ దాడి పట్ల దేశీయంగా మరియు అంతర్జాతీయంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా ఈ దాడిని ఖండించారు. అమెరికా  అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఘటనను “తీవ్రంగా కలచివేసే”దిగా పేర్కొన్నారు. దాడి అనంతరం, కాశ్మీర్ లోయలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయబడ్డాయి. భద్రతా బలగాలు, పోలీస్, సీఆర్‌పీఎఫ్ సంయుక్తంగా దాడి జరిగిన ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ దాడి తర్వాత, పహల్గాం ప్రాంతంలో పర్యాటకులు మరియు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భద్రతా పరిస్థితులు మరింత క్షీణించాయి. భవిష్యత్తులో ఇలాంటి దాడులను నివారించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ దాడి కాశ్మీర్‌లో భద్రతా పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రభుత్వం భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

జగన్‌ లో భయం పట్టిన మద్యం కేసు: ఈడీ ఎంట్రీకి మార్గం సుగమం?

జగన్‌ను బిగుతుపట్టిన మద్యం కేసు: ఈడీ ఎంట్రీకి మార్గం సుగమం? అమరావతి, ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం మద్యం కుంభకోణం కేసుతో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత తన తిరిగి వచ్చే అవకాశాలపై దృష్టి పెట్టిన ఆయనకు, పార్టీని వీడి వెలుతురులోకి వచ్చిన విజయసాయిరెడ్డి మరింత సమస్యల బాటలో నడిపిస్తున్నాడు. అవినీతి కేసుల్లో కీలక ఆధారాలను ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు అందజేస్తూ, ముఖ్యమంత్రి జగన్‌కు సన్నిహితంగా ఉన్న నేతల ప్రమేయాన్ని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇటీవల మద్యం కేసులో ఎంపీ మిధున్ రెడ్డి, కసిరెడ్డి వంటి ముఖ్య నేతల పేర్లు బహిర్గతమయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే జరిగిన అరెస్టులు, సాక్ష్యాలు జగన్‌కు చేరువగా ఉన్నాయని భావన బలపడుతోంది. మరోవైపు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా‌ను కలవడం, మద్యం కేసును ఈడీకి అప్పగించాలనే ప్రచారం వైసీపీ శ్రేణుల్లో ఆందోళనకు కారణమైంది. వైసీపీ శ్రేణులు, నేతలు అంతర్గతంగా తీవ్ర ఆత్మవిశ్లేషణలో మునిగిపోయారు. ఇప్పటికే జగన్ పార్టీ సమావేశాల్లో చేసిన వ్యాఖ్యల ద్వారా, కేసుపై తనపై ఒత్తిడి పెరుగుతోందనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మద్దతు లేకుండా పోతుందనే భయం కూడా ఆయనలో స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఈ కేసులో ఈడీ దర్యాప్తుకు ఆదేశాలిస్తే, జగన్ అరెస్టు తథ్యమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయంగా మారిన పరిణామాల నేపథ్యంలో, జగన్‌కు రాజకీయ పునరాగమనం సాధ్యమవుతుందా? అన్నది ఇప్పుడు million-dollar ప్రశ్నగా మారింది.

Featured

మహాకవి కాళిదాసు జయంతి సభలో “మహాకవి కాళిదాసు – సుభాషితాలు” అంశం: సాయి కుమార్ రెడ్డి బత్తిన

మహాకవి కాళిదాసు జయంతి సభలో “మహాకవి కాళిదాసు – సుభాషితాలు” అంశం: సాయి కుమార్ రెడ్డి బత్తిన భగవాన్ శ్రీ రామకృష్ణుల కృపతో వర్థమాన సమాజం వారు మరియు పునుగు రమామణి స్మారక నిధి వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న మహాకవి కాళిదాసు జయంతి సభ  సందర్భంగా “మహాకవి కాళిదాసు – సుభాషితాలు” అనే ప్రాసంగిక అంశంపై ఉపన్యసించేందుకు సాయి కుమార్ రెడ్డి బత్తినకు ఆహ్వానం లభించింది. సాహితీ సేవలకు ఈ అవకాశాన్ని కల్పించిన మజ్జిగ ప్రభాకర్ రెడ్డిగారికి, తమ్ముడు రవిచంద్రన్ గారికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సనాతన ధర్మం, సంస్కృతి, సాహిత్యపట్ల తనకున్న అభిమానం నేపథ్యంలో కాళిదాసు వంటి మహాకవిపై అభిప్రాయాలను ప్రదర్శించేందుకు ఈ వేదిక ఎంతో గొప్పదని ఆయన పేర్కొన్నారు.

Featured జాతీయ అంతర్జాతీయ

ఏప్రిల్ 21 గురించి మీ పిల్లలు /స్నేహితులతో సరదాగా మాట్లాడండి

ఏప్రిల్ 21, భారతదేశంలో ‘సివిల్ సర్వీసెస్ డే’గా జరుపుకుంటారు. ఈ రోజు 1947లో సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఢిల్లీలోని మెట్కాఫ్ హౌస్‌లో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారుల ప్రొబేషనర్లను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భాన్ని గుర్తు చేసుకోవడానికి ఎంపిక చేశారు. ఆ ప్రసంగంలో ఆయన సివిల్ సర్వెంట్లను ‘ఇండియాకు స్టీల్ ఫ్రేమ్’గా అభివర్ణించారు. ఈ డే 2006 నుండి అధికారికంగా జరుపుకుంటున్నారు  . ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఇతర ప్రత్యేక రోజులు: ప్రపంచ సృజనాత్మకత మరియు ఆవిష్కరణ దినోత్సవం (World Creativity and Innovation Day): సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడానికి. నేషనల్ టీ డే (National Tea Day): యునైటెడ్ కింగ్‌డమ్‌లో టీ ప్రాముఖ్యతను గుర్తించడానికి. నేషనల్ కిండర్‌గార్టెన్ డే (National Kindergarten Day): పిల్లల ప్రాథమిక విద్యను గుర్తించడానికి. నేషనల్ చాక్లెట్-కవర్డ్ కాజూ డే (National Chocolate-Covered Cashews Day): ఈ ప్రత్యేకమైన స్వీట్నెస్‌ను సెలబ్రేట్ చేయడానికి .  ఇతిహాసపరంగా, 1526లో ఈరోజే మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్, ఇబ్రహీం లోదీపై మొదటి పానిపట్ యుద్ధంలో విజయం సాధించాడు, ఇది భారతదేశ చరిత్రలో కీలక మలుపు . ఈరోజు మరణించిన ప్రముఖులు: మహ్మద్ ఇక్బాల్: ప్రముఖ కవి, తత్వవేత్త. శకుంతలా దేవి: గణిత మేధావి, ‘హ్యూమన్ కంప్యూటర్’గా ప్రసిద్ధి. జానకి బల్లభ్ పట్నాయక్: ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి  . ఈరోజు పుట్టిన ప్రముఖులు: ఇగ్గీ పాప్: ప్రముఖ అమెరికన్ రాక్ సంగీతకారుడు. జేమ్స్ మెక్‌అవోయ్: స్కాటిష్ నటుడు, ‘ఎక్స్-మెన్’ చిత్రాల్లో నటించినందుకు ప్రసిద్ధి  .

Featured సాహితీ

డా.బి.ఆర్.అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా “హ్యూమానిటీ హెల్పర్స్ చారిటబుల్ ట్రస్ట్” నిర్వహించిన కవితల పోటీలు – విజేతలకు బహుమతులు ప్రదానం

డా.బి.ఆర్.అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా “హ్యూమానిటీ హెల్పర్స్ చారిటబుల్ ట్రస్ట్” నిర్వహించిన కవితల పోటీలు – విజేతలకు బహుమతులు ప్రదానం భారత రాజ్యాంగ నిర్మాత, సమానత్వానికి మార్గదర్శకుడైన డా. బి. ఆర్. అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకొని “హ్యూమానిటీ హెల్పర్స్ చారిటబుల్ ట్రస్ట్” వారి ఆధ్వర్యంలో కవితల పోటీలు నిర్వహించబడినవి. దేశవ్యాప్తంగా అనేక మంది సాహిత్యాభిమాని కవులు ఈ పోటీలో పాల్గొని, అంబేద్కర్ గారి జీవితం, సంకల్పం, సమాజానికి అందించిన సేవలను కవిత్వంగా వ్యక్తీకరించారు. పోటీ ఫలితాలు ఈరోజు అధికారికంగా ప్రకటించబడ్డాయి. విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు ట్రస్ట్ నిర్వాహకులు అందజేశారు. ప్రథమ బహుమతి – జగద్విఖ్యాత జ్ఞాన దీపిక గుండాల నరేంద్ర బాబు, తెలుగు ఉపాధ్యాయులు, కే.ఎన్.ఆర్.నగర పాలక ఉన్నత పాఠశాల, బి.వి.నగర్, నెల్లూరు మొబైల్: 9493235992 ద్వితీయ బహుమతి – విధాత జి.వి. హేమలత, గుంటూరు చిరునామా : D. No. 26-29-33, 2nd లైన్, A.T. అగ్రహారం, గుంటూరు – 522004 ఫోన్: 0863-2322188 | మొబైల్: 9948345218 ఈమెయిల్: sreedharakumarc@gmail.com తృతీయ బహుమతి – వేగుచుక్క అంబేద్కర్ ముడావత్ లోకేందర్ (కలంపేరు: చౌహాన్) గ్రామం: బల్సులపల్లి తండా, తలకొండపల్లి మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ మొబైల్: 7660838837 (సూర్య ధనుంజయ యాడి చేతిలో నామకరణం) ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ, అంబేద్కర్ గారి ఆలోచనలు, న్యాయబద్ధ సమాజాన్ని నిర్మించేందుకు ఆయన చేసిన కృషి ఈ తరం యువతలోకి వెళ్లాలన్న ఉద్దేశంతోనే ఈ కవితల పోటీలు నిర్వహించామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సాహిత్య, సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.