Saturday, 7 March 2026

Blog

Featured శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరులో అపోలో కాస్మోటిక్ క్లినిక్ ప్రారంభం – అందానికి శాస్త్రీయ పరిష్కారం

నెల్లూరు నగరంలో ఆరోగ్య రంగానికి మరో మెరుగైన అధ్యాయం ప్రారంభమైంది. ఇప్పటివరకు మెట్రో నగరాలకే పరిమితమైన కాస్మోటిక్ సర్జరీ సేవలను ఇప్పుడు నెల్లూరులో అందుబాటులోకి తీసుకొచ్చింది అపోలో స్పెషాలిటీ హాస్పిటల్. గురువారం ఈ హాస్పిటల్‌లో ప్రత్యేక కాస్మోటిక్ క్లినిక్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శ్రీనివాసరావు, హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్లు మాట్లాడుతూ, ఇప్పుడు అందాన్ని మెరుగుపరుచుకోవడం అవసరంగా మారిందని, వయస్సు పెరుగుదలతో వచ్చే మార్పులను సరిచేసుకోవడానికి కాస్మోటిక్ సర్జరీలు శాశ్వత పరిష్కారమని తెలిపారు. ఒకప్పుడు సెలబ్రిటీలకే పరిమితమైన ఈ చికిత్సలు, ఇప్పుడు సాధారణ ప్రజలకూ అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. ఈ క్లినిక్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నాన్ సర్జికల్ మరియు సర్జికల్ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. నాన్ సర్జికల్ చికిత్సల్లో ముఖ్యంగా BOTOX (బొటాక్స్), FILLERS (ఫిల్లర్స్), FAT INJECTIONS, THREAD LIFTING, EXOSOMES, SKIN BOOSTERS లాంటి సేవలు లభ్యమవుతున్నాయి. ఇవి ముక్కు, నోరు, కంటి చుట్టూ ఉన్న రింకుల్ని తగ్గించడంలో, చర్మాన్ని మెరిపించడంలో సహాయపడతాయి. అలాగే సర్జికల్ విధానంలో FOREHEAD LIFT, BROW LIFT, FACE LIFT, RHINOPLASTY, BLEPHAROPLASTY, DIMPLE CREATION, LIP AUGMENTATION, BREAST AUGMENTATION, GYNECOMASTIA CORRECTION, LIPOSUCTION, BODY CONTOURING, TUMMY TUCK SURGERY వంటి సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, డబుల్ చిన్, జా లైన్ కరెక్షన్ లాంటి ప్రత్యేక చికిత్సలు కూడా అందిస్తున్నారు. కాస్మోటిక్ సర్జరీల వల్ల ఎలాంటి ప్రమాదం లేదని, అవి శాస్త్రీయంగా నిర్ధారించబడినవని, క్లినికల్ మానదండాలతో నిర్వహించబడుతున్నాయన్న నమ్మకాన్ని డాక్టర్లు వ్యక్తం చేశారు. చికిత్సలు పూర్తిగా సురక్షితమైనవే కాకుండా, అధిక ఖర్చుతో కూడినవిగా ఉండకుండా అందరికీ అందుబాటులో ఉండేలా ప్రణాళిక రూపొందించామన్నారు. అందంగా ఉండాలనే ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఈ అవసరాన్ని తీర్చేలా అపోలో హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన ఈ క్లినిక్ ప్రజలకు గొప్ప అవకాశమని డాక్టర్ శ్రీరామ్ సతీష్ తెలిపారు. ఈ ఆధునిక సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ స్వరూపాన్ని మరింత మెరుగుపరచుకోవాలని పిలుపునిచ్చారు.

Featured ఆంధ్రప్రదేశ్

మోదీ-లోకేష్ భేటీపై ఊహాగానాలు: కీలక రాజకీయ మార్పుల దిశగా సంకేతమా?

  రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారిని సుదీర్ఘంగా — సుమారు రెండున్నర గంటల పాటు — హైదరాబాద్‌లో కలిసిన నేపథ్యం ఇప్పుడు రాజకీయ, అధికార మరియు సామాన్య వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒక రాష్ట్ర మంత్రితో ప్రధాన మంత్రి ఇంత సమయం గడపడం సాధారణమైన విషయం కాదు. గతంలో ఇలాంటి అవకాశం ఎవరకి లేదు. ఈ భేటీలో ఏమి చర్చించబడింది? ఇది కేవలం మర్యాద పూర్వక సమావేశమా? లేక, దేశ రాజకీయాలలో పెద్ద మార్పుల ఆరంభ సంకేతమా? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. అధికార వర్గాల సమాచారం ప్రకారం, ఈ భేటీ మర్యాద పూర్వకంగానే సాగిందని చెబుతున్నప్పటికీ, రాజకీయ పరిశీలకుల విశ్లేషణలు మాత్రం దీన్ని ‘పవర్ ట్రాన్స్ఫర్’కి ముందు దశగా చూస్తున్నాయి. ఇతివృత్తంలోకి వెళితే, గతంలో రెండు సందర్భాల్లో మోదీ గారు — రాష్ట్ర పర్యటనల సందర్భంగా — లోకేష్‌ను తనను కలవాలని సూచించారు. ఇక, ఇటీవల జరిగిన అమరావతి పునఃప్రారంభ సభలోనూ అదే సూచనను మళ్లీ పునరావృతం చేశారు. దాంతో, ఈసారి లోకేష్ కుటుంబ సమేతంగా మోదీని కలిశారు. రాజకీయ అనుమానాలు & టిడిపిలో మార్పుల ఊహాగానాలు ఇప్పటికే టిడిపిలో నాయకత్వ మార్పు గురించి గట్టి ప్రచారం నడుస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలో పదవికి వీడ్కోలు చెప్పి, తన కుమారుడు లోకేష్‌ను సీఎం పదవికి మద్దతు ఇస్తారని చర్చ జరుగుతోంది. ఇటీవల కొందరు టిడిపి ఎమ్మెల్యేలు లోకేష్‌కు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేయగా, కూటమిలోని జనసేన ఎమ్మెల్యేలు మాత్రం పవన్ కళ్యాణ్‌కు సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేయడం వల్ల, ఆ డిమాండ్ ఆగిపోయింది. అయితే మళ్లీ చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రి అవ్వాలని పవన్ కళ్యాణ్ ప్రకటించిన తరువాత, టిడిపి లోకేష్‌ను జాతీయ అధ్యక్షుడిగా నియమించబోతున్నారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఆ తర్వాత ఆయన్నే ముఖ్యమంత్రి చేయాలనే కార్యాచరణకు ఇది తొలి అడుగుగా భావిస్తున్నారు. లోకేష్‌పై కుటుంబ ఒత్తిడి? చంద్రబాబు గారి వయసు, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఆయన కుటుంబ సభ్యులే ఇప్పుడు లోకేష్‌ను త్వరగా అధికార బాధ్యతలతో నడిపించాల్సిన అవసరం ఉందని భావిస్తూ, చంద్రబాబుపై ఒత్తిడి పెడుతున్నారన్న ప్రచారం ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పటికీ, వచ్చే ఎన్నికలకు ముందే లోకేష్‌ను అధికారంలోకి తీసుకురావాలనే ప్రయత్నాలు మొదలయ్యాయా? అనే ప్రశ్నలకు ఈ మోదీ భేటీతో మరింత బలం లభిస్తోంది. ముగింపు: ఇక మోదీ-లోకేష్ భేటీ ద్వారా దేశ రాజకీయాల్లో — ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో — బిజెపి – టిడిపి బంధం మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. లోకేష్‌కి ప్రధాన మంత్రి ఇచ్చిన ప్రాధాన్యం, భవిష్యత్ రాజకీయ పాత్రపై స్పష్టమైన సంకేతాలుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Featured శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

డాక్టర్ వై.ఎన్. ప్రభాకర్ నాయుడు అందించే వైద్య సేవల గురించి

డాక్టర్ వై.ఎన్. ప్రభాకర్ నాయుడు  అందించే వైద్య సేవల గురించి . ఆయన MBBS, MS, FRSM, FCCP, IAGES డిగ్రీలు కలిగిన వైద్య నిపుణుడు మరియు ఆంధ్ర P.R.O అనే వైద్య సేవలను అందిస్తున్నారు. ఈ ప్రకటనలో అందించిన సమాచారం ప్రకారం, ఆంధ్ర P.R.O వద్ద కింది వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి: •  యూరోలాజీ బాగా చేయడం (Urology treatment) •  ఎండో ఇంటర్వెన్షన్ (Endo intervention) •  థొరాసిక్ సర్జరీ (Thoracic surgery) •  మల్టీ ఆర్గాన్ బాగా చేయడం (Multi-organ treatment) •  ICU, బర్న్, ట్రామా చేయడం (ICU, Burn, Trauma care) •  ఆరోగ్యమైన హృదయ వార్డు సర్జరీ సెలరీ చేయడం (Healthy heart ward surgery salary) •  బాడీ బ్రేకర్ బాగా (Body breaker care) •  యూరోలాజీ బాడీ కేన్సర్ చేయడం (Urology body cancer treatment) •  గాంట్లో గాస్ట్రో చేయడం (Gastroenterology treatment) •  అంబులెన్స్ సర్వీస్ లభ్యం (Ambulance service available) •  క్లీనికల్ ఇన్వెస్టిగేషన్ ఆరోగ్య వార్డు చేయడం (Clinical investigation health ward treatment) •  వెనక్కి దర్వాజా (Back door) •  పెద్దలకు ఆంధ్ర వరకు చేయడం (Treatment for adults up to Andhra) •  రోగులకు ఆంధ్ర వరకు చేయడం (Treatment for patients up to Andhra) •  వెనక్కి ఆంధ్ర వరకు చేయడం (Back to Andhra treatment) •  బాడీ మసాజ్ చేయడం (Body massage) •  రోగులకు సురక్షిత ఆంధ్ర చేయడం (Safe Andhra treatment for patients) •  గాయపడిన సర్జరీ, ఆంధ్ర (Injured surgery, Andhra) •  గాయపడిన సర్జరీ చేయడం (Injured surgery treatment) •  అంబులెన్స్ రోడ్ ఎలక్షన్ ఆంధ్ర టాక్ బర్ (Ambulance road election Andhra talk bar) సంప్రదింపు వివరాలు: •  ఫోన్ నంబర్లు: 92477956806, 7981620486 ఈ సేవలు ఆరోగ్య సంరక్షణ, సర్జరీ, అంబులెన్స్, మరియు ఇతర వైద్య సౌకర్యాలను కలిగి ఉన్నాయి. అవసరమైన వారు ఈ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు.

Featured శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూ.41 కోట్లతో 339 అభివృద్ధి పనుల భారీ ప్రారంభోత్సవం:కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి

నెల్లూరు రూరల్రూ నియోజకవర్గం లో రూ .41 కోట్ల వ్యయంతో 60 రోజుల వ్యవధిలో పూర్తి చేసిన 339 అభివృద్ధి పనుల భారీ ప్రారంభోత్సవం మే 15,న ఉదయం 9:00 గంటలకు జరగుతుందిని అని MLA శ్రీధర్ రెడ్డి తెలిపారు .నగరం లో ని మాగుంట లేఔట్ నెల్లూరు రూరల్ mla కార్యాలయం లో ఆదివారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడు తు కల్లూరుపల్లి హోసింగ్ బోర్డు కాలనీ మెయిన్ రోడ్డు సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవంతో ఈ కార్యక్రమం మొదలవుతుందిఅన్నారు .ఈ కార్యక్రమంలో రాష్ట్ర మునిసిపల్ శాఖామంత్రి  పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ  బీద రవిచంద్ర పాల్గొంటారు. 678 మంది తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకులు, కార్యకర్తలు ఒక్కో పనిని ఇద్దరు చొప్పున ప్రారంభిస్తారు. వివిధ శాఖల అధికారులు, కూటమి పార్టీ నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. “ఒకే నియోజకవర్గంలో ఒకే రోజు ఇన్ని ప్రారంభోత్సవాలు దేశంలో ఎక్కడా జరగలేదు. ఇది అభివృద్ధి పట్ల మా నిబద్ధతకు, ప్రజల నమ్మకానికి నిదర్శనం” అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్‌లో వివిధ శాఖల కింద రూ.231.78 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తయ్యాయి లేదా ప్రగతిలో ఉన్నాయని ఆయన తెలిపారు. త్వరలో కొండాయపాలెం, భక్తవత్సల నగర్‌లలో రైల్వే గేట్ అండర్ బ్రిడ్జి పనులను ప్రారంభించనున్నట్లు శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. ఈ అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్, యువ నాయకుడు శ్రీ నారా లోకేష్‌లకు, తనను మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన నాయకులు, కార్యకర్తలు, ఓటర్లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Featured శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎన్ సి సి మూడవ వార్షిక శిక్షణా శిభిరం

  10 ఆంధ్ర నేవల్ యూనిట్ యన్ సి సి నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ మరియు క్యాంపు కమాండెంట్ గణేష్ గొదంగవే ఆధ్వర్యంలో 10 ఆంధ్ర నేవల్ యూనిట్ యన్ సి సి యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్-3, 28 ఏప్రిల్ 2025 నుంచి 07 మే 2025 వరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అక్షర విద్యాలయ నందునిర్వహింపబడుతున్నది ఈ క్యాంపును ఉద్దేశించి క్యాంపు కమాండెంట్ గణేష్ గొదం గవే మాట్లాడుతూ కేడేట్లు ఈ శిక్షణా శిభిరంలో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, జాతీయ సమైక్యత, సామాజిక సేవ, దేశ భక్తి, గన్ ఫైరింగ్ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఈ శిక్షణను మంచిగా ఉపయోగించుకుని అత్యు త్తమ పౌరులుగా ఎదిగి దేశ సేవ చేయాలని, ఎండలు ఎక్కువగా ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని, తగినంత మంచినీరు తాగాలని క్యాడేట్లకు ఉద్భోదించారు. ఈ క్యాంపులో ఈరోజు శారీరక వ్యాయామం, యోగ ఆసనాలు, నౌక నమూనా నిర్మాణం, వ్యక్తిత్వ వికాసం, సామాజిక అవగాహన, ప్రకృతి వైపరీత్యాలు సంభవించి నప్పుడు తీసుకోవాల్సిన నివారణ చర్యలు, సమాచార వ్యవస్థ, ఆయుధ శిక్షణ, ఆరోగ్యము మరియు పరిశుభ్రత లెక్చరర్, ఎన్సిసి గురించి అవగాహన ఉపన్యాసం, ఆటలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ శిక్షణా కార్యక్రమంలో ఎన్సిసి అధికారులు గుండాల నరేంద్ర బాబు, మల్లికార్జున రెడ్డి, మస్తానయ్య, కొండారెడ్డి, సాయి శంకరి, పి ఐ స్టాఫ్ వైకుంఠం చీఫ్ ఇన్స్ట్రక్టర్, పెట్టీ ఆఫీసర్లు రంజన్, లోకేష్, లక్ష్మణ్, దీపక్,వెంకటేష్, రమణారావు, నవీన్, ఆఫీస్ సిబ్బంది సూపరింటెండెంట్ ముకుంద సాగర్, షిప్ మోడలింగ్ ఇన్స్ట్రక్టర్ రామన్ సీనియర్ అసిస్టెంట్లు షెహనాజ్ బేగం, కల్పన,జూనియర్ అసిస్టెంట్ సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ శిక్షణా శిభిరంలో మొత్తం 565 మంది ఎన్సిసి క్యాడెట్లు హాజరై శిక్షణ పొందుతున్నారు.  

Featured శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మధు కుటుంబానికి పవన్ 50 లక్షలు విరాళం.

మధు కుటుంబానికి పవన్ 50 లక్షలు విరాళం. కావలి, ఏప్రిల్ ( పున్నమి ప్రతినిధి) జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పెహల్గాం అమరులకి మంగళగిరి లో నివాళి కార్యక్రమంలో మధుసూదనరావు కుటుంబానికి 50 లక్షల విరాళం ఇవ్వడం పై కావలి జనసేన ఇన్చార్జి అళహరి సుధాకర్ హర్షం వ్యక్తం చేశారు.. కావలి వాసి జనసైనికుడు సోమిశెట్టి మధుసూదన్ రావు చిత్రపటాన్ని ఏర్పాటు చేసి జనసేన పార్టీ రాష్ట్రనాయకులు, వీరమహిళలతో కలిసి కావలి నియోజకవర్గ ఇంచార్జ్ అళహరి సుధాకర్ పాల్గొని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈ దాడిలో పాల్గొన్న అమరులకు నివాళులు అర్పిస్తు భావోద్వేగానికి గురి అయ్యారు. ముఖ్యంగా కావలిలో మధుసూదన్ శ్రీమతి పిల్లలు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఎంతో బాధను వ్యక్తపరిచారు. ఏదీ సందర్భంగా వారు వారి కుటుంబానికి జనసేన పార్టీ తరుపున 50 లక్షలు ప్రకటించారు. దీనితో పాటు క్రియాశీల కార్యకర్తగా మరో 5 లక్షలు కూడా వారి కుటుంబానికి అందించడము తో పాటు ఎప్పటికీ వారి కుటుంబానికి అండగా ఉంటానని తెలియజేశారు. దీని ద్వారా మరోసారి పవన్ కళ్యాణ్ జనసైనికునికి ఇచ్చే భరోసా ఇంకోసారి రుజువైంది అని, ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ నాయకులు వీరమహిళల తరుపున పవన్ కళ్యాణ్ కి అళహరి సుధాకర్ కృతజ్ఞతలు తెలిపారు.

Featured సాహితీ

సొంత ఊరు ———— వారాల ఆనంద్

  (సాహితీ పున్నమి) విశాలమయిన హాల్లో గోడమీద వేలాడదీసి వున్న పాత బ్లాక్ అండ్ వైట్ ఫోటో చూసి కొత్తగా ఫ్లాట్లో కలవడాని కొచ్చిన మిత్రుడు అడిగాడు ‘మీ సొంతూరా’ అని అవునన్నాను ఎంత అందంగా వుందో చూస్తేనే హాయిగా ఉందన్నాడు పచ్చని చెట్లు చల్లని గాలీ చల్లని చూపులూ ప్రేమ పలకరింపులూ దోస్తులూ చుట్టాలూ పక్కాలూ అత్తా మామా అక్కా చెల్లె అక్కడ విశ్వాసముండేది ఒంటరితనపు ఛాయే లేని సామూహికత్వముండేది చేయి చాపితే అందుకునేందుకో చేయుండేది అంతా విన్న మిత్రుడు దగ్గరికొచ్చి గుస గుసగా అడిగాడు ‘ ఇప్పుడు లేదా ’ ‘దాదాపుగా లేదు’ ఊరే కాదు నేనూ లేను కళ్ళనిండా తడి ఛాయల్తో గొణిగాను +++++++++++++++++ Home Town ++++++++++ In the vast hall, Hanging on the wall, An old black-and-white photograph beckoned. A friend, visiting my new flat, looked at it, His curiosity evident “Is this your hometown?” he asked. “Yes,” I replied, with a faint smile “So beautiful, even just looking at it Brings peace,” he said. Lush green trees, Gentle breezes, kind glances, Warm greetings, Friends, neighbors, relatives— Uncles, aunts, sisters, brothers There was trust, Togetherness, untouched by loneliness If you reached out, another hand is always ready to meet yours. After hearing me, the friend leaned closer, His voice dropped to a whisper Now? Does it still exist? “Almost gone,” I murmured. Not just that place I am no longer the same either. With eyes shadowed by moist reflections, I murmured softly, As though the memories themselves trembled in response **** ORIGINAL TELUGU POEM AND ITS ENGLISH TRANSLATION DONE BY THE POET VARALA ANAND

Featured హెల్త్ టిప్స్

రోజుకు ఒక గుడ్డు తినడం వల్ల:డాక్టర్ MVR

  6 నుంచి 7 గ్రాముల ప్రొటీన్తో శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. శరీరంలో కణజాల మరమ్మత్తుకు సహాయపడుతుంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అదనంగా: కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. విటమిన్ డి మరియు కాల్షియం ద్వారా ఎముకలను బలపరుస్తుంది. ఊబకాయం వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

Featured ఆంధ్రప్రదేశ్

నాగభూషణం కామెడీ విలన్ నేను కామెడీ హీరో -నటకిరీటి రాజేంద్రప్రసాద్

నాగభూషణం కామెడీ విలన్ నేను కామెడీ హీరో -నటకిరీటి రాజేంద్రప్రసాద్ నెల్లూరు ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి) * న‌ట‌కిరిటీ డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్ చేతుల మీదుగా సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ఉద‌య‌గిరి ఫ‌యాజ్ ర‌చించిన ‘ర‌క్త‌క‌న్నీరు’ నాగ‌భూష‌ణం పుస్క‌కావిష్క‌ర‌ణ‌ ఎన్నో పాత్ర‌ల‌కు త‌న న‌ట‌న‌తో ప్రాణం పోసిన విల‌క్ష‌ణ న‌టుడు స్వ‌ర్గీయ నాగ‌భూష‌ణం జీవితంలోని వివిధ విశేషాలు, సినీ ప్ర‌యాణానికి సంబంధించిన విష‌యాల‌ను తెలియ‌జేస్తూ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ఉద‌య‌గిరి ఫ‌యాజ్ ‘ర‌క్త‌క‌న్నీరు’ నాగ‌భూష‌ణం అనే పుస్త‌కాన్ని ర‌చించారు. ఈ పుస్త‌కావిష్క‌ర‌ణ వెర్స‌టైల్ యాక్ట‌ర్..న‌ట‌కిరిటీ డా.రాజేంద్ర ప్ర‌సాద్ చేతుల మీదుగా ఆయ‌న స్వ‌గృహంలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో పుస్తక రచయిత ఫయాజ్, నాగభూషణం గారి పెద్ద కుమారుడు రాఘవరావు, పెద్ద కుమార్తె మల్లీశ్వరి, అల్లుడు అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా … న‌ట‌కిరిటీ డా.రాజేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘నా జీవితంలో ఈరోజు ఎంతో అదృష్ట‌మైన రోజు. ఎందుకంటే, విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క రామారావుగారి ఇంట్లో పుట్టే అదృష్టాన్ని ఆ దేవుడు నాకు ప్ర‌సాదించాడు. ఆయ‌న‌తోపాటు మ‌హామ‌హుల‌ను క‌లుసుకునే అవ‌కాశం క‌లిగింది. అందులో అతి ముఖ్య‌మైన వ్య‌క్తి నాగ‌భూష‌ణంగారు. ‘ర‌క్త‌క‌న్నీరు’ నాగ‌భూష‌ణంగారికి నాకు ద‌గ్గ‌రి పోలిక ఏంటంటే, నేను కామెడీని హీరోయిజం చేస్తే, ఆయ‌న విల‌నిజంలోనూ కామెడీ చేశారు. మ‌రీ ముఖ్యంగా ఆయ‌న‌కు డ‌బ్బింగ్‌లో చాలా గొప్ప పేరుంది. ఆయ‌న షూటింగ్‌లో ఏ టైమింగ్‌లో అయితే డైలాగ్ చెబుతారో అదే టైమింగ్‌తో డబ్బింగ్‌ను క‌ళ్లు మూసుకుని మ‌రీ చెప్ప‌గ‌ల‌రు. ఇఆయ‌న స్టేజ్ నుంచి వ‌చ్చిన గొప్ప న‌టులు. సినిమాల్లో న‌టించే రోజుల్లోనూ ఆయ‌న స్టేజ్ షోల‌ను విడిచి పెట్ట‌లేదు. ఆయ‌న గురించి చెప్పుకుంటూ వెళితే ఎన్నో విశేషాలు చెప్పొచ్చు. అలాంటి విష‌యాల‌ను సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ఫ‌యాజ్‌గారు పుస్త‌క రూపంలోకి తీసుకొచ్చారు. సీనియ‌ర్ న‌టులు గురించి నేటిత‌రం వాళ్ల‌కి ఎలా తెలుస్తుంది.. ఇలాంటి పుస్త‌కాల ద్వారానే. కాబ‌ట్టి ఫ‌యాజ్‌గారికి ఈ సంద‌ర్భంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. ఇవాళ ‘ర‌క్త‌క‌న్నీరు’ నాగ‌భూష‌ణం పుస్తకాన్ని వాళ్ల కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో ఆవిష్క‌రించే అవ‌కాశం రావ‌టం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. అంద‌రూ ఈ పుస్తకాన్ని చ‌దవాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. రైటర్ ‘ఉదయగిరి’ ఫ‌యాజ్ మాట్లాడుతూ ‘‘నాగ‌భూష‌ణంగారు గొప్ప న‌టులే కాదు.. అంత‌కు మించిన సంస్కారి. త‌న జీవితాన్ని అతి సామాన్యంగా గ‌డిపిన వ్య‌క్తి. ఆయ‌న జీవితంలో ఏ కోణాన్ని తీసుకున్నా మ‌న‌కు గొప్ప‌గా క‌నిపిస్తుంది. ఆయ‌న ఎంత గొప్ప న‌టుడో అంత‌కు మించిన గొప్ప వ్య‌క్తిత్వం ఉన్న మ‌నిషి నాగ‌భూషణంగారు. ఆయ‌న గురించి పుస్త‌కం రాసే అవ‌కాశం క‌ల‌గ‌టం నా అదృష్టం. దాన్ని నాకెంతో ఆప్తుడైన రాజేంద్ర‌ప్ర‌సాద్ చేతుల మీదుగా ఆవిష్క‌రించ‌టం మ‌రింత ఆనందాన్ని క‌లిగిస్తుంది. ఈ పుస్త‌క ర‌చ‌న‌లో ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఎంత‌గానో స‌హ‌క‌రించారు. ఈ సంద‌ర్భంగా వారికి నా హృద‌య‌పూర్వ‌క‌మైన ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేస్తున్నాను’’ అన్నారు.

Featured శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీరామకృష్ణుని కృపతో మజ్జిగ పంపిణీ సేవా కార్యక్రమం:: సాయి కుమార్ రెడ్డి బత్తిన

శ్రీరామకృష్ణుని కృపతో మజ్జిగ పంపిణీ సేవా కార్యక్రమం: భగవాన్ శ్రీ రామకృష్ణుల ఆశీస్సులతో, ప్రమాదవశాత్తూ మమ్మల్ని విడిచి వెళ్లిపోయిన నా బిడ్డ (శిష్యుడు) ఏం.పవన్ కుమార్ రెడ్డి జ్ఞాపకార్థం, ఈ రోజు వేయి మందికిపైగా బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్వర్గీయ పవన్ కుమార్ రెడ్డి స్నేహితులు పునీత్, సురేష్, భగత్, యూనస్, సందీప్, వినయ్, సాకేత్ హర్షోత్సాహంతో పాల్గొన్నారు. వారి మిత్రుడి అపూర్వమైన స్నేహాన్ని స్మరించుకుంటూ, పవన్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని వారు ప్రార్థించారు. ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన సాయి కుమార్ రెడ్డి బత్తిన మాట్లాడుతూ, “పవన్ చేసిన మంచి పనులను గుర్తు చేసుకుంటూ, మిగిలినవారికి స్ఫూర్తి కలిగించే విధంగా ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు చేస్తామని” తెలిపారు. పవన్ కుమార్ రెడ్డి జ్ఞాపకం ప్రజల గుండెల్లో సజీవంగా నిలిచిపోయింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.