Thursday, 5 March 2026

Blog

ఖమ్మం

దుబాయ్‌లో చిక్కుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్యం తలెత్తడంతో చికిత్స నిమిత్తం ఐదు రోజుల క్రితం దుబాయ్‌కు వెళ్లిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం అక్కడే చిక్కుకుపోయారు. ఇటీవల దుబాయ్ ఎయిర్‌పోర్టుపై జరిగిన దాడుల నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా అక్కడి ప్రభుత్వం అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ పరిణామాల కారణంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సురక్షితంగానే ఉన్నప్పటికీ, ఎయిర్‌పోర్టు కార్యకలాపాలకు పూర్తిస్థాయి క్లియరెన్స్ లభించే వరకు భారత్‌కు తిరిగి రాలేని పరిస్థితి నెలకొంది. అధికారిక అనుమతులు లభించిన వెంటనే ఆయన స్వదేశానికి తిరుగు ప్రయాణం చేపట్టనున్నట్లు సమాచారం.

E-పేపర్

బంజారా కాలనీ వ్యవస్థాపకులు క్రీ.శే. వడ్త్య నరసింహ నాయక్ కి ఘన నివాళులర్పించిన కళ్లెం నవజీవన్ రెడ్డి

బంజారా కాలనీ వ్యవస్థాపకులు క్రీ.శే. వడ్త్య నరసింహ నాయక్ కి ఘన నివాళులర్పించిన కళ్లెం నవజీవన్ రెడ్డి పున్నమి న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ డివిజన్ 02 మార్చ్ 2026 హయత్ నగర్ లోని బంజారా కాలనీ వ్యవస్థాపకులు క్రీ.శే. వడ్త్య నరసింహ నాయక్ 14వ వర్ధంతి సందర్భంగా హయత్ నగర్ తాజా మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి కాలనీవాసులతో కలిసి వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… శ్రీ వడ్త్య నరసింహ నాయక్ బంజారా కాలనీ అభివృద్ధికి బలమైన పునాది వేసిన మహనీయుడు అని కొనియాడారు. ఆయన దూరదృష్టి, నాయకత్వం వల్లే ఈ కాలనీ నేడు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని తెలిపారు. కాలనీ అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. అలాగే కాలనీ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం కాలనీవాసులు బాలూ, కే . శంకర్, కే .జంజ్య, ఎం . రఘుపాపతి, కే . మోహన్, కే .భరత్, బి . చిరంజీవి, జి . బాలూ, జై . పంతు, ఎం . మోహన్, శంకర్, అమ్మాల్, శివ, బి .పణ్య, సకూరు, కే . లక్ష్మణ్, కైలాష్ మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.. హయత్ నగర్ డివిజన్

ఖమ్మం

భూదాన్ నిర్వాసితులకు వెంటనే న్యాయం చేయాలి: బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు గుండాల కృష్ణ

ఖమ్మం, మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) : నగరంలోని వెలుగుమట్ల ప్రాంతంలో భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన నిరుపేదలకు వెంటనే న్యాయం చేయాలని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు గుండాల కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ ప్రతినిధి బృందంతో కలిసి ఆయన ఇళ్లు కూల్చివేసిన ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం నిర్వాసితులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా గుండాల కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం భూదాన్ భూముల్లో దమనకాండకు పాల్పడి పేదల ఇళ్లను కూల్చివేసిందని విమర్శించారు. సుమారు 30 ఎకరాల్లో ఉన్న ఇళ్లను ధ్వంసం చేసి బాధితులను నిలువనీడ లేకుండా చేసిందన్నారు. వెంటనే ప్రభుత్వం అదే స్థలంలో వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పటివరకు బీఆర్‌ఎస్ పార్టీ నిర్వాసితులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కురాకుల నాగభూషణం, మాజీ సూడా ఛైర్మన్ బచ్చు విజయ్, బత్తుల మురళి, పార్టీ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, నగర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మాటేటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

క్రాకటూరు పుష్పంజలి బీస్పీ రాష్ట్ర మహిళ వింజమూరు లోని నాయకులతో సమావేశం నిర్వహించారు

ఈ రోజు వింజమూరు లోని బాంగ్ల నందు సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య నాయకులు రాష్ట్ర మహిళ క్రాకటూరు పుష్పంజలి పాల్గొన్నారు ఆమె మాట్లాడుతూ రాబోవు పంచాయతీ ఎన్నికలకు గురించి మనకు ఓటు హక్కు కల్పించిన డా”బి ఆర్ అంబేద్కర్ ఇచ్చిన బాధ్యతలు లను ప్రతి ఒక్కరు సాగించాలని, ఆమె తెలిపారు.

ఖమ్మం

వ్యక్తిత్వ వికాసమే విజయానికి పునాది: యస్.బి.ఐ.టి.లో సదస్సు

ఖమ్మం, మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని యస్.బి.ఐ.టి కళాశాల ఛైర్మన్ గుండాల కృష్ణ అన్నారు. సోమవారం కళాశాల ఆవరణలో నిర్వహించిన వ్యక్తిత్వ వికాస సదస్సులో విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రపంచ గతిని మార్చగల శక్తి తరగతి గది నుంచే ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. నేటి యువత చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ, వ్యక్తిగత అలవాట్లలో మార్పులు, క్రమశిక్షణ ద్వారా ఈ పరిస్థితులను అధిగమించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు గంపా నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. “క్లాస్‌రూమ్ టు బోర్డ్‌రూమ్” అనే అంశంపై విద్యార్థులకు జీవిత విలువలు, వ్యక్తిగత క్రమశిక్షణపై అవగాహన కల్పించినట్లు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డా॥ జి. ధాత్రి తెలిపారు. తరగతి గదులు జ్ఞానాన్ని అందిస్తాయని, అయితే ప్రపంచం ఆ జ్ఞానానికి పరీక్ష పెడుతుందని అన్నారు. విద్యా వ్యవస్థ కేవలం పరీక్షలు, గ్రేడులు, డిగ్రీలకే పరిమితం కాకుండా, సవాళ్లను ఎదుర్కొని నిలబడే ధైర్యాన్ని కూడా అందించాలనే అభిప్రాయాన్ని కళాశాల వైస్ చైర్మన్ కె. శ్రీచైతన్య వ్యక్తం చేశారు. ముఖ్య అతిథి గంపా నాగేశ్వరరావు మాట్లాడుతూ బోర్డ్‌రూమ్ అనేది కీలక నిర్ణయాలు తీసుకునే కేంద్రంగా అభివర్ణించారు. తరగతి గదిలో తప్పులు జరిగే అవకాశం ఉన్నా, బోర్డ్‌రూమ్‌లో తీసుకునే తప్పు నిర్ణయాలు వ్యవస్థలపై, ఉద్యోగులపై, కుటుంబాలపై ప్రభావం చూపుతాయని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా॥ జి. రాజ్‌కుమార్ మాట్లాడుతూ తరగతి గది, బోర్డ్‌రూమ్ మధ్య టీమ్‌వర్క్‌ అనే సామాన్యత ఉందన్నారు. విద్యార్థులు ప్రాజెక్టులు, వర్క్‌షాప్‌లలో కలిసి పనిచేసినట్లే భవిష్యత్తులో సమిష్టి పనితీరు అలవర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి గంపా నాగేశ్వరరావును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల అకడమిక్ డైరెక్టర్లు గుండాల ప్రవీణ్ కుమార్, గంధం శ్రీనివాసరావు, డా॥ ఎ.వి.వి. శివప్రసాద్, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

E-పేపర్

ప్రజలు ప్రశాంతంగా హోలీ పండుగను జరుపుకోవాలి. హోలీ పండుగ రోజున వైన్ షాపులు,బార్ల మూసివేత.

*ప్రజలు ప్రశాంతంగా హోలీ పండుగను జరుపుకోవాలి.* *హోలీ పండుగ రోజున వైన్ షాపులు,బార్ల మూసివేత.* *సీపీ జి.సుధీర్ బాబు,ఐపీస్ ఆదేశాలు జారీ.* ఫ్యూచర్ సీటీ కమిషనరేట్ – సురక్ష ప్రతినిధి తేదీ: మార్చి 02, 2026. హోలీ పండుగ సందర్భంగా నగరంలో శాంతిభద్రతలను పరిరక్షిస్తూ, ప్రజలు ప్రశాంతంగా పండుగను జరుపుకునేలా సంబంధిత శాఖ అధికారులకు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు, IPS గారు ఆదేశాలు జారీ చేశారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని వైన్ షాపులు, కల్లు దుకాణాలు (Toddy Shops) మరియు రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు 03.03.2026 (మంగళవారం) ఉదయం 06:00 గంటల నుండి సాయంత్రం 06:00 గంటల వరకు మూసివేయబడతాయి. అయితే స్టార్ హోటళ్లు మరియు రిజిస్టర్డ్ క్లబ్‌లలోని బార్లకు ఈ ఆదేశాలు వర్తించవు. ప్రజలు ప్రశాంతంగా హోలీ పండుగను జరుపుకోవాలని భావించి, తెలంగాణ ఎక్సైజ్ చట్టం – 1968 ప్రకారం ఈ నిర్ణయం తీసుకోబడింది. ఆదేశాలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.

రాజన్న సిరిసిల్ల

ఈరోజు మొర్రాయి పల్లిలో సీఎం రిలీఫ్ చెక్కుల పంపిణీ

ముస్తాబాద్ మార్చి 2 పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొర్రాయి పల్లి గ్రామానికి చెందిన లక్కిడి బాల్రెడ్డి రూ.240000. మరియు వైష్ణవి సన్నాఫ్ శేషాచార్యులు రూ.17500. రూపాయల సీఎం రిలీఫ్ చెక్కుల పంపిణీ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు. ఉపాధ్యక్షులు మరియు కార్యకర్తలు వారికి అందజేయడం జరిగింది. చెక్కులు తీసుకొని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

రాజన్న సిరిసిల్ల

ఈరోజు మొర్రాయి పల్లిలో రిలీఫ్ చెక్కుల పంపిణీ

ముస్తాబాద్ మార్చి 2 పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొర్రాయి పల్లి గ్రామానికి చెందిన లక్కిడి బాల్రెడ్డి రూ.240000. మరియు వైష్ణవి సన్నాఫ్ శేషాచార్యులు రూ.17500. రూపాయల చెక్కులను కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు. ఉపాధ్యక్షులు మరియు కార్యకర్తలు వారికి అందజేయడం జరిగింది. చెక్కులు తీసుకొని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

విశాఖపట్నం

జీవీఎంసీలో టెండర్ల తంతు? వర్క్ ఇన్స్పెక్టర్ల ద్వంద్వ పాత్రపై విమర్శలు

విశాఖపట్నం మార్చి (పున్నమి ప్రతినిధి) విశాఖపట్నం నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఇంజినీరింగ్ విభాగంలో కొందరు వర్క్ ఇన్స్పెక్టర్లు అనుబంధ కాంట్రాక్టర్ల పేర్లతో టెండర్లు దాఖలు చేసి పనులు దక్కించుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి పనులకు సంబంధించిన కొలతలు స్వయంగా తీసుకుని, ఎం-బుక్ నమోదు కోసం అసిస్టెంట్ ఇంజినీర్లకు (ఏఈలు) అందజేస్తున్నారన్న సమాచారం బయటకు వస్తోంది. ఏటా సుమారు రూ.500 కోట్ల మేర అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో పలు జోన్లలో ఇదే తరహా వ్యవహారం కొనసాగుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్క్ ఇన్స్పెక్టర్లు పరోక్షంగా కాంట్రాక్టర్లుగా వ్యవహరిస్తే పారదర్శకత దెబ్బతింటుందని సిబ్బంది వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ అంశంపై పలుమార్లు ఫిర్యాదులు చేరినప్పటికీ స్పష్టమైన చర్యలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని పౌరసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

విశాఖపట్నం

మహిళా దినోత్సవ వేడుకలు: విశాఖ పోలీస్ బ్యారెక్స్‌లో రంగురంగుల ముగ్గుల పోటీలు

విశాఖపట్నం మార్చి (పున్నమి ప్రతినిధి) పోలీస్ బ్యారెక్స్ మైదానంలో ముగ్గుల పోటీలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందస్తుగా నగరంలోని పోలీస్ బ్యారెక్స్ మైదానంలో ఆదివారం మహిళా పోలీసులకు, వారి కుటుంబ సభ్యులకు ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నం సిటీ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించారు. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి మహిళా పోలీసులు, సిబ్బంది కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల పొడులతో అందమైన ముగ్గులు వేస్తూ తమ సృజనాత్మకతను, ప్రతిభను ప్రదర్శించారు. మహిళా ఎస్‌ఐలు, డీసీపీలు ప్రతి ముగ్గును పరిశీలించి అభినందనలు తెలిపారు. మొత్తం 60 మంది మహిళా పోలీసులు ఈ పోటీల్లో పాల్గొని వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో సాగి అందరిలోనూ ఉత్సాహాన్ని నింపింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.