Thursday, 5 March 2026

Blog

తిరుపతి

గ్రహణాలకూ లొంగని మహాక్షేత్రం- శ్రీకాళహస్తిలో ఆగని అభిషేకాలు

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, మార్చి 02,ప్రపంచవ్యాప్తంగా గ్రహణ కాలంలో ఆలయాలన్నీ తలుపులు మూసివేసి, శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుంటే.. దానికి భిన్నంగా, గ్రహణ పట్టు విడుపు కాలంలో కూడా భక్తులతో కళకళలాడే ఏకైక క్షేత్రం శ్రీకాళహస్తి. రాహు-కేతు క్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన ఈ ఆలయంలో గ్రహణ సమయంలోనూ విశేష అభిషేకాలు నిర్వహించడం వెనుకున్న ఆధ్యాత్మిక రహస్యాలను ఆలయ వేద పండితులు వివరింస్తూ.. శ్రీకాళహస్తి క్షేత్రం గ్రహణాలకు ఎందుకు అతీతమో వివరిస్తూ.. ఇక్కడ కొలువైన స్వామివారు, అమ్మవార్ల సర్పరూపాలే దానికి ప్రధాన కారణమని ఇక్కడి శివలింగం ఐదు తలల పాము (నాగపడిగ) నీడలో కొలువై ఉంటుందని జ్ఞానప్రసూనాంబ అమ్మవారి నడుముకు నాగపాము ఒడ్యాణంగా ఉంటుంది. సాధారణంగా గ్రహణాలకు కారణమయ్యే రాహు, కేతువులు సర్ప రూపధారులు. సాక్షాత్తు ఆ సర్పాలనే ఆభరణాలుగా ధరించిన స్వామి, అమ్మవార్లు ఇక్కడ కొలువై ఉండటం వల్ల, గ్రహణ ప్రభావం ఈ క్షేత్రంపై ఉండదని వేద పండితులు స్పష్టం చేశారు. గ్రహణ సమయం ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు (పట్టు-విడుపు కాలం) స్వామివారికి, అమ్మవారికి నిరంతరాయంగా విశేష అభిషేకాలు జరపడం ఈ ఆలయ ప్రత్యేకత. ఇతర ఆలయాల్లో గ్రహణం వీడిన తర్వాతే తలుపులు తీసి సంప్రోక్షణ చేస్తారు, కానీ శ్రీకాళహస్తిలో గ్రహణ సమయమే అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. జాతకంలో రాహు-కేతు దోషాలు ఉన్నవారు, గ్రహణ సమయంలో ఇక్కడ జరిగే అభిషేకాల్లో పాల్గొనడం వల్ల ఆశించిన ఫలితాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. సర్ప దోష నివారణకు ఈ క్షేత్రం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనది కావడంతో, గ్రహణ కాలంలో కూడా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అర్చకులు తెలపారు.

తిరుపతి

వ్యర్ధలతో నిండిపోతున్న కాలువలు-రోగాల బారిన పడుతున్న ప్రజలు

తొట్టంబేడు పున్నమి న్యూస్, మార్చి 02, తొట్టంబేడు మండలం తొట్టంబేడు పంచాయతీలో చెత్తాచెదారాలు వ్యర్ధాలతో మురుగు కాలువలు నిండిపోతునన్నాయని ఈదులగుంట కాలనీ వాసులు పలు రోగాలతో ఆసుపత్రి పాలవుతున్నా పంచాయతీ అధికారులుకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోని పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని ఈదులగుంట వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత జిల్లా స్థాయి అధికారులు చర్య తీసుకోవాలని ఈదులకుంట కాలనీవాసులు కోరుతున్నారు.

తిరుపతి

పురాతన వైభవం.. ఆధునిక పరిరక్షణ- శివాలయ పైకప్పు లీకేజీ పనుల పరిశీలన

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, మార్చి 02, దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయ సంప్రదాయ పరిరక్షణలో భాగంగా చేపట్టిన ఆలయ పైకప్పు లీకేజీ నివారణ పనులను సోమవారం నాడు భారత పురావస్తు శాఖ (ASI) డైరెక్టర్ డాక్టర్ మునిరత్నం రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గత కొంతకాలంగా వర్షాకాలంలో భక్తులకు అసౌకర్యం కలిగిస్తున్న లీకేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ఈ పనులు నిర్వహించారు. సుమారు రూ. 5 కోట్ల భారీ వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఎక్కడా ఆధునిక సిమెంట్ వినియోగించకుండా, పురాతన దేవాలయ నిర్మాణ శైలికి భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పురాతన కట్టడాల పునరుద్ధరణలో విశేష అనుభవం ఉన్న పూణేకు చెందిన నిపుణులైన కార్మికులు ఈ పనులను పూర్తి చేశారు. సాంకేతికత ఎంత పెరిగినా, పురాతన కట్టడాలకు ప్రకృతి సిద్ధమైన ముడిపదార్థాలే బలమని నిరూపిస్తూ ఈ పనులు చేపట్టారు. ఇందులో వాడిన ప్రధాన పదార్థాలు సున్నం, బెల్లం, కరక్కాయ పొడి. కాల్చిన బంకమట్టి, ఇటుక ముక్కలు. అరబ్ దేశాలలోని అడవుల నుండి సేకరించిన ప్రత్యేకమైన వృక్ష ఆధారిత జిగురు ఈ పదార్థాల మిశ్రమం పైకప్పుకు అదనపు బలాన్ని ఇవ్వడమే కాకుండా, శతాబ్దాల పాటు నీరు నిలవకుండా, లోపలికి ఇంకకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది. పనుల నాణ్యతను పరిశీలించిన అనంతరం మునిరత్నం రెడ్డి మాట్లాడుతూ.. “దేవాలయాల వారసత్వాన్ని కాపాడటం మన బాధ్యత. పూణే కార్మికులు చూపిన నైపుణ్యం అభినందనీయం. ప్రస్తుతం పనులు పూర్తయిన తీరుపై పూర్తి సంతృప్తిగా ఉన్నామని ఈ పనుల వల్ల రాబోయే కాలంలో లీకేజీ సమస్య తలెత్తదని, ఆలయ నిర్మాణం మరింత పటిష్టమైందని ఆయన వెల్లడించారు.

తిరుపతి

వెంకటసుబ్బారెడ్డికి నివాళులర్పించన బియ్యపు ఆకర్ష్ రెడ్డి

శ్రీకాళహస్తి మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన రొమ్మాల వెంకటసుబ్బారెడ్డి సోమవారం నాడు ఆకస్మిక మృతి చెందారు. సమాచారాన్ని తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి తన కుమారుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి ద్వారా వెంకటసుబ్బారెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వెంకటసుబ్బారెడ్డి కుటుంబ సబ్యులకు తన తరపున సానుభూతి తెలియజేసి పరామర్శించి రావాలని సూచడంతో తండ్రి సూచనల మేరకు ఆకర్ష్ రెడ్డి వెంకటసుబ్బారెడ్డికి నివాళులర్పించి రొమ్మాలవారికి తన ప్రఘాడసానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో రవీంద్రారెడ్డి, చంద్రమోహన్ రెడ్డి,యుగంధర్ రెడ్డి,కందాటి ఈశ్వర్ రెడ్డి, చంద్రారెడ్డి,సుమన్,శివ రెడ్డి తదితరులు ఉన్నారు.

తిరుపతి

భక్తులకు ఆహార ప్యాకెట్ల వితరణ

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 02, శ్రీకాళహస్తిలోని లోక్ సత్తా పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షుడు, అడ్వకేట్, దివంగత టి. లోకేష్ బాబు 8వ వర్ధంతి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంకు విచ్చేసిన భక్తులకు ఆహార ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లోకేష్ బాబు సోదరుడు, స్కౌట్స్ కార్యాలయ కమిషనర్ టి. రమేష్ బాబు, సభ్యులు అజార్ తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా భక్తులకు సేవ చేయడం ద్వారా లోకేష్ బాబు సేవాస్ఫూర్తిని స్మరించుకున్నారు.

తిరుపతి

సదస్సు గోడ పత్రిక ఆవిష్కరణ

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 02, మహిళా శ్రేయస్సు సమాజ పురోగతి అని మహిళా సాధారితే అభివృద్ధికి అసలైన పునాది అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ శ్రీకాళహస్తి నియోజకవర్గం అధ్యక్షులు శాంతి దుర్గ అన్నారు మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కే. ఆర్. సూర్యనారాయణ పిలుపుమేరకు మార్చి 7 వ తేదీ విజయవాడలో నిర్వహించనున్న భారీ సదస్సుకు సంబంధించిన గోడ పత్రికను సోమవారం నాడు కాళహస్తిలోని తెలుగు గంగ డివిజన్ కార్యాలయం నందు ఆవిష్కరించారు ఈ సందర్భంగా శాంతి దుర్గా మాట్లాడుతూ…. ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళల పాత్ర అత్యంత కీలకమని మహిళా ఉద్యోగుల సమస్యలు వారి హక్కులు సాదారికతపై చర్చించేందుకు విజయవాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి కార్యక్రమానికి తెలుగంగ కార్యాలయంలోని మహిళ ఉద్యోగస్తులందరూ పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఆనంతరం రాష్ట్ర కౌన్సిలర్ విజయలక్ష్మిని ఆహ్వానిస్తూ తెలుగు గంగ ఆఫీసులో పనిచేస్తున్న మహిళ ఉద్యోగులు సిబ్బందికి అధికారిక ఆహ్వాన పత్రాలను అందజేశారు. మహిళా సాధారికత విధానాలతో నిర్వహించనున్న ఈ సదస్సు ఉద్యోగంలో నూతన ఉత్తేజాన్ని నింపుతుందని అసోసియేషన్ ప్రతినిధులు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు గంగలో పనిచేసే ఇంజనీరింగ్ మహిళలు, ఏపీజీఈఏ సెక్రెటరీ భాష ఉపాధ్యక్షులు గజలక్ష్మి తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

నేలుట్ల నరేష్ ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగన్న

రాజన్న సిరిసిల్ల మార్చి 2 పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణంలోని 26వ వార్డు కౌన్సిలర్ నెలూట్ల నరేష్ ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగన్న. బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటీ నరసింగా రావు. రంజాన్ మాసం పవిత్రతను ప్రతిబింబించే ఈ ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలో పాల్గొని ఉపవాస దీక్ష ముగించుకున్న వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో సౌహార్ధత. పరస్పర గౌరవం మరింత బలపడాలని ఆకాంక్షిస్తూ. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి. వైస్ చైర్మన్ దార్ల సందీప్. కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు. పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఖమ్మం

బీజేపీ సీనియర్ నాయకుడు చెక్క మధుసూదన్ రావు మృతి – పలువురు నేతల నివాళులు

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు చెక్క మధుసూదన్ రావు అనారోగ్య కారణాలతో సోమవారం మృతి చెందారు. ఆయన మరణ వార్త పార్టీ శ్రేణుల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది. వారి మృతికి సంతాపం తెలియజేస్తూ బీజేపీ రాష్ట్ర నాయకులు కొందపల్లి శ్రీధర్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్య నారాయణ, జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, అలాగే ఇవి రమేష్, పాలకొల్లు శ్రీనివాస్, పడిగల మధు, నంబూరి రామలింగేశ్వరావ్, సుదర్శన్ మిశ్రా, నాయుడు రాఘవా తదితరులు ఆయన నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు. పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చేకూరాలని ప్రార్థించారు. చెక్క మధుసూదన్ రావు గారి మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.

ఖమ్మం

హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ హోలీ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోలీ పండుగ ఆనందం, ఐక్యత, సోదరభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. రంగుల పండుగగా ప్రసిద్ధి చెందిన హోలీ మన జీవితాల్లో సంతోషం, శాంతి, సౌభ్రాతృత్వాన్ని నింపాలని ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ పండుగను సురక్షితంగా జరుపుకోవాలని సూచించారు. సమాజంలో ప్రేమాభిమానాలు పెంపొందించే ఈ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ప్రజలతో కలిసి ప్రతి ఆనంద క్షణాన్ని పంచుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు.

ఖమ్మం

ఖమ్మం లో కూల్చి వేతలు.. స్పందించి న కేరళం ముక్యమంత్రి :

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం జిల్లా లో ఇటీవల ఖమ్మం నగర శివారు లో వెలుగు మట్ల భుదాన్ భూముల లో జరిగిన కూల్చివేతల మీద కేరళం ముఖ్య మంత్రి పినరయి విజయన్ తీవ్ర స్థాయి లో విరుచుకు పడ్డారు.ఖమ్మం లో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు బుల్డో జర్ రాజు ని తలపిస్తుంది అని ఆరోపించారు. వినోభా బావే నెత్రుత్వం లో ని భుదాన్ ఉద్యమం లో భాగంగా భూమి లేని పేదలకి కేటాయించిన వినోబా బావే నగర్ లోని ఇళ్లని కూల్చివేయడం పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.