Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

ఎస్.రాయవరం బాలికల ఫుట్‌బాల్‌ దూకుడు.. రాష్ట్ర జట్టుకు ఇద్దరు విద్యార్థినులు!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎస్.రాయవరం బాలికల ఫుట్‌బాల్‌ దూకుడు.. రాష్ట్ర జట్టుకు ఇద్దరు విద్యార్థినులు!

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్.రాయవరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ జట్టుకు ఎంపికయ్యారు.
  • స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్‌-14 ఫుట్‌బాల్ సెలక్షన్ పోటీల్లో పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థినులు మహ్మద్ హాలీ మున్నిసా, టి.హారిక ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టులో చోటు సంపాదించారు.
  • కోటవురట్ల ప్రభుత్వ కళాశాల మైదానంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో వీరు తమ ఆటతీరుతో సత్తా చాటారు.

ఎస్.రాయవరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ జట్టుకు ఎంపికయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్‌-14 ఫుట్‌బాల్ సెలక్షన్ పోటీల్లో పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థినులు మహ్మద్ హాలీ మున్నిసా, టి.హారిక ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టులో చోటు సంపాదించారు. కోటవురట్ల ప్రభుత్వ కళాశాల మైదానంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో వీరు తమ ఆటతీరుతో సత్తా చాటారు. విద్యార్థినులు రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీసం ప్రసాద్ హర్షం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు. అలాగే పాఠశాల ఉపాధ్యాయ బృందం, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ స్వాతి, వైస్ చైర్మన్ లక్ష్మి విద్యార్థినులకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *