Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

స్థానిక ఎన్నికలపై టీడీపీ ఫోకస్‌… నేడు రైల్వేకోడూరులో కీలక సమావేశం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
స్థానిక ఎన్నికలపై టీడీపీ ఫోకస్‌… నేడు రైల్వేకోడూరులో కీలక సమావేశం

వార్త ముఖ్యాంశాలు

  • రైల్వేకోడూరు: స్థానిక ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో కసరత్తు ముమ్మరం చేసింది.
  • ఎన్నికల కార్యాచరణ, పార్టీ శ్రేణుల సమన్వయంపై చర్చించేందుకు బుధవారం రైల్వేకోడూరు పట్టణంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు.
  • పట్టణంలోని రాజ్‌ కన్వెన్షన్‌ హాల్‌లో ఉదయం 10 గంటలకు ఈ సమావేశం జరగనుంది.

రైల్వేకోడూరు: స్థానిక ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో కసరత్తు ముమ్మరం చేసింది. ఎన్నికల కార్యాచరణ, పార్టీ శ్రేణుల సమన్వయంపై చర్చించేందుకు బుధవారం రైల్వేకోడూరు పట్టణంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. పట్టణంలోని రాజ్‌ కన్వెన్షన్‌ హాల్‌లో ఉదయం 10 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశాన్ని విజయవంతం చేసేందుకు మంగళవారం రైల్వేకోడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులతో సమాలోచన నిర్వహించారు. టీడీపీ సీనియర్‌ నాయకుడు కస్తూరి విశ్వనాథ నాయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త మాచినేని విశ్వేశ్వర నాయుడు సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులతో చర్చించారు. స్థానిక ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో సన్నద్ధం కావాలని వారు సూచించారు. కూటమి అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు బుధవారం జరిగే సమన్వయ సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణ, నాయకులు – కార్యకర్తల సమన్వయం తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. మంగళవారం జరిగిన సమావేశంలో నియోజకవర్గంలోని పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *