వార్త ముఖ్యాంశాలు
- తిరుపతి జిల్లా చిట్వేలు మండలం, పరిసర గ్రామాల ప్రజలకు ఇది శుభవార్త.
- కంటి సమస్యలతో బాధపడుతున్న వారి సౌకర్యార్థం 'పుష్పగిరి కంటి ఆసుపత్రి' సౌజన్యంతో చిట్వేలులో ప్రత్యేక ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు.
- స్థానిక మాజీ ఉప సర్పంచ్ శ్రీ చౌడవరం ఉమామహేశ్వర్ రెడ్డి ప్రత్యేక చొరవ, ఆధ్వర్యంలో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
తిరుపతి జిల్లా చిట్వేలు మండలం, పరిసర గ్రామాల ప్రజలకు ఇది శుభవార్త. కంటి సమస్యలతో బాధపడుతున్న వారి సౌకర్యార్థం ‘పుష్పగిరి కంటి ఆసుపత్రి’ సౌజన్యంతో చిట్వేలులో ప్రత్యేక ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. స్థానిక మాజీ ఉప సర్పంచ్ శ్రీ చౌడవరం ఉమామహేశ్వర్ రెడ్డి ప్రత్యేక చొరవ, ఆధ్వర్యంలో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
-శిబిరం వివరాలు ఇవే..
ఈ నెల 7వ తేదీ (బుధవారం) ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు చిట్వేలు గ్రామపంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో ఈ వైద్య శిబిరం జరగనుంది. ఈ శిబిరంలో ప్రముఖ కంటి వైద్య నిపుణులు పాల్గొని ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి తగిన వైద్య సలహాలు, సూచనలతో పాటు ప్రాథమిక చికిత్సలు అందించనున్నారు.
-సద్వినియోగం చేసుకోండి..
దృష్టి లోపాలు, ఇతర నేత్ర సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిట్వేలు మండలం, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. శిబిరానికి హాజరై నిపుణులైన వైద్యులతో ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకుని, కంటి చూపును సంరక్షించుకోవాలని మాజీ ఉప సర్పంచ్ ఉమామహేశ్వర్ రెడ్డి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.