Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

సెప్టెంబర్ 17 ముమ్మాటికీ తెలంగాణ విమోచన దినోత్సవమే: బీజేపీ నేతలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సెప్టెంబర్ 17 ముమ్మాటికీ తెలంగాణ విమోచన దినోత్సవమే: బీజేపీ నేతలు

వార్త ముఖ్యాంశాలు

  • సెప్టెంబర్ 17ను ‘విలీన దినం’ లేదా ‘ప్రజా పాలన’ అంటూ పేర్లు మార్చి కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రను వక్రీకరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ రెడ్డి, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి విమర్శించారు.
  • నర్సంపేట బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నిజాం, రజాకార్ల నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన సెప్టెంబర్ 17ను అధికారికంగా ‘విమోచన దినోత్సవం’గానే నిర్వహించాలి.
  • ​ పరకాల, భైరాన్‌పల్లి పోరాటాలు, జాతీయవాదుల త్యాగాలను పాఠ్యాంశాల్లో చేర్చి నేటి తరానికి అందించాలి.

సెప్టెంబర్ 17ను ‘విలీన దినం’ లేదా ‘ప్రజా పాలన’ అంటూ పేర్లు మార్చి కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రను వక్రీకరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ రెడ్డి, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి విమర్శించారు. నర్సంపేట బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ
నిజాం, రజాకార్ల నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన సెప్టెంబర్ 17ను అధికారికంగా ‘విమోచన దినోత్సవం’గానే నిర్వహించాలి.
​ పరకాల, భైరాన్‌పల్లి పోరాటాలు, జాతీయవాదుల త్యాగాలను పాఠ్యాంశాల్లో చేర్చి నేటి తరానికి అందించాలి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చరిత్రను మరుగునపరచే కుట్రలను సహించేది లేదు.అని అన్నారు
​ఈ సమావేశంలో కౌన్సిలర్ జూలూరి రోజా రాణి, నాయకులు వడ్డేపల్లి నరసింహ రాములు, రేసు శ్రీనివాస్, గూడూరు సందీప్, కట్ల రాంచేందర్ రెడ్డి తదితర బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *