వార్త ముఖ్యాంశాలు
- పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో ) అనకాపల్లి, అక్టోబర్ 5: గ్రామీణ ప్రాంత పాఠశాల విద్యార్థుల్లో సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథం, నూతన ఆవిష్కరణలపై ఆసక్తిని పెంపొందించేందుకు డైట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో రెండు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
- భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆవిష్కరణల విభాగం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
- చోడవాడ, పరవాడ, తుమ్మపాల, ఎటికొప్పాక, సబ్బవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు చెందిన మొత్తం 250 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో )
అనకాపల్లి, అక్టోబర్ 5: గ్రామీణ ప్రాంత పాఠశాల విద్యార్థుల్లో సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథం, నూతన ఆవిష్కరణలపై ఆసక్తిని పెంపొందించేందుకు డైట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో రెండు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆవిష్కరణల విభాగం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. చోడవాడ, పరవాడ, తుమ్మపాల, ఎటికొప్పాక, సబ్బవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు చెందిన మొత్తం 250 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులకు కళాశాల ప్రయోగశాలలు, ఆధునిక సాంకేతిక సదుపాయాలను పరిచయం చేసి, నూతన ఆలోచనలు, సమస్యల గుర్తింపు, ఆచరణాత్మక పరిష్కారాల రూపకల్పనపై శిక్షణ ఇచ్చారు. కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్ విద్యార్థులకు జ్యామితి పెట్టెలు, భోజనం, రవాణా సౌకర్యాలను కల్పించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.వై. కుంటరావు, వైస్ ప్రిన్సిపాల్, వివిధ విభాగాధిపతులు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమ సమన్వయకర్త ప్రొఫెసర్ డాక్టర్ పి. పూర్ణప్రియ ఆధ్వర్యంలో కార్యక్రమం విజయవంతంగా సాగింది.