Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

సుద్దవాగు తండా ఘటనపై ఎంపీ స్పందన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సుద్దవాగు తండా ఘటనపై ఎంపీ స్పందన

వార్త ముఖ్యాంశాలు

  • ఖమ్మం: సుద్దవాగు తండాలో సోమవారం జరిగిన రాళ్ల దాడి ఘటనకు సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్న వారి ఆచూకీపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పందించారు.
  • ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి, అదుపులో ఉన్నవారి వివరాలను కుటుంబ సభ్యులకు తెలియజేయాలని కోరారు.
  • పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఖమ్మం: సుద్దవాగు తండాలో సోమవారం జరిగిన రాళ్ల దాడి ఘటనకు సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్న వారి ఆచూకీపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పందించారు. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి, అదుపులో ఉన్నవారి వివరాలను కుటుంబ సభ్యులకు తెలియజేయాలని కోరారు.

పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే వారు తిరుమలాయపాలెం పోలీస్‌ స్టేషన్‌లో కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. దీనిపై ఎంపీ ఏసీపీతో మాట్లాడగా, వారిని ఎక్కడికీ తరలించలేదని, ఖమ్మం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లోనే ఉన్నారని ఏసీపీ స్పష్టం చేసినట్లు ఎంపీ తెలిపారు. కుటుంబ సభ్యులు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి కలుసుకోవచ్చని, అనంతరం వారిని ఇంటికి పంపిస్తున్నట్లు ఏసీపీ పేర్కొన్నారని ఎంపీ వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *