Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

రామారాయుడుపాలెం మార్గంలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలి..!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రామారాయుడుపాలెం మార్గంలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలి..!

వార్త ముఖ్యాంశాలు

  • విషపూరిత పాముల సంచారంతో ప్రజల్లో భయాందోళనలు..!!
  • అధికారులకు గొర్లె బాబురావు విజ్ఞప్తి..!!!
  • పున్నమి - కే ఆనంద్ (అనకాపల్లి బ్యూరో ) : యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని రామారాయుడుపాలెం గ్రామానికి వెళ్లే మార్గంలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని 32వ వార్డు అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొర్లె బాబురావు అధికారులను కోరారు.

విషపూరిత పాముల సంచారంతో ప్రజల్లో భయాందోళనలు..!!

అధికారులకు గొర్లె బాబురావు విజ్ఞప్తి..!!!

పున్నమి – కే ఆనంద్ (అనకాపల్లి బ్యూరో ) :

యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని రామారాయుడుపాలెం గ్రామానికి వెళ్లే మార్గంలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని 32వ వార్డు అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొర్లె బాబురావు అధికారులను కోరారు. ఈ మార్గంలో వీధి దీపాలు లేకపోవడంతో రాత్రివేళ రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మార్గంలో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట రక్తపింజర, పొడపాములు, త్రాచుపాములు వాటి పిల్లలతో సహా వివిధ రకాల విషపూరిత పాములు కనిపిస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. చీకటి కారణంగా పాములను గుర్తించడం కష్టంగా మారి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని స్థానిక ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్, ఏఈ నానాజీ వెంటనే స్పందించి రామారాయుడుపాలెం మార్గంలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని గొర్లె బాబురావు విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకముందే అధికారులు తక్షణ చర్యలు చేపట్టి సమస్యను పరిష్కరించాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *