Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

కొక్కిరాపల్లిలో ఘనంగా దుర్గాభవాని అమ్మవారి పందిరి పూజలు..!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కొక్కిరాపల్లిలో ఘనంగా దుర్గాభవాని అమ్మవారి పందిరి పూజలు..!

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీ దుర్గాభవాని అమ్మవారి పందిరి నిర్మాణానికి పూజలు పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో ) యలమంచిలి: అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీ 23వ వార్డు కొక్కిరాపల్లిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.
  • ఉత్సవాల్లో భాగంగా శ్రీ దుర్గాభవాని అమ్మవారి పందిరి నిర్మాణానికి సంబంధించి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
  • ఈ సందర్భంగా పలకా రమేష్–లక్ష్మి దంపతుల చేతుల మీదుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పందిరి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

శ్రీ దుర్గాభవాని అమ్మవారి పందిరి నిర్మాణానికి పూజలు

పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో )

యలమంచిలి: అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీ 23వ వార్డు కొక్కిరాపల్లిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ దుర్గాభవాని అమ్మవారి పందిరి నిర్మాణానికి సంబంధించి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పలకా రమేష్–లక్ష్మి దంపతుల చేతుల మీదుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పందిరి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అనంతరం గ్రామ పెద్దలు, శ్రీ దుర్గాభవాని అమ్మవారి కమిటీ సభ్యులు, గ్రామస్థులు కలిసి రాట వేశారు.
కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని ఉత్సవ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. శ్రీ దుర్గాభవాని అమ్మవారి ఆశీస్సులతో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరగాలని గ్రామస్థులు ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *