Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

మెడికల్ అసోసియేషన్ ఏన్కూరు మండల అధ్యక్షులుగా గుడ్ల వెంకటేశ్వర్లు ఎన్నిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మెడికల్ అసోసియేషన్ ఏన్కూరు మండల అధ్యక్షులుగా గుడ్ల వెంకటేశ్వర్లు ఎన్నిక

వార్త ముఖ్యాంశాలు

  • ఏన్కూరు మండలం మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులుగా గుడ్ల వెంకటేశ్వరరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
  • ఆదివారం ఏన్కూర్ లో సంఘం గౌరవ అధ్యక్షులు బస్మాంగి నాగేశ్వరరావు గారి అధ్యక్షతన ఏనుకూరు మెడికల్ అసోసియేషన్ మండల మహాసభ ఆదివారం జరిగింది.
  • ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షులు గుడ్ల వెంకటేశ్వరావు మాట్లాడుతూ మండలంలోనీ మొత్తం మెడికల్ షాపులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని, ప్రజలకు నాణ్యమైన మందులు అందించే దానికోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని కోరారు.

ఏన్కూరు మండలం మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులుగా గుడ్ల వెంకటేశ్వరరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం ఏన్కూర్ లో సంఘం గౌరవ అధ్యక్షులు బస్మాంగి నాగేశ్వరరావు గారి అధ్యక్షతన ఏనుకూరు మెడికల్ అసోసియేషన్ మండల మహాసభ ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షులు గుడ్ల వెంకటేశ్వరావు మాట్లాడుతూ మండలంలోనీ మొత్తం మెడికల్ షాపులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని, ప్రజలకు నాణ్యమైన మందులు అందించే దానికోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని కోరారు. ఎక్కువ డిస్కౌంట్ వస్తుందని నాణ్యతలేని మందులను ప్రజలు కొనుగోలు చేయడం వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినే అవకాశం ఉందని నాణ్యమైన మందులను కస్టమర్లు అడిగి తీసుకోవాలని ఆయన అన్నారు. అదేవిధంగా మెడికల్ అసోసియేషన్ మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రజలకు ఉపయోగపడే విధంగా మెడికల్ క్యాంపులు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింధని పేర్కొన్నారు. ఈ సమావేశానికి ఏన్కూర్, జన్నారం, నాచారం, బిఆర్ పురం, తిమ్మారావుపేట గ్రామాలకు చెందిన మెడికల్ షాప్ యజమానులు హాజరయ్యారు. గౌరవ అధ్యక్షులుగా బస్మాంగి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా పాలెపు పాపారావు, కోశాధికారిగా దొడ్డ శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులుగా జవ్వాజి శ్రీనివాసరావు, కోపిల రామారావు, షేక్ హుస్సేనుద్దీన్, షేక్ అన్వర్, లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి. మోహన్, బి. శ్రీనివాసరావు, వంశీకృష్ణ, షేక్ పెంటు సాహెబ్, షేక్ జానీ, తుమ్మలపల్లి మధు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *