వార్త ముఖ్యాంశాలు
- మదనపల్లె టమోటా మార్కెట్లో చైర్మన్ జంగాల శివరామ్ రాయల్ ఆదివారం పర్యటించారు.
- వేలం పాటలను పరిశీలించి టమోటా ధరలను అడిగి తెలుసుకున్నారు.
- మొదటి రకం 15 కేజీల క్రేట్ రూ.320 పలికింది.
మదనపల్లె టమోటా మార్కెట్లో చైర్మన్ జంగాల శివరామ్ రాయల్ ఆదివారం పర్యటించారు. వేలం పాటలను పరిశీలించి టమోటా ధరలను అడిగి తెలుసుకున్నారు. మొదటి రకం 15 కేజీల క్రేట్ రూ.320 పలికింది. రెండో రకం క్రేట్ రూ.250, మూడో రకం రూ.100 ధర పలికింది. రైతులను ఎవరైనా మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.