వార్త ముఖ్యాంశాలు
- అన్నమయ్య జిల్లాలో అక్టోబర్ 12 నుంచి 19 వరకు ప్రత్యేక టీకా కార్యక్రమం నిర్వహించనున్నారు.
- ఈ విషయాన్ని డీఎంహెచ్వో డాక్టర్ జి.
- ఉషశ్రీ తెలిపారు.
అన్నమయ్య జిల్లాలో అక్టోబర్ 12 నుంచి 19 వరకు ప్రత్యేక టీకా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని డీఎంహెచ్వో డాక్టర్ జి. ఉషశ్రీ తెలిపారు. ఐదేళ్లలోపు టీకాలు వేయించుకోని పిల్లలకు టీకాలు వేయనున్నారు. పొంగు, రుబెల్లా వ్యాధులతో పిల్లలకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని తెలిపారు. ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి టీకాలు వేయించుకోని పిల్లలను గుర్తిస్తారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.