పున్నమి ప్రతినిధి అక్టోబర్ 18 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సి సి ఐ మార్కెటింగ్ ఇతర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్ మాట్లాడుతూ జిల్లాలో 50 ,300 ఎకరాల్లో పత్తి సాగు చేయగా 45,270 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారని తెలిపారు పత్తి నాణ్యత ఆధారంగా మద్దతు ధర రూ.8667 ఉందని వెల్లడించారు జిల్లాలో సీసీఐ ఆధ్వర్యంలో 5 జిన్నింగ్ మిల్లులలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని వేములవాడ పరిధిలో రెండు కొనరావుపేట మండలంలో ఒకటి ఇల్లంతకుంట మండలంలో రెండు ఉన్నాయని తెలిపారు వీటిని జిల్లాలో రైతులు పత్తి కొనుగోలు కేంద్రాలకు పత్తి తెచ్చి అమ్మకాలు చేసుకోవచ్చు
