పున్నమి ప్రతినిధి అక్టోబర్ 18 రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ వ్యాప్తంగా నేడు సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగుతుండగా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్లలో మాత్రం ఆనవాయితీ ప్రకారం సోమవారం నిర్వహించనున్నారు దీంతో బతుకమ్మ పేర్చేందుకు మహిళలు ఆదివారం బంతిపూలతో కొనుగోలు చేశారు గతంలో అడవులు వ్యవసాయం భూముల వద్ద సహజంగా పూలు లభించేవి కాగా ప్రస్తుతం వ్యవసాయ విస్తరణతో పూలు లభించకపోవడంతో మార్కెట్లో కొనుగోలు చేశారు మార్కెట్లో బంతి గునుగు తంగడపువ్వు లాంటివి బతుకమ్మకు కొనుగోలు చేశారు
