Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

నగరపాలక సంస్థ ఆర్ఎంసీ కార్యాలయం నందు ఘనంగా గాంధీ జయంతి వేడుకలు.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నగరపాలక సంస్థ ఆర్ఎంసీ కార్యాలయం నందు ఘనంగా గాంధీ జయంతి వేడుకలు.

వార్త ముఖ్యాంశాలు

  • పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అధికారులు, సిబ్బంది..
  • దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన గాంధీ మహాత్ముడు చూపిన మార్గం నేటితరానికి అనుసరణీయమని పలువురు వక్తలు కొనియాడారు.
  • జాతిపిత మహాత్మగాంధీ జయంతిని పురస్కరించుకుని నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఆ మహనీయుని విగ్రహానికి గురువారం పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అధికారులు, సిబ్బంది..
దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన గాంధీ మహాత్ముడు చూపిన మార్గం నేటితరానికి అనుసరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. జాతిపిత మహాత్మగాంధీ జయంతిని పురస్కరించుకుని నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఆ మహనీయుని విగ్రహానికి గురువారం పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ.. సత్యం, అహింసలను ఆయుధాలుగా చేసుకుని, శాంతియుతంగా పోరాటం చేసి దేశానికి గాంధీ మహాత్ముడు స్వాతంత్ర్యం సాధించి పెట్టారని తెలిపారు. సహాయ నిరాకరణోద్యమం, విదేశీ వస్త్ర బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా.. ఇలా స్వాతంత్య్ర సముపార్జనకు ఆయన పిలుపునిచ్చిన ప్రతి పోరాటంలోనూ ప్రజలు భాగస్వాములయ్యారన్నారు. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహాత్మాగాంధీని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆ మహనీయుని ఆశయాల సాధనకు ప్రతిఒక్కరూ పునరంకితం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, డిప్యూటీ డైరెక్టర్ రామారావు, రెవిన్యూ ఆఫీసర్ సీహెచ్ శ్రీనివాసరావు, మేనేజర్ ఎండి అబ్దుల్ మలిక్, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *